Thread Rating:
  • 12 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
3Roses
#6
ఊరి రైల్వేస్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో చిన్న స్థలం. చుట్టూ కాంపౌండు, గోడ కట్టి గేట్ పెట్టారు. సాయంత్రం ఐదు అవుతుండగా స్కూటీ ఒకటి వచ్చి ఆగింది, అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూనే స్కూటీ దిగింది.

"అమ్మా.. ఎందుకు మాటిమాటికీ ఫోన్ చేస్తావ్, పనిలో ఉంటానని తెలుసు కదా.. పద్దాక ఫోన్ చెయ్యకు" అని పెట్టేసి, ఇంకో ఫోన్ చేసింది. "సర్, నేను మీరిచ్చిన అడ్రెస్కి వచ్చాను, బైటే ఉన్నాను" అనగానే కాల్ కట్ అయ్యింది.

తరువాతి నిమిషంలో ఒకతను బైటికి వచ్చి గేటు తీసి నవ్వి లోపలికి రమ్మంటే పలకరింపుగా తిరిగి నవ్వి స్కూటీ కీస్ అందుకుని లోపలికి వెళ్ళింది.

మీ పేరు..?

"మాధవిలత" అంది ఆ అమ్మాయి

"మీలాంటి వారు ఒకరు ఉంటారని నేను అస్సలు ఊహించలేదు" అని మాట్లాడుతూనే లోపలికి నడిచాడు. వెంటే వెళ్ళింది మాధవిలత.

"నేనున్నాగా" అంది నవ్వుతూ, "చచ్చిపోవాలి అనుకున్న వాళ్లకి కూడా తోడు అవసరం, చచ్చిపోయాక వాళ్ళు ఏమైనా చెయ్యలేని పనులు ఉంటే అవి నేను చేసి పెడతాను"

ఇద్దరు కూర్చున్నారు. కాఫీ కలిపి చేతికిస్తే అందుకుంది. చేతికి ఉన్న వాచిలో ఒకసారి టైం చూసుకుని చుట్టూ చూసింది.

"మిమ్మల్ని ఏమని పిలవాలి ?"

"పెద్ద పేరు కదా, లత అని పిలవండి" అంది కాఫీ సిప్ చేస్తూ

"ఓకే లత గారు, ఇంతకీ మీరు ఎంత తీసుకుంటారో చెప్పలేదు"

లత : అది నేను చెప్పాలి అంటే, ముందు నాకు మీ గురించి తెలియాలి. ఆ తరువాత మీరు చెయ్యాలి అనుకునే పని తెలియాలి. మీరేంటో మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలీకుండా నేనేది చెయ్యలేను, చేసి రిస్క్ తీసుకోలేను. ఇప్పటి వరకు మీ పేరు చెప్పలేదు.

"ఓహ్.. అలాగే లత గారు, అంత క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఏమి లేదులేండి" అంటే ఇద్దరు నవ్వారు.

లత : ఇంకా మీ పేరు చెప్పలేదు

"మై బాడ్.. సారీ.. ఐయామ్ వినయ్"  అన్నాడు నవ్వుతూ

లత : ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారా.. చనిపోబోయే ముందు కూడా మీ మొహంలో నవ్వు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంది.

వినయ్ మళ్ళీ నవ్వాడు.

లత : ఓకే నాకు మీ కధ చెప్పండి.

నా పేరు వినయ్, పేరుకు తగ్గట్టే అందరిపట్లా వినయంగానే ఉంటాను. ముద్దుగా విన్ను అని పిలుస్తారు ముగ్గురు.

ఒకడు నా స్నేహితుడు అభయ్
ఇంకొకరు నన్ను పెంచిన నా మావయ్య చందు
మరొకరు.. మరొకరు నేను ప్రేమించిన నా అత్తయ్య (గుండె వేగం పెరిగింది) గీత.. గీతానిత్యమయి

లత : వాట్..!   మీ అత్తయ్యని ప్రేమించారా

వినయ్ : నేను ప్రేమించాకే నాకు అత్తయ్య అయ్యింది

లత : సొ సాడ్

తను చనిపోయే ముందు.. అంటే నిన్న. నన్ను ఒక కోరిక కోరింది. అది తీర్చుదామనే ఇక్కడికి వచ్చాను. ఇవ్వాళ నేను చనిపోబోతున్నాను, వాళ్ళ కోరిక తీర్చడానికి నేనున్నాను కానీ నా కోరిక తీర్చడానికి ఎవ్వరు లేరు, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను.

లత : అయితే వినయ్ గారు లవ్ ఫెయిల్ అయ్యి చనిపోతున్నారన్నమాట

వినయ్ : కాదనుకుంటా, నా కధ చెపుతాను. అంతా విన్నాక మీరే చెప్పండి ఎందుకు చావాలని అనుకుంటున్నానో

"మొదలెట్టండి మరి" అంది లత ఉత్సాహంగా

★★★


తెలంగాణ ఇంకో ఆరు నెలల్లో వస్తుందనగా మొదలయింది నా కధ. రోజుకో రాస్తారోకో, రెండు రోజులకి ఒక బంద్. అప్పటికి నేను కాలేజీ పిల్లాడినే..

తెలంగాణ ఉద్యమం గురించి ఏమి తెలీదు, రోజు కాలేజీకి రావడం, అన్న వాళ్ళు బంద్ పిలుపుని ఇవ్వగానే అదే బస్సులో సంతోషంగా ఇంటికి తిరిగి రావడం. ఇదే మా పిల్లలందరికి తెలిసింది.

అప్పుడప్పుడు భయపడేవాళ్ళం కూడా, ఒక వేళ తెలంగాణ ఇచ్చేస్తే ఇక బందులు ఉండవు, రోజూ కాలేజీకి వెళ్లాల్సి వస్తుందని. పిల్లలం అందరం ఇంటి దెగ్గరే ఆడుకునే వాళ్ళం, పెద్దవాళ్లు గుంపుగా బండ్ల మీద వెళుతుంటే వాళ్ళని చూసి గర్వంగా చెప్పుకునే వాళ్ళం మా అన్నయ్య ఉన్నాడంటే, మా నాన్న ఉన్నాడని. నేనూ చెప్పేవాడిని, మా మావయ్య ఉన్నాడని..

మా మావయ్య.. పేరు చందు.

పుట్టింటికి వచ్చిన అమ్మ అందరితో కలిసి తిరుపతి వెళుతుంటే బస్సు బోల్తా పడి అందరూ చనిపోయారు. నాన్న నన్ను అమ్మమ్మ ఇంటికి పంపివ్వలేదు, అదే రోజు పరీక్ష ఉండటం వల్ల మావయ్య కూడా వాళ్ళతో వెళ్ళలేదు.

అమ్మ చనిపోయిన నాలుగు రోజులకే నాన్న నన్ను మావయ్య దెగ్గర విడిచిపెట్టేసాడు, తరువాత ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు అది వేరే విషయం.

ఆ రోజు నుంచి నేను కానీ మావయ్య కానీ వాళ్ళ ఇంటి గడప ఎరుగం. ఎవ్వరు లేని ఊరిలో ఉండి ఏం చేస్తాం అన్న ఆలోచన వచ్చి ఉన్నవి అమ్మేసి ఈ ఊరు వచ్చాము. ఉన్న డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కుని మిగతా డబ్బుల్లో సగం నా పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేసి మిగతా సగం వడ్డీలకి తిప్పడం మొదలుపెట్టాడు. షూరిటీ, సెక్యూరిటీ చూసుకుని వడ్డీలకి తిప్పడం వల్ల మాకు బాగానే గడుస్తుంది, ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నాం ఇద్దరం.

ఒకరోజు పది మంది ఇంటికి వచ్చి మావయ్యతొ కూర్చున్నారు. అప్పటికే మేమీ బస్తీకి వచ్చి మూడేళ్లు, పైగా సొంతయింటి వాళ్ళం, పైగా మావయ్య వడ్డీ వ్యాపారం చేస్తాడు కనక కొంచెం గట్టిగా ఉంటాడు. ఈ సారి జరగబోయే అతి పెద్ద ధర్నాలో పాలుపంచుకోమని అందరికి చెపుతున్నాం, బాధ్యతగా వచ్చి చేరాలని చెపితే సరేనన్నాడు మావయ్య.

రెండు రోజుల తరువాత అందరితో కలిసి వెళ్ళాడు. ఇంటికి మాత్రం రాలేదు. బస్తీ మొత్తం అందరినీ దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసారని చెపితే ఏడుపు వచ్చేసింది. ఏం చెయ్యాలో తెలీలేదు. ఇంటి లోపలికి వెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. అన్నం సహించలేదు, ఎప్పుడు ఒంటరిగా అనిపించిందే లేదు. అర్ధరాత్రి దాటింది, ఒక్క మావయ్య మాత్రమే కాదు, పక్కింట్లో వాళ్ళు ఎదిరింట్లో వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఆంటీలు అందరూ గుంపుగా నిలుచుని మాట్లాడుకుంటుంటే ఇంటి ముందు గచ్చు మీద కూర్చుని వింటున్నాను.

నా ఫ్రెండ్ అభయ్ నేను ఒక్కడినే కూర్చోవడం చూసి నా దెగ్గరికి వచ్చి కూర్చున్నాడు.

అభయ్ : భయంగా ఉందా

వినయ్ : ఇప్పుడు ఎలా రా.. మావయ్యని వదలరా

అభయ్ : అమ్మ చెప్పింది, రెండు రోజుల్లో వదిలేస్తారట

వినయ్ : రెండు రోజులా.. ఆమ్మో ఎలారా.. నాకు భయంగా ఉంది

అభయ్ : మా నాన్న కూడా ఉన్నాడు కదరా, వాళ్లంతా కలిసే ఉంటారు

వినయ్ : ఏమో.. అని కళ్ళు తుడుచుకున్నాను.

గుంపుగా మాట్లాడుకుంటున్న ఆంటీలలో నిలుచుని వాళ్ళు మాట్లాడేది వింటున్న వీధి చివర కిరాణా కొట్టు దుర్గరావు అమ్మాయికి అభయ్, వినయ్ ఇద్దరి మాటలు వినపడి వాళ్ళ దెగ్గరికి వెళ్ళింది. వినయ్ ని చూసి నవ్వింది.

"ఏరా వాడికి లేని భయం నీకెందుకు" అని అడిగితే అభయ్ "లేదక్కా.. వాళ్ళ ఇంట్లో వాడు వాళ్ళ మావయ్య, ఇద్దరే ఉండేది. అందుకే భయపడుతున్నాడు" అని చెప్పేసరికి వినయ్ వంక చూసింది.

"మీ అమ్మా నాన్నా లేరా" అని అడిగితే వినయ్ జరిగింది చెప్పాడు. జాలిపడింది

అభయ్ : ఇంతకీ నువ్వు ఎవరక్కా, నిన్నెప్పుడు చూడలేదే

"ఒరేయి, నేను తెలీదా.. రోజు కొనుక్కోవడానికి మా కొట్టుకి వస్తారు" అని వేలు పెట్టి చూపించింది.

వినయ్ : ఆ కొట్టు మీదేనా.. మరి నువ్వెందుకు మాకు ఎప్పుడు కనిపించలేదు.

"ఆడపిల్లనిరా, నన్ను కొట్టులోకి రానివ్వరు. ఇదిగో ఇప్పుడు బంద్ నడుస్తుంది, పైగా మగాళ్లందరూ జైల్లో ఉన్నారు. అందుకే బైటికి వచ్చాను"

అభయ్ : అబ్బో.. ఇంతకీ నీ పేరేంటి

"నా పేరు గీత, మరి మీవి ?"

అభయ్ : నా పేరు అభయ్

వినయ్ : నా పేరు వినయ్

గీత : తిన్నారా ఇంతకీ

అభయ్ : నేను తిన్నాను, వీడు తినలేదు.

గీతా : ఏరా.. ఏమైంది. ఇంట్లో అన్నం లేదా ?

వినయ్ : భయంగా ఉందక్కా.. మావయ్య..

గీత : మీ మావయ్య ఒక్కడే కాదు, తనకి తోడుగా ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కలిసే ఉన్నారట, వాళ్ళని విడిపించడానికి హైదరాబాద్ నుంచి కేసిఆర్ కూడా వస్తున్నారని ఇప్పుడే న్యూస్లో చెప్పారు. ముందు పదా తిందువు

వినయ్ : ఆకలిగా లేదు అక్కా

గీత : సరే.. చెకోడీలు తింటారా, మా కొట్టుకి వెళదాం పదండి అంటే ఇద్దరు లేచి నిలబడ్డారు.

గీత ఇద్దరినీ వెంటబెట్టుకుని వెళుతుంటే తల్లి చూసినా ఏమనలేదు. ముగ్గురు వెళ్లి కొట్లో కూర్చున్నారు.

అభయ్ : నేను డబ్బులు తేలేదు

వినయ్ : నేను కూడా

గీత : అబ్బా.. అవసరం లేదులే.. తీసుకోండి

అభయ్ : నేను గొట్టాల ప్యాకెట్ తీసుకోనా

వినయ్ : అక్కా నేను రసగుల్లా తీసుకోనా

గీత నవ్వి "సరే తీసుకోండి" అంటే అన్ని మర్చిపోయి కూర్చుని తినడం మొదలుపెట్టారు ఇద్దరు. మధ్యలో చెరిసగం పంచుకోవడం చూసి నవ్వుకుంది.

గీత : మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా

అభయ్ : అవునక్కా

గీత : ఎప్పుడు ఇలాగే ఉండండి ఇద్దరు. ఇక వెళ్ళండి, మా అమ్మ చూసిందంటే తిడుతుంది. మీకు ఫ్రీగా ఇచ్చానని ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా అంటే ఇద్దరు తల ఊపారు. నవ్వి పంపించేసింది.

వినయ్ : అక్క చాలా మంచిది కదరా

అభయ్ : అవును.. మనం ఎలాగోలా ఈ అక్కతొ ఫ్రెండ్షిప్ చెయ్యాలిరా, అప్పుడు మనం ఇలానే అన్ని ఫ్రీగా తినొచ్చు. ఏమంటావ్..?

వినయ్ : సరే అంటాను

అర్ధరాత్రి వరకు బైటే గడిపి ఇంట్లోకి వెళుతుంటే గీత అక్క పిలిచింది.

వినయ్ : ఏంటక్కా

గీత : చిన్న పిల్లాడివి, ఒక్కడివే వద్దులే.. మా ఇంటికి వెళదాం, ఇల్లు తాళం వేసిరా అంటే సరే అని తాళం వేసి వచ్చాడు. వినయ్ చెయ్యి పట్టుకుని నడుస్తూ నీకేం భయం లేదు, అందరం ఉన్నాంగా.. మీ మావయ్య కూడా వచ్చేస్తాడు అని ధైర్యం చెపితే ఊ కొట్టాడు.

మొదటి సారి మావయ్య కాకుండా ఇంకొకరితొ పడుకోవడం, బాగా ఏడవడం వల్లో అర్ధరాత్రి దాటడం వల్లో తెలీదు కానీ వెంటనే నిద్ర పట్టేసింది.

పొద్దున్నే లేచేసరికి గీత అక్క కాలు నా మీద ఉంది, వెంటనే తీసేసి లేస్తే తనూ లేచింది. గీత అక్క వాళ్ళ అమ్మ వచ్చి "గీతా.. అందరినీ వదిలేసారట, వచ్చేస్తున్నారు" అనగానే గీత అక్క యే.. అని హైఫైక్ కోసం చెయ్యి ఎత్తింది, ఏమైందో తెలీదు, ఆనందంలో వాటేసుకున్నాను. ఏడుపు వచ్చేసింది. వెంటనే లేచి ఇంటికి పరిగెత్తాను.

త్వరగా స్నానం చేసి మిగిలిన అన్నం కూర ఉంటే అన్ని పారేసి, అంట్లు తోమి ఇల్లు ఊడ్చి శుభ్రంగా సర్దేసాను. ఈ పనులన్నీ చేసేసరికి గంట గడిచిపోయింది. స్నానం చేసి రెడీ అయ్యి ఒక్కడినే కూర్చుని ఎదురుచూస్తుంటే బైట బండి శబ్దం వినిపించింది. ఏడుపు వచ్చేసింది, బైటికి పరిగెత్తాను. నన్ను చూడగానే ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చేసాడు.

చందు : ఎంత బరువు ఉన్నావో చూడు, అని మంచం మీద కూర్చోబెట్టి రేయి.. విన్ను.. ప్రామిస్, ఇంకెప్పుడు అలాంటి జోలికి వెళ్ళను. సరేనా.. ప్రామిస్ అన్నాగా అని కళ్ళు తుడిచాడు

వినయ్ : ఎంత భయం వేసిందో తెలుసా (పట్టుకున్న మావయ్య నడుముని ఇంకా వదల్లేదు)

చందు : నాకూ భయం వేసింది, ఒక్కడివే ఎలా ఉన్నావో అని. రాత్రంతా నిద్ర పోలేదు నేను తెలుసా

వినయ్ : నేను కూడా

చందు : సరే ఉండు స్నానం చేసి వస్తాను, బైటికి వెళ్లి ఏమైనా తెచ్చుకుందాం అని లేచి స్నానం చేసి బైటికి వచ్చేసరికి ఎవరో అమ్మాయి వినయ్ తొ మాట్లాడుతుంది. బట్టలు వేసుకుని బైటికి వచ్చాడు.

వినయ్ : తనే నా మావయ్య, మావయ్యా తను గీత అక్క. రాత్రి వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా

"థాంక్స్" అన్నాడు నవ్వుతూ చందు.

గీత : మీరంటే బాగా ఇష్టం వాడికి, బాగా బెదిరిపోయాడు. వాడి ఆనందం చూద్దామని వచ్చాను. మిమ్మల్ని కేసిఆర్ విడిపించాడా.. ఆయన్ని చూసారా

చందు : లేదు, ఆయన వస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందని రాకముందే మమ్మల్ని వదిలేసారు.

గీత : ఓహ్.. సరే నేను వెళతాను

చందు : మీ పేరు

గీత : గీత.. ముల్లయ్య కాలేజీ ఇన్స్టిట్యూట్లో డిగ్రీ చేస్తున్నాను

చందు : అరె.. నేనూ అదే కాలేజీ, కాకపోతే నాది ఇంజనీరింగ్ బ్లాక్.

ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే ఇద్దరి మొహాలు చూస్తున్నాడు వినయ్.

గీత : సరే చందు, నేను వెళతాను.

చందు : నెంబర్ ఇవ్వచ్చుగా, ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు నాకు ఫోన్ చెయ్యొచ్చు

గీత నవ్వింది. "వినయ్.. మీ మావయ్య నువ్వనుకున్నంత మంచి వాడు కాదు" అని నవ్వుతుంటే చందు గట్టిగా నవ్వాడు. గీత వెళ్ళిపోయాక మామా అల్లుడు ఇద్దరు బైటికి వెళ్లిపోయారు.

తరువాతి నాలుగు నెలలు అస్సలు కాలేజీ మొహం చూసిందే లేదు. గీత అక్క ఎంత దెగ్గరయ్యిందంటే అభయ్ కంటే గీత అక్కతోనే ఎక్కువగా ఆడుకునేవాడిని.


నాలుగు నెలల తరువాత తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు, బళ్ళు తెరుచుకున్నాయి, అంతా మాములుకి వచ్చేసింది. ఈ గొడవల్లో మా ఏడో తరగతి బోర్డు ఎగ్జామ్స్ లేకుండానే మాములు అనువల్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయాము.
Like Reply


Messages In This Thread
3Roses - by Pallaki - 16-08-2024, 10:04 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 07:42 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Manoj1 - 17-08-2024, 08:13 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:38 AM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 10:40 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:42 PM
RE: 3Roses - by Paty@123 - 17-08-2024, 10:50 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:43 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 10:52 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:44 PM
RE: 3Roses - by Babu143 - 17-08-2024, 11:22 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:45 PM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:46 PM
RE: 3Roses - by Iron man 0206 - 17-08-2024, 03:26 PM
RE: 3Roses - by Uday - 17-08-2024, 03:38 PM
RE: 3Roses - by smartrahul123 - 18-08-2024, 05:42 PM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 04:07 PM
RE: 3Roses - by Saikarthik - 17-08-2024, 06:20 PM
RE: 3Roses - by Chutki - 17-08-2024, 06:48 PM
RE: 3Roses - by thadichina.itukalu - 17-08-2024, 09:54 PM
RE: 3Roses - by Manoj1 - 18-08-2024, 12:20 AM
RE: 3Roses - by unluckykrish - 18-08-2024, 06:42 AM
RE: 3Roses - by maheshvijay - 18-08-2024, 07:09 AM
RE: 3Roses - by sri7869 - 19-08-2024, 12:11 AM
RE: 3Roses - by Pallaki - 19-08-2024, 09:23 PM
RE: 3Roses - by smartrahul123 - 20-08-2024, 12:24 PM
RE: 3Roses - by Mohana69 - 23-08-2024, 04:09 PM
RE: 3Roses - by Iron man 0206 - 24-08-2024, 06:54 PM
RE: 3Roses - by utkrusta - 19-08-2024, 09:33 PM
RE: 3Roses - by BR0304 - 19-08-2024, 10:43 PM
RE: 3Roses - by Sachin@10 - 20-08-2024, 04:23 AM
RE: 3Roses - by Iron man 0206 - 20-08-2024, 05:53 AM
RE: 3Roses - by sri7869 - 23-08-2024, 12:28 PM
RE: 3Roses - by Bangaram56 - 23-08-2024, 03:05 PM
RE: 3Roses - by Babu143 - 24-08-2024, 04:56 PM
RE: 3Roses - by Pallaki - 28-08-2024, 07:20 AM
RE: 3Roses - by BR0304 - 28-08-2024, 08:50 AM
RE: 3Roses - by Varama - 28-08-2024, 10:43 AM
RE: 3Roses - by Iron man 0206 - 28-08-2024, 11:47 AM
RE: 3Roses - by Manoj1 - 28-08-2024, 12:54 PM
RE: 3Roses - by Sachin@10 - 28-08-2024, 07:03 PM
RE: 3Roses - by sri7869 - 29-08-2024, 12:19 PM
RE: 3Roses - by utkrusta - 29-08-2024, 02:27 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:32 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:33 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:35 PM
RE: 3Roses - by Sachin@10 - 31-08-2024, 12:44 AM
RE: 3Roses - by sri7869 - 31-08-2024, 01:15 AM
RE: 3Roses - by Iron man 0206 - 31-08-2024, 04:51 AM
RE: 3Roses - by unluckykrish - 31-08-2024, 06:09 AM
RE: 3Roses - by Hellogoogle - 31-08-2024, 02:56 PM
RE: 3Roses - by Ghost Stories - 31-08-2024, 05:01 PM
RE: 3Roses - by Chutki - 02-09-2024, 12:19 AM
RE: 3Roses - by sri7869 - 02-09-2024, 01:39 AM
RE: 3Roses - by Sachin@10 - 02-09-2024, 05:20 AM
RE: 3Roses - by Iron man 0206 - 02-09-2024, 06:00 AM
RE: 3Roses - by Manoj1 - 02-09-2024, 08:06 AM
RE: 3Roses - by Yogi9492 - 02-09-2024, 12:15 PM
RE: 3Roses - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: 3Roses - by Babu143 - 02-09-2024, 04:39 PM
RE: 3Roses - by James Bond 007 - 04-09-2024, 03:25 PM
RE: 3Roses - by utkrusta - 04-09-2024, 06:08 PM



Users browsing this thread: 22 Guest(s)