16-08-2024, 09:10 PM
(This post was last modified: 16-08-2024, 10:22 PM by Dorasam143. Edited 1 time in total. Edited 1 time in total.)
దయాగాడి దండయాత్ర
అది 300 సవంత్సరాలు క్రితం... రాజుల కాలం.. అందులో రెండు రాజ్యాలు గురించి తెలుసుకుందాం...
మొదటి రాజ్యం అనంతగిరి రాజ్యం.. ఈ రాజ్యాని పరిపాలిస్తుంది వీర సింహుడు..... అయన భార్య పేరు భానుమతి దేవి.
వీర సింహుని వయసు పైపడడంతో అనంతగిరి రాజ్యాని ఆయన కుమారుడు విజయ సింహునికి అప్పగించి అయన కన్నుమూశారు..
విజయ సింహుని పరిపాలనలో అనంతగిరి రాజ్యం సుభిక్షంగా ఉంది..కొడుకు పరిపాలన చూసి తల్లి భానుమతి దేవి చాలా సంతోషించింది...
*****
మరో పక్క... కళింగ రాజ్యం అని ఒక చిన్న రాజ్యం ఉంది... ఆ రాజ్యాని విక్రమాధిత్యుడు పరిపాలిస్తున్నాడు....
అయన ఒక్కగానోక్క కుమార్తె తమన్నా..
విక్రమాధిత్యునికి కుమార్తె తమన్నా తప్ప కుమారులు లేరు... పైగా తన వయసు పైపడుతుంది... యుద్ధం చేసే స్థితిలో తను లేడు... శత్రువులు ఎప్పుడైనా తన రాజ్యం మీదకి యుద్దానికి వస్తారు... ఈ భయం విక్రమాధిత్యునికి ఉంది..
చివరికి విక్రమాధిత్యుని భయమే నిజం అయ్యింది.. తన శత్రు రాజ్యం రాజు గజపతి వర్మ తన సైన్యంతో కళింగ రాజ్యం మీదకి యుద్దానికి వచ్చాడు..
ఈ యుద్ధంలో విక్రమాధిత్యుడు వీర మరణం పొందాడు... దాంతో
అయన కూతురు తమన్నా అలాగే మరి కొందరు అక్కడ నుంచి పారిపోయారు..
మిగిలి ఉన్న ప్రజలని గజపతీవర్మ తన రాజ్యంలో బందించాడు.
పారిపోయినవారంతా ఒక కొండా గుహలో తలదాచుకున్నారు..ఎలాగైనా గజపతివర్మని చంపి.. తన రాజ్యంలో బందీగా ఉన్న ప్రజలని విడిపించాలి అని అనుకున్నారు.. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు...
*******
ఇంకో పక్క అనంతగిరి రాజ్యంలో భానుమతిదేవి విజయ సింహుని మారువేశంలో వెళ్లి వేరే రాజ్యాలు వాళ్ళ పరిపాలనలు ఎలా ఉన్నాయో కనిపెట్టమంది..
తల్లి అజ్ఞాతో విజయ సింహుడు ఒక మామోలు మనిషిగా మారువేశంలో అన్ని రాజ్యాలు తిరుగుతూ వారి పరిపాలన ఎలా ఉందొ గమనిస్తూ ఉన్నాడు..
అలా తిరుగుతూ తిరుగుతూ... గజపతివర్మ రాజ్యానికి వచ్చాడు విజయ సింహుడు...
అప్పటికే తమన్నా తన మనుషులని రహస్య గూడచారలుగా
అక్కడ ఉంచింది... వారు అక్కడ ఉన్న రాజ్య బటులనీ ఒక్కొక్కరిగా చంపుతున్నారు..
ఇది విజయసింహుడు గమనించి..వారిని పట్టుకోవడానికి వెంబడిస్తాడు..
వాళ్లు అడివిలోకి పారిపోతారు..
విజయసింహుడు వాలా వెనకాలే అడవిలోకి వస్తాడు... అక్కడ తమన్నా దేవి ఎవరో వ్యక్తి తన మనుషులని తరమడం చూసి... తన మనుషులని తప్పించడానికి తను అడ్డుగా వెళ్ళింది...
తెల్లటి సౌందర్య రాసి అయిన తమన్నాని చూసి విజయ సింహుడు ఆగిపోయాడు..
మరి తరువాత ఏమి జరిగింది అనేది తరువాయి భాగంలో...
సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది...