Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
#3
1. కారుతో గుద్దింది.





7 సంవత్సరాలు రష్, 5 సంవత్సరాల క్రిష్

క్రిష్ "అమ్మా..... చూడు... అక్క నన్ను కొడుతుంది"

రష్ "నేను నీకు అక్కని కాదు" అని అరిచింది.

క్రిష్ "అమ్మా.... అక్క నా మీద అరుస్తుంది"

రష్ "నేను అక్కని కాదు అని చెబుతున్నానా...."

క్రిష్ "అమ్మా" అని అరుస్తున్నాడు.



రష్ "నేను నీకు అక్కని కాదు"

క్రిష్ "నువ్వు నా కంటే పెద్ద దానివి కదా..."

రష్ "అవునూ నీ కంటే..... రెండూ సంవత్సరాలు పెద్దదాన్ని"

క్రిష్ "అయితే నాకు అక్కవే..."

రష్ కోపంగా చూసి "మా నాన్న నీకు ఏమవుతాడు"

క్రిష్ "మామ అవుతాడు"

రష్ "హుమ్మ్.... మీ అమ్మ నాకు అత్త అవుతుంది"

క్రిష్ "అవునూ..."

రష్ "ఇప్పుడు చెప్పూ... నేను నీకు మామ కూతురుని నేను నీకు ఏమవుతాను"

క్రిష్ "నాకు తెలియదు" అని పైకి లేచాడు.

రష్ కూడా పైకి లేచి "నీ కంటే చిన్నదాన్ని అయితే నీకు మరదలిని అవుతా.... కాని నీ కంటే పెద్ద దాన్ని కదా..."

క్రిష్ "మరదలు అంటే పెళ్లి చేసుకుంటారు అంతే కదా..."

రష్ సిగ్గు పడి "నీకు ఎవరూ చెప్పారు" అంది.

క్రిష్ "నన్ను క్రిష్ అని పిలువు, నేను నిన్ను రష్ అని పిలుస్తా"




క్రిష్ "అమ్మా.... రష్ నన్ను కారుతో గుద్దేసింది"

అందరూ వచ్చి చూసేసరికి రష్ చిన్న బొమ్మ కారుతో క్రిష్ ని గుద్దింది. 

అతనికి దెబ్బ తగలక పోయినా గొడవ చేస్తున్నాడు. అందరూ బొమ్మ కారు అని చెప్పడంతో

క్రిష్ "ఇవ్వాళ బొమ్మ కారుతో గుద్దింది ఏమి అనకపోతే నిజం కారుతో గుద్దుతుంది..... తనని కొట్టండి" అన్నాడు.





రాముడు - సీత ఆట

రష్ రాముడు, సీతని కనుక్కోవాలి.

రష్, క్రిష్ వైపు చూసింది. అతనిని చూస్తూ ఉంటె ఎందుకో అతని మైండ్ వాయిస్ వినపడుతుంది. 

రష్ క్రిష్ ని చూపిస్తూ "సీత" అంది.

రష్ కి వెయ్యి పాయింట్స్ వచ్చాయి.






పెళ్లి సమయంలో క్రిష్ ని ఇక ప్రేమించడం వేస్ట్..... అని అనిపించింది. అందుకే అతనితో ప్రేమను అలాగే మరచిపోవాలని అనుకుంది.

కాని అప్పగింతలు అప్పుడు, క్రిష్ ని చూసినపుడు అతని మైండ్ వాయిస్ వినపడింది.

క్రష్ "ఎందుకు నన్ను అలా చూస్తున్నావ్... నేను నిన్ను ఇష్టపడ్డట్టు, నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావా..." అనుకున్నాడు.

రష్ ఏడుస్తూ కార్ ఎక్కింది. ఆ రోజు అల్లా ఆలోచిస్తూ అలానే ఏడుస్తూ ఉంది. మరుసటి రోజుకు క్రిష్ ని మరచిపోవాలని అనుకోని భర్త సందీప్ భుజంపై తలని వాల్చింది.






24 సంవత్సరాలు రష్, 22 సంవత్సరాల క్రిష్



కార్ కీస్ తీసుకొని కోపంగా కారు దగ్గరకు వెళ్ళింది, వెనక నుండి ఆమె భర్త సందీప్ బయటకు వచ్చి "నువ్వు ఇలా చేయక్కర్లేదు... రష్ నా మాట వినూ" అన్నాడు.

అతని మాటలు గాల్లో కలిసి పోగా... రష్ నడుపుతున్న కారు ఆ విల్లా లోని ఐరన్ గెట్ దాటుకుని రోడ్ మీదకు వెళ్ళిపోయింది.

చీకటిలో నల్లటి రోడ్ పై ఫ్లడ్ లైట్ వెలుతురులో కారు వెళ్తూ ఉంది.

సైలెంట్ గా ఉన్న రోడ్ పై సైలెంట్ గా కారు నడుపుకుంటూ వెళ్తుంది.

ఆమె చూపు అనుకోకుండా ఎదురుగా ఉన్న బ్యాండ్ పై పడింది. వాటి పై పేర్లు క్రిష్, రష్ అని రాసి ఉన్నాయి.




ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి.

క్రిష్ "రష్... ఇప్పుడు నువ్వు నా భార్యవి.... ఈ బ్యాండ్ నీతో పెట్టుకో... నేను నీకు ఎప్పుడూ తోడూ ఉంటాను, ఎప్పుడూ గుర్తు ఉంటాను" అన్నాడు.

రష్ అతనిని అభిమానంగా చూస్తూ ఉండగా వాళ్ళ కొడుకు నిర్వేద్ (13 నెలలు) అంబాడుతూ వాళ్ళ దగ్గరకు వస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు పాల కోసం వచ్చాడు.

రష్ "ఇంకేం పాలు.... అయిపోయాయి ఇంకా రావు... ఇంతకు ముందే కొంచెం వస్తే మీ నాన్న తాగాడు" అంది.

క్రిష్ "నువ్వే కదా నొప్పిగా ఉంది అన్నావ్.... ఒరేయ్ మీ అమ్మ మాట నమ్మకు"

రష్ "మీ నాన్న మాట నమ్మకు"

క్రిష్ "మీ అమ్మ మాట నమ్మకు" అని నిర్వేద్ చెవులు మూసి రష్ ని వెక్కిరించాడు.

రష్ మూతి తిప్పుతూ "ఒరేయ్ మీ నాన్నకి చెల్లెలు కావాలని అడుగు అప్పుడు మళ్ళి పాలు వస్తాయి" అంది.

క్రిష్ "ఓహో... అది కావాలా... అలా అడగొచ్చు కదా..." అంటూ రష్ నడుము పై చక్కలిగిలి పెట్టాడు.

రష్ "వద్దు.... వద్దు.... వద్దు.... " అంటూ నవ్వుతుంది.




ఆమె ఆలోచనలను దూరం చేసుకుంటూ తల అడ్డంగా ఊపుతూ గతం తాలుకా ఆలోచనలను చెదరకోట్టింది. 

ఎదురుగా కనిపిస్తున్న బ్యాండ్ ని తీసుకొని చూసింది, దానిపై క్రిష్, రష్ అని రాసి ఉంది. 

చేత్తో గట్టిగా పట్టుకొని పళ్ళు నములుతూ గ్లాస్ డోర్ ఓపెన్ చేసి బయటకు విసిరింది.

అటుగా వెళ్తున్న లారీ టైర్ కింద పడి ఆ బ్యాండ్ ముక్కలయింది. 






రష్ "క్రిష్..... ఐ లవ్ యు..... చిన్నప్పటి నుండి నీ పై నాకు ప్రేమ, ద్వేషం  రెండూ ఉండేవి... కాని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు నీపై ప్రేమ మాత్రమె ఉంది... ఎందుకో తెలుసా..." అంటూ చూస్తూ ఉంది.

ఇంతలో ఎదురుగా కనిపిస్తున్నా కార్ ని ఓవర్ టేక్ చేసింది.







రష్ కారు లైట్స్ ఆపి చూస్తుంది. ఎదురుగా చిన్న లైటింగ్ లో ఇద్దరు వ్యక్తులు కనిపించారు.


ఒకరు నూతన్, క్రిష్ సీనియర్.... 

మరొకరు క్రిష్.....




రష్ వాళ్లకు వంద మీటర్ల దూరంలో ఉంది. వాళ్ళకు అక్కడ కారు ఉన్న సంగతి కూడా తెలియదు. క్రిష్ ని మాత్రం తనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు.

రష్ "టైటానిక్ సినిమా గుర్తు ఉందా..... క్రిష్.... నువ్వు నన్ను అడిగావు.... రోజ్ నిజానికి, జాక్ ని ప్రేమించలేదు అందుకే చంపేసింది అన్నావ్ గుర్తు ఉందా..."

రష్ "రోజ్, జాక్ ని ప్రేమించింది అలాగే చంపేసింది... నీకు అర్ధం కాదు ఇదంతా...."

రష్ "ఇప్పుడు చూడు... నేను నిన్ను ఇష్టపడుతున్నాను... అలాగే నిన్ను చంపుతున్నాను"

అనుకుంటూ యేక్సలేటర్ ని బలంగా తొక్కింది. క్షణాల్లో వేగం పుంజుకున్న కారు క్రిష్ కి అడుగుల దూరంలోకి వచ్చి అతన్ని గుద్దబోతుంది.

క్రిష్, ఎదురుగా వస్తున్నా కారు అద్దంలో నుండి రష్ ని చూస్తూ "రష్, కాని ఎందుకు... నువ్వు కోరుకున్నట్టే విడిపోయాం కదా" అనుకున్నాడు.

రష్ అతని మైండ్ వాయిస్ ని అతని మొహం లో కనిపిస్తున్నా ఎక్సప్రెషన్ ని చూస్తూ ఉంటె కాలం ఒక్క సారిగా స్తంబించింది.




రష్ కి జరిగిన కాలం అంతా ఒక్క సారిగా కళ్ళముందు కనపడింది.










త్వరలో 
మొదటి భాగం......  నా జీవితం - నా భర్త సందీప్ చేతుల్లో......

హాయ్.... నా పేరు రష్... 




























[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 10-08-2024, 10:40 PM



Users browsing this thread: 3 Guest(s)