Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
Heart 
146. వన్, టూ, త్రీ....







క్రిష్ తాగి వచ్చి అరుస్తూ తిడుతూ ఉన్నాడు, సినిమా పాటలు పాడుతున్నాడు. దానికి తగ్గట్టు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఐ యామ్ సారీ, ఐ లవ్ యు అన్నాడు.

కాజల్ డోర్ దగ్గర నిలబడి నవ్వుతూ ఫోన్ లో షూట్ చేస్తూ చూస్తుంది.

నిషా లోపల సోఫాలో కూర్చొని ఇద్దరినీ తలచుకొని తల కొట్టుకుంటూ ఉంది.

నిషా "ఏం చేస్తున్నావ్?"

కాజల్ "ఉండవే..." అంటూ నవ్వుతుంది.

నిషా "ఆ పూల కుండీలు అన్నీ నేను చాలా కష్ట పడి పెంచాను, రేపు ఆదివారం మీ ఇద్దరూ కలిసి అదంతా సరి చేయాలి" అన్నాడు.

కాజల్ కోపంగా వెనక్కి తిరిగి నిషాతో "నో వే.... రేపు ఆదివారం...."

నిషా "హుమ్మ్... రేపు ఆదివారం చాలా పనులు ఉన్నట్టు ఉన్నాయి" అంటూ తన అక్క పిర్రల పై చరిచింది"

కాజల్ "ఆహ్.." అని తోసేసి "ఇక అయిపొయింది" అంటూ బయటకు నడిచింది.

నిషా నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తుంది.

క్రిష్ "ఐ మిస్ యు బేబి... ప్లీజ్" అంటూ మాట్లాడుతూ ఉన్నాడు.

కాజల్ వెళ్లి అతని ముందు నిలబడింది.

చల్లని గాలికి కదులుతున్న ఆమె కురులు చేత్తో తడుముకుంటూ, వెన్నెల కాంతులలో ఆమె తెల్లని మోములోని అందాన్ని మిస్మరైజింగ్ చూస్తూ, అదురుతున్న ఆమె చెర్రీ పళ్ళు లాంటి ఎర్రని పెదవులను చూస్తూ "మై ఏంజెల్" అన్నాడు.

ఆ పక్కనే ఉన్న చిన్న సిమెంట్ తొట్టిలో ఉన్న కదులుతున్న నీళ్ళలో క్రిష్ మరియు కాజల్ ల ప్రతిబింబంతో పాటు చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు.



నిషా నడుము మీద చేతులు పెట్టుకొని "స్స్" అంటూ చూస్తుంది.

క్రిష్ తేరుకునే సరికి, కాజల్ మరో సారి అతని తల పట్టుకొని నీళ్ళతొట్టిలో ముంచింది.

క్రిష్ "ఆహ్... ఆహ్... " అని అరుస్తూ గాలి పీల్చుకుంటూ ఉన్నాడు.

కాజల్ "పర్లేదా...."

క్రిష్ "హుమ్మ్" అని తల ఊపాడు.

కాజల్ మళ్ళి అతన్ని మెడ పట్టుకొని నీళ్ళలో ముంచింది. 

క్రిష్ తల నీళ్ళలో ఉండగా అతని చేతులు బయట కొట్టుకుంటూ ఉన్నాయి.

కాజల్ అతని మెడ పట్టుకొని మళ్ళి బయటకు తీసింది. 

క్రిష్ బయటకు వచ్చాక గాలి పీల్చుకుంటూ ఉన్నాడు.

కాజల్ "పర్లేదా..." అని అడిగింది.

క్రిష్ "వద్దు" అంటూ ఏడ్చినంత పని చేశాడు. పైగా తొట్టికి అడ్డంగా చేతులు కూడా పెట్టాడు.

కాజల్ ఏ మాత్రం జాలి చూపించకుండా మరో సారి ముంచింది.

నిషా పరిగెత్తుకుంటూ వచ్చి "వదిలి పెట్టవే పాపం" అంది.

క్రిష్ కూడా మొహం పై ఉన్న జుట్టు నిండా నీళ్ళు మొహం మీదకు కారుతూ ఉన్నాడు.

కాజల్ "ఎంత తాగావ్...."

క్రిష్ "ఒకటి..."

కాజల్ "ఒకటి తాగితే ఇంత ఎక్కదు... మర్యాదగా ఎంత తాగావో చెప్పూ..."

క్రిష్ "రెండూ...."

కాజల్ "నిజం చెబుతావా లేదా...."

క్రిష్ "ఎనిమిది" అని చేతులు చూపించాడు.

కాజల్ "ఇప్పటికి ఆరు సార్లు అయింది... ఇంకో రెండూ సార్లు ముంచుతా...."

క్రిష్ "బేబి... ప్లీజ్ వద్దు..."

కాజల్ "చేతులు వెనక్కి పెట్టుకో.... గాలి పీల్చుకో.... వన్, టూ, త్రీ.... " అంటూ ముంచింది.



నిషా సోఫాలో కూర్చొని ఇద్దరినీ చూస్తూ ఉండగా....

క్రిష్ ని కింద కూర్చోబెట్టి కాజల్ అతని తల మీద టవల్ వేసి రుద్దుతుంది.

కాజల్ "ఎందుకే... మమ్మల్ని చూస్తావ్.... టీవీ చూసుకో"

నిషా "వద్దు.... ఈ డ్రామా బాగుంది"

కాజల్, క్రిష్ ని వదిలి "తిన్నావా..." అని అడిగింది.

క్రిష్ తల నిలువుగా అడ్డంగా కాకుండా ఊపుతున్నాడు.

నిషా "వాట్ ఏ కో ఇన్సిడెన్స్.... అక్క ఇవ్వాళ ముగ్గురుకు వండింది...." అంది.

క్రిష్ వెంటనే "నేను తినేశా.... నిజంగా తినేశా.... ప్రామిస్" అంటున్నాడు.

నిషా నవ్వుతూ "హేయ్.. క్రిష్, తాగాక తినాలి రా... నువ్వే చెప్పావ్..."

క్రిష్ "నీ యమ్మ కడుపు మాడ... నేను నిజంగా తిన్నానే..."

కాజల్ కోపంగా చూస్తుంది.

క్రిష్ "నిన్ను కాదు తనని అన్నాను"

కాజల్ "మా ఇద్దరికీ ఒకరే అమ్మ" అంది.

అప్పటికి కాని క్రిష్ కి ఏమి అన్నాడో గుర్తుకు రాలేదు.

నిషా నవ్వుతూ ఉంది.

కన్ను మూసి తెరిచే సరికి క్రిష్ డైనింగ్ టేబుల్ మీద ఉండి అతని ముందు ఫుడ్ పెట్టారు. 

క్రిష్ బలవంతంగా తింటున్నాడు.

నిషా "అన్ని బాగున్నాయా క్రిష్..." అంది.

క్రిష్ కి అంతా కారంగా అనిపించింది.

క్రిష్ "కొంచెం షుగర్ ఇస్తావా..."

కాజల్ చేతిలోకి తీసుకొని మూడు, నాలుగు చెంచాలు అతని ఫుడ్ లో వేసి "తిను" అంది.

నిషా నవ్వుకుంటూ మళ్ళి మామూలు అయినట్టు నటిస్తూ "అక్కకి నువ్వంటే ఎంత ఇష్టమో చూసావా... నువ్వు ఒక స్పూన్ అడిగితే, నాలుగు స్పూన్ లు వేసింది"

కాజల్ "ఇందులో ఇంకా అయిపొయింది..."

నిషా "లోపల పెద్ద డబ్బా వైట్ డబ్బాలో ఉంటుంది అక్కా" అంది.

కాజల్ "సరే" అని తీసుకురావడానికి వెళ్ళింది.

క్రిష్ "ఒక స్పూన్ వేయాల్సిన చోట నాలుగు అయిదు స్పూన్ లు వేస్తె అది వంట అవ్వదు" అన్నాడు.

నిషా "ఇలా డైలాగ్ లు చెప్పి టైం వెస్ట్ చేస్తావా... " అంది.

క్రిష్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి పడేసి వచ్చాడు.

కాజల్ "అందులో లేదే..." అని కేకేసింది.

నిషా "వైట్ డబ్బా చెప్పానా..... కాదు దాని పక్కన రెండో డబ్బా" అంది.

ఈ లోపు క్రిష్ ఖాళీ ప్లేట్ తీసుకొని వచ్చాడు.

ఈ లోపు కాజల్ వచ్చింది.

కాజల్ "అదేంటి అప్పుడే తినేసావా... ఈ షుగర్ ఏం చేయాలి"

నిషా "నోట్లో పోయి అక్కా, పొట్టలో కలిసి పోతుంది"

క్రిష్ కోపంగా నిషాని చూస్తున్నాడు.

కాజల్ "సరే" అంటూ నిజంగానే పోయబోయింది.

క్రిష్ "చాలు చాలు వద్దు... వద్దు... కడుపు నిండిపోయింది" అని పైకి లేచాడు.









[Image: tumblr-o2sl1q-LMin1qcnno2o3-500.gif]

Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 09-08-2024, 05:37 AM



Users browsing this thread: 27 Guest(s)