06-08-2024, 12:17 PM
(This post was last modified: 06-08-2024, 12:19 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
5. దేవుడు ఉన్నాడు, లేడు...
శైలజ "సర్, శైలజని కీర్తి మేడం అసిస్టెంట్" అంది.
అంటే తను కీర్తి ఆఫీస్ లో ఉంది అని సిగ్నల్ ఇచ్చింది.
మీ మెయిల్ కి ఒకమ్మాయి రేసుం పంపాను... చూడండి, కీర్తి మేడం గారు పంపమన్నారు, మీకు అసిస్టెంట్..." అంది
ఫోన్ పక్కన పెట్టి కంప్యూటర్ ఆన్ చేసి రేసుం చూశాను.
పేరు నిషా.....
తిరిగి కీర్తి వదినకి ఫోన్ చేశాను.
ఫోన్ లో కీర్తి నవ్వుతూ "హా... రాజ్.... చెప్పూ.." ఎంత స్వీట్ వాయిస్.... అన్ని కుట్రలు పన్నుతుంది.
వైభవ్ "వదిన, ఈ అమ్మాయి రేసుం నాకు పంపావు.... ఏంటి" అన్నాను.
కీర్తి (ఫోన్ లో) "ఈ అమ్మాయి మంచి క్యారక్టర్ ఉన్న అమ్మాయి.... నీకూ నచ్చుతుంది... అని నీకూ అసిస్టెంట్ గా అపాయింట్ చేశాను" నవ్వుతూనే ఉంది.
వైభవ్ "నాకే వర్క్ లేదు, నాకు అసిస్టెంట్ ఏంటి వదినా...."
కీర్తి (ఫోన్) "అలా అంటావ్ ఏంటి? రేపు ప్రాజెక్ట్ వస్తే.... మొత్తం నువ్వు మైంటైన్ చేయాలి? కదా... నువ్వేం మాట్లాడకుండా ఓకే చేసేయ్" అని నవ్వుతూ ఫోన్ కట్టేసింది.
వైభవ్ "నువ్వు బ్రతికి ఉండగా నాకు అధికారం ఎందుకు వస్తుందే" అని అనుకున్నాను.
నాకు చాలా ఆనీజీ గా అనిపిస్తుంది. నేను ఒక చేపపిల్లని ఒక వైపు కళ్యాణి, మరో వైపు కీర్తి వదిన ఇద్దరూ నన్ను తినడానికి చూస్తున్నారు. ఒకరి నుండి తప్పించుకుంటే మరొకరి నోట్లోకి వెళ్తాను. అలా అని ఎక్కువ సేపు ఇలా ఉండలేను. కాలం ముందుకు గడుస్తూ నన్ను డెసిషన్ చూపించమని ఫోర్స్ చేస్తుంది.
దేవుడా నాకు ఏదైనా దారి చూపించు అని ప్రార్ధించాను.
శైలజ ఫోన్ చేసింది.
శైలజ "హలో"
వైభవ్ "హా... శైలజ ఏంటి? ఈ అమ్మాయి"
శైలజ "సర్, ముందు నేను ఒక వీడియో పంపిస్తాను చూడండి" అంది.
వీడియో ఓపెన్ చేశాను.
ఇంటర్వ్యూ హాల్ నుండి నిషా బయటకు వచ్చింది.
లోపల నుండి ఒక లావుపాటి ఇంటర్వ్యూయర్ కూడా అదే వేగంగా వచ్చి నిషా చేయి విసురుగా పట్టుకొని "ఎక్కడికే వెళ్తున్నావ్... ఆఫర్ లెటర్ ఇస్తా అందుకోవె..." అంది.
నిషా నొప్పికి "ఆహ్" అని అరుస్తూ ఇంటర్వ్యూయర్ తో "వదులు" అని అడిగింది.
ఇంటర్వ్యూయర్ చేతులు గట్టిగా పట్టుకోవడంతో నిషా చేతి గాజులు పగిలి గుచ్చుకున్నాయి.
నిషాకి బాధగా అనిపించి "అమ్మా" అని అరిచింది. తన చేతిలోని సర్టిఫికెట్స్ కింద పడ్డాయి. అవి తీసుకుంటూ ఉంటే... కొన్నింటి పై ఇంటర్వ్యూయర్ కాలు పెట్టి తొక్కింది.
అది చూస్తూ ఉంటే.... ఆమె కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.
ఆఫీస్ లో అందరూ వాళ్ళను చూస్తూనే ఉన్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇంటర్వ్యూయర్ ఇంకా శాడిజంలా మాట్లాడుతూ "ఇది పెద్ద కేసు.... కాలేజ్ లో ఉన్నప్పుడు చాలా కధలు పడింది.... మేం... తప్పు అని చెప్పాం అని..... మా మీద ర్యాగింగ్ కంప్లయింట్ యిచ్చింది. తర్వాత పెళ్లి చేసుకుంది. దీని వేషాలు తెలిసి దీని మొగుడు జాగ్రత్త పడి విడాకులు ఇచ్చి పారి పోయాడు... ఇప్పుడు జాబ్ కావాలని వచ్చింది... నీ లాంటి బిచ్ ఇక్కడ పని చేస్తే.... ఇక్కడ అందరి కాపురాలు కూలిపోతాయ్..." అంది.
అందరూ తనని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఇబ్బందిగా అనిపించి, నిషా ఆ ఇంటర్వ్యూయర్ కాలి కింద ఉన్న సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుండి వీలు అయినంత తొందరగా బయటకు వెళ్లిపోవాలని అనుకుంది.
నిషా కళ్ళు తుడుచుకొని "నా.. నా.. నా సర్టిఫికేట్..." అంది.
ఇంటర్వ్యూయర్ "నీకూ ఎందుకె సర్టిఫికేట్స్... ఎదో చదివి పాస్ అయినట్టు.... లేక్చిలర్స్ దగ్గర పడుకొని తెచ్చుకున్న మార్క్స్ కదా" అని కాలు దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ చేతుల్లోకి తీసుకొని విసిరి నిషా మొహాన కొట్టింది.
నిషా వాటిని తీసుకొని సర్దుకుంటుంది.
మరో ఇంటర్వ్యూయర్ "దీన్నీ నేను వేరే వాడి బైక్ మీద చూశాను...." అంది.
ఇంటర్వ్యూయర్ "అవునా.... " అని నిషా వైపు చూసి "ఎవరే అది" అంది.
నిషా తల వంచుకొని సర్టిఫికెట్స్ సర్దుకుంటూ వాటికి అయిన కాలు బూటు మరకలు తుడుచుకుంటూ ఉంది.
ఇంటర్వ్యూయర్ ముందుకు వచ్చి నిషా కాలర్ పట్టుకొని "ఎవరే అది చెప్పవే..." అంది.
నిషా "ఆహ్...." అని అరిచి చొక్కా పట్టుకొని దీనంగా ఇంటర్వ్యూయర్ వైపు చూసింది.
ఇంటర్వ్యూయర్ గట్టిగా లాగితే చొక్కా చినిగిపోతే అందరి ముందు తన బ్రా కనిపిస్తుంది.
తన అక్క గాని, క్రిష్ గాని తన పక్కన ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు. తన అసహాయతకు తనని తానె తిట్టుకుంది.
ఇంటర్వ్యూయర్ అనుకున్న పని చేసేసింది. కాలర్ గట్టిగా లాగడంతో రెండు గుండీలు చిరిగి బ్రా బయటకు కనిపించింది.
నిషా రెండు చేతులు హార్ట్ దగ్గర పెట్టుకొని బాధగా ఫీల్ అయింది. చుట్టూ అందరూ చూస్తున్నారు కాని ఎవరూ తనకు సహాయానికి రావడం లేదు.
నిషా చిన్నగా "అవును దేవుడు లేడు... కాని నాకు నేను ఉన్నాను" అనుకుంది.
ఎదురుగా ఉన్న ఇంటర్వ్యూయర్ "ఏంటే అలా చూస్తున్నావ్.... తల దించు... దించు... " అంది.
నిషా మనసులో "ఏదైనా తేడా వస్తే అక్క కానీ, క్రిష్ కాని ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, నాకు సపోర్ట్ చేస్తారు" అనుకుంటూ "ఏంటే... నీ బోడి బిల్డప్" అంది.
అప్పటి వరకు పిల్లిలా సైలెంట్ గా ఉన్న నిషా అలా మాట్లాడే సరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఇంటర్వ్యూయర్ కూడా ఎదో మాట్లాడే లోపే...
నిషా "కల్లు తాగిన కోతిలా ఎందుకు అరుస్తున్నావ్.. అసలు ఆ పొట్టని ఆ చొక్కాలో, ఆ పిర్రలను ఆ ప్యాంట్ లో ఎలా తోస్తావే... తల్లి..... తీసేటపుడు నలుగురు కలిసి లాగుతారా... ఊహించుకుంటూనే నవ్వొస్తుంది" అంది.
చుట్టూ అందరూ నవ్వారు.
ఇంటర్వ్యూయర్ చేతులు ఎత్తి ముందుకు వస్తూ ఉంటే... నిషా కళ్ళు పెద్దవి చేసి "ఎక్కడికి వస్తున్నావ్... ఆగూ అక్కడే.... ఇప్పటి వరకు నువ్వు చేసింది అంతా.... అదిగో ఆ సిసి కెమెరా లో రికార్డ్ అయింది" అంది.
ఇంటర్వ్యూయర్ అటు చూస్తూ కొంచెం కంగారు పడింది.
నిషా "నువ్వు మాట్లాడిన సొల్లు అంతా నా ఫోన్ లో రికార్డ్ కూడా అయింది" అంటూ తన ఫోన్ ని బయటకు తీసింది.
ఇంటర్వ్యూయర్ ముందుకు వచ్చి ఫోన్ లాక్కోబోతే తోసేసింది. ఇంటర్వ్యూయర్ తన చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని అందులో సర్టిఫికెట్లు బయటకు తీసి చించబోయింది.
నిషా "అవి జిరాక్స్ లే.... మీ ఆఫీస్ బయటే తీయించా.... ఇంకా కావాలి అంటే ఇంకో సెట్ కూడా తెప్పిస్తా... చించుకుంటూ కూర్చో..." అంది.
ఇంటర్వ్యూయర్ "నిన్నూ..." అంటూ కోపంగా చూసింది.
నిషా "ఇదిగో ఈ వీడియో మరియు ఆడియో పెట్టుకొని పోలిస్ స్టేషన్ కి వెళ్లి అవమానించారు అని, బలాత్కారం చేయబోయారని ఇంకా రకరకాలు కేసులు పెడతా.... నిన్ను కోర్టుకు తిప్పుతా..." అంది.
ఇంటర్వ్యూయర్ "హేయ్... నిషా.... ఇలా రా.... రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం"
నిషా నవ్వింది.
ఇంటర్వ్యూయర్ "నిషా, మర్యాదగా పిలుస్తున్నా రా... రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం" అని పొగరుగా అరిచింది.
నిషా "ఇప్పుడు నన్ను భయపడ మంటావా...." అంది.
నిషా మోహంలో భయం తాలుకా చాయ కనిపించడం లేదు, పైగా ఇంటర్వ్యూయర్ వెనక్కి తగ్గడం తో తనకు ఇప్పుడు కొంచెం మజా కూడా వస్తుంది.
నిషా "అమ్మా, బాబు పోతే... నేను అక్కా ఇద్దరమే కలిసి పెరిగాం...
ప్రేమ అని ఒకడు వస్తే... పెళ్లి చేసుకున్నా....
వాడు దరిద్రుడు అయితే, విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నా...
ప్రేమించిన పాపానికి బాధగా అనిపించి ఆరు నెలలు పట్టింది అందులో నుండి బయటకు రావడానికి....
ఇది నేను వచ్చిన మొదటి ఇంటర్వ్యూ...
నేను భయపడను..
ఎందుకంటే నీ కంటే పెద్ద వెధవను నా ఎక్స్. మొగుణ్ణి చూశా...
ఇది కాక పోతే వేరే ఏదైనా చేసుకుంటా...
అసలు ఇవన్నీ కాక పోతే.... సూపర్ మార్కెట్ లో సేల్స్ పర్సన్ గా అయినా జాయిన్ అవుతా....
అంతే కాని తప్పు చేయను... చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు...
మీ ముగ్గురు కోసం సెక్యూరిటీ ఆఫీసర్లను పంపిస్తా సిద్దంగా ఉండండి...."
నిషా తను చెప్పాల్సినది మొత్తం చెప్పిసి అందరి ముందు తల ఎత్తుకొని ఆత్మవిశ్వాసంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
తన బ్రా బయటకు కనిపిస్తున్నా ఎవరూ చూసే దైర్యం చేయలేదు.
వెనక ఆ ఇంటర్వ్యూయర్ అరుస్తున్నా వెనక్కి కూడా తిరగకుండా వెళ్లి పోయింది.
వీడియో మొత్తం చూశాను. వావ్ అనుకోకుండా ఉండలేకపోయాను. తనను అవమానించిన చోట తను తిరగబడి లేచింది, నిలబడింది, ఎదిరించింది. తను నాకు బాగా నచ్చింది. ఆ నచ్చడం కాదు, ఒక మనిషిగా నచ్చింది. పస్తుతం నేను చేయాల్సింది కూడా అదే... తిరగబడాలి, నిలబడాలి, ఎదిరించాలి, అన్నింటికి మించి నన్ను నేను మార్చుకొని నా శత్రువులను కలవాలి. కామ్ గా ఆలోచించి నా సమస్యని ఎదుర్కోవాలి.
నాకు తెలియని దైర్యం వచ్చింది. యస్ ఏమి లేని ఒకమ్మాయి ఒంటరిగా ఎదిరించింది అంటే.... అన్ని ఉండి నేను అడక్క తినాలా.... అనుకున్నాను.
నాకు తెలియని దైర్యం వచ్చింది. యస్ ఏమి లేని ఒకమ్మాయి ఒంటరిగా ఎదిరించింది అంటే.... అన్ని ఉండి నేను అడక్క తినాలా.... అనుకున్నాను.
వైభవ్ చిన్నగా "అవును దేవుడు ఉన్నాడు... నాకు దారి చూపించాడు. మిస్ నిషా నువ్వు నన్ను ఇన్స్పైర్ చేశావ్" అనుకున్నాను.
కళ్యాణి గురించి ఆలోచించాలి అంటే భయం వేస్తుంది కాని ఆలోచించి ఎదో ఒక డెసిషన్ తీసుకోక పోతే జరిగే పరిణామాలకు ఇంకా భయం వేస్తుంది. ఎదో ఒకటి చేయాలి..... చేయాలి....
కళ్యాణితో కలిసి ఉండడం కుదరదు. బాధగా అనిపించినా లేకపోయినా జరగాల్సింది జరగాలి.
బోర్డు మీద మార్కర్ తో రాయడం మొదలు పెట్టాను.
కళ్యాణి .... మరో వైపు కీర్తి .....
ఒక వ్యక్తి చేతి నుండి తప్పించుకుంటే మరో వ్యక్తికీ ఆహారం అయిపోతాను. న్యాక్ గా ఈ సమస్య నుండి బయట పడాలి.
కళ్యాణి కావాలి? ఎస్ ఆర్ నో....
నా ఆన్సర్ నో....
చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను.