04-08-2024, 08:11 PM
(This post was last modified: 04-08-2024, 08:15 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
ఓరోరి మానవా నీకన్నీ చాలవా
వినుమంటే వింటవా చూస్తావు వింతగా
కుర్చోర బండ మీద దిండు ఎందుకూ
తినరాదు పప్పు బువ్వ బొక్క ముక్కలేందుకూ
కూకుంటే లేస్తవా లేదంటే నడ్తవా
బండెక్కి తుర్రుమంటవ్
ఫోను పట్టి బుర్రుమంటవ్
గూట్లనే గుయ్యిమంటవ్
జాగ్రత్తో హుయ్....!
ఓరోరి మానవా నీకన్నీ చాలవా
చిటికైన ఎస్తవా చినుకత్తే చూస్తవా
ఇంతోటి దానికే ఉరుకుడెక్కువా
అంతోటి దానికే అరుపులెక్కువా
ఓరోరి మానవా నా లాంటి మానవా
బాటతోని ఆట ఇది
గడియతోని గమనమిది
ఇంటవా ఇంటావా నువ్వు చెప్తె ఇంటవా
చిన్నప్పటి చిట్టి కథలు చదువుమంటే
పెద్దోడి పత్తి కథలు చదువువవట్టే
చదువత్తే చదువవా చావత్తే చావవా
ఏమైన నీకు ఆశెక్కువా
ఒరోరి నీకు దూకుడెక్కువా.
ఓరోరి మానవా చదివినవా మానవా…!
ఇంకెంత చదువుతావు ఇది గింతె మానవా...!!
- Haran000
వినుమంటే వింటవా చూస్తావు వింతగా
కుర్చోర బండ మీద దిండు ఎందుకూ
తినరాదు పప్పు బువ్వ బొక్క ముక్కలేందుకూ
కూకుంటే లేస్తవా లేదంటే నడ్తవా
బండెక్కి తుర్రుమంటవ్
ఫోను పట్టి బుర్రుమంటవ్
గూట్లనే గుయ్యిమంటవ్
జాగ్రత్తో హుయ్....!
ఓరోరి మానవా నీకన్నీ చాలవా
చిటికైన ఎస్తవా చినుకత్తే చూస్తవా
ఇంతోటి దానికే ఉరుకుడెక్కువా
అంతోటి దానికే అరుపులెక్కువా
ఓరోరి మానవా నా లాంటి మానవా
బాటతోని ఆట ఇది
గడియతోని గమనమిది
ఇంటవా ఇంటావా నువ్వు చెప్తె ఇంటవా
చిన్నప్పటి చిట్టి కథలు చదువుమంటే
పెద్దోడి పత్తి కథలు చదువువవట్టే
చదువత్తే చదువవా చావత్తే చావవా
ఏమైన నీకు ఆశెక్కువా
ఒరోరి నీకు దూకుడెక్కువా.
ఓరోరి మానవా చదివినవా మానవా…!
ఇంకెంత చదువుతావు ఇది గింతె మానవా...!!
- Haran000