02-08-2024, 08:36 AM
"రేయ్ ప్లేట్ కిచెన్ టేబుల్ మీద పెట్టు"... టిఫిన్ తిని లేవబోతున్న కొడుకుతో అంది మృదుల.
"అదేంటి? రోజూ తిని ఇలానే వదిలేస్తా కదా?" అర్ధం కాక అడిగాడు సంజయ్.
"లక్ష్మి రాలేదు, నేను ఆఫీసుకి తొందరగా వెళ్ళాలి, నాతో వాదించకురా. ప్లేట్ తీ"... కసురుకుంటూ బదులిచ్చింది.
"రాలేదా, అదేంటి? నిన్న రాలేదు. ఈ రోజు వస్తుంది అన్నావు కదా"
"ఏమోరా. నాకైతే ఆఫీస్ వర్క్ చాలా ఉంది. నీకు చదువుకుని రిలాక్స్ అవ్వాలని ఉంటే, కొన్ని గిన్నెలు తోము"... లోపలికి వెళ్తూ చెప్పింది.
"ఏంటి అమ్మా జోకా"
"డెడ్ సీరియస్"
"ఛీ ఛీ. నేను అంట్లు తోమాలా? మామ్, ఐ యామ్ గోయింగ్ టు బి ఎ బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్" అన్నాడు గొప్పగా.
వెనక్కి తిరిగి చూసి... "బట్ యు కెనాట్ ఈట్ కోడ్, యు ఈట్ ఫుడ్. సో డూ సమ్ డిషెస్"... నవ్వుతూ, ఆఫీసుకి రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళింది మృదుల.
కంప్యూటర్ ముందు ఉండి, తల్లి వెళ్ళే దాకా టైం పాస్ చేద్దాం అనుకుంటూ ఊరికే ఏవో సైట్స్ చూడసాగాడు.
తల్లి రెడీ అయ్యి గేట్ లాక్ చేసుకోమన్న పిలుపు విని బయటకి వచ్చాడు.
పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే ఆటో ఎక్కబోతున్న తల్లికి టాటా చెప్తూ ఉండగా, వెనక దూరంగా వస్తున్న లక్ష్మి కనిపించింది.
"అమ్మా, లక్ష్మి"... లక్ష్మి వస్తున్న వైపు చెయ్యి చూపించి అరిచినట్టు అన్నాడు సంజయ్.
స్టార్ట్ అవ్వబోతున్న ఆటో నించి బయటకి దిగి లక్ష్మి వైపు కాస్త కోపంగా చూడసాగింది మృదుల.
దగ్గరికొచ్చింది లక్ష్మి.
లక్ష్మికి ఏదీ చెప్పే అవకాశం ఇవ్వకుండా... "ఏంటి లక్ష్మి ఇది, నిన్న రాలేదు, ఈ రోజు వస్తాను అన్నావు, ఎక్కడి అంట్లు అక్కడే ఉన్నాయి, బట్టలు కూడా ఉన్నాయి. మా ఇంట్లో పనుల గురించి నీకు తెలుసు కదా. రాకపోతే ఎలా చెప్పు"... కాస్త కోపం, చనువు రెండూ చూపిస్తూ అంది మృదుల.
"మా నాన్న కాలికి నిన్న దెబ్బ తగిలిందమ్మా, పెద్ద కట్టు కట్టారు. నిన్నంతా ఇంట్లో లేనమ్మా. ఈ రోజే కాస్త బాగుందమ్మా. అందుకే మీకు కలిసి విషయం చెప్పాలని వచ్చాను, రేపు కూడా రానమ్మా. ఎల్లుండి వస్తే చెప్తాను"... దిగులుగా చెప్పింది లక్ష్మి.
"అయ్యో. సరే కానీ, మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నువ్వు రావక్కరలేదు, మీ నాన్నని చూసుకో. కాని మా ఇంటి పని కోసం, నువ్వు వచ్చే దాకా ఎవరినైనా పంపుతావా?"... ఆఫీస్ బిజీతో ఇంటి పని కూడా చెయ్యాలంటే తన వల్ల అవ్వదని తెలిసి, లక్ష్మి చేతిలో కొన్ని వందలు పెడుతూ అడిగింది మృదుల.
ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ, తనకి ఏదన్నా కష్టం వస్తే, జీతంతో సంబంధం లేకుండా తనకి సాయం చేసే మృదులతో... "చూస్తానమ్మా. మా చుట్టలమ్మాయి వచ్చింది. మీ వరకు చేస్తే చాలు అని చెప్పి చూస్తాను. డిగ్రీ చదువుతోందమ్మా, వస్తుందో రాదో చెప్పలేను. తను రానంటే నేనే వస్తాను. ఈ రోజు, రేపు మీరే చూసుకోండి... చెప్పింది లక్ష్మి.
"ఆ అమ్మాయిని ఒకసారి సాయంత్రం ఇంటికి పంపించు చాలు, మాట్లాడతాను"... అంది మృదుల.
"అలాగేనమ్మా"... అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి.
'ఎవరో ఒకరు, వస్తే చాలు, పని భారం తగ్గుతుంది' అనుకుంటూ నిట్టూర్చి... "సరేరా, జాగ్రత్త"... కొడుకు వీపు మీద తట్టి క్షణం కూడా ఆగకుండా ఆటోలో కూర్చుంది మృదుల.
గుర్రం లాగా సర్రుమని వెళ్తున్న తల్లి ఉన్న ఆటో వైపు, ఆటో దూరంగా వెళ్ళే దాకా చూసి... లోపలికి వెళ్లాడు సంజయ్.
'ఎంత చిన్న విషయం ఇది. కాని అమ్మకి ఇంపార్టెంట్. నిజమే, లక్ష్మి రెండు రోజులు రాకపోతే రాకపోతేనే ఇల్లు పిచ్చిగా ఉంది. వాషింగ్ మెషీన్ వాడినా, లక్ష్మి ఉతికినట్టు లేవు బట్టలు'... వేసుకున్న తన షర్ట్ చూసుకుని అనుకుంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు సంజయ్.
లక్ష్మి వస్తుందో, లేదా లక్ష్మి పంపించే అమ్మాయి వస్తుందో, ఆ కధేంటో వచ్చే భాగంలో చూద్దాం.