Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా లవ్ స్టోరీస్
#15
Update 3

ఇక అలా రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి తన నెంబర్ ఫీట్ చేసుకొని హాయ్, రవి హియర్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టాను. తన దగ్గర నుండి వెంటనే రిప్లై వచ్చింది హాయ్ అని.
రవి : వెళ్ళావా ఇంటికి
అంజలి: ఇంకా లేదు ఇంకో 15 మినిట్స్ పడుతుంది.
రవి : రేపు శనివారం కదా ప్లాన్స్ ఏంటి
అంజలి : ఏముంది కాలేజ్ కి వెళ్లడమే
రవి : బంక్ కొడదాం అనుకుంటున్నా, సినిమా కి వెళదాం నువ్వు వస్తావా
అంజలి : ఏంటి బంక్ కొత్తగా, నువ్వు క్లాస్సేస్ కి రెగ్యులర్ గా వెళ్తావ్ అంటగా, నాకంటే చాలా సిన్సియర్ అంటగా చదువు పట్ల
రవి : నీకు ఎవరు చెప్పారు
అంజలి : సీనియర్ ని బాబు ఆ మాత్రం తెలుసుకుంటాం, ఏమి తెలుసుకోకుండానే నెంబర్ ఇస్తానా నీకు
రవి : అమ్మనీ ఇది మాములు షాక్ కాదు
అంజలి : హా  హా హా
రవి : మీరు ఏమో అనుకున్నా అస్సలు, సూపర్ అంతే
అంజలి : అంత లేదు లే
రవి : ఇంకా ఏమేమి తెలుసు
అంజలి : ఇంకా నువ్వు Btech అయిపోయాక సివిల్స్ కోచింగ్ కి వెళ్తావ్ అంటగా
రవి : ఇది కూడా చెప్పారా?
అంజలి : హా చెప్పారు ?
రవి : అబ్బో బాగానే తెలుసుకున్నావ్ గాని నీకు నా గురించి చాలా ఎక్కువ చెప్పారు, మనకు అంత సీన్ లేదు, ఏదో మంచిగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని అంతే
అంజలి : అవును మరి మంచిగా చదువుకోకుండా ఈ లవ్ ఏంటి బాబు
రవి : లవ్ చేస్తూ బాగా చదువుకోకూడదా అని నిన్ను చూసాకే అనిపించింది.
అంజలి : అబ్బా అవునా… మరి బంక్ ఏంటి… అంతగా కావాలి అంటే సండే కలుద్దాం లే.
రవి : ఇంట్లో ఏమి అనరా
అంజలి : నేను హాస్టల్ లో ఉంటా, అమ్మ వాళ్ళు సిటీ లో నే ఉంటారు బట్ చాలా దూరం కాలేజ్ కి అని నేను హాస్టల్ లో ఉంటున్న.
రవి : మరి ఇందు సంధ్య కూడా హాస్టలే నా
అంజలి : ఇందు ఇంటి దగ్గర నుండే వస్తది, సంధ్య నా హాస్టలే, కానీ నేను సండే రావాలి అంటే వీళ్ళలో ఎవరో ఒకరు నాతో పాటు రావాలి so నువ్వే ఇందు కి ఫోన్ చేసి నన్ను తీసుకురమ్మని చెప్పు
రవి : సరే అయితే సంధ్య ని కూడా రమ్మను అందరం లంచ్ కి వెళదాం  
అంజలి : సరే రేపు కలుద్దాం అని బాయ్ చెప్పింది.
రవి : నైట్ ఫోన్ చెయ్యనా
అంజలి : సరే చెయ్యి కానీ నేను ఫ్రీగా ఉంటేనే మాట్లాడుతా
రవి : సరే బాయ్, లవ్ యు ❤️?
అంజలి : ?
ఇక నేను 9 కి అలా కాల్ చేసా, తను ఎత్తలేదు. ఇంకో 10 మినిట్స్ లో ఇందు నుండి కాల్. లిఫ్ట్ చేసా
ఇందు : ఏంటి లవర్ బాయ్ ఏమి చేస్తున్నావ్ తిన్నావా?
రవి : ఏమి లేదు ఇందు ఖాళీగానే ఉన్నా ఇప్పుడే తిన్న నువ్వు తిన్నావా? నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా
ఇందు : ఎందుకు
రవి : రేపు బంక్ కొట్టి మూవీ కి వెళ్దామా, నీకు ఓకే అయితే అంజలి సంధ్య కి కూడా చెప్పు.
ఇందు :  అంజలి రాదు లే నేను సంధ్య వస్తే నీకు ఓకే నా.
రవి : ప్లీజ్ అబ్బా
ఇందు : సరే అడుగుతా ఒకవేళ రాకపోతే మనం వెళదాం
రవి : హా సరే కాని సండే మాత్రం అంజలి ని ఏదో ఒకటి చేసి తీసుకురా లంచ్ కి వెళదాం
ఇందు : ఓకే, సండే అయితే ఎలా అయినా తీసుకొస్తాలే, అయినా అంజలి వస్తే మాతో మాట్లాడతావా అస్సలు.
రవి : అప్పుడేదో అలా చేసా లే ఇప్పుడు చెయ్యను.
ఇందు : సరే నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతా, కాన్ఫరెన్స్ లో పెట్టాలా?
రవి : పెట్టు, నేను ఉన్నా అని చెప్పకు
ఇందు : వెయిట్ చెయ్
కాల్ లో
ఇందు : హలో అంజు ఏమి చేస్తున్నావ్
అంజలి : ఏమి లేదు వే కాళీ నే ఇప్పుడే తిన్న నువ్వు తిన్నావా
ఇందు : తిన్నా గాని నువ్ రేపు మూవీ కి వస్తావా
అంజలి : రేపు కాలేజ్ ఉంది గా
ఇందు : బంక్ కొడదాం
అంజలి : నేను రాను అని తెలుసు కదే
ఇందు : నా కోసం రా రా ప్లీజ్
అంజలి : ఏమే సంధ్య రేపు మూవీ కి వెళ్తావా
ఇందు : ఏంటి నువ్వు రావా
అంజలి : అబ్బా నేను రేపు మార్నింగ్ చెపుతా
సంధ్య : నేను రెడీనే ఏమి మూవీ కి వెళదాం
ఇందు : అక్కడ ఏమి మూవీ ఉంటే అదే
అంజలి : అస్సలు ఎప్పుడు లేనిది కొత్తగా ఈ ప్లాన్స్ ఏంటి మేడం
ఇందు : ఊరికినే మనం వెళ్ళక చాలా డేస్ అవుతుంది అని
అంజలి : అంతేనా ఇంకా ఏమయినా నాకు తెలియకుండా ప్లాన్ చేస్తున్నావా
ఇందు : అంతే బాబు ఇంకా ఏమి లేదు
అంజలి : సరే నేను రేపు కాల్ చేస్తా బై
ఇందు : రవి ఇప్పుడు హ్యాపీయేన
రవి : ఏంటి హ్యాపీ నేను వస్తే తను ఏమనుకుంటుందో, నేను వస్తున్న అని చెప్పలే గా
ఇందు : అది నేను మేనేజ్ చేస్తా లే లైట్ తీస్కో
అప్పుడే అంజలి దగ్గర నుండి కాల్ వస్తుంది, ఇప్పుడు ఏమంటుందో అని టెన్షన్ స్టార్ట్ అయ్యింది. వేరే ఇంపార్టెంట్ కాల్ ఒకటి వస్తుంది సరే నేను మళ్ళీ చేస్తా అని చెప్పి అంజలి కాల్ లిఫ్ట్ చేసా
అంజలి : ఏంటి రవి ఇదంతా నీ ప్లానేనా
రవి : ఏంటి ప్లాన్?
అంజలి : ఇందు ఫోన్ చేసి అడిగింది రేపు మూవీ కి వెళ్దామా అని
రవి : నువ్ రానని తనకి చెప్తే సరిపోతుంది గా మధ్యలో నేను ఎందుకు గుర్తుకు వచ్చా , అయినా తన నెంబర్ నా దగ్గర లేదు.
అంజలి : సరే కోప్పడకు, మేము వెళ్తున్నాం రేపు. నువ్వు వస్తే అప్పుడు ఉంటది నీకు.
రవి : అబ్బా అదేంటి నేను కూడా వస్తా ప్లీజ్, ఆల్రెడీ నువ్ బంక్ కొడదాం అని ఫిక్స్ అయ్యావ్ గా నేను వస్తే ఏమి ప్రాబ్లెమ్
అంజలి : వద్దు, సండే కలుద్దాం అన్నా గా
రవి : సండే కూడా కలుద్దాం
అంజలి : ఇంకేమన్నా కాదు, నేను రాలేను బాబు
రవి : సరే అయితే రేపు ఒక్కరోజు కలుద్దాం లే
అంజలి : మళ్ళీ మొదటికే వస్తున్నావ్ వద్దని చెప్పానా
రవి : సరే నీ ఇష్టం మూవీ కి రాను లే మూవీ అయిపోయాక బయట కలుస్తా, సండే వద్దులే.
అంజలి : ఓకే బై
రవి : బై గుడ్ నైట్
కొద్దిసేపు అయిన తర్వాత అంజలి మెసేజ్ చేసింది ఫీల్ అయ్యావా అని
రవి : అలా ఏమి లేదు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నాకు
అంజలి : సరే నువ్వు కూడా రా మరి, ఏమో రా నన్ను అన్నిటికి కన్వీన్స్ చేస్తున్నావ్ నువ్వు, ఏమి మాయ చేసావో ఏంటో
రవి : థాంక్ యు అంజలి, థాంక్ యు వెరీ మచ్ ❤️
అంజలి : బై గుడ్ నైట్ ?
రేపు ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయా.
Like Reply


Messages In This Thread
RE: నా లవ్ స్టోరీస్ - by Thewarrior100 - 27-07-2024, 02:58 PM



Users browsing this thread: 11 Guest(s)