Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా లవ్ స్టోరీస్
#9
Update 2

నేను అలా అటు వైపు వెళ్ళగానే మా రూమ్ మేట్స్ ఏంటి సంగతి అన్నట్లు నా వైపు చూస్తున్నారు. ఎం లేదు రా వాళ్ళకి నేను తెలిసిన వాడిలా కనిపిస్తే పిలిచారు. సీనియర్స్ కదా అని వెళ్ళాను అంతే అని అన్నాను. వాళ్ళు ఎంతసేపు ఒబ్సెర్వ్ చేసారో ఏంటో మరి but అబద్దం అయితే చెప్పా. ఈ ర్యాగింగ్ ఇవన్నీ చేసేటప్పుడు వాళ్లు లేరు. మేము డైలీ బస్టాప్ దగ్గరే కలుస్తాం. ఒక ఇద్దరు సేమ్ కాలేజ్ , నేను ఒక కాలేజ్ ఇంకో ఫ్రెండ్ వేరే కాలేజ్. మొత్తం నలుగురం ఉంటాం రూమ్ లో. మేము అందరం first ఇయర్ లో ఉన్నప్పుడు హాస్టల్ ఫ్రెండ్స్. అందుకే డిఫరెంట్ కాలేజ్ అయిన క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది మా మధ్య. వాళ్లు కూడా ఇంకా ఏమి అడగకుండా సరే వెళదాం లే అని అన్నారు. అయినా గాని వాళ్లలో నా బెస్ట్ ఫ్రెండ్ గాడికి డౌట్ వచ్చింది. సర్లే అడిగితే అప్పుడు చూద్దాం లే అని bus కోసం వెయిట్ చేసాం. Bus రాగానే వెళ్ళాం. కానీ నా మనసు మొత్తం అక్కడే ఉంది. అస్సలు ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంది. నేను దిగాల్సిన స్టాప్ వచ్చినా అలానే తన గురించి ఆలోచిస్తున్న. నా ఫ్రెండ్స్ ఇది గమనించినా అప్పుడు ఏమి అడగలేదు. ఇక రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి టెర్రస్ మీదకి వెళ్ళాను. ఫోన్ ఓపెన్ చేసి సంధ్య కి కాల్ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకులే వాళ్లు ఇంటికి అయినా వెళ్లారో లేదో అని ఆగిపోయా. ఎం చెయ్యాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్ధం అవ్వట్లే. సరే వెయిట్ చేద్దాం, ఇంకా కొంచెం టైం తీసుకొని ప్రొసీడ్ అవుదాం అని అనుకున్నాను కిందికి వెళ్ళగానే నా బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ డౌట్ గా చూసి చాయ్ తాగుదాం రా అని బయటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక ఏంటి సంగతి ఎవరు ఆ అమ్మాయిలు? లవ్ చేస్తున్నావా? ఆ ముగ్గురి లో ఎవరిని అని టక టక అడిగేసాడు. నేను కూడా ఏమి దాచుకోకుండా నాకు కూడా ఏమి అర్ధం అవ్వట్లేదు రా, ఒక అమ్మాయి నచ్చింది బట్ సీనియర్ రా ఆ అమ్మాయి అని చెప్పా. ఏంట్రా ఎప్పుడు లేనిదీ కొత్తగా లవ్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాగా చదవాలి, ఐఏఎస్ అవ్వాలి అని ఏమో చెప్పావు ఇప్పుడేంటి ఇలా అని అడిగాడు. అది అదే ఇది ఇదేరా అని అన్నా. అంతే అంటావా అని ఒక నవ్వు నవ్వి సరే మామ నీకు ఎమన్నా help కావాలంటే అడుగు అని చెప్పాడు. సరే అని ఎవరికీ చెప్పకు అప్పుడే అని చెప్పా. అలా కొద్దిసేపు బయట తిరిగి రూమ్ కి వెళ్ళాం. వెళ్ళగానే ఇందు నుండి కాల్, ఎత్తగానే ఏంటి hero ఎం చేస్తున్నావ్ అని అన్నది. ఎం లేదు ఇందు, అంజలి గురించే ఆలోచిస్తున్న అన్నా. అనుకున్నా రా బాబు నీ చూపులు చూస్తేనే అర్ధం అయ్యింది దీన్ని వదిలేలా లేవు అని అన్నది. మంచిగా ట్రై చెయ్ first టైం అది పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం అని అన్నది. ఇంకా తన నెంబర్ ఫీట్ చేసుకోమని చెప్పి ఫోన్ కట్ చేసింది. నేను కూడా కొద్దిసేపు ఆ ఆలోచనలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ కి వంట లో help చేసి తిని పడుకున్నాను. కానీ ఎంత సేపటికి నిద్ర అస్సలు రావట్లేదు. అంజలినే గుర్తు వస్తుంది. ఏదో 3 AM కి అలా నిద్ర పట్టేసింది. ఇక మార్నింగ్ లేచి తొందరగా కాలేజ్ కి వెళ్లి వాళ్ళ కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న. 9 కి అలా ఇందు n అంజలి వస్తూ కనిపించారు. ఇందు చూసి హాయ్ చెప్పింది, అంజలి చూసి చూడనట్లు వెళ్తుంది. నేను వాళ్ళతో పాటే వెళ్ళాను. హాయ్ అని అంజలి ని పలకరించాను. తను కూడా హాయ్ అని ఏంటి ఎం కావాలి అని అడిగింది. ఎం లేదు కొద్దిసేపు మీతో వుంటా అన్నా. క్లాస్సేస్ లేవా నీకు అని అడిగింది. ఉన్నాయి బట్ 9.30 వరకు వెళ్తా అని చెప్పా. సరే మేము వెళ్ళాలి గా అని అంది. మీరు ఫైనల్ ఇయర్ కదా క్లాస్సేస్ కి వెళ్తారా అని అడిగా. అప్పటి దాకా సైలెంట్ గా ఉన్న ఇందు తను బంక్ కొట్టె బ్యాచ్ కాదు బాబు కాలేజ్ టాపర్ n సిన్సియర్ స్టూడెంట్. ఓహ్ సూపర్ అన్నాను. నాకు కూడా అలాంటి వాళ్లు అంటే బాగా ఇష్టం అని చెప్పాను. సరే రవి ఇక మేము క్లాస్ కి వెళ్తాము అని వెళ్లారు. నేను కూడా ఇక చేసేది ఏమి లేక క్లాస్ కి వెళ్ళాను. ఈవెనింగ్ మళ్ళీ వెయిట్ చేశాను. ఇందు కనిపించింది. ఇందు దగ్గరికి వెళ్లి హాయ్ చెప్పినా రెస్పాండ్ అవ్వలేదు. ఏంటి మేడం పట్టించుకోట్లేదు అని అడిగా. అబ్బో మళ్ళీ మేడం కి వచ్చావే అని, నువ్ మాతో ఎక్కడ మాట్లాడతావ్ అని అన్నది. ఏమైంది ఇపుడు అని అడిగాను. మార్నింగ్ నేను హాయ్ చెప్పిన పట్టించుకోలేదు, అంజలి ఉంటే మేము కనపడం కావచ్చు అని అన్నది. నేను వామ్మో ఇదేదో తేడా కొట్టేలా ఉంది అని sorry చెప్పి గుంజీలు తీసినట్లు యాక్ట్ చేసా. తను నవ్వి సర్లే ఏడవకు పద బస్టాపు కి పోదాం అని అన్నది. అవును సంధ్య మేడం ఎక్కడ మార్నింగ్ కూడా కనిపించలేదు అని అడిగాను. తను వేరే కాలేజ్,ఈవెనింగ్ బస్టాప్ లోనే కలుస్తుంది. ఓహో సరే మరి అంజలి ఎక్కడుంది అని అడిగా. లైబ్రరీ కి వెళ్ళింది. కానీ ఒక్క విషయం అంజలి కి నువ్వు నచ్చావ్ అని నా గట్టి ఫీలింగ్ అని అన్నది. ఎందుకు అలా అనిపించింది అని అడిగాను. తనకు ప్రొపోజ్ చేసిన వాళ్లలో నువ్వే చాలా క్యూట్ గా ఉన్నావ్ n అందులో ఏజ్ లో చిన్నవాడు ప్రొపోజ్ చేస్తే అమ్మాయిలకి థ్రిల్ గా ఉంటుంది. నాకు కూడా ఎవడన్నా జూనియర్ ప్రొపోజ్ చేస్తే వెంటనే okay చెప్పేస్తా అన్నది. సరే మా ఫ్రెండ్ గాడికి చెప్తాలే అని అన్నా. వామ్మో వద్దులే వాడు ఎలాంటివాడో ఏంటో నువ్వయితే నాకు okay అన్నది కొంచెం సిగ్గుపడుతూ. నేను కూడా తనతో ప్లే అలాంగ్ ఆడాలి అని అంతా అదృష్టమా అన్నాను. మళ్ళీ అంజలి కి okay అయితే నాకు okay అన్నాను. తను వెంటనే నేనేదో జోక్ గా అన్నాను బాబు లైట్ తీస్కో అన్నది. అంటే నేను ante ఇష్టం లేదా అని అడిగాను. నువ్వు నాకే డైరెక్ట్ గా ప్రొపోజ్ చేస్తే నేను okay చేసేదాన్ని బట్ ఇప్పుడు నో ఛాన్స్ అన్నది. అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యా అని కన్నుకొట్టా. తనకి నేను అటపట్టిస్తున్న అని అర్ధం అయ్యి తగుల్తాయ్ నీకు అన్నది. లేదు నిజంగానే చెప్తున్నా నువ్వు కూడా సూపర్ ఉంటావ్, ఇంకా హైట్ కూడా match అవుతుంది, అంజలి na కంటే హైట్ ఉంది అని కొంచెం భయం ఉంది నీ విషయం లో అయితే ఆ టెన్షన్ కూడా ఉండేది కాదు అని అన్నాను. అప్పుడు ఇందు ఒరేయ్ మొద్దు నువ్వు అలా ఉండటం వల్లే అంజలి నిన్ను ఏమి అనలేదు అనుకుంటా అని అన్నది. ఏమో చూద్దాం అని సర్లే గాని ఒకసారి అంజలి కి phone చెయ్ అని అడిగాను. ఫోన్ చేసి మాట్లాడి ఇంకో 20 మినిట్స్ లో రావచ్చు అని చెప్పింది. ఇంతలో సంధ్య తో ఇంకొక ఆమె కూడా వచ్చింది. వాళ్లు ఏదో మాట్లాడుతూ ఉంటే సంధ్య ఏమి సంగతి ఏమంటుంది నీ gf అని అడిగింది. నేను నవ్వి ఊరుకున్నాను. కొద్దిసేపు అలా వెయిట్ చేశాను. దూరంగా అంజలి వస్తున్నట్లు అనిపిస్తే అటు వెళ్ళాను. తన దగ్గరికి వేగంగా వెళ్లి తనతో కూడా నడుస్తూ హాయ్ అంజలి మేడం అని అన్నాను. తను కూడా హాయ్ రవి అని ముసి ముసిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగా. నా కోసం నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నవ్వు వస్తుంది అని అన్నది. నేను అలిగినట్లు మొహం పెట్టాను, తను ఏమనుకుందో ఏమో అలా చూడకు రా బాబు నాకే మంచిగా అనిపిస్తలేదు అని అన్నది, ఈరోజు మొత్తం ఆలోచించా నాకు కూడా నీతో ఫ్రెండ్షిప్ వరకు అయితే okay, నేను ఫ్రెండ్ గా ఒప్పుకున్న విషయం నువ్వు అప్పుడే నా ఫ్రెండ్స్ కి చెప్పకు అని చెప్పింది . నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నాకు నమ్మకం కలిగితే అప్పుడు ఆలోచిస్తా నీ ప్రపోసల్ గురించి అని అన్నది. నేను నమ్మలేక ఒక్కసారి గిచ్చు అని అన్నాను. సరే అని బుగ్గ మీద మెల్లగా గిచ్చింది. నేను షాక్ అయ్యి alane చూస్తున్న. మళ్ళీ గిచ్చనా అని నవ్వింది. నేను నమ్మలేక చేతిని నోటికి అడ్డం గా పెట్టుకొని షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టాను. తను బాగా నవ్వుతుంది నన్ను చూసి. నాకు కూడా ఫుల్ హ్యాపీ అయ్యి మేడం మిమ్మల్ని అంజలి అని పిలవచ్చా అని అడిగాను. తను ఒకసారి కోపంగా చూసినట్లు చూసి మళ్ళీ నవ్వుతూ సరే పిలువు రా అన్నది. వెంటనే నేను నిన్ను రా అని పిలవచ్చుగా అని అన్నది. నేను తప్పకుండా అంజలి అని అన్నాను. నేను వెంటనే కొద్దిసేపు ఎక్కడన్నా కూర్చుందామా అని అడిగాను. కాలేజ్ గ్రౌండ్స్ చాలా పెద్దవి, లవ్ బర్డ్స్ ఎక్కడ పడితే అక్కడే ఉండి ముచ్చట్లు పెడతారు. మేము కూడా ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం. కొద్దిసేపు నా ఫ్యామిలీ గురించి తెలుసుకుంది. నేను కూడా తన డీటెయిల్స్ అడిగా. ఇక వెళ్లేముందు తను నన్ను నువ్వు చాలా క్యూట్ గా ఉంటావ్ మిల్క్ బాయ్ లా అని అన్నది. నీకు అలా ఉంటే ఇష్టమా అన్నాను. హా అని అన్నది. అమ్మాయిలకి మాన్లీ గా ఉండేవారే నచ్చుతారు గా అన్నాను. హా అవును బట్ క్యూట్ గా ఉండి అప్పుడప్పుడు మాన్లీ గా ఉంటే సూపర్ కదా అన్నది. అయినా నువ్వు కూడా గెడ్డం పెంచితే సూపర్ గా ఉంటావ్ అన్నది. నేను థాంక్స్ చెప్పాను. ఇక అలా మాట్లాడుతూ బస్టాప్ కి వచ్చాము. వాళ్ళందరూ వెళ్లిపోయారు, ఫోన్ చూసుకుంటే సంధ్య, ఇందు నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంజలి కి కూడా కాల్ చేసారు. లేట్ అయ్యింది అని తను వెళ్తుంటే అంజలి ని పిలిచి ఒకసారి నీ చెయ్యి పట్టుకోవచ్చా అని అడిగాను. తను ఏమి మాట్లాడకుండా చెయ్యి ఇచ్చి నా కళ్ళలోకి చూస్తూ కొద్దిసేపు అలానే ఉండి ఐ లైక్ యు అన్నది. తర్వాత ఇంప్రెస్సెడ్ అని బాయ్ చెప్పి నవ్వుకుంటూ వెళ్ళింది. వెళ్ళేటప్పుడు నా చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళింది. చూస్తే ఆ చీటీ లో తన ఫోన్ నెంబర్ ఉంది. ఫుల్లు హ్యాపీ అనిపించి నేను నా గుండె మీద చెయ్యి వేసుకుని అలా ఫీల్ అవుతూ ఉన్నాను. తను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ bus ఎక్కింది.
Like Reply


Messages In This Thread
RE: నా లవ్ స్టోరీస్ - by Thewarrior100 - 26-07-2024, 12:51 AM



Users browsing this thread: