Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
128. పెళ్లి క్యాన్సిల్





ఎవరో అంకుల్ "రా బాబు కూర్చో.."

నేను "నేను పెళ్లి కొడుకు కాదండి..." అంటూ వినపడుతున్న మాటలు విని ఈషా బయటకు చూసింది. అక్కడ నన్ను చూసి బయటకు వచ్చింది.

ఈషా అందరికి నన్ను కాపాడిన వ్యక్తీ అని అలాగే పెళ్ళికొడుకు బావమరిది అని పరిచయం చేయడంతో ఒక్క సారిగా రేంజ్ మారిపోయింది.

అందరూ పలకరించారు. ఈషాతో పాటు నేను కూడా లోపలకు వెళ్లాను. తను రెడీ అయి చమట పట్టకుండా ఉండడం కోసం AC గదిలో కూర్చుంది.

[Image: Eesha-Rebba-Saree-Photos.jpg]

అక్కడ కొంత మంది అమ్మాయిలూ అలాగే కొంత మంది చిన్న పిల్లలు ఉన్నారు.

అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాను. జోక్ లు వేస్తూ నవ్విస్తున్నాను.

ఈషా "నువ్వేంటి అప్పుడే వచ్చావ్..."

నేను "ఏం చేస్తాం? మా బావ గాడి తెలివితేటలు, ఈ అడ్రెస్ ఇచ్చి ఇక్కడకు రమ్మన్నాడు"

ఈషా చేతులు కట్టుకొని సీరియస్ గా చూస్తుంది. చుట్టూ అందరూ కూడా నన్ను చూస్తూ ఉన్నారు.

నేను పళ్ళు బిగించి "బావ గారు" అన్నాడు.

నేను చిన్నగా "రెస్పెక్ట్...." అని మళ్ళి "నాకు మాత్రమె ఈ అదృష్టం లేదు" అన్నాడు.

ఈషా ఆగి వెనక్కి తిరిగి "మేడం... నీకూ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో తెలుసా..." అంది.

[Image: HD-wallpaper-love-anime-boy-girl-love-st...omance.jpg]

నేను చిన్నగా నవ్వి "మీ మేడం... రెస్పెక్ట్ ... రెండూ వ్యతిరేక పదాలు తెలుసా..." అన్నాను.

ఈషా అది కాదు అంటూ ఎదో చెప్పబోయింది.

అప్పుడే "నువ్వు ఎందుకు వచ్చావ్... రా...." అన్న వాయిస్ విని పక్కకు తిరిగి చూడగా నిషా కనపడింది.

నేను ఈషా వైపు చూసి "చూశావా..." అని సైగ చేశాను.

నిషా వాళ్ళ అమ్మ కూడా నవ్వేసింది. ఈషా తల కొట్టుకుంది.

నిషా "లోపలకు ఎందుకు వచ్చావ్... లేడీస్ రూమ్ లోకి అంటున్నా..." అంది.

నేను "ఓహ్.. అదా... పెళ్లి కూతురుని కాపాడాను, అలాగే బ్రదర్ వరస కదా... అందుకని AC ఉన్న గదిలో కూర్చో బెట్టారు" అన్నాను.

నిషా "కాపాడితే రెస్పెక్ట్ ఇవ్వాలా.... బయటకు పో... ముందు..." అంది.

ఈషా వాళ్ళ అమ్మ "పర్లేదు కూర్చో బాబు" అంది.

నిషా "వాళ్ళు అలానే అంటారు... నీకు సిగ్గుండాలి" అని వెక్కిరించింది.

ఈషా వాళ్ళ అమ్మ "మా అమ్మాయిని కాపాడాడు, మా మామ గారు అయితే ఈ పాటికి ఇంటికి పిలిచి సన్మానం చేసేద్దురు" అంది.

నేను స్టైల్ గా కుర్చీలో కూర్చోవడం చూసి నిషా పళ్ళు నూరింది, అది చూసి ఈషా నవ్వింది.

నేను, ఈషాతో "కొంత మందిని కాపాడినా కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వరు" అని నిషాకి వినపడేలా అన్నాను.

నిషా "ఇంతే చెయ్... మా అక్క రాగానే ఉన్నవి లేనివి అన్ని కలిపి చెబుతా... నీ తిక్క కుదురుతుంది" అంది.

నేను "నమ్మదు.." 

నిషా "పందెమా..." అంది కన్నింగ్ గా నవ్వుతూ....

నేను "నీలా అబద్దాలు ఆడేవాళ్ళతో నేను పందెం కాయను"

నిషా "గెలవలెను అని చెప్పూ" అంది.

నేను "నిన్న నీ ఆఫీస్ మొదటి రోజు కదా... ఏం ఘనకార్యం చేశావ్... పది మంది నీ వెంట పడ్డారు" అన్నాను.

నిషా క్యాజువల్ గా "ఓహ్ అదా... ఏం లేదు..." అంది.

నేను మనసులో సచ్చింది గొర్ర అనుకున్నాను. చుట్టూ అందరూ నిషాని వింతగా చూడడం గమనించి నా వైపు ఉరిమి చూసింది ఆ విషయం ఎత్తినందుకు...

ఇక తప్పదు అనుకోని నా ముందుకు జరిగి "తర్వాత చెబుతా అన్నాను కదా... ఇలా అందరిలో అడగాలా..." అంది.

నేను "చెప్పూ" అన్నాను పెద్దగా....

నాతో పాటు చుట్టూ అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వినడం మొదలు పెట్టారు. నిషా చెప్పడం మొదలు పెట్టింది.




ఆఫీస్ మొదటి రోజు కావడంతో నీటుగా ఆఫీస్ డ్రెస్ చేసుకొని అద్దంలో చూసుకొని బయటకు వచ్చాను. అక్కని అడిగి అడిగి కొనిపెట్టించుకున్న హీల్స్ ఇవి అనుకుంటూ వేసుకొని ఒక సారి పై నుండి కిందకు చూసుకున్నాను. హీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆడవాళ్లకు, హీల్స్ కి అవినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే హీల్స్ మా ఆడవాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచేస్తాయి. 

[Image: transparent-business-woman-cartoon-busin...14678.webp]

ఆత్మవిశ్వాసం గా అద్దంలో నన్ను నేను చూసుకుంటూ, సేల్ఫీ తీసుకోకుండా ఉండలేక పోయాను. సేల్ఫీ తీసుకొని ఒక సారి చూసుకొని బాస్ కి ఫోన్ చేశాను.

వైభవ్ "హలో ఎవరు?"

నిషా "నేను సర్... నిషా, కొత్తగా జాయిన్ అయిన మీ అసిస్టెంట్" అన్నాను.

వైభవ్ "హా.... ఆ ర్యాగింగ్ పిల్లవి కదా నువ్వు..." అన్నాడు.

నిషా పళ్ళు కొరుక్కొని "అవునూ సర్...." అంది.

వైభవ్ "ఇవ్వాళ జాయిన్ అవ్వమన్నానా"

నిషా "అవునూ సర్...."

వైభవ్ "అది కాదు ఇవ్వాళా..."

నిషా "అవునూ సర్.... అవునూ..."

వైభవ్ "ఓహ్... షిట్... ఓహ్... ఫక్..." 

నిషా ఒక సారి ఫోన్ ని చూసి మళ్ళి చెవిలో పెట్టుకుంది.

వైభవ్ "ఓకే ఒక పని చెయ్...."

నిషా "చెప్పండి సర్..." అన్నాను. కొత్త జాబ్ కదా.. వినాలి..

వైభవ్ "ఇవ్వాళ నా నిశ్చితార్ధం"

నిషా "అవునా సర్... కంగ్రాట్స్..." మనసులో ఆ రోజు ఆన్ లైన్ లో ఎంగేజ్ మెంట్ అని చదివిన సంగతి గుర్తుకు వచ్చింది.

వైభవ్ "నువ్వు ఒక పని చెయ్"

నిషా "చెప్పండి సర్"

వైభవ్ "అడ్రెస్ పంపిస్తాను... అక్కడకు రా..."

నిషా "ఓకే సర్.." అంటూ ఫోన్ లో పంపిన అడ్రెస్ చూసుకున్నాను. అది ఒక పెళ్లి మండపం, పైగా నేను ఆఫీస్ అటైర్ లో ఉన్నాను.

ఇక చేసేది ఏం లేక క్యాబ్ అతనికి అడ్రెస్ మార్చమని చెప్పాను. విత్ ఎక్స్ట్రా ప్రైస్...... ఫస్ట్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే....





అక్కడకు వెళ్ళగానే వైభవ్ సర్ దగ్గరకు వెళ్ళగానే నన్ను ఒక పక్కకు తోసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉన్నారు.

ఆ కళ్యాణ మండపంలో చాలా ప్లేస్ ఉంది కాని తక్కువ మంది జనాభా ఉన్నారు.

ఒక వైపు వైభవ్ సర్ వాళ్ళు ఉంటే..... మరో వైపు పెళ్లి కూతురు తరుపు వాళ్ళు ఉన్నారు.

అందరికి మధ్యలో ఎవరితో సంబంధం లేకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాను.

ఒకతను వచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు. 

నేను అతని వైపు కోపంగా చూసి "ఎప్పుడు ఆడపిల్లలని చూడలేదా... ఎందుకు అలా చూస్తున్నావ్" అన్నాను.

అతను నా ముందు వచ్చి నిలబడి, "నిషా..." అన్నాడు.

నేను అలానే కూర్చొని స్టైల్ గా "ఏంటి?" అన్నాను.

అతను "నా పేరు నిరంజన్.... వైభవ్ సర్ అసిస్టెంట్ ని, ఇక నుండి నువ్వు నా అసిస్టెంట్ వి" అన్నాడు.

నా మైండ్ బ్లాక్ అయిపొయింది... విత్ ఎక్స్టా ఇడియట్ యాటిట్యూడ్...... సెకండ్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే...





మెల్లగా లేచి నిలబడి, సరిగ్గా నిలబడి "సర్" అన్నాను.

అతను నన్ను ఫాలో మీ అన్నాడు. అతని వెంట వెళ్లాను, నాకేమో ఆకలి అవుతుంది.

వావ్.... అక్కడ అన్ని రకాలు ఐటమ్స్ ఉన్నాయి.

నిజానికి రిచ్ పీపుల్ పెళ్లి చూపులు కదా... భలే భలే ఐటమ్స్ ఉన్నాయి. 

కాని నన్ను తీసుకొని వెళ్లి... ఒక గదిలో నించోబెట్టారు.

నా చేతిలో ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ఫోన్ చేయగానే ఈ పెన్ డ్రైవ్ అక్కడ ఉన్న ఒక usb కి పెట్టి, స్విచ్ ఆన్ చేయమన్నారు.

నిషా "పెళ్లి కొడుకు పెళ్ళికూతురుకి గిఫ్ట్ ఇస్తున్నాడా" అన్నాను

అతను "హుమ్మ్" అని నవ్వాడు.

రోమాన్స్ అనుకుంటూ అక్కడే నిలబడ్డాను. 

నిషా "ఎంత సేపటిలో స్టార్ట్ అవుతుంది" అన్నాను.

నిరంజన్ "టూ మినిట్స్" అన్నాడు.

అక్కడే నిలబడి ఉన్నాను.

అండ్ టూ మినిట్స్.... టెన్ మినిట్స్.... థర్టీ మినిట్స్.... ఐ మిస్సిడ్ మై లంచ్ ........  థర్డ్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే...





వెళ్లి తినొచ్చు.. కాని ఫస్ట్ డేనే నిజాయితీ లేదు అంటారు అనుకున్నా.... అందుకే నిలబడి ఉన్నా...

ఎవరికైనా ఫోన్ చేసి లేదా గేమ్స్ చూసుకుందాం అనుకున్నా

ఫైనల్లీ ఫోన్ చేశారు. కాని వైభవ్ సర్ మరియు నిరంజన్ సర్ ఇద్దరూ అరుచుకుంటూ ఉన్నారు.

వద్దు...  వద్దు...  వద్దు...  వద్దు...  జస్ట్ డూ ఇట్... జస్ట్ డూ ఇట్... డూ ఇట్.... డూ ఇట్.... 

బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. తర్వాత నాకు ఫోన్ లో "రూమ్ నెంబర్ చెబుతాను అక్కడకు రా... వేరే పెన్ డ్రైవ్ ఇస్తా..." అని వినపడింది.

ఆహ్.... ఫోర్త్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే...





అక్కడకు వెళ్లి పెన్ డ్రైవ్ తీసుకొని వచ్చి వైభవ్ సర్ "ప్లగ్ ఇన్" అనగానే పెట్టాను.

కొద్ది సేపటికి కళ్యాణ మండపం మొత్తం చీకటి అయిపొయింది. వావ్ రిచ్ పీపుల్ కెన్ మెక్ ఎనీ థింగ్...

సడన్ గా కళ్యాణ మండపం సినిమా థియేటర్ అయిపొయింది... అలాగే అందరూ సైలెంట్ గా ఉండడం తో.. మొత్తం సైలెన్స్ అయిపొయింది. 

అందరూ నవ్వుతున్నారు. అక్కడ ఉన్న స్క్రీన్ పై ఫోటోస్ వస్తున్నట్టు ఉన్నాయి.

వాళ్ళ నవ్వులు వింటూ నేను కూడా నవ్వుకుంటూ ఉన్నాను. ఫైనల్ గా ఫోన్ తీసుకొని ఆన్ లైన్ లోకి వెళ్లి పోయాను.

కింద గొడవలు అవుతున్నాయి. కొంత సేపటికి వైభవ్ సర్ నాకు ఫోన్ చేసి "పారి పో...." అన్నారు.

పారి పో.... పారి పో.... పారి పో.... అన్నారు ఫిఫ్త్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే...





దెన్... ఐ రన్... ఐ హేట్ మై హై హీల్స్.... అండ్ ఐ హేట్ ఆల్ వుమెన్ హూ సపోర్త్స్ హై హీల్స్...

దాక్కొని క్రిష్ కి ఫోన్ చేశాను... పారి పోయాను. నీకూ కాల్ చేయడమే సిక్స్త్ బ్యాడ్ లక్ ఆఫ్ మై డే...




స్టొరీ విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. 

క్రిష్ నిషా చెవి దగ్గరకు వచ్చి "బుద్ది ఉందా.... ఎలాంటి సమయంలో ఎలాంటిది చెబుతున్నావ్..." 

నిషా "కదా... ఛా.... తప్పు చేశాను... "

క్రిష్ "బయటకు వెళ్దామా...."

నిషా తల ఊపగానే ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు.

నిషా "ఈషా కి సారీ చెప్పేదా... అందరికి సారీ చెప్పేదా" అని కంగారుగా అంది.

క్రిష్, నిషాని చూస్తూ "కామ్ డౌన్... అందరూ మర్చి పోతారు.... నువ్వు మళ్ళి కేలక్కు..." అన్నాడు.

నిషా "ఓకే" అంది.

అపార్ట్ మెంట్ కిటికీ నుండి కిందకు చూడగానే కారు నుండి కిందకు దిగుతున్న కాజల్ ని చూశారు.

నిషా "అక్క వచ్చింది"

క్రిష్ తనని చూడగానే సంతోషంగా నవ్వాడు.

ఆ వెనకే మరో కారు ఆగింది. అందులో నుండి మరో స్త్రీ దిగింది. తనని చూడగానే క్రిష్ మొహం మారిపోయింది.

నిషా "క్రిష్" అంటూ పక్కకు తిరిగి చూడగా..... బూమ్... క్రిష్ కనిపించలేదు. మాయమైపోయాడు.

వెనక్కి తిరిగి చూడగా ఈషాకి మిగిలిన వాళ్ళకు కూడా చెప్పకుండా సరాసరి వేగంగా బయటకు వెళ్లి పోతున్నాడు.

ఆమె డోర్ దగ్గరకు వచ్చే సరికి, క్రిష్ ఆమె కంట కనపడ కుండా దాటేసి వెళ్ళిపోయాడు. 

కాజల్ కూడా క్రిష్ ని చూసింది. అతని చేతిని పట్టుకొని "క్రిష్" అంది.

క్రిష్, కాజల్ చేతిని వదిలించుకొని, ఆమె వెనక ఎదో దెయ్యాని చూసినట్టు భయపడుతున్నట్టు, తప్పించుకొని వెళ్ళిపోయాడు.

కాజల్ కూడా వెనక్కి తిరిగి అక్కడున్న ఆమె వైపు చూసింది.

ఆమె..... రష్..

[Image: Rashmika-Mandanna-in-a-blue-pattu-saree-...meet-2.jpg]















Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 23-07-2024, 10:06 PM



Users browsing this thread: 23 Guest(s)