Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అంజని
#41
(18-07-2024, 12:05 PM)Haran000 Wrote: ఇంటికి వెళుతూ మారుతి గురించి చెప్పాను,

“ ఒకరోజు చెప్పాడు ఏమైంది అంటే, వీడు ఒక కోడిపిల్లని కొనుక్కున్నాడు. అది వర్షంలో తడిచిందంటా, ఐతే ఇంట్లో సోఫాలో పెట్టి దాన్ని టవల్ తో చుడిచాడంట. దానికి చాలి పెట్టకుండా ఉండడానికి టవల్ నిండా కప్పి పోయాడంట. వాళ్ళ నాన్న వచ్చి సోఫాలో కూర్చున్నాడంట. అంతే కోడిపిల్ల అటే అతుక్కపోయింది.”

“ అయ్యో చచ్చిందా? ” అంది నవ్వుతూ.

“ హా ”

“ ఇంకా? ”

“ ఒకరోజు ముడ్డి ఎలా కడుక్కుంటావురా అని ఏదో మాటవరసకు అడిగాను. కూర్చున్నోడు లేచి ముందు కూర్చొని బాత్రూంలో ఎలా కడుక్కుంటాడో అలా ఒకచేతు వెనక్కి పెట్టుకొని ముడ్డి రాసుకుంటూ నాకు యాక్షన్ చేసి చూపించాడు ఎదవ ”

“ హహ...అప్పుడు పిల్లోడుగా ఎలా చెప్పాలో తెలీలేదో ఏమో పాపం ”

“ హ్మ్....”

“ వాళ్ళింటికి వెళ్తారా మేడం మీరు ”

“ ఇంటికి అంటే రెండు సార్లు పుట్టిన రోజుకి పోయాను. ”

“ హ్మ్... రేపు రామంటాడు అంటారా? ”

“ ఏమో.... అడిగితే వెల్దాం లే ”


అలా మేము మాటల్లో ఇంటికి వచ్చేశాము. తిన్నాక తను దిగులుగా కూర్చుంది. టీవీ పెట్టుకోమని రిమోట్ ఇచ్చినా వద్దంది. నేను కూడా తన ఆలోచన ఏముందో అని విసిగించలేదు.

పడుకుందాం అని గదిలోకి వెళ్ళాను. వచ్చి నన్ను వాటేసుకుంది.

“ ఐశూ, నిన్ను మేడం గా పిలవాలని లేదు ”

“ హ్మ్.... ” అన్నాను.

“ నాకెవరూ లేరు, ఇక్కడే ఉంటాను. ”

ఒక్కరోజు అని చెప్పి ఇవాళ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇగ ఇక్కడే సెటిల్ అంటుంది ఎంటా అని వెనక్కి తిరిగాను.

“ లేదు. నువు వెళ్ళాలి, డాక్టర్ అవుతా అన్నావుగా ”

“ కానీ ఐశూ, నువు కూడా ఒంటరిగా ఉంటున్నావు, నన్నూ నీతో ఉండనివ్వు, మనం ఇలాగే కలిసి ఉందాము. ”

నాకేం అనాలో తెలీడం లేదు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న నాకు తను వచ్చిన రెండో రోజుకే నా ఇంట్లో, నా జీవితంలో కొన్ని నవ్వులు నిండుకున్నాయి. ఇన్నాళ్లు నా నీడతో మాట్లాడుకునే నేను ఇంకో మనిషితో మాట్లాడుతున్నాను. ఒంటరిగా భయంగా పడుకునే నేను నిన్న కొత్త అనుభవాన్ని రుచి చూశాను. మనిషి అన్నాక ఒక తోడు ఉండాలి, అది నిజమే అనిపించింది.

“ నాకంటే మగవాళ్ళు ఇష్టం లేరు, నువు అలా కాదుగా ” అన్నాను.

నా కళ్ళలో ఆప్యాయంగా చూస్తూ, నాకు ముద్దు పెట్టింది. 

“ నువ్వు నచ్చావు అంటున్నా కదా, ఇక మగాల్లెందుకు? ”

“ ఇప్పుడు కాకున్నా తరువాత అనిపిస్తే?, నీకు తెలీదు లీలా, చిన్నపిల్లలను చూస్తే మనకూ కావాలి అనిపిస్తుంది. ”

“ ఐతే నేను పిల్లల్ని కంటాను, ఎలాగో నీకు మొగాల్లంటే ఇష్టం లేదు కాబట్టి తల్లివి కాలేవు,  నేను మొస్తాను బిడ్డని. ”

ఆ ఒక్కక్షణం నాకు నా గతం అంతా గిర్రున తిరిగింది. తను అన్న ఆ మాటకి నాకు నవ్వొచ్చింది. 

“ పిచ్చిదాన ఎవరు చెప్పారే నీకు నేను తల్లిని కాను అని, నేను కూడా తల్లినే. ” అనేసాను అసంకోచంగా.

తను అవాకయ్యింది. అది నేను చూడగలను. టక్కున పరుపులో పడిపోయింది. నన్నే చూస్తూ ఉంది. తను అలా చూడడం తట్టుకోలేక నేను మొహం తిప్పుకున్న.

“ ఐశూ.... నిజమా ? ” అని ఆశ్చర్యంగా అడిగింది.

నేను మౌనంగా లేచి గది నుంచి బయటకి అడుగు వేస్తుంటే చేయి పట్టుకొని ఆపింది.

“ చెప్పు, నీకెందుకు మగవారంటే ఇష్టం ఉండదు? మరి తల్లి ఎలా అయ్యావు? ”

“ ఇప్పుడవ్వాన్ని ఎందుకులే, నాకు నువు ఇక్కడ ఉండడం ఇష్టమే. నేను ఒప్పుకుంటున్న. ” అని తన మనసు మర్లించే ప్రయత్నం చేశాను. అయినా తను మరోసారి అదే ప్రశ్న అడిగింది.

మౌనంగా కూర్చున్న. దగ్గరకొచ్చి నా మొహం తన వైపు తిప్పుకుని, “ చెప్పు, ఏమైంది, నువ్వెందుకు ఇలా ఒంటరిగా ఉంటావు, నీకెవరూ లేరా? ”

 నా గతం తలచుకొని నాకే నవ్వొచ్చింది.

“ నవ్వుతావెంటి చెప్పూ ” అంది.

ఇక చెప్పక తప్పదు.


నేను:----


మాది కరీంనగర్ జిల్లాలో చిన్న గ్రామం, బస్సు ఉండేది కాదు. ఆటోలో పక్కూరుకి పోతే ఆ ఊరుకి బస్సులు ఉంటాయి. మా అమ్మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం. నేను చిన్నదాన్ని. మా వూరులోనే ఏడో తరగతి దాకా చదివి ఎనమిదో తరగతికి పక్కూరుకి ఆటోలో వెళ్లేదాన్ని.  అలా నా పదో తరగతి ఐపోయాక, నాకు ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయి. మా మండలంలోనే నేనే టాప్. అప్పుడు మా పెద్దక్కకి పెళ్ళి కుదిరింది. మా నాన్నకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. నేను పుట్టాక వూరి చౌరస్తాలో ఒక షటర్ కొని దుకాణం పెట్టుకుంటే అది బాగా నడిచింది. నా వల్ల ఇంటికి లక్ష్మి వచ్చింది అని తెగ మురిసిపోయేవారు. అందుకే నాకు ఐశ్వర్య లక్ష్మీ అని పేరు పెట్టాడు. ఎండాకలంలో పెళ్లి సందడిలో ఇంట్లో అందరూ చుట్టాలు. ఎంత సంతోషంగా ఉన్నామో మాకే తెలుసు. 

సోమవారం పెళ్ళి అనగా, శనివారం అందరం ఇంట్లో స్థలం సరిపోయేది కాదు. ఆరు బయట మొగవాళ్ళు మంచం మీద, ఆడవాళ్ళం చాపలు వేసుకొని పడుకునే వాళ్ళం. అలాగే మా చుట్టాలతో ముచ్చట్లు పెట్టుకొని, రేపు ఎల్లుండి పెళ్లి పనులు వల్ల నిద్ర ఉండదూ, ఇవాళా బాగా నిద్రపోండి అని మా అమ్మ చెప్తే ఆరోజు తొమ్మిది గంటలకే మా చిన్న అక్క, పిన్నీ, నేను ముగ్గురం ఒకే చాపలో, నేను కొనకు నిద్రపోయాను.

మంచి నిద్రలో ఉండగా, ఎంతసేపు అయ్యుంటుందో ఏమో, ఒక్కసారిగా ఎవరో నా మూతి మీద చెయ్యేసి మూసారు. నాకు మాట రాలేదు. కళ్ళు తెరిస్తే అంతా చీకటి ఏమీ కనిపించట్లేదు. ఎవడో తెలీదు. నన్ను ఎత్తుకున్నాడు. తప్ప తాగినట్టు మందు వాసన, నా మూతి గట్టిగా మూసేసాడు, అరవడం కాదు, నా నోట ఒక్క మాట కూడా రాకుండా ఐపోయింది. ఎంత విలవిలా కొట్టుకున్నా నా చప్పుడు ఎవ్వరికీ వినిపించకుండా చేసాడు. నన్ను కోడిపిల్లని పిల్లి ఎత్తుకుపోయినట్టు ఎత్తిపోయి, ఏదో గోడచాటుకు నన్ను నతికి బలవంతం చేసాడు. ఎంత అరవాలకున్నా అరవలేకపోయాను. నన్ను కొట్టాడు. ఒక్క దెబ్బకే స్పృహ కోల్పోయాను.

తెల్లారి లేచేసరికి. నేను నా పక్కలో ఏమీ జరగనట్టు ఉన్నాను. నా పెదవికి రక్తం ఉంది. అమ్మ చూడకముందే తుడుచేసుకున్న. భయంతో కూర్చున్న. కూర్చుంటే తెలిసింది, లోపల డ్రాయర్ లేదు. వెంటనే బాత్రూమ్లోకి పరిగెత్తాను. లంగా లేపి చూసుకుంటే అంతా అయిపోయింది. పదారెళ్ళకే ఎవడో కూడా తెలీని మగాడితో.

ఇంట్లో అంతా పెళ్ళి సందడి, చేసిందేవడో తెలీదు. ఈ విషయం చెప్తే మా అమ్మ ఎలా స్పందిస్తుందో తెలీదు. ఎవరైనా వింటే పరువు పోతుంది. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో ఏం తెలీదు నాకు. బట్టలన్నీ విప్పేసి, స్నానం చేసి అంతా కడుక్కొని, రక్తం చుక్కలు అంటుకున్న లంగాని ఎవ్వరూ చూడకుండా చెత్తలో పాడేసి మళ్ళీ బాత్రూంకి పోయి నాలో నేను కుమికుమిలి ఏడ్చి ఏడ్చి బాధ మొత్తం దిగమింగుకొని నా అక్క పెళ్ళి అనే సంతోషం ఉన్నట్టు నటిస్తూ బయటకి వచ్చాను.

అప్పగింతల్లో మా అక్క దూరంవుతుందని ఏడ్చానో లేకా నాకు జరిగింది తలచుకొని ఏడ్చానో తెలీదు, నా కన్నీళ్లన్నీ కరిగించేసాను.

ఎంత బాధను నాలో దాచుకున్నాగాని నిజం బయట పడక తప్పుతుందా, నాలుగు నెలలకి నాకు పొట్ట వచ్చింది. నాన్నమ్మకి నా మీద అనుమానం మొదలైంది. నెల రోజులు అనుమానం రాకుండా నాన్నమ్మ కల్లుకప్పి తిరిగాను. ఎంత తిరగను చెప్పు, బట్టలు మార్చుకుంటూ అమ్మకి దొరికిపోయాను.

చిన్నప్పటి నుంచి నా మీద ఒక్కసారి కూడా చేయిచేస్కోకుండా పెంచిన మా అమ్మ, “ పాపపుదానా ” అంటూ మొహం మీద కొట్టింది. జుట్టు పట్టుకొని నన్ను బయటకి నెట్టేసింది. 

నాన్నమ్మ విని, “ ఏ పాపిష్టి వాడి ముందు పంగ జాపావే పాపిష్టి లంజా ” అని మొత్తుకుంది. 

నేను నాకేం తెలీదు ఒకడు నన్ను బలవంతం చేశాడు, అక్క పెళ్ళని చెప్పలేదు అంటే, ఎవడు వాడు అని అడిగారు. నేనే చూడలేదు, వాళ్లకేం చెప్పాలి. తెలీదు అన్నాను. చీకట్లో జరిగింది అని ఏడ్చాను.

మా నాన్న తలెత్తుకోలేక, రాత్రంతా ఇంట్లోంచి బయటికి పోలేదు. ఇంటి ముందు రేకుల కింద రాత్రంతా చలిలో ఏడుస్తూ కూర్చున్న. ప్రొద్దున్నే నాన్న నన్ను లేపి బండి ఎక్కించుకొని పక్కూరు బస్టాండ్ కి తీసుకెళ్ళాడు. “ ఎటు నాన్నా ” అని అడిగితే కరీంనగర్ వెళ్తున్నాము అన్నాడు.

కరీంనగర్ బస్టాండ్ లో దిగాక, మళ్ళీ “ ఎందుకు వచ్చాము? ” అని అడిగితే “ అబార్షన్ కోసం హాస్పిటల్ కి ” అని చెప్పాడు.

నాకు నాలో ఉన్న ప్రాణాన్ని చంపుకోవాలి అనిపించలేదు.  అబార్షన్ చేసుకోను అని అందరి ముందూ గొడవ పెట్టేసాను. చేసిన తప్పు చిన్నది అనుకుంటున్నావా అని నన్ను బస్ స్టాండ్ లో కొట్టాడు. మూడు గంటలు నన్ను బ్రతిమాలి బ్రతిమాలి నన్ను అబార్షన్ కి ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోలేదు. 

ఐపోయింది, మా నాన్న నన్ను వదిలేసి, నా మొహం మీద రెండు వంద రూపాయిల నోట్లు విసిరి ఊరి బస్సు ఎక్కేసాడు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఆకలితో పిచ్చిదానిలా బస్టాండ్ లో హైదరాబాద్ platform దగ్గర చెత్త డబ్బా పక్కన కూర్చున్న. నన్ను చూసి జాలిపడి వచ్చి మాట్లాడిన మనిషి లేరు. చీకటి పడే సమయానికి నా విషయం తెలిసిన మా అత్త బస్టాండ్ కి వచ్చింది. అత్తని చూడగానే లేచి పోయి కాళ్ళ మీద పడిపోయాను. “ ఆకలిగా ఉంది అత్తా ఇంటికి తీసుకుపో ” అని. 

నన్ను ఆటోలో ఇంటికి తీసుకుపోయింది. అన్నం తినపెట్టింది. జరిగిందంతా చెప్పాను. నన్ను నా ప్రసవం దాకా చూసుకుంది. కానీ ఎవరెవరితోనో ఫోన్ లో నా విషయం, నేను ఉన్న విషయం అందరికీ చెప్పేది. మా చుట్టాలు ఎవరు ఫోన్ చేసినా నా గురించి చెప్పేది. మా నాన్న వాళ్ళు మాత్రం అత్తా మామ ఫోన్ చేసి నా గురించి మాట్లాడుదాం అనుకుంటే కట్ చేసేవాళ్ళు. 

ఆసుపత్రిలో నాకు ప్రసవం జరిగింది. మొగ బిడ్డ పుట్టాడు. ఆరోజు నేను కోలుకున్నాక అత్త నాతో, “ ఇక్కడి వరకే నా బాధ్యత బుజ్జీ, మీ వాళ్ళు తీసుకువెళ్తే వెళ్ళూ లేకుంటే నాకు తెలీదు, మీ బావ పఠ్నం నుంచి ఇంటికి తిరిగిస్తున్నాడు. నువు మాతో ఉండడం కష్టం ” అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళింది.

మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి, వాళ్ళకి నా డిశ్చార్జ్ కోసం ఒక బంగారు కమ్మ ఇచ్చేసాను. నాకు ఒక చీర, దుప్పటి, బాబుకి ఒక ఉన్ని డ్రెస్సు ఇచ్చారు. 

వాడిని ఎత్తుకొని, ఆసుపత్రి నుంచి బయటకి వెళ్ళేముందు కౌంటర్ దగ్గర ఉన్న ఫోన్ లోంచి ఇంటికి ఫోన్ చేసాను. 

నాన్న ఎత్తి, “ ఆ ఎవరు ” అనగానే ఆయన గొంతు విని చాలా హాయిగా అనిపించింది. 

“ నాన్న నేను బుజ్జిని, నాకు కొడుకు ” అనగానే.....”


అంతే లీలాతో చెపుతూ పరుపు నుంచి కుమిలిపోతూ కింద పడిపోయాను. తను కంగారు పడింది. ఏడుస్తుంది.

నా భుజం పట్టుకొని లేపి మంచానికి ఒరిగించి కూర్చోబెట్టింది.

“ ఏమైంది ఐశూ, చెప్పు మీ నాన్న బాబు పుట్టాడని చెప్తే సంతోషపడ్డారా? ”



నేను:---- 

నాన్న నేను అలా చెప్పగానే, “ ఎవడి కొడుకే వాడు, ఏ రక్తం వాడిది, తండ్రి ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు. నీ వల్ల ఇక్కడ రెండో దానికి పెళ్ళి సంబంధాలు రావేమో అని భయంగా ఉంది. దరిద్రపు లంజ, మాకు నువు ఎప్పుడో సచ్చావు. మళ్ళీ ఫోన్ చెయ్యకు. ” అని పెట్టేసాడు.

నా వల్ల మా వాళ్ళ పరువు మొత్తం పోతుంది. కరీంనగర్ లో కూడా నేను ఉండకూడదు అనుకున్న. 

హాస్పిటల్ పక్కనే బస్టాండ్ ఉంటే వెళ్ళి ఐదు రోజుల పసికందును ఎత్తుకొని సికింద్రాబాద్ బస్సు ఎక్కేసాను. టికెట్ కి డబ్బులు లేక నా కాళ్ళ వెండి పట్టీలు ఇచ్చేసాను. 

పిల్లాడిని దుప్పటి కప్పి, ఆ బస్సు శబ్దం వినిపించకుండా నా గుండెలకు హత్తుకుని కూర్చున్న. గంట గడిచాక వాడు ఏడవడం మొదలు పెట్టాడు. పాలు ప్రొద్దున అత్త పోయేముందు పట్టించాను. ఇప్పుడు పాలు పట్టిద్దాం అంటే.... అంటే.....


“ ఏడువు ఏడువు ఐశూ ” 

“ ఎంతని ఏడవాలి లీలా, కన్నీళ్లు ఉంటేగా అసలు. ”


లీలా ఏడుస్తూ నన్ను హత్తుకుంది. 


నేను:----


ఆ చిన్న వయసులో తల్లినయ్యాను, నా రొమ్ములో పాలు రావు. వాడు పాలకోసం ఏడుస్తూ, వాన్ని చూసి నా కన్న పేగు ఏడుస్తూ, బస్సు దిగేలోపు నా కన్నీళ్ళ సముద్రం ఇంకిపోయింది. ”

బస్సు సికింద్రాబాదులో ఆగిన వెంటనే బయటకి వచ్చి హోటల్ కనపడితే అక్కడికి వెళ్లి గ్లాస్ పాలు బిచ్చం అడుక్కుంటూ హోటల్ అన్న కాళ్ళు పట్టుకున్న. చిన్న చెంచాతో ఆ గిలాసడి పాలు పోసి నా కొడుకు ఆకలి తీర్చుకున్న.

అక్కడి నుంచి లేచి, నడుచుకుంటూ ఆ తొవ్వ మొత్తం తిరిగితే ఒక మర్వాడి కొట్టు కనిపించింది. నా మిగిలిన ఒక బంగారు కమ్మని తీసుకొని డబ్బులు ఇవ్వమన్నాను. “ వెయ్యి రూపాయలు ఇస్తా ” అన్నాడు. నేను “ కొంచెం చూసి ఇవ్వండి సేటు” అంటే, “ ఈ జూకా నీదే అని గ్యారంటీ ఏంటి, బస్టాండ్ లో దొంగతనం చేసావా, పో.. లీ...సులని పిలవనా? ” అని బెదిరించాడు. వాడి కాళ్ళు పట్టుకుని, “ అయ్యా రెండు వేలైన ఇవ్వండి ” అంటే ఇచ్చాడు. 

అవి తీసుకొని, పిల్లాడికి అక్కడే ఒక కొట్టులో మంచి బట్టలు, ఒక పాల డబ్బా, ఒక గజ్జల బొమ్మా, ఒక తువాలా, నాకు ఒక చున్నీ, వాడికి రెండు లంగోటీలు కొన్నాను. 

మూడు రోజులు, అదే హోటల్ ముందు రేకుల కింద ఉంటూ, ఆ హోటల్ అన్న పుణ్యాత్ముడు, నన్ను ఒక్కసారి కూడా ఏమీ అనలేదు. ఆ ఫుట్పాత్ మీద, మూడు రోజులు, నాకు రెండు బన్నులూ, అరటిపండులూ, పిల్లాడికి పూటకో గిలాసడి పాలతో బతికేసాము. నన్ను చూసి కొంతమంది పాల డబ్బా పక్కన చిల్లర విసిరి పోయారు.

నాలుగో రోజు ఆ హోటల్ కి ఒక ఆవిడ వచ్చింది. పేరు స్వర్ణలత. వాళ్ళకి స్వధార్ అనే అనాధ ఆశ్రమం ఉంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది. అక్కడ ఉండడానికి బెడ్డు బట్టలు ఇచ్చారు. నెల రోజులు నేనేంటో నాకే తెలీకుండా, నా బాబుని చూసుకుంటూ ఉన్నాను. ఇక నాకు ఏమీ లేవు, వాడు తప్ప. 

ఒకరోజు పిల్లలని దత్తత తీసుకుంటాము అని ఒక జంట వచ్చింది. వాళ్ళకి పెళ్ళై ఎనమిది ఏళ్లు అవుతున్న సంతానం కాలేదంటా. ఆరోజు సాయంత్రం, స్వర్ణలత వచ్చి నాతో వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడిగితే, బాబుని వాళ్ళకి ఇచ్చేయమంది. మరుసటి రోజే, నా కొడుకుని రెండు లక్షలకు అమ్మేసాను.

“ అలా ఎలా చేసావు ఐశూ? ” అంటూ నా భుజాలు పట్టుకొని ఊపేసింది లీల.


“ నా దౌర్భాగ్యం లీలా, ఏం చెయ్యను, వాడు పెద్దయ్యాక, తండ్రి ఎవరు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. వాడిని ఈ లోకం దిక్కులేని పుట్టుక అని ముద్రవేస్తుంది. దానికన్నా దత్తత ఇచ్చేయడమే మంచిది అనిపించింది. వాళ్ళు స్వర్ణలతతో డబ్బులు ఇస్తే నేను ఒప్పుకుంటానా అని అడిగారట, నాకు చెప్పింది. గత్యంతరం లేక ఒప్పుకున్నాను. నా కళ్ళారా నా కొడుకుని చూసుకున్న. వాడికచ్చం నా పోలికే, నా కళ్ళూ వాడి కళ్ళు ఒకేలా ఉన్నాయి. ముద్దులు పెట్టుకున్న, ఎన్ని పెట్టుకున్నా సరిపోలేదు. అలాగే ఏడుస్తూ నిద్రపోయాను. నిద్ర లేచేసరికి బాబు నా పక్కన లేడు. వాడి పక్కలో రెండు లక్షలు ఉన్నాయి. అంతే లీలా, ఇంకో మూడేళ్లు అదే ఆశ్రమంలో ఉండి, అక్కడ నుండి బయటకు వచ్చేసాను. బయటకి వచ్చాక, ఆ రెండు లక్షలు ఉన్నాయి కదా అని ఒక వుమెన్స్ హాస్టల్ లో రూం రెంటుకి తీసుకున్న. దగ్గర్లో చీరల దుకాణంలో పనికి చేరాను. 

మగాళ్లంటే ఎందుకు ఇష్టం లేదని అడిగుతారు కదా మీరు, చెప్తా విను. బాబుని దూరం చేసుకున్న తరువాత, ప్రతీ రాత్రీ నాకు ఆరోజు జరిగింది పీడకలలా వచ్చేది. ఒక మగాడి నీడలా, చీకట్లో నన్ను చెరించి చెడగొట్టిన దృశ్యం నా కళ్ళలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటుంది. ఉక్కపట్టుకొని ఏడువని రోజు లేదు. ఒక్కోసారి సచ్చిపోవాలి అనిపించేది. ఆశ్రమం చెట్టుకి ఉరేసుకోబోతే వాళ్ళు వచ్చి ఆపారు. బిల్డింగ్ మీద నుంచి దూకబోతే, పక్క బిల్డింగ్ లో ఒక చిన్న పిల్లాడి ఏడుపు విని ఆగాను. ఆశ్రమం నుంచి బయటకి వచ్చేసాకా, బయట ఏ మగాడిని చూసినా, వీడేనా నా బిడ్డకి తండ్రి అనిపించేది. ప్రతీ మగాడితో నాకు ఆ రాత్రి నీడ కనిపించేది. మగాళ్లని చూడడం, రాత్రి అది గుర్తు చేసుకోవడం ఏడవడం, పిచ్చి దానిలా తల కొట్టుకోవడం. నా గదిలో నేను నరకం అనుభవించాను. చీర కట్టుకొని రోడ్డు మీద నడుస్తుంటే నన్ను చుట్టూ ఉన్న మొగాళ్ళు గుచ్చి గుచ్చి చూడడం, ఆటోలో పోతే ఆ ఆటో డ్రైవర్ ఎక్కడ ఆటో ఆపి ఏ గోడ చాటుకు నన్ను లాక్కెళ్లి బలవంతం చేస్తాడో అని బయమేసేది. బస్సు ఎక్కితే మగవాళ్ళు, షాపులోకి పోతే మగవాళ్ళు. అందరిలో నన్ను పాడుచేసిన మగాడు కనిపించే వాడు. ఆడదాని బతుకు ఇంత దారణమా అనిపించింది. నేను ఆడదానిలా ఉంటే మొగ కన్నులు నా మీద పడడం నాకు అసహ్యంగా, భయంగా అనిపించింది. ఆడదానిగా పుట్టడమే నా తప్పా అనిపించింది. అటువంటప్పుడు నేను అసలు ఆడదానిలా ఎందుకు ఉండలీ అనిపించింది. నాకు నేనే పిచ్చి లేసింది, నేను పిచ్చి దాన్ని అనుకుంటూ ఒక మగాళ్ళ బట్టల దుకాణానికి వెళ్లి చొక్కా ప్యాంటు కొనుక్కొని అవి తొడుక్కొని అటు మొగా కాకా, ఇటూ ఆడా కాకా, ఓ మాడా లాగా బతకడం అలవాటు అయిపొయింది నాకు. 

వాడి ఐదు నిమిషాల సుఖం కోసం, పదహారేళ్ళకే నా జీవితం మొత్తం సర్వనాశనం చేసాడు. ఇంతకంటే పెద్ద కారణం ఏం కావాలి, మగాడిని నేను అసహ్యించుకోడానికి చెప్పు ? ” అనడుగుతూ ఒక్కసారిగా లీలా కళ్ళలోకి చూసి తల వెనక్కి వాల్చి గుండెభారంతో అలసిపోయి పడిపోయాను.

భాదతో కళ్ళు మూసుకొని, “ ఈ భూమ్మీద ఉన్న మొగాల్లందరూ నిన్ను బలవంతంగా రోజుకొకడు దెంగినట్టు ఊహించుకో లీల నా గోస నీకు అర్థం అవుతుంది. ” అని అంటే, నన్ను లేపి పరుపులో పడుకో పెట్టింది. “ ఇంకేం చెప్పకు ఐషూ చాలు. పడుకో ” అంటూ తన కళ్ళు తుడుచుకుంటూ నన్ను నిద్రపుచ్చింది. 


=

=

సోమవారం, ప్రొద్దున్నే లేచి టైం చూసుకుంటే, ఐదు దాటింది. వెంటనే ఫోన్ తీసి మారుతికి కలిపాను. 

ఎత్తాడు. 

“ హెలో, హెలో, Happy Birthday రా ”

వాడి నుంచి సమాధానం లేదు. 

“ ఒరేయ్ మాట్లాడరా, నాకు థాంక్స్ చెప్పవా? ”

“ ఈసారి నువు ఫస్ట్ చెయ్యలేదు. ” అన్నాడు అలిగినట్టు.

వాడికెప్పుడూ నేను అర్థరాత్రి పన్నెండు దాటేక కాల్ చేసి విషెస్ చెప్పేదాన్ని ఇవాల్నే చెయ్యలేదు.

“ సారీరా రాత్రి పడుకునే సరికి ఆలస్యం అయ్యింది, అలారం పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. ” అన్నాను. 

“ సరే, నిన్న ఇచ్చిన డ్రెస్ వేసుకొని గుడికి రావాలి గుర్తుందిగా? ”

“ హా వస్తాను తప్పకుండా ”

పక్కనే లీలా కూడా లేచి, నా చెవి దగ్గర మొహం పెట్టి, “ నేను కూడా వస్తాను హీరో ”

“ హా రా హీరోయిన్ ”  అన్నాడు నవ్వుతూ.



మేము స్నానం చేసి గుడికి వెళ్ళాలని లీలా లంగా వోణి వేసుకుంది. నేను టవల్ చుట్టుకొని బాత్రూం నుంచి బయటకి వచ్చి, అసలు వీడు ఏ డ్రెస్ కొన్నాడు? కొంపదీసి ఏ చుడిదార్ కొన్నాడా ఏంటి అని కంగారు పడ్డాను. వాడికేమో తప్పకుండా వేసుకొని వస్తాను అన్నాను, లేదంటే మాట్లాడను అని మొండికేశాడు కదా. 

డబ్బా తీసి కవర్ విప్పి, మూత తీసాను. ఒక కాగితం ఉంది. తిప్పి చూస్తే, “ I love you aishuu ” అని ఉంది. 

అది చూసి నవ్వుకున్న.

అది పక్కన పెట్టి చూస్తే ఫోటో ఆల్బమ్ ఉంది. ముందు పేజీ తెరచి చూసాను. 

నేను గుడికి వెళ్లి దండం పెట్టుకునే ఫోటో. రెండో పేజీలో నేను జిమ్ లో ఎక్సర్సైజ్ చేసే ఫోటో, మూడో పేజీలో నేను కాలేజ్ దగ్గర వాడి నుదుట ముద్దు పెట్టే ఫోటో. ఇక అక్కడితో ఆపేసాను. పక్కన పెట్టి లోపల డ్రెస్ ఉన్న డబ్బా మూత తీసాను. 

నేను కంగారు పడ్డదానికన్నా ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. ఒక ఎర్రని రంగు పూల డిజైన్ ఉన్న బనారసి పట్టు చీర. అప్పుడే లీలా కూడా చూసింది. “ అబ్బ ఎంత బాగుంది ఐశూ చీర. ” అంది.

నేను వెంటనే పక్కన పెట్టేసాను. తను కూడా నవ్వు పోగొట్టుకొని నిరాశగా చూసింది.

డబ్బాలొంచి చీరని తీసి నాకు అందించింది. “ ఇచ్చిన డ్రెస్ వేసుకుంటాను అని మాటిచ్చావు ఐశూ, కట్టుకో ” అంది. 

నిజమే మాటిచ్చాను, కానీ ఎలా అనుకున్న. అలా అని వాడితో మాట్లాడకుండా ఉండలేను కదా. 

చీర తీసుకుంటూ డబ్బాని చూసాను, లోపల బంగారు జంకీలు, వెండి పట్టీలు, ఒక బంగారు నెల్లెస్, అరడజను బంగారు గాజులు కూడా ఉన్నాయి. 

“ లేదు ఇదంతా ఇప్పుడు నా వల్ల కాదు. ”

“ అలా అనొద్దు ఐశూ, మారుతి కోసం, birthday కదా, కట్టుకో. ”



లీలా నాతో బలవంతంగా, చీర కట్టించి, నగలు తొడిగింది. కాళ్ళకి పట్టీలు కూడా తొడిగింది. చెవులకు జంకీలు పెట్టింది. నాకు జెడ వేసింది. పది సంవత్సరాల తరువాత నన్ను ఒక అందమైన ఆడదానిలా ముస్తాబు చేసింది.

నన్ను నేను అద్దంలో చూస్కోడానికి ఇబ్బంది పడ్డాను, లేదు భయపడ్డాను.

ఎలాగోలా లీలా నన్ను గుడికి తీసుకెళ్ళింది. గుడి ముందు కార్ దిగినాక మొదటిగా శాంతవ్వ నన్ను చూసి లేచి వచ్చీ నా మొహం పట్టుకొని, “ బంగారు తల్లి, మహా లక్ష్మిలా ఎంత ముద్దుగా ఉన్నావో ” అంటూ చేతులు తిప్పి లెంపలు విరిచింది. 

కొబ్బరి కాయ, ఊదుబత్తులు చేతికిచ్చి లోపలికి పంపింది. నన్ను చూసి పూజారి నోరెళ్ళ పెట్టాడు. 

నేను మారుతి పేరిట అర్చన చెయ్యమన్నాను.

శివుణ్ణి మొక్కొకొని మండపంలో కూర్చున్నాము.

లీల నన్నే దీర్ఘంగా చూస్తూ, “ ఏం కోరుకున్నావు ” అని అడిగింది.

“ ఏనాటికైనా నేను కోరుకునేది ఒక్కటే లీల, నా కొడుకు బాగుండాలి అని ”


రెండు కుడుక వక్కలు తిని లేచి పక్కనే ఆ మారుతీ దర్శనం చేసుకుని కళ్ళు తెరిచానో లేదో, మారుతీ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు. 

నా చెయ్యి పట్టుకొని కలిపి ఊపేస్తూ, “ happy birthday ఐశూ ” అని గంతులేస్తూ చెప్పాడు. 

లీల కూడా అచ్చెరుపులో “ happy birthday ఐశూ ” అని చెప్పింది.

నేను లీలకి కార్ లో ఉన్న వాడి గిఫ్ట్ తెమ్మని సైగ చేసాను. సుప్రియ అక్క, సాగర్ బావతో మాట్లాడుతూ ఉండగా లీల గిఫ్ట్ తీసుకొచ్చింది. వాళ్ళముందే బహుమతి ఇచ్చాను.  “ థాంక్స్ ఐశూ ” అని చెప్పి తీసుకున్నాడు. 

ఉత్సాహంతో అక్కడే పక్కన గద్దె మీద పెట్టి దాన్ని విప్పబోతుంటే నేనే ఆపాను.

“ ఆగురా, అది ఇక్కడ విప్పితే పాడవుతుంది, ఇంటికి వెళ్ళాక విప్పు ” 

“ సరే నువు చెప్పావుగా ok ”


లీలా మారుతిని దగ్గరకి లాక్కొని బుగ్గ ముద్దిచ్చి, “ happy birthday Hero, మరి పార్టీ ఎప్పుడు? ”

“ థాంక్స్ హీరోయిన్, కానీ నీకు పార్టీ లేదు, నువు గిఫ్ట్ ఇవ్వలేదు. ”

“ హేయ్ కిస్ ఇచ్చాను కదరా? ”

“ ఇది కిస్ అంటారా, లిప్స్ మీద ఇవ్వు. అప్పుడు కిస్ అని ఒప్పుకుంటాను. ” అన్నాడు చమత్కారంగా.

లీలా వాడి చెవిలో, “ మీ అమ్మా వాళ్ళు లేనప్పుడు ఇస్తాలేరా ముందు పార్టీ స్పెషల్ ఏంటో చెప్పు ” అంది.


సుప్రియ అక్క వాడిని లాగి, “ నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి పదా, ముందు కాలేజ్ కి వెళ్లి సాయంత్రం వచ్చాకా పార్టీ ” 

“ బై ఐశూ, బై హీరోయిన్ ” అని చెప్పి వెళ్ళిపోయాడు. 

మేము తిరిగి ఇంటికి వెళ్ళాము. వెళ్ళక ఫోన్ వచ్చింది, సుప్రియ అక్క.

“ ఎంటక్కా ఫోన్ చేసావు? ”

“ మారుతి, కాలేజ్ కి వెళ్ళను అన్నాడు. నువు ప్లే స్టేషన్ గిఫ్ట్ ఇచ్చావు కదా, అది చూసి ఆగలేక మళ్ళీ నీ దగ్గరకి వస్తున్నాడు. ”

“ సరే అక్కా నేను ఇంటికి పంపిస్తాలే ”


ఫోన్ పెట్టేసి, చాలా కాలం తరువాత చెవులకి కమ్మలు పెట్టుకున్న కదా, నొప్పిగా అనిపించాయి. విసుగొచ్చి తీసేస్తూ, లీలని చూసాను, తను హఠాత్తుగా హైరానా పడిపోతూ, “ హే...... ఎక్కడికి వస్తున్నావు ఆగు మారుతీ ” అని అరిచింది. 

“ ఐశూ విపొద్దు ” అని అరిచాడు.

నేను కమ్మ దిమ్మెను లూస్ చేస్తూ, “ మారుతీ కాలేజ్ కి ఇంకా టైం ఉంది, పో ” అన్నాను వెనక్కి చూడకుండా. 

మరో క్షణంలో, “ మేడం లోపలకి వచ్చాడు ” అని చెప్పింది లీల.

అవును ఇన్నాళ్ళకి ఒక పురుషుడు నా ఇంట్లోకి అడుగు పెట్టాడు. నాకు ఎంతలా కోపం వస్తుందో ఏం తొడతానో అని లీల కన్నులు పెద్దచేసుకొని భయపడుతూ ఉంది.

కానీ నేను ఏమీ అనను. ఎందుకంటే..... ఎందుకంటే.....

.
.
.
.
.
.
.
.
.
.
.
.

మారుతి ఇంట్లో అడుగుపెట్టి, 

ఉక్కపెడుతూ “ అమ్మా..... ” అని ప్రేమగా గొంతు పెకిలించాడు.


నాలో తల్లిపేగు కలుక్కుమంది. అక్కడే విప్పుతున్న కమ్మని వదిలేసి, ఇన్నాళ్ళ నా గుండె భారం వదిలేస్తూ తేలిగ్గా మొకాళ్ళ మీద కూలపడ్డాను.

వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నా వెనక కూర్చొని నన్ను హత్తుకొని, “ విప్పకు అమ్మా, నిన్ను ఇలా చూడాలని ఉంది నాకు. ” అంటూ నా మెడలో కంటతడి పెట్టుకున్నాడు. 

లీల మా ఇద్దరినీ అచ్చేరుపుగా చూసింది. 

ఇన్నాళ్ళ తరువాత నా కంట నీళ్లు నిండుకున్నాయి. ఏడ్చాను. వెనక్కి తిరిగి నా కొడుకొని ఒళ్ళోకి తీసుకొని గుండెల మీద మోస్తూ నా కళ్ళారా చూస్కొని, ఏడ్చాను.

“ ఇలాగే ఉండమ్మా, ప్లీస్, అలా వద్దు. నాన్న ఎవరూ, ఏం జరిగింది, ఎందుకు ఇదంతా నేను అడగను. నాతో ఉండు చాలు. నిన్ను అమ్మా అని పిలవకుండా ఇంకో ఒక్క నిమిషం కూడా ఉండలేను. I love you అమ్మా. ”

వాడి మొహం పట్టుకొని ముద్దులు పెట్టేసి మళ్ళీ హత్తుకుని లీలని చూసాను.

“ లీల నువు నా కొడుకు పేరు అడగలేదు. మారుతి - ఆ హనుమంతునికి వాళ్ళమ్మ పెట్టుకున్న పేరు. ”

సంతోషంతో వచ్చి ఇద్దరినీ హత్తుకుంది. 

నేను బయటకి చూస్తూ పక్కకి చూస్తే ఆల్బమ్ తెరిచి ఉంది. ఆఖరి పేజీలో, పైన నా కన్నులు, కింద మారుతి కన్నుల ఫోటోలు ఉన్నాయి. రెండూ ఒకేలా అనిపించాయి.



~ శుభం ~


{Inspired from a real event.}

Wonderful emotional and romantic narration. Yes You are right. Writer has all liberty to write anything (as long as it doesn't hurt others). Keep writing.
[+] 2 users Like na_manasantaa_preme's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అంజని - by Haran000 - 17-07-2024, 12:03 PM
RE: రేపటి కోసం - by Pallaki - 17-07-2024, 05:21 PM
RE: రేపటి కోసం - by Haran000 - 19-07-2024, 01:30 PM
RE: రేపటి కోసం - by Haran000 - 17-07-2024, 06:07 PM
RE: రేపటి కోసం - by nareN 2 - 18-07-2024, 11:34 PM
RE: రేపటి కోసం - by Ramya nani - 17-07-2024, 11:46 PM
RE: రేపటి కోసం - by Ramya nani - 17-07-2024, 11:47 PM
RE: రేపటి కోసం - by sri7869 - 18-07-2024, 01:13 AM
RE: రేపటి కోసం - by Haran000 - 18-07-2024, 12:04 PM
RE: రేపటి కోసం - by Haran000 - 18-07-2024, 12:05 PM
RE: రేపటి కోసం - by Haran000 - 18-07-2024, 12:05 PM
RE: రేపటి కోసం - by na_manasantaa_preme - 22-07-2024, 11:10 AM
RE: రేపటి కోసం - by Haran000 - 22-07-2024, 06:27 PM
RE: రేపటి కోసం - by ramd420 - 18-07-2024, 10:15 PM
RE: అంజని - by Haran000 - 19-07-2024, 12:09 PM
RE: అంజని - Completed - by Jathirathnam - 19-07-2024, 01:12 PM
RE: అంజని - Completed - by Haran000 - 19-07-2024, 01:45 PM
RE: అంజని - Completed - by Rishabh1 - 19-07-2024, 04:11 PM
RE: అంజని - Completed - by Haran000 - 19-07-2024, 06:01 PM
RE: అంజని - Completed - by Jathirathnam - 20-07-2024, 02:38 AM
RE: అంజని - Completed - by Haran000 - 20-07-2024, 06:49 AM
RE: అంజని - Completed - by Haran000 - 19-07-2024, 01:55 PM
RE: అంజని - Completed - by Sushma2000 - 19-07-2024, 03:36 PM
RE: అంజని - Completed - by Haran000 - 19-07-2024, 03:41 PM
RE: అంజని - Completed - by nareN 2 - 19-07-2024, 05:12 PM
RE: అంజని - Completed - by Haran000 - 19-07-2024, 06:11 PM
RE: అంజని - Completed - by Haran000 - 19-07-2024, 06:31 PM
RE: అంజని - Completed - by sri7869 - 19-07-2024, 10:17 PM
RE: అంజని - Completed - by Haran000 - 20-07-2024, 06:42 AM
RE: అంజని - Completed - by nareN 2 - 19-07-2024, 10:26 PM
RE: అంజని - Completed - by Haran000 - 20-07-2024, 06:44 AM
RE: అంజని - Completed - by Babu143 - 19-07-2024, 10:37 PM
RE: అంజని - Completed - by Haran000 - 20-07-2024, 06:47 AM
RE: అంజని - by utkrusta - 20-07-2024, 01:51 PM
RE: అంజని - by Haran000 - 21-07-2024, 03:26 PM
RE: అంజని - by Ghost Stories - 20-07-2024, 02:32 PM
RE: అంజని - by Haran000 - 21-07-2024, 03:29 PM
RE: అంజని - by Ghost Stories - 21-07-2024, 04:12 PM
RE: అంజని - by Haran000 - 21-07-2024, 04:18 PM
RE: అంజని - by sez - 22-07-2024, 09:15 AM
RE: అంజని - by Haran000 - 22-07-2024, 06:38 PM
RE: అంజని - by Bittu111 - 22-07-2024, 02:24 PM
RE: అంజని - by Haran000 - 22-07-2024, 06:28 PM
RE: అంజని - by Haran000 - 22-07-2024, 06:43 PM
RE: అంజని - by Veeeruoriginals - 22-07-2024, 07:14 PM
RE: అంజని - by Veeeruoriginals - 22-07-2024, 07:18 PM
RE: అంజని - by Haran000 - 22-07-2024, 11:41 PM
RE: అంజని - by Haran000 - 27-07-2024, 11:22 AM
RE: అంజని - by కుమార్ - 11-08-2024, 12:39 AM
RE: అంజని - by Haran000 - 11-08-2024, 04:54 PM



Users browsing this thread: 15 Guest(s)