Thread Rating:
  • 13 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#43
బిందు, నటాషా ముందు వెళ్ళారు .


విశాల్ కూడా వేరే ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యాడు .

రవి ' స్వప్న!! ఎవరు అతను??? అని అడిగాడు..

స్వప్న  'అదే అర్థం కాలేదు... సడెన్ గా వచ్చి... అంటూ రవి వైపు చూసి 'ఏమి అడిగావ్??? అన్నది ఆశ్చర్యంగా..

రవి 'అంటే... నేను ఊహించింది నిజమే..హాస్పిటల్ లో ఏమి జరిగింది???

స్వప్న 'నీకెలా తెలుసు అన్నది... ఇంకా ఆశ్చర్యంగా..

రవి 'నువ్వు హాస్పిటల్ నుంచి టెన్షన్ గా బయటకు రావడం.. లంచ్ కూడా సరిగా చేయకపోవడం బట్టి..

స్వప్న జరిగింది చెప్పింది..

అంతా విని రవి..నువ్వు ఎప్పుడైనా చూశావా??? అతన్ని.. స్వప్న 'లేదు.. రవి.. ఎక్కడా చూడలేదు..

రవి 'అవునా??? మరి యాక్సిడెంట్ అయిన అతనికి నీకు లవ్ ప్రపోజ్ చేసిన అతనికి ఏమైనా సంబంధం ఉందా??

విశి 'ప్రపోజ్ ఎక్కడ చేశాడు?? తన ఫీలింగ్ మాత్రమే చెప్పాడు...

ఇంక ఆ యాక్సిడెంట్ అయిన అతనికి,ఇతనికి ఏం సంబంధం వుందో తెలియదు.. అన్నది కంగారుగా

రవి (ఫోన్ విషయం ఇప్పుడే చెప్తే స్వప్న భయపడొచ్చు అతను వస్తే... అప్పుడు చూస్తా.. అనుకొని)

స్వప్న! ఈ విషయం ఎవరికీ చెప్పకు... లేనిపోని ఇష్యూస్ వస్తాయి...

స్వప్న 'హ... అన్నది డల్ గా..

రవి 'అరే... ఇప్పుడు ఏమైంది??? ఎందుకు అంత డల్ గా వున్నావ్!!! బి. కూల్... ఏమి కాదు..మేం అందరం అన్నాడు.. 

స్వప్న 'సరే... అన్నది.

బిందు ' స్వప్న!!! ఇటు రా... అంటూ పెద్దగా పిలిచింది..

రవి 'చూడు... రాకాసి పిలుస్తోంది... వెళ్ళు... జాగ్రత్త... ఫీలింగ్స్ మార్చు... లేకపోతే కనిపెడుతుంది..

స్వప్న నవ్వి 'బిందు' దగ్గరకు వెళ్ళింది .

సాయంత్రం వరకు ఫుల్ ఎంజాయ్ చేశారు..
ఈ హడావిడిలో..స్వప్న 'వీర' గురించి మర్చిపోయింది.. 6.00 అయ్యేసరికి ఫుల్ చీకటి అయ్యింది.. అందరూ బస్ ఎక్కారు.. బస్ స్టార్ట్ అయ్యింది .

కొంతమంది తాము దిగిన సెల్ఫీలు చూసుకుంటున్నారు.. కొంతమంది చిన్న కునుకు తీస్తున్నారు.. నాలాంటి వాళ్ళు...Smile 

నటాషా తన ఫోన్ లో ఫొటోస్ చూపిస్తోంది..గుడ్..నాట్ బ్యాడ్ అని..

స్వప్న అన్ని ఫోటోస్ చూస్తూ.. సడెన్ గా... ఒక ఫోటో దగ్గర ఆగింది. ఫోన్ లాక్కొని జూమ్ చేసింది.. అంతే... గుండె గుభేల్ మంది.. గబగబా ఫోటోస్ మూవ్ చేసింది..

అన్నింట్లో దాదాపు ఒక ముప్పై ఫోటోల్లో తమ వెనుక 'వీర' వున్నాడు... తన చేతిలో ఫోన్ తో.

వీళ్ళని ఫోటో తీస్తున్నాడు..కాదు తనని తీస్తున్నాడు..

అంతే... ఒక్కసారిగా భయం వేసింది..చేతులు చల్ల పడ్డాయి..

వెనుక సీట్లో వున్న రవికి ఫోన్ ఇచ్చి... చూడమని సైగ చేసింది..

రవి తీసుకుని చూశాడు..ముందు అర్థం కాలేదు..

స్వప్న కంగారు చూశాక అర్థం అయ్యింది..

నటాషా 'ఏంటి?? ఏముంది అందులో.. అంత కంగారుగా చూస్తున్నారు.. అని అడిగింది

రవి 'ఏం లేదు... అన్నింట్లోను బిందు.. హైలెట్ అయ్యింది ఎంటా అని..?

బిందు 'ఏంటి??? గాలి నా వైపు మళ్ళింది ..

స్వప్న (అమ్మో! ఇతనేంటి??? నా వెనక పడ్డాడు.. అన్ని ఫోటోస్ లో వున్నాడు.. మళ్ళీ చేతిలో తన ఫోన్.. నన్నే తీశాడా ఫోటోస్.....)

మళ్ళీ చెమటలు పడుతున్నాయి... నటాషా  ' స్వప్న!!! ఏంటే... టెన్షన్ అవుతున్నావ్??? స్వప్న 'ఏం లేదు... అని రవి వైపు చూసింది.. 

రవి కళ్ళతో సైగ చేసాడు.. 'నేను వున్నాను. భయపడకు అని...

నటాషా 'చూడవే... బిందు... వీళ్ళిద్దరూ ఎవో సైగలు "చేసుకుంటున్నారు...'

బిందు 'ఏంటి రా!!! మాకు తెలియకుండా మీ సైగలు...

రవి 'తనకి హెల్త్ బాగోలేదు... అదే మీకు చెప్పొద్దూ... అంటోంది .

నటాషా 'ఇది కాదు కానీ... మరో మాట చెప్పు...

స్వప్న ఏం మాట్లాడలేదు.. కామ్ గా నటాషా భుజంపై తల వాల్చి కళ్ళు మూసుకుంది...

రవి 'అబ్బా! చూడు... తనని.. ఎలా అయిపోయిందో... అన్నాడు

బిందు 'ఓకేలేరా.. ఎందుకు అంత విసుగు... అన్నది..

నటాషా ' స్వప్న ' తల నిమురుతూ... 'అసలు ఆ యాక్సిడెంట్ కేస్ జోలికి 'ఎందుకు వెళ్ళావు. అప్పటి నుంచి డల్ అయ్యావ్... 

స్వప్న (నిజమేనా??? అయినా నేను చేసింది మంచి పని... మరి నాకు ఎందుకు నెగెటివ్ గా జరగాలి??? )

అందరూ గెస్ట్ హౌస్ చేరేసరికి 9.00 దాటింది..

స్వప్న చాలా డల్ గా వుంది..ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పోదామా అని వుంది...

రవికి మెసేజ్ చేసింది...

'రేపు నేను వెళ్ళి పోతాను...

రవి: ఏయ్!! ఎందుకు???

స్వప్న: అతన్ని తల్చుకుంటే భయంగా ఉంది... హాస్పిటల్ లో అలా చెప్పటం ఏంటి???

ఇవాళ మనల్ని ఫాలో అవ్వటం ఏంటి???

రవి: నాకు అదే అర్థం కాలేదు... ఒక పని చేద్దాం... రేపు మనం ఎక్కడికి వెళ్ళొద్దు.. నేను వేరే ఎదైనా ప్లాన్ వేస్తాను.. ఓకే నా!!

స్వప్న: మ్... ఓకే.. సరే గుడ్ నైట్

రవి: గుడ్ నైట్ బంగారం... ఏమి ఆలోచించకుండా పడుకో...

కాని స్వప్న మాత్రం కాలత నిద్ర పోయింది..

 నెక్స్ట్ డే 

అందరూ రెడీ అయ్యి కిందికి వచ్చాక...

రవి 'ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళటం లేదు ... గెస్ట్ హౌస్ లో నే ఎంజాయ్ చేద్దాం..

ఒక అమ్మాయి... నీ ఇష్టం రా బాబు...నువు లీడర్ కాబట్టి నువ్వు చెప్పిందే వినాలి తప్పదు కదా...అనుకుంటూ రూం లోకి విసవిస వెళ్ళిపోయింది

రవి ' తనని వదిలేయండి..అని అన్నాడు

అల సాయంత్రం వరకు ఏదో ఆడుతూ,పాడుతూ టైంపాస్ చేశారు..

ఇప్పుడు నేను కొన్ని చీటీలు రాశాను .
ఎవరికి ఏది వస్తే... అది చేయాలి..అంటూ చీటిలు ఒక బౌల్ లో వేసి కలిపాడు..అందరికీ వాళ్ళకి వచ్చిన టాస్క్స్ చేస్తున్నారు...చివరికి స్వప్నకి డ్యాన్స్ టాస్క్ వచ్చింది.

రవి వైపు చూసింది... తను ఎటో చూశాడు..
 మ్యూజిక్ అన్ అయ్యింది... ఇక తప్పదని తను డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది..

ఒక్క మాటలో చెప్పాలి అంటె సైపల్లవి, శ్రీలీల ని మిక్స్ చేసినట్టు 20 నిమిషాలు మోత మోగించింది..

తనకి చాలా హ్యపినెస్ వచ్చేసింది... దిగులు అంతా పోయింది.. అప్పుడు అర్థం అయింది...

రవి ఎందుకు... ఈ ప్రోగ్రాం పెట్టాడా!!! అని..

నెక్స్ట్ డే... మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళారు.. రవి జాగ్రత్తగా గమనిస్తున్నాడు.. ఈవెనింగ్ అయ్యింది

                               &&&&&&&

ఇంకో వైపు.. 

ఆరోజు లాస్య ఎన్ని సార్లు స్వప్నకి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. తను చూసుకోలేదు.

లాస్య ఇంక లాభం లేదని.సుచిత్ర కి కాల్ చేసింది..

'మామ్! స్వప్న ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు??? ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అనింది.. సీరియస్ గా..

సూచి '  అరెరే ....ఇప్పుడే స్వప్న బైటికి వెళ్ళింది...వచ్చిన తర్వాత నువ్వు చేశావ్ అని చెప్తాలే

లాస్య ' ఇప్పుడు కానీ నువ్వు స్వప్న కి ఫోన్ ఇవ్వకపోతే ... నేను బయలుదేరి మీ దగ్గరకి వస్తాను..

సుచిత్ర ' ఇంక లాభం లేదని...అసలు విషయం చెప్పేసింది.

లాస్య ముందు షాక్ అయ్యింది...

"అదేంటి మామ్!! నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావ్!!! అని అడిగింది ఆశ్చర్యంగా..

సుచిత్ర 'అదేం లేదు లాస్య... మావయ్య కి తెలిస్తే లేనిపోని తలనొప్పి ..అందుకే చెప్పలేదు..

లాస్య 'మామ్! స్వప్నది కూడా నా ఏజ్  కదా నేను అర్థం చేసుకోగలను... తన గురించి నేనెందుకు మావయ్య కి చెప్తాను..

ఇంకా చెప్పాలంటే... స్వప్నకే సపోర్ట్ చేస్తా.... 

సుచిత్ర 'ఓకే.. లాస్య!! కానీ స్వప్న నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇవాళ... ఒన్స్ లిఫ్ట్ చేస్తే నీకు ఫోన్ చేయమని చెబుతా... 

లాస్య 'చేస్తుందా!!! మామ్...

సుచిత్ర 'ఏంటి లాస్య... అంత పెద్ద డౌట్ వచ్చింది తప్పకుండా చేస్తుంది..

లాస్య 'సరే.. మామ్ అంటూ కాల్ కట్ చేసింది
(ఇంత జరుగుతున్నా అమ్మ కానీ,స్వప్న కానీ నాకు ఒక్క మాట చెప్పలేదు)

మేడం ...మీటింగ్ స్టార్ట్ చేద్దామా...అన్న మాటతో చుట్టూ చూసింది...అందరూ తననే చూస్తున్నారు...

లాస్య ' హా....అన్నదే కానీ ఆలోచన అంత స్వప్న కాల్ చేస్తుందా లేదా అనే..

స్వప్న అండ్ బ్యాచ్ ఆరోజంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసి.. ఈవెనింగ్ భీమిలి లో బీచ్ రెస్టారెంట్ కి వెళ్ళారు.. అందరూ సీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు .. మన స్వప్న పాప మాత్రం వెజిటేరియన్...

 స్వప్న తన బ్యాగ్ లో నుండి ఫోన్ తీసింది.. చూస్తే ఎన్నో మిస్డ్ కాల్స్..

ముఖ్యంగా 2 అన్ నోన్ నెంబర్స్.. నుంచి. 17 వున్నాయి...

అందులో ఒక నెంబర్ నుంచి మెసేజ్..

' స్వప్న! దిస్ ఈజ్ లాస్య... కాల్ మి... అని వుంది..

"ఓహో! లాస్య!! అనుకుంటూ లాస్య కి కాల్ చేసింది. 

అప్పుడే ఫ్రెష్ అయి మెయిల్ చెక్ చేస్కుంటూ వున్న లాస్య కి కాల్ వచ్చింది..ఎవర అని చూసింది...' క్వీన్ ' కాలింగ్ అని ఉంది...

అప్పుడు చూడాలి లాస్య ముఖం...నింగిలోని చంద్రుడు కూడా అంత వెలగడు ఏమో అన్నట్టు...ఉంది

లాస్య వెంటనే లిఫ్ట్ చేసింది..

' స్వప్న!!! ఎలా వున్నావ్??? మీ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూన్నావా??? అని అడిగింది..

స్వప్న 'నీకు తెలిసిపోయిందా లాస్య!!! అని అడిగింది కంగారుగా.

లాస్య 'హా! అమ్మ చెప్పింది.... బట్ మావయ్యకి చెప్పనులే

స్వప్న అక్కడ నుంచి లేచి కొంచెం దూరంలో వున్న చైర్స్ లో కూర్చొని మాట్లాడుతోంది..

'అరే...లాస్య!!! నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావ్....

లాస్య 'హ.. స్వప్న... ఏం చేయను??? ఎన్ని సార్లు నీకు ఫోన్ చేశాను???

ఫస్ట్ టైం లిఫ్ట్ చేసి వుంటే..అలా మాట్లాడే దాన్ని ఏమో...

స్వప్న ' ఎందుకు అల??

లాస్య ......

స్వప్న ' హాల్లో లాస్య..! ఉన్నావా?

లాస్య ' హా హా....వున్నాను..

స్వప్న ' ఒక్కోసారి అనిపిస్తుంది... నా పట్ల నీ బిహేవియర్ నన్ను ఏదో ఇంప్రెస్స్ చేయాలి అన్నట్టు...
ఐనా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడి...తెలుగు ని తక్కువ చేయటం చాలా తప్పు..

నువ్వు కూడా నా లాంటి ఆడపిల్లవే తను 'తన' లాగే బిహేవ్ చేసే వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది..

లేనిపోని బిల్డప్ ఇచ్చేవాళ్ళని అసలు నమ్మదు...

లాస్య 'సారి.. స్వప్న. అయితే నేను నాలాగానే వుంటా.. ఇక నుంచి... ??

స్వప్న 'దట్స్ గుడ్... ఇంకేంటి... తిన్నావా???

లాస్య 'తిన్నాను... నువ్వు..

లాస్య ' ఆ.... ఇప్పుడే ఏదో సీ ఫుడ్ రెస్టారెంట్ కి వచ్చాము..

లాస్య 'నువ్వు వెజిటేరియన్ కదా... మరెలా???

స్వప్న ' నీకెలా తెల్సు అన్నది ఆశ్చర్యంగా..?

లాస్య '......అంటే అమ్మ చెప్పింది లే..

స్వప్న ' ఓహ్....నా ఫ్రెండ్స్ చూసుకుంటారు.

లాస్య ' సరే ఇది నా ఇండియన్ నెంబర్..సేవ్ చేసుకో...

స్వప్న 'ఓకే... లాస్య!!!వుంటా మరి.. 

లాస్య 'రిటన్ ఎప్పుడు???

 స్వప్న 'ఇంకో టూ డేస్ లో .. అని చెప్పాగానే అంతే వున్నట్లు వుండి కరెంట్ పోయింది... చుట్టూ చీకటి...

స్వప్న 'సరే... పవర్ పోయింది... మళ్ళి కాల్ చేస్తా... బై అంటూ కాల్ కట్ చేసి..

ఫోన్ లో టార్చ్ ఆన్ చేసింది...

ఎదురుగా 'వీర' కూర్చోని తననే చూస్తున్నాడు..
[+] 6 users Like Avengers35's post
Like Reply


Messages In This Thread
Veera - by Avengers35 - 17-06-2024, 09:25 PM
RE: Veera - by sri7869 - 17-06-2024, 09:56 PM
RE: Veera - by dombull7 - 17-06-2024, 10:58 PM
RE: Veera - by hijames - 18-06-2024, 01:05 AM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:01 PM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:02 PM
RE: Veera - by hijames - 18-06-2024, 02:19 PM
RE: Veera - by Avengers35 - 19-06-2024, 12:07 PM
RE: Veera - by hijames - 19-06-2024, 12:33 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 01:41 AM
RE: Veera - by Saikarthik - 20-06-2024, 10:40 AM
RE: Veera - by appalapradeep - 20-06-2024, 11:59 AM
RE: Veera - by sri7869 - 20-06-2024, 07:24 PM
RE: Veera - by hijames - 20-06-2024, 08:24 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 08:33 PM
RE: Veera - by hijames - 20-06-2024, 09:38 PM
RE: Veera - by sri7869 - 20-06-2024, 09:45 PM
RE: Veera - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: Veera - by Avengers35 - 21-06-2024, 08:24 PM
RE: Veera - by Saikarthik - 21-06-2024, 09:18 PM
RE: Veera - by sri7869 - 21-06-2024, 09:43 PM
RE: Veera - by dombull7 - 21-06-2024, 11:29 PM
RE: Veera - by hijames - 22-06-2024, 03:38 AM
RE: Veera - by Avengers35 - 22-06-2024, 09:02 PM
RE: Veera - by sri7869 - 22-06-2024, 09:04 PM
RE: Veera - by hijames - 23-06-2024, 04:30 AM
RE: Veera - by Saikarthik - 23-06-2024, 10:42 AM
RE: Veera - by Avengers35 - 23-06-2024, 07:22 PM
RE: Veera - by hijames - 23-06-2024, 08:11 PM
RE: Veera - by sri7869 - 23-06-2024, 10:28 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 07:31 PM
RE: Veera - by hijames - 08-07-2024, 07:36 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 08:43 PM
RE: Veera - by hijames - 08-07-2024, 09:50 PM
RE: Veera - by sri7869 - 09-07-2024, 05:00 AM
RE: Veera - by Saikarthik - 09-07-2024, 09:00 AM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 09:43 PM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 10:00 PM
RE: Veera - by 3sivaram - 20-07-2024, 10:38 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 06:54 AM
RE: Veera - by sri7869 - 20-07-2024, 10:21 PM
RE: Veera - by Uday - 21-07-2024, 03:04 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 04:23 PM
RE: Veera - by Uday - 21-07-2024, 07:08 PM
RE: Veera - by sri7869 - 22-07-2024, 11:25 AM
RE: Veera - by Avengers35 - 10-08-2024, 10:53 PM
RE: Veera - by sri7869 - 11-08-2024, 01:00 PM
RE: Veera - by vrao8405 - 01-09-2024, 11:49 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 01:36 PM
RE: Veera - by বহুরূপী - 17-11-2024, 05:08 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 05:19 PM
RE: Veera - by sri7869 - 17-11-2024, 06:38 PM
RE: Veera - by Avengers35 - 21-11-2024, 07:59 AM
RE: Veera - by sri7869 - 21-11-2024, 10:23 AM
RE: Veera - by BR0304 - 21-11-2024, 01:41 PM



Users browsing this thread: 1 Guest(s)