Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా లవ్ స్టోరీస్
#4
Update 1

నా పేరు రవి. నేను కొంచెం ఫెయిర్ గా ఉండి 5.6 హైట్  ఉంటాను. నేను Btech సెకండ్ ఇయర్ చదివే టైం లో జరిగిన స్టోరీ ఇది. మా కాలేజీ లో సీనియర్స్ లో నాకు ఫ్రెండ్స్ ఉండేవారు. 1st ఇయర్ హాస్టల్ లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు వాళ్లు. హైదరాబాద్ లో ఒక పేరు మోసిన కాలేజీ మాది. గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ ల 7 కాలేజెస్ కలిసి ఒకే దగ్గర ఉంటాయి. అందువల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపిస్తారు. నేను నాన్ లోకల్ కావడం వల్ల కాలేజీ దగ్గర లో రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ తో పాటు ఉండేవాడిని. ఇంకా నాకు బండి కూడా లేదు ఆ టైం లో. డైలీ rtc bus కి వెళ్లి వచ్చేవాడిని. అంతా బాగుంది అనుకున్న టైం లో ఒక అమ్మాయి నా లైఫ్ ని మొత్తం చేంజ్ చేసింది. ఒక రోజు కాలేజీ నుండి బస్టాప్ కి వస్తున్న టైం లో సీనియర్స్ గ్యాంగ్ ర్యాగింగ్ చేద్దామని నన్ను పిలిచారు. నేను వాళ్లు పిలిచేది పట్టించుకోకుండా వాళ్ళ పక్కనే గ్రీన్ చుడిధార్ లోఉన్న అమ్మాయిని చూస్తూ వెళ్తున్నా. First టైం నా లైఫ్ లో అంత అందమయిన అమ్మాయిని చూడటం. చూపు తిప్పుకోకుండా చూస్తున్న. తన కళ్ళు, తన ఫేస్, తన పెదవులు, తన జుట్టు ఇలా అన్నీ అబ్సర్వ్ చేస్తున్న. నాకు కొద్దిసేపు ఏమి అర్ధం కాలేదు. అప్పుడే నా భుజం మీద ఒక చెయ్యి పడింది. ఏంటి తమ్ముడు ఫ్లాట్ అయ్యావా పాప ని చూసి అని అన్నాడు నా భుజం మీద చెయ్యి వేసిన అతను. నేను అదేం లేదు అన్న just వూరికినే చూస్తున్న అని చెప్పా. సరేగాని అటు పదా అని తీసుకెళ్లాడు. వెళ్ళాను అనే గాని నా ఫోకస్ మొత్తం ఆ అమ్మాయి మీదనే వుంది. అప్పుడే ఆ అమ్మాయి నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. నాకు first టైం వణుకు పుట్టింది. ఎందుకంటే నేను అమ్మాయిని ఎప్పుడు అంతా ఇష్టం గా చూడలేదు. అప్పుడు పక్కనే ఉన్న ఒకడు బయో డేటా చెప్పు అన్నాడు. ఆ టెన్షన్ లో నేను సెకండ్ ఇయర్ అని కూడా మర్చిపోయి చెప్పడం స్టార్ట్ చేసా. అలా వాళ్లు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఆమె వైపు చూస్తున్న. అప్పుడు అక్కడే ఉన్న సీనియర్ ఫ్రెండ్ ఒకడు నన్ను చూసి ఏంట్రా సెకండ్ ఇయర్ వాడిని ర్యాగింగ్ చేస్తున్నారు అని వాళ్ళతో అన్నాడు. వాళ్లు అంతా షాక్ అయ్యారు. ఏంటి వీడు సెకండ్ ఇయరా మరి ఏంటి చెప్తే సరిపోయేది గా రా అని అన్నాడు ఆ గ్యాంగ్ లో ఒకడు. పక్కన ఇంకోడు వీడి బాడీ ప్రెసెంట్ మైండ్ obsent రా, వీడి మనసు మొత్తం వేరే దగ్గర ఉంది అని నేను చూస్తున్న అమ్మాయి వైపు చూసి అన్నాడు. అప్పుడు నేను కవర్ చేద్దాం అని 1st ఇయర్ లో నన్ను ఎవరు ర్యాగింగ్ చెయ్యలే అందుకే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పలే అన్న అని చెప్పా. అప్పుడు ఆ అమ్మాయి అబ్బో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వాళ్లు కూడా ఇది నమ్మేలా లేదు అన్నట్లు చూసారు. సరే పద రా అని ఆ అన్న అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయితో చెవి లో ఏదో చెప్తుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న అమ్మాయి ఉండనీ వీడ్ని కొద్దిసేపు ర్యాగింగ్ చేస్తాం మేము కూడా, ఎప్పుడు ఎవరిని ర్యాగింగ్ చెయ్యలే అస్సలే అని అన్నది. వెంటనే అందరు ఒకేసారి గట్టిగ నవ్వారు. ఆ అమ్మాయి కూడా సూపర్ గా నవ్వింది. తను నవ్వితే అలానే చూస్తూ ఉండొచ్చు. నేను కూడా చిన్న స్మైల్ ఇచ్చా. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ బ్యాచ్ లో అబ్బాయిలని సైలెంట్ గా ఉండమని చెప్పింది. Adhe first తన గొంతు వినడం. సూపర్ ఉంది తను మాట్లాడే విధానం. ఇక నేను కూడా వెయిట్ చేస్తున్న ఎం అడుగుతారో అని.  పక్కన ఉన్న అన్న జాగ్రత్త మా వాడు కొంచెం అమాయకుడు అని ఆ అమ్మాయిలకి చెప్పి వెళ్ళాడు.  అమ్మాయిలు మొత్తం నలుగురు ఉన్నారు అబ్బాయిలు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి కూడా first టైం ఏమో టెన్షన్ పడుతున్నారు. But అందులో  మోడరన్ గా ఉన్న ఒక అమ్మాయి మాత్రమే కొంచెం ఇబ్బంది పెట్టింది నన్ను. అది ర్యాగింగ్ ల లేదు ఏదో క్వశ్చన్ ఎండ్ ఆన్సర్స్ ప్రోగ్రాం ల ఉంది. అప్పుడప్పుడు వచ్చే నవ్వుని అపుకుంటున్న. వాళ్ళకి కూడా అర్ధం అయ్యింది. ఇక పక్కన ఉన్న బాయ్స్ తమ్ముడు ఈ ర్యాగింగ్ బోర్ గా ఉంది నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు ఒక 1st ఇయర్ వాడ్ని ర్యాగింగ్ చేద్దాం అని అన్నారు. నేను సరే అని అన్నానో లేదో గర్ల్స్ అందరు గోల చేసారు. ఏంటి మా రాగ్గింగ్ అంటే లెక్క లేదా అని గొడవ చేసారు. అందులో ఒకడు మీరు చేసేది ర్యాగింగ్ అని ఎవడు అనడు. వీడు నవ్వు ఆపుకోలేక చస్తున్నాడు అని నన్ను చూసి అన్నాడు. ఇక లాభం లేదు అని నేను సరే అన్న మేడం వాళ్ళకి ఇంకా ర్యాగింగ్ చెయ్యాలని ఉందేమో వాళ్ళది అయిపోయాక మనం రేపు చేద్దాంలే అని అన్నాను. సరే మేము వెళ్తాము చేసుకొండే బాబు అని ఒకడు నా నెంబర్ అడిగి తీసుకొని వెళ్ళాడు. మిగతా వాళ్లు కూడా వెళ్లిపోయారు. ఇక గర్ల్స్ లో ఒకరు వెళ్లారు. కానీ నా పిల్ల మాత్రం ఉంది. ఇక వాళ్లు వెళ్ళాక నాకు కొంచెం దైర్యం వచ్చింది. వాళ్ళ ముగ్గురులోతను మిడిల్ లో ఉంది. నేను మెల్లగా మీ పేరు మేడం అని ఆమెని అడిగాను. వాళ్లు షాక్ అయినట్లు నా వైపు చూసి మిగతా వాళ్ళు ఏ మా పేర్లు వద్దా అని కొంచెం జలసీ గా చూసారు ఆమె వైపు. అప్పుడు నేను అలా ఎం లేదు మేడం మీ పేరు కూడా చెప్పండి అని అన్నాను. సరే అని ఆ ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్పారు. ఒకరి పేరు సంధ్య ఇంకొకరి పేరు ఇందు. ఇంకా మీ పేరు అన్నట్లు ఆమె వైపు చూసా. వాళ్లు ముగ్గురు వస్తున్న నవ్వు ను ఆపుకుంటూ ఉన్నారు. అంతలోనే సంధ్య అది చెప్పదు లే గాని నేను చెప్తా అని అన్నది. చెప్పకు అని ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. పాపమే అర్ధగంట నుండి నీ కోసం మనం ఎన్ని చేసిన భరించాడే అని ఇందు అన్నది. అంత సీన్ లేదు అని ఏదో అంటుండగానే సంధ్య తన పేరు చెప్తుంటే తన నోరు మూసింది. అప్పుడే నేను వద్దులే మేడం నేనే తెలుసుకుంటా అని అన్నాను. అప్పుడు వెంటనే నా ఏంజెల్ అవన్నీ సరే గాని మమ్మల్ని మేడం అని వాళ్ళని అన్నా అంటున్నవ్ ఏంటి అని అడిగింది. అది అది.. మేడం..  అని నసుగుతుంటే పక్కన ఉన్న ఇందు తెలిసి కూడా ఎందుకు అడుగుతావ్. రోజు కాలేజీ లో ఎవడో ఒకడు నీకు ఫ్లాట్ అవ్వడం నువ్వు లైట్ తీసుకోవడం అలవాటే గా అని అయిన వీడు నీతో పాటు మమ్మల్ని కూడా మేడం అన్నాడులే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఏమో అని కవర్ చేసింది. సర్లే లేట్ అవుతుంది నేను కూడా వెళ్తా అని లేచి నిలబడి తన bag తీసుకుంది. అప్పుడు చూసా తన ఫుల్ స్ట్రక్చర్ అబ్బో సూపర్. నాకయితే మైండ్ దొబ్బింది. అస్సలు కళ్ళు రెప్ప కూడా వేయకుండా తన బ్యాక్ చూస్తున్న. అది గమనించి దగ్గరికి వచ్చి హలో మిస్టర్ ఏంటి నీ ప్రాబ్లెమ్ అని అన్నది. అప్పుడు గమనించ తను నా కంటే కొంచెం ఎత్తు ఎక్కువ ఉంది 5.8 లేదా 5.9 ఉండొచ్చు. నాకు కొంచెం బాధ వేసింది తను అలా అన్నందుకు, నా కంటే ఎత్తు ఉన్నందుకు. తల కిందికి వేసి సారీ మేడం అని చెప్పా. అప్పుడు ఇందు వచ్చి ఎందుకే అలా అంటావ్, అయినా నువ్వేంటి ఎప్పుడు ఎవర్ని ఏమి అనేదానివి కాదు ఎందుకు సీరియస్ అవుతున్నావ్ అని అన్నది. అప్పుడు తను సర్లే లైట్ తీస్కో అని నా పేరు అంజలి అని చెప్పింది నన్ను కూల్ చేయడానికి. నా మొఖం వెయ్యి వోల్ట్స్ బల్బ్ ల వెలిగిపోయింది ఒక్కసారి. అప్పుడు సంధ్య అమ్మయ్య వీడు నవ్వాడు అది చాలు అని సరే రవి మేము వెళ్తాము అని చెప్పింది. నాకు ఒక్కసారి నా బాడీ పార్ట్ ఏదో నన్ను విడిచి వెళ్తున్నట్లు అనిపించింది. కొంచెం బాధగా చూసాను. అప్పుడు ఇందు వచ్చి నెంబర్ కావాలా అని అడిగింది. నేను ఏమి చెప్పకుండా అలానే అంజలి ని చూస్తున్నాను. అప్పుడు ఇందు వాళ్లిద్దర్ని వెళ్ళమని చెప్పి వాళ్లు కొంచెం దూరం వెళ్ళాక ఏంటి సంగతి లవ్ ఎట్ first సైట్ ఆ అని అడిగింది.  Just అలా లవ్ ఎట్ first సైట్ అని నా ఫీలింగ్ ని తక్కువ చెయ్యకండి మేడం అని అన్నాను. Ohh సూపర్ అయితే all the best for your  love అని చెప్పింది. So నువ్వు try చేస్కో. But దాన్ని పడేయ్యడం చాలా కష్టం,  సరే గాని మేడం అని పిలవకు అక్క అని లేదా  ఇందు అని పిలువు అని చెప్పింది. ఇదంతా వినే పోసిషన్ లో నేను లేను. ఒకసారి అంజలి వెళ్తున్న వైపు చూసా తను మా వైపే చూస్తూ ఉంది. ఎందుకో నాకు కొంచెం హోప్ వచ్చి వెంటనే అంజలి వాళ్లు ఉన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళ. ఇందు కూడా నా వెనకాలే వచ్చింది. తను చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. అలా వెహికల్స్ చూస్కోకుండా రోడ్ క్రాస్ చేసినందుకు. నేను వెంటనే అంజలి I am in love with you, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పా. పక్కన ఉన్న సంధ్య ఇందు ఇద్దరు షాక్ అయ్యారు. తను కూడా షాక్ లో అలానే చూస్తుంది. నేనేదో టైం పాస్ కు చెప్పట్లేదు మేడం సీరియస్ గా చెప్తున్నా అని అన్నాను. Two మినిట్స్ చూసి చెప్పావు గా ఇక వెళ్ళు అని అన్నది.  నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. నాకు ఉన్న ఫీలింగ్ ఆ అమ్మాయి కి ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అని అనిపించింది. సరే అని ఇందు ని అడిగి కాలేజీ డీటెయిల్స్ కనుక్కున్నాను. వాళ్ళది పక్క కాలేజీ ఫైనల్ ఇయర్ అని చెప్పింది. ఇంకా ఒక ఇయర్ ఏ వుంటారు కాలేజీ లో అని బాధపడ్డ. అప్పటికే రెండు నెలలు అయిపోయ్యాయి. చాలా తక్కువ టైం ఉంది. కొంచెం దూరం వెళ్లి మళ్ళీ వచ్చి ఇందు వైపు చూసి ఫోన్ నెంబర్ అడిగాను. అంజలి కోపం గా చూసే సరికి నెంబర్ చెప్పకుండా నీ నెంబర్ ఇవ్వు అని తీసుకొని Anjali Bf jr. అని ఫీట్ చేసుకుంది anjali కి కనపడకుండా. సంధ్య అది చూసి నవ్వుతుంది. నేను వెంటనే సంధ్య ని మీ నెంబర్ అయిన ఇవ్వండి అని అడిగా. తను వెంటనే నెంబర్ ఇచ్చింది. నేను my GF friend అని ఫీట్ చేసుకున్న. అది చూసి సంధ్య నవ్వుకుంది. అంజలి దగ్గరికి వెళ్లి మేడం మీ నెంబర్ ఇస్తారా అని అడిగా, ఒక సీరియస్ లుక్ ఇచ్చి నువ్వే కనుక్కో చూద్దాం అని bus ఎక్కడానికి వెళ్ళింది. సంధ్య కూడా all the best చెప్పి వెళ్ళింది. ఇందు వచ్చి మంచి ఛాన్స్ రా నీకు అది ప్రొపోజ్ చేసిన ఏమి అనకుండా వెళ్లడం ఇదే first టైం నీ మీద మంచి ఒపీనియన్ వచ్చిందేమో అని చెప్పి వెళ్ళింది. నేను హ్యాపీ గా ఫీల్ అవుతూ అటు వైపు వెళ్ళాను bus ఎక్కడానికి. 
Like Reply


Messages In This Thread
RE: నా లవ్ స్టోరీస్ - by Thewarrior100 - 21-07-2024, 12:56 AM



Users browsing this thread: