Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#38
మిత్రులారా 


ఈ థ్రెడ్ లో కథలు ఎందుకు ఆగిపోతాయి అన్న విషయం మీద మీరంతా మీకు తోచిన మీకు సబబు అనిపించిన విషయాలని చెప్పుకొస్తున్నారు. 

మీరు చెప్పినట్లు "గాస్" అయిపోయి కథలు ఆగిపోయిన సందర్భాలతో పాటు కుటుంబ ఇతరత్రమైన పరిస్తితులు కూడా ఉంటాయి అని చెప్పే ప్రయత్నమే ఈ క్రింది మెసేజ్. 

ఈ మెసేజ్ ఇక్కడ నడుస్తున్న డిస్కషన్ కి సంబంధం లేదు.. కానీ దీన్ని సవరించి సరిచేసి రాసే ఓపిక లేక నా థ్రెడ్ లో రణధీర్ గారి పోస్ట్ కి సమాధానం గా పెట్టిన మెసేజ్ నే యధా తధంగా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను.. 

అణ్యధా తలచవలదు. నేను ఎవ్వరినీ నిందించాలని ఈ మెసేజ్ పెట్టడం లేదు. "గాస్" అయిపోయి రాయడం ఆపేయడం అన్నది ఖచ్చితంగా ఒక కారణమే.. ఆ కారణాలతో పాటుగా మరికొన్ని కారణాలు కూడా మీ అందరి ద్రుష్టికి తీసుకురావాలన్నదే నా ప్రయత్నం...

మీ
గుడ్ మెమొరీస్
=============================================

రణధీర్ గారు,


మీ పోస్ట్ కి చాలా వివరంగా సమాధానం రాయాలి అనుకున్నాను కానీ నాకు అంత సమయం లేకపోవడం వలన ఇదివరకు మీలాగే చాలా మంది ఈ కథలు ఎందుకు మధ్యలొ ఆగిపోతున్నాయి అని వాల్లకి వచ్చిన సందేహాలను థ్రెడ్ ఒకటి తెరిచి ఒక డిస్కషన్ లా ఆ థ్రేడ్ నడిపించారు.. మీరు ఆ థ్రెడ్స్ ని ఓప్కగా చదివితే బాగుంటుంది అనిపించి ఆ 2 థ్రెడ్స్ లింక్ లను మీకొసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కొంచెం ఓపిక చేసుకుని ఈ రెండు థ్రెడ్స్ ని చదవండి.. 

(1) కొత్తకథలు అంతగా రావట్లేదు పాతకథల అప్డేట్స్ లేవు too boring 
       కొత్త కథలు అంతగా రావట్లేదు పాత కథల అప్డేట్స్ లేవు too boring (xossipy.com)

       కొత్తకథలు అంతగా రావట్లేదు పాతకథల అప్డేట్స్ లేవు too boring


(2) కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే... 
       కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే...

జులై 29, 2022 లో ఈ థ్రెడ్ ([b]కొత్తకథలు అంతగా రావట్లేదు పాతకథల అప్డేట్స్ లేవు thoo boringలొ కింది పోస్ట్ పెట్టాను దానికి ఇప్పుడు మరికొంత సమాచారం జత చెస్తాను చదివి మీ అభిప్రయాన్ని చెప్పండి.. [/b]

రచయిత # 1

ఇన్నాళ్ళుగా ఈయనకి ఉద్యోగం లేదు 3 నెలల క్రితమే ఈయనకి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఈయన ఉన్న ఊరు ఒదిలి కొత్త ఉద్యోగంలో ట్రైనింగ్ కోసం వేరే ఊరు వెళ్ళేడు. అక్కడ సుమారుగా ఒక నెల రోజులు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయినాక తమిళనాడులో పోస్టింగ్. అది కూడా 3 నెలలకు ట్రైనింగ్. ఆ 3 నెలల తరువాత అతన్ని మరో 3 నెలలకు ఇంకో ఊరు పోస్ట్ చేస్తారు. అలా ఒక సంవత్సరం పాటు తిప్పేక ఆయనకి పెరమనెట్ పొస్టింగ్ ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈయనకి జీవితంలో దొరికిన మొట్ట మొదటి ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలా లేక కథలు రాస్తూ కూర్చోవాలా..?

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 1 - ఈ 2 సంవత్సరాలలో ట్రాన్స్ఫర్స్ వల్ల 3 ఊళ్ళు మారేడు. మొన్న ఎప్రిల్ లో పెల్లి కూడా చేసుకున్నాడు.. ఇప్పుడు చెప్పండి ఈయన కథలు రాయడం మీద శ్రద్ద పెట్టాల జీవితాన్ని చక్కదిద్దుకునే పని చెయ్యాలా..? 

రచయిత # 2

ఈయన వ్యాపారస్తుడు. 5 నించీ 10 కోట్లు అప్పులు తెచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఖర్చుపెట్టి కాట్రాక్టు పనులు పూర్తిచేసేడు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పులమీద వడ్డీలు పెరిగిపోయి అప్పులవాళ్ళా బాధలు పడలేక సంసారం ఎలా నడపాలో తెలియని పరిస్తితుల్లో ఈయన కొట్టుమిట్టాడుతున్నాడు.. చెప్పండి ఇప్పుడు ఈయన కధలు రాస్తూ కూర్చోవాలా లేక సంసారం ఎలా నడిపించాలా ఆలోచించాలా..??

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 2 - ఈయన పూర్తిగా థ్రెడ్ లొ కనిపించడం మానేశాడు. ఫోన్ చేస్తే సమాధానం లేదు.. ఈయన పరిస్తితి ఏమయ్యిందో కూడా ఎవ్వరికీ తెలియదు. 

రచయిత # 3

ఆయన ఈమధ్య కొత్తగా ఉద్యోగం మారేడు ఆ ఉద్యోగంలో విపరీతమైన పనివొత్తిడి.. ఇది ఇలా ఉండగా, పెళ్ళిచేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మనకి ఓ నానుడి. అంటే, పెళ్ళిచెయ్యడం, ఇల్లు కట్టడం ఎంత పెద్ద పనులులో మీరే అర్ధం చేసుకోండి. ఈ పెద్దమణిషి ఉద్యోగం మారే సమయానికే ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు, ఆ ఇల్లుపని, ఉద్యోగంలో పనిభారం, ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేసరికి వాళ్ళ అబ్బాయికి పెళ్ళి కుదిరింది. దానితో ఆ పనులు.. చెప్పండి ఇప్పుడు ఈయన ఆగిపోయిన కథలకు అప్డేట్స్ పెడుతూ కూర్చోవాలా..? లేక కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలా..?

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 3 - ఈయనకు ఈమధ్య 60 ఏళ్ళు వచ్చాయి ఇంకా ఇల్లు అప్పులు ఉన్నాయి. పిల్లలు ఉద్యోగాలలో స్తిరపడలేదు. ఈయన ఇద్దరు కొడుకుల బాధ్యతని కూడా ఈయనే చొసుకుంటున్నాడు. ఈయన కుటుంబ బాధ్యతలని చూసుకుంటూ కూదా తరచు కథలకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.. 

రచయిత # 4

ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఈయన కంపెనీ వాళ్ళు ఇతన్ని అతనికి తెలియని టెక్నాలజీలో ప్రోజక్ట్ లో పడేసేరు. పాపం రాని టెక్నాలజీని కిందా మీదా పడుతూ నేర్చుకుంటూ నానా ఇబ్బందులూ పడుతూ ప్రోజక్ట్ పనులను చేస్తున్నాడు.. మరి ఈయన్ని ఉద్యోగంలో నిలదొక్కుకోమని చెప్పాలా..? లేక కథలు రాస్తూ కూర్చోమని చెప్పలా..? 

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 4 - ఈ 2 సంవత్రరాలలో ఈయన 2 ఉద్యోగాలు మారాడు. ఈయన ఉద్యోగమే చూసుకోవాలా/చేసుకోవాలా కథలు రాస్తూ కూర్చోవాలా..?? 

రచయిత # 5

ఈయన కూడా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మొన్నటివరకూ అమెరికాలో ఉండేవాడు. అకుకోకుండా వీసా సమస్యలు వచ్చి ఉన్నపళంగా 10 రోజుల సమయంలో ఇండియా ఫొమ్మన్నారు. ఇక్కడ అమెరికాలో ఇక్కడివి అక్కడ ఒదిలేసి ఉన్నపళంగా పెళ్ళం పిల్లలను ఎంటబెట్టుకుని ఇండియా పోవలసి వచ్చింది. 3 నెలలు అయ్యింది ఇప్పటికీ ఇండియాలో ఆయన స్థిరపడలేదు. పాపం ఆయనకి కథలకు అప్డేట్స్ ఇవ్వాలని తెలియడం లేదు..

రచయిత # 6 (ఇంతకు ముందు ఈయన గురించి చెప్పలేదు ఇప్పుడు కొత్తగా చెబుతున్నాను)


ఒక 2 సంవత్సరాలు ఉద్రుతంగా మన xossipy.comలొ కథలు రాశాడు. మీరు ఈయన గురించి ప్రస్తావించారని ఇప్పుడు ఈయన గురించి చెబుతున్నాను - ఈయన తండ్రిగారు పోవడం వలన ఇంటికి పెద్ద కొడుకుగా ఆయన్ కుటుంబాన్ని తన భుజాల మీద మొయ్యవలసి వచ్చింది. ఈయకి కూడా 50+ వయసు. 

తండ్రిగారు పోవడంతో కుటుంబసమస్యలు మీద పడి వాటిని ఓ కొల్లిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయనకు స్ట్రస్స్ వల్ల గుండె జబ్బు వచ్చి 3 శ్తంట్స్ వేశారు. మీరంతా ఇక్కడ మొదలుపెట్టిన కథలకి అప్డేట్స్ ఇవ్వలేదని తిట్టుకుంటున్నారని తెలియదు పాపం పాడైపోయిన గుండేకాయని, కూలిపోతున్న కుటుంబాన్నీ ఒదిలేసి మీకోసం ఇక్కడ కథలు రాస్తూ కూర్చోవాలని ఆయనకి ఎవ్వరూ చెప్పలేదు పాపం. ఏంచేస్తాం..??

ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కో రచయితకి ఒక్కో సమస్య. ఒక రచయిత తల్లిగారు కోవిడ్ వల్ల పోయేరు. 

మరో రచయిత తండ్రి గారు కోవిడ్ వల్ల చనిపోయేరు.  

నాకు తెలుసు ఇంతోటి దానికి వీళ్ళంతా కథలు రాయడం ఎందుకు మొదలుపెట్టాలి అని మీరు అడుగుతారు.

ఎందుకంటే కథలు రాసిన/రాస్తున్న వాళ్ళని మనం ఎటూ ప్రోత్సహించం అది మన తెలుగువాళ్ళ రక్తంలోనే లేదు.. పాపం ఈ పిచ్చివాళ్ళందరికీ కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు తెలియదు పరిస్తితులు ఇలా అడ్డం తిరుగుతాయని. ఎవరికన్న కానీ ముందు ముందు రోజులు ఇలా ఉంటాయి అని ముందుగా తెలిసుంటే పాపం ఈ కథలు రాయడం అనే పనిని వాళ్ళు మొదలుపెట్టి ఉండే వాళ్ళు కాదు. ఎం చేస్తాం నెను చెప్పిన వాళ్ళకి మీకున్నంత తెలివితేటలు విజ్ఞత లేదు. అందుకే మీకులాగ కథలు కావాలి, అప్డేట్స్ కావాలి అని జనాలని తిడుతూ కూర్చోకుండా వాళ్ళే కథలు రాసి నలుగురిని అలరించాలని ప్రయత్నం చేసి ఇదిగో ఈ రోజు మీలాంటి వాళ్ళతో తిట్లు తింటున్నారు. 

ఇక్కడ బోరు అనేవాళ్ళు కిందా మీద పడి కథ రాసే రచెయితల కథలమీద ఎప్పుడన్న ఒక అర పేజీ స్పందన తెలియచేసేరా..?? చదివి నచ్చుకున్న కత మీద తెలుగులో ఒక అరపేజీ విస్లేషణ రాసి చూడండి అప్పుడు మీకు తెలిసొస్తుంది తెలుగులో కథలు రాయడం ఎంత కష్టమో.. 

ఎదుటివాళ్ళమీద రాళ్ళు విసరడం చాలా సులువైన పని. గురివిందగింజలకు ముడ్డికింద నలుపు కనపడదని ఓ సామెత. 

నేను ఎవ్వరినీ తిట్టడానికో ఎవరినీఎ కించపరచడానికో ఇదంతా రాయడం లేదు. మనం ఎదుటి వాళ్ళమీద ఓ రాయి విసిరే ముందు మనవైపు ఏదన్న దోషం ఉందా అని చూసుకోమని మాత్రకే చెపుతున్నాను..

సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ..

మీ
గుడ్ మెమొరీస్
[+] 11 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by goodmemories - 18-07-2024, 01:30 AM



Users browsing this thread: 1 Guest(s)