Thread Rating:
  • 36 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
విక్కీని సంగీతని చూస్తూనే వెళ్ళింది స్వప్నిక. అన్నం తినిపించి మూతి తుడుస్తున్నాడు. అడుగుల శబ్దం విని స్వప్నిక వైపు చూసాడు. దెగ్గరికి రాగానే సంగీత కూడా చూసి భయపడిపోయింది, వెంటనే విక్కీ భుజం వెనుక చిన్న పిల్లలా దాక్కుంది. సంగీతని పెంకుల ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి బైటికి వచ్చాడు. స్వప్నిక చెయ్యి పట్టుకుని నడుస్తుంటే విక్కీ కళ్ళలోకి చూస్తుంది.

విక్కీ : డివోర్స్ తరువాత మీ అక్క మీ అమ్మతో కలిసి బిజినెస్ పెట్టాలనుకున్నారు. ఒక్క దాంట్లో ఉండకుండా లాస్ రాగానే అది మూసేసి ఇంకోటి, అందులో లాస్ రాగానే ఇంకోటి మార్చారు. ఈ లోగా నీ ఫోటో పేపర్లో పడటం. కంపనీ ఓనర్ అని పేపర్లో చదవడం మీ అక్కని పిచ్చిదాన్ని చేసేసాయి. దేని కోసం అయితే నన్ను అన్నని మోసం చేసిందో, ఉన్న మొగుడిని వదిలేసిందో.. పేరు, పలుకుబడి, డబ్బు అవన్నీ నీ దెగ్గర ఉండటం చూసి తట్టుకోలేకపోయింది.

తన దృష్టిలో నువ్వొక మోసగత్తేవి. తనకి పట్టాల్సిన అదృష్టం తన నుంచి నువ్వు లాగేసుకున్నావని నీ మీద అసూయ ద్వేషాలతో రగిలిపోయింది. ఇదంతా చూడలేక, తన కూతురు ఇలా అవ్వడానికి తనే కారణం అని భావించి ఆ బాధతోనే మీ అమ్మ చనిపోయింది.

సంగీత ఒంటరితనంతో పాటు పిచ్చిది కూడా అయిపోయింది. నువ్వంటే అసూయ పడే దెగ్గర నుంచి నీ పేరు వింటే దడుచుకునే స్టేజికి వచ్చేసింది. తను వేసిన తప్పటడుగులు చివరికి తనని ఎక్కడికి తీసుకొచ్చాయో చూసుకుంటే తన మీద తనకే ద్వేషం.. పదిహేనుసార్లు సూసైడ్ అట్టెంప్ట్ చేసింది.

స్వప్నిక : ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు

విక్కీ : చెప్పలేదు..

స్వప్నిక : అమ్మ  ?

విక్కీ : మీ అమ్మని మున్సిపాలిటీ వాళ్ళే..

స్వప్నిక : నేను ఒకసారి తన దెగ్గరికి వెళ్ళనా

విక్కీ : చూసావుగా నిన్ను చూస్తేనే ఎలా ముడుచుకుపొయిందో, ఈ మూడు నెలల్లో చాలా మార్పు తీసుకొచ్చాను. ఇంతకముందు అయితే గోల చేసేది, అరిచేది. గోళ్ళతో రక్కెసేది.. డాక్టర్ ఇంకా చాలా టైమ్ పడుతుందని చెప్పారు. ఇక్కడ తనతో రోజు ఒక మొక్క నాటిస్తున్నాను, చిన్న పిల్లలకి ఎలా నేర్పిస్తామో అన్నీ మొదటి నుంచి నేర్పుకుంటూ వస్తున్నాను.

స్వప్నిక మెల్లగా తలుపు దెగ్గరికి వెళ్లి తొంగి చూసింది. సంగీత మంచం మీద పడుకుంటే వెళ్లి దెగ్గర కూర్చుంది.

కళ్ళు తెరవగానే ఎదురుగా స్వప్నికని చూసి భయపడి లేవబోతుంటే భుజం మీద చెయ్యి వేసింది. విక్కీ మధ్యలోకి రాబోతుంటే వద్దని ఆపేసింది. వెంటనే ఫోన్ తీసి తను ఇంట్లో ఉన్నప్పుడు పాత ఫోటో ఆల్బమ్ అంత ఫోనులో ఫోటోలు తీసి దాచుకుంది. అవి ఓపెన్ చేసి బ్రైట్నెస్ పెంచి సంగీతకి చూపించి వీళ్ళు ఎవరో చెప్పు చూద్దాం అనేసరికి గోల చెయ్యడం ఆపి ఫోన్ వంక చూసింది.

స్వప్నిక : కూర్చో.. అని భుజం మీద చెయ్యి వేసి మంచం మీద కూర్చోపెట్టి పక్కనే కూర్చుంది. చిన్నప్పుడు అక్కా చెల్లెళ్ళ ఫోటో.. అక్కా.. ఇది నువ్వు ఇది నేను అని పక్కన ఫోటో చూపించింది.

సంగీత : వాళ్ళు ఏం చేస్తున్నారు

స్వప్నిక : అది మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా.. నువ్వు నాకోసం మట్టి వినాయకుడిని చేస్తున్నావ్.. మళ్ళీ ఇప్పుడు చేద్దామా ఇద్దరు కలిసి అంటే తల ఊపింది.

సంగీతతో కలిసి బైటికి వెళ్లి పక్కన పొలం దెగ్గర బంకమట్టి ఉంటే తీసుకొచ్చింది. స్వప్నిక వినాయకుడిని చేస్తుంటే సంగీత ఆనందంగా చూస్తుంది. విక్కీ కూడా వచ్చి కూర్చున్నాడు.

స్వప్నిక : బావ.. పెళ్లి చేసుకుందాం

విక్కీ : చేసుకుందాం

వారం రోజులు సంగీతకి అలవాటు అయ్యేదాకా స్వప్నిక కూడా అక్కడే ఉంది. అన్నం తినిపించుకుని, కధలు చెపుతూ నిద్రపుచ్చేది. బాగా అలవాటు అయ్యింది అనుకున్న తరువాత సంగీతని తీసుకుని బెంగుళూరు వెళ్లారు. స్వప్నిక అంతా వివరించి వాళ్ళ నిర్ణయం చెప్పింది. విశాల్ కరగలేదు.. స్వప్నిక చెప్పిన దానికి ఒప్పుకోలేదు. తనకి ఇష్టం లేదని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోయాడు. కడుపుతో ఉన్న సాధన ఏమి మాట్లాడలేదు, నచ్చినట్టు చేయమంది.

ఇరవై ముప్పై మంది సమక్షంలో విక్కీ స్వప్నికల పెళ్లి జరిగింది. తెల్లారే సంగీతతో కలిసి మళ్ళీ కాకినాడ కాపురం వచ్చేసారు. కంపెనీ భారం అంతా వసుంధర మీద పడింది. ఒకప్పుడులా మళ్ళీ బిజీ అయిపోయింది.

రెండున్నర ఏళ్ళు గడిచాయి. సాధన తన ఏడాది కొడుకుతో కాకినాడ వచ్చింది.

చెట్లకి నీళ్లు పడుతున్న సంగీత విశాల్ని, బిడ్డతో ఉన్న సాధనని చూడగానే ముందు జంకినా వెంటనే పలకరించి గేటు తీసింది. ఇద్దరు లోపలికి వెళుతుంటే విశాల్ చెయ్యి పట్టుకుంది సంగీత. సాధనకి తెలుసు సంగీత ఆరోగ్యం ఇప్పుడు బానే ఉందని, వాళ్ళని మాట్లాడుకొనీ అని వదిలేసి విక్కీ వాళ్ళ కోసం లోపలికి వెళ్లింది.

సంగీత : ఎలా ఉన్నావ్ బావ

విశాల్ : చూస్తున్నావుగా

సంగీత : నన్ను క్షమించు బావ.. అని కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోయాడు.. భుజం మీద చెయ్యి వేసి ఊరుకోమన్నాడు.

విశాల్ : ఈ చెట్లన్నీ నువ్వు పెట్టినవేనా

సంగీత కళ్ళు తుడుచుకుని అవును బావ అంది.

సంగీత : విక్కీ ఇచ్చిన ఈ జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. నాకు నీ కొడుకుని చూపించు అంటే రా అని చెయ్యి పట్టుకున్నాడు విశాల్.

వాళ్ళ మంచితనం చూసి తను వాళ్ళని బాధపెట్టిన సంఘటనలు గుర్తుకువచ్చాయి, ఏడుపు వచ్చినా అన్ని దిగమింగుకుని నవ్వుతూ విశాల్ తో లోపలికి వెళ్ళింది.

సాధన : ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటారు, అక్కడ ఎన్ని బాధ్యతలు, ఎన్ని పనులు.. అత్తయ్య ఒక్కటే చూసుకోవాలంటే ఎంత ఇబ్బంది అని చెపుతుంటే మౌనంగా వింటున్నారు విక్కీ, స్వప్నిక

సంగీత : అవును సప్పు.. నేనిప్పుడు బానే ఉన్నాను. నాకోసం మీరు చేసింది చాలు, ఇక మీ జీవితాలు చూసుకోండి పిల్లల్ని కనండి అంటూ సాధన దెగ్గరికి వెళ్లి చెయ్యి చాపితే పిల్లోడిని చేతికిచ్చింది సాధన.

పిల్లోడిని ఆడిస్తూ స్వప్నిక దెగ్గరికి వెళ్ళింది.. సప్పు.. నాకిప్పుడు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు. నేను ఇలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక మీరు ఇది మీ జీవితాలని మొదలుపెట్టే సమయం. ఆలోచించొద్దు నాకే సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా మీ దెగ్గరికి వచ్చేస్తాను.. వెళ్ళండి, అని బాబుని విశాల్ కి ఇచ్చేసి విక్కీ, స్వప్నికల చేతులు పట్టుకుంది.

తరువాతి రోజున సాయంత్రం విశాల్ సాధనతో కలిసి విక్కీ, స్వప్నిక కూడా వెళ్లిపోతుంటే ఆనందంగా చెయ్యి ఊపి వాళ్ళని పంపించింది. విక్కీ సంగీత కోసం అన్ని ఏర్పాట్లు చేసాడు, పక్కన ఉండేవాళ్లకి అందరికి జాగ్రత్తలు చెప్పాడు. వాళ్లంతా సంగీతని జాగ్రత్తగా చూసుకుంటామని మాటిచ్చారు.

కారు వెళ్ళిపోయాక గేటు పెట్టేసి లోపలికి నడుస్తుంటే ఏడుపు తన్నుకొచ్చింది. ఇన్ని రోజులు విక్కీ, స్వప్నికలతో ఎంతో సంతోషంగా గడిపింది. ఈ రాత్రి పడుకుని తెల్లారి లేస్తే పక్కన ఎవ్వరు లేరనే బాధ. ఏడుస్తూనే ఎదురుగా ఉన్న గులాబీ మొక్కని చూసి కళ్ళు తుడుచుకుంది.

గులాబీని తెంపి చూస్తుంటే మొహం మీదకి చిరునవ్వు వచ్చేసింది. కళ్ళ ముందు విక్కీ కనిపించాడు. చల్లగాలి ఒంటిని తాకుతూ తన చుట్టే తిరుగుతున్నట్టు అనిపించింది సంగీతకి. ఆ గాలి మనసుకి హాయిని, ప్రశాంతతని గుర్తుచేస్తుంటే విక్కీని తలుచుకుంటూనే గులాబీని తలలో పెట్టుకుంది.

ఆకాశంలోకి చూసి థాంక్స్ నాన్నా.. నువ్వు చేసిన మంచే నన్ను ఇప్పుడు ఇలా నిలబెట్టింది. నీలా బతుకుతాను అని కళ్ళు తుడుచుకుంది నవ్వుతూనే


ఆకాశంలో కనిపించే పెద్ద నక్షత్రం ఈ సారి పూర్తిగా మాయం అయిపోయింది.

సమాప్తం
❤️❤️❤️
❤️
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. - by Pallaki - 17-07-2024, 08:00 AM



Users browsing this thread: 8 Guest(s)