14-07-2024, 04:57 PM
(14-07-2024, 04:17 PM)Mahesh.thehero Wrote: ష్ ష్ ష్ ష్ ..... అంటూ మేడమ్ - విశ్వ సర్ .
జోకొడుతున్న తమ అమ్మ ఒడిలో తల ఉంచి హాయిగా నిద్రపోతున్న తమ ప్రాణమైన అన్నయ్య - తమ్ముడిని చూసి , sorry sorry ..... అంటూ నోటికి తాళం వేసి అడుగులో అడుగువేసుకుంటూ వచ్చారు , అమ్మా అమ్మా హ్యాపీ హ్యాపీ కదూ చూస్తుంటేనే తెలిసిపోతోంది తెగ మురిసిపోతున్నావు అంటూ మేడమ్ మరియు నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మేడమ్ : ష్ ష్ సౌండ్ చెయ్యకుండా ముద్దులుపెట్టండి .
మాకే చెబుతున్నావా అమ్మా అంటూ నవ్వుకున్నారు .
మేడమ్ : తల్లులూ ..... లంగావోణీ - పరికిణీలో సో బ్యూటిఫుల్ , ఉమ్మా ఉమ్మా .....
అక్కయ్య : లవ్ యు అమ్మా , అతినెమ్మదిగా నా పాదాలు ఎత్తి సోఫాలో కూర్చుని తన ఒడిలో పాదాలు ఉంచుకుని సుతిమెత్తగా ఒత్తసాగింది .
చెల్లి : మమ్ ..... అమ్మా ..... నువ్వేమో పైన - అక్కయ్యేమో కింద , మీ సంతోషాలు చూస్తుంటే జలసీ వేస్తోంది , అమ్మా ..... నేను పడుకోబెట్టుకుంటాను లే .....
మేడమ్ : నో నో నో ..... డిస్టర్బ్ అవుతుంది వెళ్లు వెళ్లు అంటూ తోసేసి నవ్వుతోంది.
అక్కయ్య - సర్ నవ్వులు ......
చెల్లి : అక్కయ్యా ......
అక్కయ్య : ఏమీ వినిపించినట్లు యాక్ట్ చేస్తోంది .
మేడమ్ - సర్ నవ్వులు ..... , అమ్మో ఇక్కడ యుద్ధం మొదలయ్యేలా ఉంది నేను ఎస్కేప్ అంటూ నవ్వుకుంటూ కాక్ పిట్ లోకి వెళ్లిపోయారు సర్ .
చెల్లి : మీరిద్దరూ హ్యాపీ - మరి నేను అంటూ దుఃఖం తన్నుకొచ్చేసింది , అమ్మా .... అన్నయ్య స్నానం చెయ్యాలికదా .....
మేడమ్ : ఏడ్చినా నేనైతే నా ప్లేస్ ఇవ్వను , లేకలేక కలిగిన అదృష్టం , వెళ్లు మీ నాన్న దగ్గరికి వెళ్లు అంటూ నవ్వులు , ఇక స్నానం అంటావా ..... ఫ్లైట్ లో కాకపోతే ఇంట్లో చేస్తాడు , మరొక గంట ఆలస్యం అవుతుంది అంతే ......
అక్కయ్య : చెల్లీ చెల్లీ ..... , నీకు మాకంటే ఎక్కివ సంతోషం కలిగేది చెప్పనా ? , మేము చేతులతో జొకోడితే నువ్వు ముద్దులతో జోకొట్టు .
చెల్లి : కోపంతో మేడమ్ బుగ్గపై గిల్లేసి , లవ్ యు లవ్ యు సో మచ్ అక్కయ్యా అంటూ వెళ్లి అక్కయ్య పెదాలపై ముద్దులుపెట్టి , నా ప్రక్కనే మోకాళ్లపై చేరి హాయిగా నిద్రపో అన్నయ్యా అంటూ బుగ్గలపై అటూ ఇటూ ముద్దులుకురిపిస్తోంది .
తొలిముద్దుకే లవ్ యు చెల్లీ అంటూ నిద్రలోనే చెల్లిని స్పృశించి ఎత్తుకుని గుండెలపై పడుకోబెట్టుకుని జోకొడుతున్నాను .
మేడమ్ - అక్కయ్య ...... అవాక్కై చూస్తుండిపోయారు .
ఇద్దరూ జలసీ అవుతుండటం చూసి , సౌండ్ చెయ్యకుండా యాహూ యాహూ ..... అంటూ మేడమ్ బుగ్గపై మళ్లీ గిల్లేసింది చెల్లి , లవ్ యు లవ్ యు అన్నయ్యా .....
( చెల్లీ ..... మాకోసం రాత్రంతా నిద్రపోలేదు హాయిగా నిద్రపో అంటూ నిద్రలోనే జోకొడుతున్నాను ) .
కొద్దిసేపటి తరువాత విక్రమ్ సర్ ..... కాక్ పిట్ నుండి తొంగిచూసి , హమ్మయ్యా .... యుద్ధ వాతావరణం తొలగిపోయిందన్నమాట అంటూ నిర్భయంగా వచ్చి కూర్చున్నారు , 15 నిమిషాలలో ఢిల్లీలో ల్యాండ్ కాబోతున్నామని చెప్పారు .
ల్యాండింగ్ కుదుపులకు మరియు ఫ్లైట్ ఆగడంతో మెలకువరావడంతో కళ్ళుతెరిచాను , చెల్లీ - మేడమ్ - అక్కయ్యను చూసి ఆనందిస్తూ హాయిగా నిద్రపోతున్న చెల్లిని జోకొడుతూనే లేచి కూర్చున్నాను , అక్కయ్యా .....
అక్కయ్య : ఢిల్లీ రీచ్ అయ్యాము తమ్ముడూ ......
పైలట్స్ వచ్చి డోర్ తెరవడంతో , చెల్లిని ఎత్తుకునే లేచి కిందకుదిగాము , సర్ govt వెహికల్ రన్ వే దగ్గరే వేచిచూస్తుండటంతో బయలుదేరాము , ఇంటికి చేరుకోవడానికి గంట సమయమే పట్టింది .
మేడమ్ : తల్లీ ..... ఇక్కడ నుండి ప్రెసిడెంట్ భవన్ కు కేవలం 5 కిలోమీటర్లే , స్పెషల్ ఆఫీసర్స్ అందరూ ఈ అపార్ట్మెంట్స్ లోనే ఉంటారు , మన అపార్ట్మెంట్ నుండి కనిపిస్తుంది అంటూ పైకి తీసుకెళ్లారు , 8th ఫ్లోర్ బాల్కనీ నుండి ప్రెసిడెంట్ భవన్ తోపాటు సిటీలో విజిటెడ్ ప్లేసస్ చాలానే కనిపిస్తున్నాయి .
మేడమ్ : అమ్మో 10 గంటలు అవుతోంది , మహేష్ .... నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను , కనిపించే వాటన్నింటికీ వెళదాము .
Sorry మేడమ్ , అక్కయ్యకు ఇష్టమైతే మీరు వెళ్ళండి , కాశ్మీర్ కు వచ్చినదే చెల్లికోసం , ఒకరోజు కూడా చెల్లితో టైం స్పెండ్ చెయ్యలేదు , బయలుదేరేంతవరకూ చెల్లితోనే .......
అక్కయ్య : ఉమ్మా ఉమ్మా ..... , నా మనసులోని మాటనే చెప్పావు తమ్ముడూ , నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ చెల్లిని అందుకోబోయింది .
ఊహూ ..... చెల్లి లేచేంతవరకూ ఇవ్వను , హ్యాపీగా సర్ డోర్ ఓపెన్ చేయడంతో లోపలికివెళ్లి సోఫాలో కూర్చుని జోకొడుతున్నాను .
అక్కయ్య ప్రక్కనే వచ్చి మాఇద్దరి బుగ్గలపై ముద్దులుకురిపిస్తోంది .
మేడమ్ : ఆనందబాస్పాలతో పొంగిపోతున్నారు , మహేష్ - తల్లీ తేజస్వీ ..... బెడ్రూం లోకి వెళ్లి పడుకోండి , బ్రేక్ఫాస్ట్ అయ్యాక మీ ఇష్టం .....
అక్కయ్య : నేను హెల్ప్ చేస్తాను అమ్మా అంటూ లేచింది .
మేడమ్ : నో నో నో , నీ చెల్లికి తెలిస్తే మీ సర్ చెపినట్లు రుద్ర తాండవమే వెళ్ళండి వెళ్ళండి , AC వేసుకుని మీకిష్టమైనంతసేపు పడుకోండి అంటూ పంపించి డోర్ క్లోజ్ చేసుకున్నారు .
చెల్లిని గుండెలపై పడుకోబెట్టుకుని బెడ్ మీదకు వాలాను .
అక్కయ్య .... మా ప్రక్కనే వాలిపోయి చెల్లి బుగ్గపై ముద్దులుపెడుతూ , నా బుగ్గపై - భుజంపై పంటిగాట్లుపెడుతూ , చిలిపి అల్లరితో నవ్వుతూ నవ్వుతూనే మాఇద్దరినీ చుట్టేసి నిద్రలోకిజారుకుంది .
ప్రాణం కంటే ఎక్కువైన ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , జోకొడుతూనే నిద్ర ఆవహించేసింది .
మమ్మీ మమ్మీ ..... అంటూ రోజూలానే కళ్ళు తిక్కుకుంటూ లేచిచూసి , ష్ ష్ ..... లవ్ యు అన్నయ్యా లవ్ యు అక్కయ్యా , డిస్టర్బ్ చేసేసాను అంటూ లెంపలేసుకుంది .
మేడమ్ వచ్చి చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
ఆకలేస్తోంది కదూ చెల్లీ ......
చెల్లి : Yes ..... నో నో , ప్చ్ .....
నాకూ ఆకలివేస్తోంది .
నాక్కూడా అంటూ అక్కయ్య , తమ్ముడూ ...... మేము ఫేస్ వాష్ చేసుకునేలోపు నువ్వు స్నానం చేసి వచ్చేయ్యాలి .
( బ్రేక్ఫాస్ట్ - లంచ్ రెండూ రెడీ అంటూ మేడమ్ మాటలు )
అంత టైం కూడా అవసరం లేదు అంటూ చెల్లి బుగ్గపై - అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి బాత్రూమ్లోకి వెళ్ళాను , కాలకృత్యాలు తీర్చుకుని బట్టలు విప్పి బాస్కెట్ లో ఉంచి వెచ్చగా తలంటు స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చాను , బెడ్ పై డ్రెస్ ఉండటం చూసి లవ్ యు అక్కయ్యా అంటూ వేసుకుని హాల్లోకి వెళ్ళాను .
ఘుమఘుమలకే ...... డైనింగ్ రూమ్ అక్కడ అంటూ వెళ్ళాను .
చెల్లి - అక్కయ్య నవ్వుతూ తీసుకెళ్లి కూర్చోబెట్టారు .
మేడమ్ వడ్డించి ప్రేమతో అక్కయ్యకు ..... అక్కయ్య చెల్లికి ..... చెల్లి నాకు తినిపిస్తున్నారు .
ఎంజాయ్ ఎంజాయ్ అంటూ బుద్ధిగా వడ్డించుకుని హాల్లోకి వెళ్లిపోయారు సర్ .....
అందరం నవ్వుకున్నాము .
అక్కయ్య : అమ్మా ఇన్ని వంటలా ? .
టైం లేదు లేకపోయుంటే రెండు మూడు స్వీట్స్ చేసేసేదానిని మీకోసం .
స్వీట్స్ - స్వీట్స్ అంటూ ఇద్దరం చూసుకుని నవ్వుకున్నాము .
చెల్లి - మేడమ్ బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్య పరుగునవెళ్లి బెడ్రూం నుండి రెండు చేతులలో రెండు పళ్ళెం లలో నిండుగా స్వీట్స్ హాల్లో ఉన్న సర్ కు వడ్డించి మాదగ్గరకు తీసుకొచ్చింది .
మ్మ్ మ్మ్ ..... సో గుడ్ ఫింగర్ లిక్కింగ్ గుడ్ wow ..... ఇలాంటి స్వీట్స్ తినడం ఫస్ట్ టైం , థాంక్యూ థాంక్యూ ...... అంటూ సర్ తింటూ ఫీల్ అవుతున్నారు .
ఆశతో చూస్తున్న చెల్లి - మేడమ్ కు స్వయంగా తినిపించింది అక్కయ్య .....
సర్ కంటే ఎక్కువ సంతోషంతో కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు , సో సో సో గుడ్ తల్లీ - అక్కయ్యా ..... సూపర్ , అన్నీ తినేయ్యాలనిపిస్తోంది .
మేడమ్ : రాత్రి దేవీ ......
అక్కయ్య : అవును అమ్మా ..... , Unlimited స్వీట్స్ , మా అమ్మ - చెల్లికోసం , ఈ దివ్యమైన పళ్ళెం లు ఇక్కడే ఉంటాయి , ఎంతమంది ఎన్నైనా తినొచ్చు , అన్నింటినీ ఒక పాత్రలోకి మార్చగానే మళ్లీ పళ్ళెం నిండా ప్రత్యక్షము అవ్వడం చూసి మేడమ్ స్పృహ కోల్పోవడం - చెల్లి కళ్ళప్పగించి చూస్తుండటం చూసి , అక్కయ్య ఇద్దరి బుగ్గలపై ముద్దుపెట్టారు , మేడమ్ నోటికి స్వీట్ అందించగానే స్పృహలోకొచ్చి గబగబా తినేశారు , sooooper ...... అండ్ షాకింగ్ తల్లీ , ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను .
చెల్లి : అంటే ఇప్పటివరకూ నమ్మలేదా అమ్మా ? , నాకంటే ముందుగా అమ్మకు చెప్పారుకదా ......
మేడమ్ : అదీ అదీ , sorry లవ్ యు తల్లీ ..... అంటూ లేచి కౌగిలించుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్య : తప్పులేదు అమ్మా ..... , ఈకాలంలో ఎవ్వరూ నమ్మలేని నిజం .
నేను నమ్ముతాను నేను నమ్ముతాను , స్వీట్స్ ప్రత్యక్షం అవ్వడం కళ్లారా చూసినట్లు పెద్ద పెద్ద కళ్ళతో షాక్ లోనే వచ్చి ప్లేట్ నిండా స్వీట్స్ వేసుకున్నారు , ఈపూటకు కేవలం స్వీట్స్ మాత్రమే అంటూ షాక్ లోనే వెళ్లిపోయారు .
అందరమూ నవ్వుకున్నాము .
సంతృప్తిగా తిని హాల్లోకి వచ్చి కూర్చున్నాము .
సర్ అయితే న్యూస్ చూస్తూ ఒక్కొక్కటే స్వీట్ ఎంజాయ్ చేస్తున్నారు , మహేష్ - తేజస్వి సూపర్ సో గుడ్ అంటూ వేళ్ళు కూడా చప్పరిస్తున్నారు .
అక్కయ్య : ప్లేట్స్ ఇక్కడే ఉంటాయి సర్ , మీకిష్టమైనన్ని స్వీట్స్ తినొచ్చు .
మేడమ్ : తల్లీ .....
అక్కయ్య : ఇంకా రెండు ఉన్నాయిలే అమ్మా వచ్చి కూర్చోండి .
సర్ : మహేష్ చెప్పడం మరిచిపోయాను , అపార్ట్మెంట్స్ లో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ మరియు ఆర్మీ ఆఫీసర్స్ అందరూ నిన్ను కలవాలని ఉదయం నుండీ వస్తూనే ఉన్నారు - నీ స్పీచ్ కు అందరూ ఫిదా అయిపోయారు , నువ్వు పడుకున్నావని తెలిసి నిన్ను డిస్టర్బ్ చేయొద్దని తరువాత వస్తామని హ్యాపీగా వెళ్లిపోయారు , మీరు ok అంటే పిలుస్తాను .
OK ok మీ ఇష్టం సర్ , అంతలోనే అందరికీ ఎలా తెలిసింది ? .
మేడమ్ : నీ సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ అన్నింటినీ అపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలందరూ కలిసే చూస్తారు - ప్రాక్టీస్ చేస్తారు , మా అన్నయ్య మా అన్నయ్య అంటూ గర్వంగా చెప్పుకుంటుంది నీ చెల్లి .
లవ్ యు చెల్లీ అంటూ అంటూ ముద్దులుకురిపిస్తున్నాను .
అంతలో కాలింగ్ బెల్ సౌండ్స్ తోపాటు కీర్తి కీర్తి కీర్తి ..... అంటూ కేకలువేస్తూ డోర్ నాక్ చేస్తున్నారు .
చెల్లి : అన్నయ్యా - అక్కయ్యా ..... నా కొత్త ఫ్రెండ్స్ - నీ శిష్యులు వచ్చినట్లున్నారు , నువ్వంటే చాలా రెస్పెక్ట్ అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి డోర్ తెరిచి ఆహ్వానించింది .
పాతికమంది పిల్లలదాకా లోపలికివచ్చి , సర్ సర్ సర్ అంటూ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ లో విష్ చేశారు .
సంతోషంతో లేచి అలాగే విష్ చేసాను .
సర్ సర్ సర్ ...... అంటూ అందరూ చుట్టూ చేరారు , మేము క్షేమంగా వచ్చినందుకు తమ సంతోషాన్ని తెలియజేసారు .
ఆ వెనుకే ఆఫీసర్స్ వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు , అందరూ స్పీచ్ గురించి మరియు తమ పిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వలన కరేజ్ గా మారుతుండటం గురించి నన్ను అభినందించారు .
పిల్లలు ముఖ్యన్గా గర్ల్స్ లేడి పిల్లల్లా కాదు పులి పిల్లల్లా ఉండాలన్నదే నా కోరిక , దానికోసం ఏమైనా చేస్తాను .
అంతే చప్పట్లతో అపార్ట్మెంట్ దద్దరిల్లిపోయింది , చెల్లి - అక్కయ్య - మేడమ్ సంతోషంతో ఏకంగా విజిల్స్ వేస్తున్నారు , అక్కయ్య ..... మేడమ్ వైపు సైగచెయ్యడంతో లోపలికివెళ్లి రెండు ప్లేట్స్ నిండుగా స్వీట్స్ తీసుకొచ్చి పంచారు .
మోహమాటపడినవాళ్ళు - మోహమాటంతో ఒకటి తీసుకున్నవాళ్ళు రుచిచూసి ఆశతో స్వీట్స్ వైపు చూస్తున్నారు , అక్కయ్య - మేడమ్ నవ్వుకుని మళ్లీ ఒక రౌండ్ ఇష్టమైనన్ని తీసుకోమని చెప్పడంతో , రెండు చేతులనిండా తీసుకున్నారు , పిల్లలు మహా ఇష్టంగా తింటుండటం చూసి , ఒక పాత్ర నిండా వేసి వారి మధ్యలో ఉంచారు.
ప్రతీ ఆఫీసర్ ..... సర్ దగ్గరకువెళ్లి , స్వీట్స్ ఎక్కడ దొరుకుతాయని తెగ ఎంక్విరీ చేసేస్తున్నారు .
సర్ కు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక మావైపు బేలగా చూస్తుండటం చూసి నవ్వుకున్నాము , ఆంధ్రా ఆంధ్రా .....
సర్ : మై నేటివ్ ప్లేస్ స్వీట్స్ , మీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంటికి వచ్చెయ్యండి , మోహమాటపడ్డారో మీరే లాస్ అవుతారు మీఇష్టం .
నై నై నో నో .... రోజూ వస్తామెమో అంత టేస్టీ విక్రమ్ భాయ్ ....
సర్ : Always welcome ఫ్రెండ్స్ ......
చెల్లితో గడుపుతుంటే సమయమే తెలియలేదు , గంటగంటకూ మేడమ్ స్నాక్స్ - డ్రింక్స్ - ఫ్రూట్స్ ..... తెస్తూనే ఉన్నారు - తింటూనే ఉన్నాము , చూస్తుండగానే చీకటిపడిపోయింది , బయలుదేరే సమయం దగ్గరపదుతోందని తెలియగానే అందరి కళ్ళల్లో బాధ , అక్కయ్య కోసమే అని అంతకుమించి సంతోషం .......
Super