Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
117. టాక్ ఆఫ్ ద టౌన్







రాజ్ సొల్యూషన్స్:
కంపనీ మేనేజింగ్ డైరక్టర్ లోపలకు నడుస్తూ వస్తూ ఉంటే ఆమె వెనక స్టాఫ్ ఆమె పర్సనల్ సెక్రటరీలు మిస్ శైలజ, మిస్టర్ అబ్బాస్ ఇద్దరూ పరిగెడుతూ వస్తున్నారు. ఆమె క్యాబిన్ లోకి వెళ్లి కూర్చొని "ఇంటర్వ్యూ చేసిన ఆ ముగ్గిరుని రమ్మను" అంది.

ఆ ముగ్గురు లోపలకు వచ్చి నిలబడ్డారు. మేనేజింగ్ డైరక్టర్ సీట్ లో కూర్చున్న యువతిని చూస్తూ "కీర్తి మేడం" (కీర్తి సురేష్) అన్నారు.

కీర్తి కంప్యుటర్ లో ఎదో చూస్తూ "కూర్చోండి" అని సైగ చేసింది. 

పక్కనే నిలబడ్డ అబ్బాస్ ఆ ముగ్గురిని ఉరిమి చూస్తూ ఉంటే, శైలజ మాత్రం వాళ్లతో ఏం కాదు అన్నట్టు నవ్వుతూ ఉంది.

ముగ్గురు వచినపుడు దైర్యంగా ఉన్నా అక్కడ సీరియస్ గా ఉన్న కీర్తి మేడం ని మరియు అంతకంటే కోపంగా ఉన్న అబ్బాస్ ని చూస్తూ భయభ్రాంతులకు గురయ్యారు.

కీర్తి కంప్యుటర్ ని లో వర్క్ చేసేసి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంది.

ముగ్గురు ఆమెనే చూస్తూ ఆమె వేస్తున్న గుటకలనూ కూడా చూస్తూ ఉన్నారు.

కీర్తి చిన్న కర్చీఫ్ తో మూతి తుడుచుకొని తిరిగి ముగ్గురు వైపు చూసింది, ఎదో చెప్పమన్నట్టు.

ముగ్గురు చూస్తూ ఉన్నారు కాని ఏం మాట్లాడలేదు. ఇంతలో అబ్బాస్ మాట్లాడుతూ "మేడం ఈ ముగ్గురు వీళ్ళ కాలేజ్ జూనియర్ ఒకరిని ఆఫీస్ కి పిలిపించి ర్యాగింగ్ చేసి అవమానించారు" అన్నాడు.

కీర్తి పైకి లేచి కిటికీ లో నుండి బయటకు చూస్తూ చేతులు వెనక్కి పెట్టుకొని ఉంది. ఆమె అక్కడ ఎవరినో చూస్తుంది.

ఇంటర్వ్యూ చేసిన ఆ లావాటి మహిళ "అదేం లేదు మేడం.. అంతా అబద్దం" అని బుకాయించింది.

అబ్బాస్ "ఆఫీస్ లో అందరూ చూశారు.... మీరు చేసిన నిర్వాకం.... ఆమెనే కాదు, ఆఫీస్ లో మీది ఇష్టారాజ్యం అయిపొయింది మేడం" అంటూ కీర్తికి చెబుతున్నాడు.

లావాటి మహిళ అబ్బాస్ ని కోపంగా చూస్తూ "అదేం లేదు మేడం.... మేం బాగానే ఉన్నాం"

అబ్బాస్ "అక్కడ CC కెమెరాలో రికార్ట్ అయింది" 

లావాటి మహిళ "అదేం లేదు మేడం... అయినా మన ఆఫీస్ CC కెమేరా ఫుటేజ్ మనం బయటకు ఇవ్వము కదా" అంది.

శైలజ "అవును మేడం.... మనం ఇవ్వాల్సిన అవసరం లేదు.. సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి అడిగితే మనం ఇవ్వం అని చెప్పొచ్చు" అంది.

లావాటి మహిళ నవ్వుకుంటూ "అసలు ఆ అమ్మాయి నిషా... ఉత్త పాడు మనిషి ఇలా చేస్తుంది అని అనుకోలేదు మేడం... ఇప్పుడు మనల్ని ఇలా యిబ్బంది పెడుతుంది" అంది.

శైలజ మాట్లాడుతుంది. మనం మన ఎంప్లాయిస్ కి సపోర్ట్ గా ఉండాలి, అప్పుడే ఎంప్లాయిస్ మనకు విలువ ఇస్తారు.

ఆ వెంటనే అబ్బాస్ మాట్లాడుతున్నాడు. మనం మోరల్స్ ఫాలో అవ్వాలి అప్పుడే ఎంప్లాయిస్ క్రమ శిక్షణలో ఉంటారు అని చెబుతున్నాడు.

లావాటి మహిళ, ఇంకెప్పుడు ఇలా జరగదని ప్రామిస్ అంటూ చెప్పుకొస్తుంది.

కీర్తి ఒక్క సారిగా వెనక్కి తిరిగి పెద్ద గొంతుతో "ఇప్పుడు జరిగింది కదా...." అని అరిచింది.

ఒక్క సారిగా గది మొత్తం సైలెంట్ అయి పోయింది.

కీర్తి గంభీరంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనం లాంటి తన కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి "ఇప్పుడు జరిగింది కదా" అని సైలెంట్ గా కాని అంతే దర్పంగా అడిగింది.

గదిలో ఎవరూ మాట్లాడలేక పోయారు.

కీర్తి "రాజ్ సోలుషన్స్.... నా భర్త సుధీర్ రాజ్ కి తన తండ్రి సుదర్శన్ రాజ్ ఇచ్చాడు, దీని ఫారెన్ బ్రాంచ్ ని అక్కడే ఉండి నిర్వహిస్తూ తన భార్య అయిన నాకు దూరంగా అక్కడే ఉంటున్నాడు, ఎందుకోసం... కొత్త ప్రాజెక్టులు వస్తాయి మన ఎంప్లాయిస్ కి చేతి నిండా పని ఉండాలి, శాలారీ టైం కి పడాలి అని ఆలోచన.... కాని మీరేం చేస్తున్నారు.... కాలేజ్ లో మీ జూనియర్ ని పిలిచి ఇక్కడ ర్యాగింగ్ చేయాలని అనుకున్నారు... చెస్.... షేం ఆన్ యు..." అంది.

శైలజ వైపు ముగ్గురు దీనంగా చూశారు. శైలజ తల దించుకొని అలానే ఉంది. 

కీర్తి "మీ ముగ్గురు మీ వర్క్ వేరే వాళ్ళకు అసైన్ చేసి వారంలో ఖాళీ చేసి వెళ్లి పోవాలి, అబ్బాస్ వీళ్ళ ముగ్గురు దగ్గర రిజిగ్నేషన్ లు తీసుకొని ప్రాసెస్ చేయించు..."

అబ్బాస్ "అలాగే మేడం..." అని బయటకు వెళ్లి పోయాడు.

లావాటి మహిళ నోరు తెరిచి "మేడం" అంది.

కీర్తి "అవుట్" అంది.

ముగ్గురు బయటకు వెళ్ళడం కోసం డోర్ దగ్గరకు వెళ్ళారు.

కీర్తి "ఆ అమ్మాయి మీరు ర్యాగ్ చేసిన అమ్మాయి (నిషా) రేసుం నా దగ్గరకు పంపండి" అంది.

లావాటి మహిళ "సరే మేడం...."

కీర్తి "శైలజ, ఆమెను ప్రాపర్ గా మీట్ అయి సారీ లెటర్ పంపి ఇంటర్వ్యూ లెటర్ పంపించు..." అంది.

శైలజ "ఓకే మేడం..." అని ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో బయటకు వెళ్ళిపోయింది.

బయటకు వెళ్ళాక లావాటి మహిళ, శైలజని చూసి హెల్ప్ చేయమని అడగగా "నువ్వు చేసిన పని ఒకరు రికార్డ్ చేసి ఆన్ లైన్ లో పెట్టారు, టాక్ ఆఫ్ ద టౌన్ అయింది" అంది.

ముగ్గురు వేరే దారి లేదని బాధగా వెళ్లి పోయారు.













[Image: Keerthy-Suresh1.jpg]

Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 13-07-2024, 10:07 PM



Users browsing this thread: 20 Guest(s)