Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"మ్యూచువల్ ఫండ్"
#39
"నిన్నే. ఎవరితోనయినా ఏదన్నా ఉందా?"

అలాంటి ప్రశ్న అడుగుతాడని ఊహించని హారిక ఏం చెప్పాలో తెలీక అలానే ఉండిపోయింది.

"ఏదన్నా ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు"

తల అడ్డంగా ఊపింది.

"అయితే ఏమీ లేదు?"... మళ్ళీ అడిగాడు.

"లేదు సర్. నాకు అలాంటివి లేవు"... కాస్త కోపంగా బదులిచ్చింది.

"కోపం వచ్చిందా?"

"కోపం కాదు సర్. కానీ మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం బాగోలేదు. ఇంటర్వ్యూలో ఇలాంటివి అడుగుతారని నాకు ఎవరూ చెప్పలేదు"

నవ్వాడు.

అర్ధం కానట్టు చూసింది.

"నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం. కాకపోతే"... ఫ్లాస్కులో ఉన్న కాఫీ పోసుకుంటూ ఆగాడు.

"కాకపోతే మా పనికి దానికి సంబంధం ఉంది కాబట్టే అడిగాను"

"అంటే సర్?"

"నువ్వు వచ్చిన ఈ జాబ్ వేకెన్సీ ఎందుకు వచ్చిందో గెస్ చేస్తావా?"

"ఇది రిక్వైర్మెంట్ కాదా సర్, వేకెన్సీనా?"

"యస్"... కాఫీ తాగుతూ... 'అమ్మాయి బుర్ర ఉన్నదే, ఇక తీసుకోవచ్చు'... అన్నాడు.

"గెస్ చెయ్యి"

"ఏమో సర్"

"థింక్"

"ఎవరన్నా రిజైన్ చేసారా?"

"రిజైన్ కాదు రిమూవ్డ్"

"అంటే సర్"

"తీసేసాను"

"ఎందుకు సర్"

"అమ్మాయి. నీ లానే. బి.కాం. బుర్ర బానే ఉంది, బుద్ధే సరిగా లేదు. మూడు వారాలు కూడా పని చెయ్యలేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుట. ఏదో తేడా వచ్చింది, విడిపోయారు. జాబ్ అవసరం ఉంది అని చెప్పింది, మాకు సరిపోతుంది అని తీసుకున్నాం. పని బానే చేసింది. కొత్త నెల స్టార్ట్ అయింది. మాకు అప్పుడు పని ఎక్కువ ఉంటుంది. రెండు రోజులు వచ్చింది, మూడో రోజు రాలేదు. కాల్స్ చేస్తే ఎత్తలేదు, మెసేజెస్కి రిప్లై లేదు, చివరికి ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇల్లెక్కడో నేను వెళ్ళి కనుక్కుని కలిసాను. బాయ్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడుట, జాబ్ వద్దుట, బాయ్ బాయ్ అంది. రెండు రోజులు ఇంటికి వెళ్ళకుండా ఆఫీసులో ఉండి మొత్తం చేసుకున్నాను.

జాబ్ కావల్సినప్పుడు ఉన్నవి, లేనివి కల్పించి చెప్పి, కష్టాల్లో ఉన్నామని, కన్నీళ్ళు వస్తున్నాయని, అవని, ఇవని, ఏవేవో చెప్పి, తీరా పని ఇచ్చాక, ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని, ఇదుగో ఇలా బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడని బాయ్ చెప్పి, మా పని మధ్యలో వదిలేసి, పై వాళ్ళ నించి నాకు తిట్లు పడేలా చేసి. ఇదంతా మళ్ళీ జరగకుండా ఉండటం కోసం, ఏదన్నా ఉంటే ముందే తెలుసుకుంటే దానికి తగ్గట్టు నేను డెసిషన్ తీసుకోవడం కోసం అడిగాను.

ఊహించిన దాని కన్నా ఎక్కువ మందే వచ్చారు, ఐ కెన్ చూజ్ వన్, ఐ హ్యావ్ ఛాయిస్."

తల ఊపుతూ, తల దించుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది.

అలా ఉన్న హారికని చూస్తూ... 'నైస్. బాగుంది. పర్ఫెక్ట్'... అనుకున్నాడు.

తల ఎత్తింది.

"నాకు అలాంటివి లేవు సర్. హెల్థ్ సరిగా లేకపోతే తప్ప నేను లీవ్ పెట్టను సర్. పని దగ్గర కూడా అంతా నేర్చుకుంటాను. మీరు అన్నట్టు టైం కన్నా ముందే చెయ్యడానికే చూస్తాను. ఓవర్ టైం కూడా చేస్తాను. నన్ను నమ్మచ్చు మీరు. మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఈ జాబ్ కావాలి సర్"

"రైట్. సీనియర్ మేనేజర్ గారికి ఒక మాట చెప్పాలి. రేపు చెప్తాను నీకు. బయట డెస్క్ దగ్గర ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళు"

"అలగే సర్. థ్యాంక్ యూ"... తలూపుతూ లేచింది.

"ఒకే"... తలూపుతూ మానిటర్ వైపు చూడసాగాడు.

తలుపు దాకా వెళ్ళి, ఆగి, వెనక్కి తిరిగింది.

ఏంటన్నట్టు చూసాడు.

"నా కోసం మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి మీకు కలగదు సర్. మీ రిక్వైర్మెంట్కి నేను సరిపోతాను అనుకుంటే జాబ్ ఇవ్వండి సర్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను"... చెప్పి తల దించుకుని వెళ్ళిపోయింది.

హారిక వెళ్ళిన వైపే చూస్తూ... 'ఇంత కన్నా ఏం కావాలి. పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. వెల్కం హారికా'... అనుకుంటూ మానిటర్ చూడసాగాడు.

డెస్క్ దగ్గర ఫోన్ నంబర్ ఇచ్చి, బయట ఇంకా సన్నగా చినుకులు పడుతుంటే గొడుగు తెరిచి, జీవితంలో జరిగిన మొదటి ఇంటర్వ్యూ అనుభూతిలోనే ఉండి, కాసేపు నడుద్దాం అనుకుంటూ నడవసాగింది హారిక.
Like Reply


Messages In This Thread
RE: "మ్యూచువల్ ఫండ్" - by earthman - 10-07-2024, 06:23 PM



Users browsing this thread: 8 Guest(s)