Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
113.  ప్లాంట్







క్రిష్ "హేయ్.... ష్... ష్... ష్... "

కాజల్ "ఏమయింది?"

క్రిష్ "మీ చెల్లి ఒక్కతే కూర్చొని బీర్ తాగుతుంది"

కాజల్ "దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా.... ఏంటి ఇది టైం కాని టైం లో..."

క్రిష్ "ఎదో బాధ పడుతుంది..."

కాజల్ "హా... అవునూ... చూస్తూ ఉంటే అలానే ఉంది"

క్రిష్ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.

కాజల్ చిన్నగా "ఎక్కడికి వెళ్తున్నావ్.... దాని జోలికి వెళ్తే నమిలి తినేస్తుంది" అంది.

క్రిష్ నడుచుకుంటూ వెళ్లి, నిషా పక్కనే కూర్చొని తన చేతిలో ఉన్న బీర్ తీసుకొని కొంచెం తాగి దించాడు.

కాజల్ కూడా వచ్చి, నిషాకి మరో వైపు కూర్చొని అదే బాటిల్ ని తీసుకొని కొంచెం తాగింది.

ఎవ్వరు ఏం మాట్లాడడం లేదు.

జస్ట్ మార్చుకొని మార్చుకొని బీర్ తాగుతున్నారు. బాటిల్ అయిపోగానే మరొకటి ఓపెన్ చేస్తూ నాలుగు బాటిల్స్ అవ్వజేశారు.

కాజల్ "ఎందుకే అలా బాధ పడతావ్... నిన్ను మిస్ అయినందుకు వాడు బాధపడాలి... ఎంత బాగుంటావ్... ఎంత హాట్ గా ఉంటావ్... నువ్వు నా మీద లెస్బియన్ ఫీలింగ్స్ ఉన్నాయి అనగానే ఎగిరి గంతు వేసా... ఆహా.... దీన్ని అందాలను పిండి పిప్పిచేయాలని అనుకున్నా... ఐ లవ్ యు నిషా... నువ్వు నా గుండెల్లో ఉన్నావ్...." అంటూ సైడ్ నుండి హాగ్ చేసుకుంది.

నిషా "అవునా.... అయితే వీడు ఎక్కడ ఉన్నాడు" అంది.

కాజల్ తాగిన మత్తులో "మీ అక్కని చూడు రెండు ఉన్నాయ్..." అని రెండు సళ్ళు ఎత్తి చూపిస్తూ ఒక దాంట్లో నువ్వు, ఇంకో దాంట్లో నా క్రిష్ అంటూ నవ్వింది.

నిషా నవ్వు ఆపుకుంటూ "అవి గుండెలు కాదు... సళ్ళు" అంది.

కాజల్ "ఏమో నాకు తెలియదు, నాకు మాత్రం మీ ఇద్దరూ రెండు సళ్ళు" అంది.

నిషా "సళ్ళు కాదు కళ్ళు అంటారు"

కాజల్ "ఏమో నాకు తెలియదు... నాకు మాత్రం సళ్ళే" అంది.

నిషా పెద్దగా నవ్వేసింది.

కాజల్, నిషా తో "అది... ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు" అంటూ బుగ్గలు రెండు పట్టుకొని లాగుతుంది.





కొద్ది సేపటి తర్వాత కాజల్ నిద్ర పోతూ ఉంటే దుప్పటి కప్పి, నిషా వచ్చి కుర్చోగా... క్రిష్ మరో బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ నిషా చేతికి ఇచ్చాడు.

నిషా తీసుకొని తాగి తిరిగి క్రిష్ చేతికి ఇస్తూ "బ్లాక్ అవుట్ లా ఉంది" అంది.

క్రిష్ "హుమ్మ్..."

నిషా కన్నీళ్ళు పెట్టుకుంటూ "ఎవరో నన్ను లాక్కొని వచ్చి, బలంగా భూమిలోకి తొక్కేసి నట్టు. గాలి ఆడకుండా.... వెలుతురూ కనపడక... ప్రాణం పోక... నరకంలా... బ్రతికి ఉండగానే పూడ్చిపెట్టినట్టు.... ఉంది" అంది.

క్రిష్ సైలెంట్ గా బాటిల్ ఎత్తి దించుతూ "హుమ్మ్" అన్నాడు.

నిషా "నీకూ ఎలా అనిపించింది రా.. నాలుగు బ్రేక్ అప్ లు అయ్యాయి కదా..." అంది.

క్రిష్ నవ్వేసి "ఓహ్... నేనిపుడు సీనియర్ ని కదా" అన్నాడు.

నిషా కూడా నవ్వింది.

క్రిష్ బీర్ బాటిల్ పైకెత్తి తాగి కిందకు దించి, ఎదురుగా ఉన్న ఖాళీ బాటిల్స్ ని చూస్తూ "ఈ బాటిల్స్ లో ఉన్న బీర్ మొత్తం ఒకటే కానీ ప్రతి 'బ్రేక్ అప్' డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరిది ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు.... అలాగే ఒకరికే జరిగిన రెండూ కూడా మ్యాచ్ అవ్వవు" అన్నాడు.

నిషా చిన్నగా నవ్వి బాటిల్ ఎత్తి కొంచెం తాగి కిందకు దించింది. 

క్రిష్ "కానీ..." అన్నాడు.

నిషా "హుమ్మ్... కానీ...."

క్రిష్ "లైఫ్ అనేది... 'బ్రేక్ అప్' తర్వాతే మొదలు అవుతుంది అంటారు. ఎందుకంటే సక్సెస్ ఎప్పుడూ ఏ పాటం నేర్పదు.... ఇంకా మనిషిని సోమరి పోతులను చేస్తుంది... పొగరుబోతులను, అహంకారులను చేస్తుంది.... కాని ఫెయిల్యూర్.... లైఫ్ లెసన్ నేర్పిస్తుంది" అన్నాడు.

నిషా "అవునా.... ఏం నేర్పిస్తుందో..." అంది.

క్రిష్ "అది నువ్వే వెతకాలి.... ఎందుకంటే ఇది నీ లైఫ్..."

నిషా సైలెంట్ గా బీర్ తాగి, క్రిష్ చేతికి ఇస్తూ "నాకు కూడా నిద్ర వస్తుంది... వెళ్తున్నా గుడ్ నైట్" అంది.

క్రిష్ పైకి లేచి "నిషా...."

నిషా "హుమ్మ్..."

క్రిష్, నిషా ఎదురుగా నిలబడి "నువ్వు పూడ్చి పెట్టబడలేదు.... నాట బడ్డావు... ఒక విత్తనంలా నాటబడ్డావు..." అని తమ గదిలోకి వెళ్తున్నాడు.

నిషా, క్రిష్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంది.

క్రిష్ "యు ఆర్ నాట్ బురీడ్... యు ఆర్ ప్లాంటెడ్..." అని తమ గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు.

నిషా, క్రిష్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉంది. ఎప్పుడు గుండెల మీద మోసే తన సమస్య ఇప్పుడు ఎందుకో చాలా చిన్నగా అనిపిస్తుంది. 

తన దారిలో సాత్విక్ ఒక మైల్ స్టోన్.... మానసికంగా తను అక్కడే ఉండిపోయింది. తోలి సారి ఆ మైల్ స్టోన్ ఎక్కి నిలబడి మిగిలిన ప్రపంచం చూడసాగింది.

ఫోన్ తీసుకొని యాప్ ని తిరిగి ఇన్స్టాల్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేసింది. 

"హాయ్ ఫ్రెండ్స్.... నేను నిషా.... మీ అందరికి గుర్తు ఉండే ఉంటాను.... నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. గతంలో మార్కెటింగ్ ఫీల్డ్ లో పని చేసిన అనుభవం ఉంది.... ఏదైనా జాబ్ చేయాలనీ అనుకుంటున్నాను... ఏదైనా పర్లేదు.... సాలరీ ఎంత అయినా పర్లేదు... మీ దగ్గర ఏదైనా ఓపినింగ్స్ ఉంటే... ప్లీజ్ నాకు చెప్పండి" 


















[Image: 360_F_485540658_CDz4vEGndpfXKfCrtr0muxsEHe8dyNud.jpg]

Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 13-07-2024, 05:20 PM



Users browsing this thread: 22 Guest(s)