13-07-2024, 05:13 PM
112. నేనున్నాను
సోమవారం మార్నింగ్ కాజల్ నిద్ర లేచేసరికి ఒళ్లంతా నొప్పులుగా అనిపిచి, క్రిష్ వైపు చూసింది. రోజు పొద్దున్నే లేచి రోమాన్స్ చేసే క్రిష్ ఇవ్వాళా మొద్దు నిద్ర పోతున్నాడు. ముందు రెండు రోజులగా పాపం చాలా కష్టపడ్డాడు. పాపం అనిపించి అతని నుదిటి పై ముద్దు పెట్టి బాత్రూంకి వెళ్లి వచ్చింది. వచ్చే సరికి క్రిష్ నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తూ "గుడ్ మార్నింగ్" చెప్పాడు.
కాజల్ "త్వరగా ఫ్రెష్ అవ్వు.... కాలేజ్ ఉంది.. ఇవ్వాళ" అంది.
క్రిష్ "ఉందిలే బోడి కాలేజ్... ఇవ్వాళ వెళ్ళను..." అన్నాడు.
కాజల్ "హేయ్... హేయ్... అలా ఏం కుదరదు..."
క్రిష్ "కుదురుతుంది.... నా కాలేజ్ నా ఇష్టం..."
కాజల్ "నువ్వు నా ఇష్టం.... మూసుకొని లే..." అని అతన్ని పైకి లేపి బాత్రూంలోకి తోసింది.
రెండు నిముషాల తర్వాత
క్రిష్ తలుపు తెరిచి "బేబి.." అన్నాడు.
కాజల్ "ఇవ్వాళ కాదు.... రేపు చూద్దాం.."
క్రిష్ "హే.. అది కాదు.."
కాజల్ "ఏంటి?"
క్రిష్ తల గీక్కొని, మళ్ళి కోపంగా "నీ యంకమ్మా.... నువ్వు అనవసరంగా గుర్తు చేశావ్... నీ వల్ల నేను మర్చి పోయాను" అని తలుపు విసురుగా వేసుకున్నాడు.
కాజల్ క్రిష్ ని చూసి పెద్దగా నవ్వుకుంది.
క్రిష్ స్నానం చేసి వచ్చి రెడీ అయి వచ్చి ఇద్దరూ బయటకు వచ్చారు.
ఇల్లు ఎప్పటిలా కాకుండా తేడాగా ఉంది. అది తేడాగా కాకుండా నిన్న తాగి పడేసిన బీర్ బాటిల్స్ అలానే ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సిన బ్రేక్ ఫాస్ట్ లేదు.
ఎదో ఇంట్లో లేనట్టే...
కరక్ట్ గా చెప్పాలంటే, కళ లేనట్టు అసలు జీవమే లేనట్టు అనిపించింది.
అదంతా నిషా ఇంట్లో లేనట్టే అనిపించే సరికి, ఇద్దరికీ నిషా అప్పుడు గుర్తుకు వచ్చింది.
కాజల్ పరుగుపరుగున నిషా బెడ్ రూమ్ దగ్గరకు వెళ్లి కంగారుగా "నిషా..." అని అరిచింది.
డోర్ క్లోజ్ చేసి గడి వేసి ఉంది. కాజల్ కంగారుగా తలుపు కొడుతూ "నిషా... నిషా... " అని అరుస్తూనే ఉంది.
క్రిష్ ని చూస్తూ కంగారుగా "క్రిష్... క్రిష్... నిషా ఎప్పుడు తలుపు గడియ పెట్టుకోదు... ఒక సారి చూడు" అంటూ ఏడుస్తుంది.
క్రిష్ కూడా పెద్ద పెద్దగా "నిషా..." అని అరిచి తలుపు కొడుతూ... ఫోన్ నుండి నిషా ఫోన్ కి ఫోన్ కూడా చేస్తున్నాడు.
క్రిష్ కి కూడా డౌట్ వచ్చి తలుపుని భుజంతో తలుపునూ కొడుతున్నాడు.
ఇంతలో డోర్ ఓపెన్ అయి నిషా బయటకు వచ్చి ఆవలిస్తూ ఉంది.
కాజల్, నిషాని హాగ్ చేసుకొని ఏడుస్తూ "ఏం కాదు... నీకేం కాదు... సాత్విక్ లేక పొతే మేమున్నాం... నేను ఉన్నాను... క్రిష్ ఉన్నాడు.... లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాము.... నువ్వు సాత్విక్ కోసం బాధ పడొద్దు" అంది.
క్రిష్ ఇద్దరినీ చూస్తూ ఉన్నాడు. కాజల్ ని ఇంత టెన్షన్ గా అతను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు.
కాజల్ "వాడు పోతే పోయాడు... మేమున్నాం" అంది.
నిషా "వాడు ఎప్పుడో పోయాడు... మీరింకా ఎందుకు ఆఫీస్ కి వెళ్ళలేదు"
క్రిష్ ముందుకు వచ్చి నిషా నుదిటి పై చేయి వేసి "ఎలా ఉంది" అన్నాడు.
నిషా "రేయ్ ఆపండ్రా.... బాబు.... ఒళ్ళు నొప్పులుగా ఉండి... పడుకుంటే... మీరెంటి అసలు..." అని విసుక్కుంది.
కాజల్ మాత్రం నిషాని హాగ్ చేసుకునే ఉంది.
నిషా విసురుగా కాజల్ ని తోసేసి "ఓయ్.. ఏంటి నీ ఓవర్ యాక్షన్... పో.. ఇక్కడ నుండి... నాకు నిద్ర వస్తుంది" అంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ వెళ్ళిపోయారు.
కాజల్ "నిషా ఎప్పుడు బయట పడలేదు... కానీ తను బాధ పడుతుంది... నాకు తెలుసు" అంది.
క్రిష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, కాజల్ చెబుతూనే ఉంది.
క్రిష్ కాజల్ ని ఆఫీస్ లో డ్రాప్ చేసి కాలేజ్ కి వెళ్ళిపోయాడు.
తలపు వేయగానే నిషా బెడ్ పై పడుకొని అలానే ఉంది. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తానూ చూసుకుంటే ఎవరినో చూసినట్టు అనిపిస్తుంది.
చెరిగిపోయిన జుట్టు, బ్రేక్ ఫాస్ట్ చేయకుండా, తినకుండా ఒక డల్ జీవితం గడుపుతున్నట్టు అనిపిస్తుంది.
ఆలోచనలు అన్ని పక్కకు నెట్టేసి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చింది.
కళ్ళు తెరిచి ఫోన్ చూడగానే సమయం మధ్యానం ఒంటి గంట. కడుపులో ఆకలి వేస్తుంది, గబా గబా పైకి లేచి స్నానం చేసి డ్రెస్ చేసుకొని బయటకు రాగానే డైనింగ్ టేబుల్ మీద వంట కనపడింది.
ఆ పక్కనే ఒక స్లిప్ "నీ కోసమే వండాను. ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా తిను..." అది చేతిలోకి చూడగానే తన అక్కని తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి.
తన అక్క చెప్పింది అబద్దం కాదు. సాత్విక్ వెళ్ళిపోయాక తనలో మార్పు వచ్చింది డిప్రెషన్ లో ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. బయటకు బాగానే ఉన్నా లోపల లోపల ఏడుస్తూ ఉంది.
ఎవరికీ తెలియదు అనుకుంది కాని అక్కకు మొదటి నుండి తెలుసు... తానూ ఎప్పుడు గమనిస్తూనే ఉంది అనిపించగానే అదోలా అనిపించింది.
ఫుడ్ కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకోగానే ఉప్పగా అనిపించి వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తి ఊసేసి నీళ్ళతో నోటిని కడుక్కున్నా నోటి పై ఆ ఫీలింగ్ ఇంకా పోలేదు.
సడన్ గా క్రిష్ మీద జాలి వేసింది అలాగే నవ్వు కూడా వచ్చింది "చచ్చాడు వెధవ.. " అనుకుని నవ్వుకుంది.
ఇంతలో ఫోన్ మోగింది ఎదో మెసేజ్ వచ్చినట్టు, ఫోన్ చూడగా క్రిష్ నుండి... "ఫుడ్ ఆర్డర్ పెట్టాను.. తినేసేయ్... జాగ్రత్త... మీ అక్క వండిన వంట పారెయ్... అడిగితే తిన్నా అని చెప్పూ..." అని ఉంది.
క్రిష్ కి రిప్లై పెట్టింది "ఎందుకు క్రిష్... ఫుడ్ బాగానే ఉంది కదా.."
క్రిష్ "బాగుందా.... వండేటపుడు నేను పక్కనే ఉన్నాను.. నేను ఏదైనా చెబుతుంటే... సైలెన్స్ అని నా నోరు మూయించింది" అని పెట్టాడు.
ఆ రిప్లై కి నిషా నవ్వుకొని "ప్రేమతో చూడు క్రిష్.. ఫుడ్ ఎంత బాగుందో..." అని పంపింది.
క్రిష్ "ప్రేమగానే నీకూ నాకు మాత్రమే వండింది, తను మాత్రం ఆఫీస్ లో తింటుంది అంట..." అని పంపాడు.
నిషా "ప్రేమ ఉంటే... ఉప్పగా ఉన్నా తియ్యగానే ఉంటుంది"
క్రిష్ "నువ్వు ఆల్రెడీ టేస్ట్ చూసావ్ అని అర్ధం అయింది... మూసుకొని ఆర్డర్ పెట్టింది తిను..."
నిషా నాలుక కరుచుకొని "ఓకే బాయ్..." అని పెట్టింది.
క్రిష్ "ఒక్క వారం ఎక్కడికైనా వెళ్దామా.. ఫ్రెష్ ఎయిర్... మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఆలోచించు.." అని పంపాడు.
అయిదు నిముషాలు అయినా రిప్లై రాలేదు.
నిషా ఆ ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ "నన్ను ఇష్టపడుతున్న వాళ్ళను వదిలేసి నేనంటే అసలు ఇష్టమే లేని వ్యక్తుల గురించి ఆలోచించడం వేస్ట్" అనుకుంటూ పైకి లేవగానే క్రిష్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది.
నిషా అది తీసుకొని తినేసి, పేపర్ వెస్ట్ బయట పడేసింది. సోఫాలోనే నిద్ర పోయింది.
కళ్ళు తెరవగానే ఎదురుగా కాజల్ కోపంగా తననే చూస్తుంది. వెనక క్రిష్ సైగ చేస్తున్నాడు. ఫుడ్ పడేయలేదు అని.... నిషా అబ్బా అనుకుంది.
కాజల్, నీ కోసం కష్ట పడి వండితే... తిన కుండా ఇలా ఉంటావా.... ఇలా అయితే ఎలా... అని అరుస్తూ మధ్య మధ్యలో ఎంత బాగా వండాను అని తనని తాను పోగుడుకుంటూ అంటూ క్రిష్ వైపు చూసింది.
ఆ గోడ మీద పిల్లి లాగా క్రిష్ ఎక్సలెంట్ గా ఉంది నీ వంట అంటూ ధమ్స్ అప్ సింబల్ చూపించాడు. కాజల్, నిషాని తిట్టినా తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంది. నిషా కోపంగా క్రిష్ వైపు ఉరిమి చూసింది... క్రిష్ తల దించుకున్నాడు.
నిషా విసుగ్గా బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. కాజల్ బయట అరుస్తూనే ఉంది. నిషా మంచం పై పడుకుని అలానే కళ్ళు మూసుకుంది.
కాసేపు తలుపు కొట్టి కాజల్ విసుగ్గా వెళ్ళిపోయింది.
రాత్రి ఎప్పటికో మెళుకువ వచ్చి చూసింది. బయటకు వెళ్లి చూస్తే... డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది. చూస్తూ ఉంటే హోటల్ నుండి తెప్పించి నట్టు అనిపించింది.
కాని ఇప్పుడు తినాలని కాదు తాగాలని అనిపిస్తుంది.
ఒక మగాడు అయినా ఆడది అయినా ఎక్కువ ఓపెన్ అయ్యేది తన పార్టనర్ కి మాత్రమె. వాళ్లతో ఎమోషనల్ గా కనక్ట్ అవుతారు.
డిప్రేస్సేడ్ పర్సన్స్ ని బయట పడేయాలంటే అది పార్టనర్ వల్ల సాధ్యం అవుతుంది. అలాగే పార్టనర్ వదిలి వెళ్ళిపోతే లేదా మోసం చేస్తే... రెండో వారు డిప్రేస్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.