Thread Rating:
  • 13 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#33
నటాషా వాళ్ళ రెలెటివ్స్ గెస్ట్ హౌస్ లో వీళ్ళు ఉండటానికి ఎరేంజ్స్ంట్స్ చేశారు

అందరూ లోపలికి వెళ్ళారు....

ఖరీదైన ఫర్నిచర్... చాలా మంది పనివాళ్ళు... బిందు చుట్టూ చూసి..

"వావ్!! ఫెంటాస్టిక్... ఏమే మీ చుట్టాలు బాగా సౌండ్ పార్టీ నా?? అని అడిగింది పెద్ద వాయిస్ తో.

విశాల్ 'రియల్లి... ఇట్స్ సూపర్... అనగానే...అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు...

నటాషా ' స్వప్న! నీకు నచ్చిందా?? అని అడిగింది తను భుజంపై చేయి వేసి..

స్వప్న 'మ్... చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు.. చాలా బాగుంది... అన్నది.

రవి 'అవును.. నటాషా! నాకో డౌట్..మీ రెలిటివ్స్ అన్నావ్ కదా!!...వీళ్ళకి ఎవరైనా అబ్బాయి వుంటే చెప్పు....బిందూని ఇచ్చి పెళ్లి చేద్దాం...

బిందు ' నాకు ఒకే...ఈలోపు ఒకతను వచ్చి 'నటాషా' తో.. బాగున్నారా మేడమ్!! అని అడిగాడు.

నటాషా 'బాగున్నాను.. అంకుల్... మీరు ఎలా వున్నారు?? అని అడిగింది నవ్వుతూ..

అతను 'నేను.. బాగున్నా మేడమ్... మీరు చెప్పినట్లే మీ అందరికీ రూమ్స్ ఎరేంజ్ చేశా....అలాగే మీరు వున్నని రోజులు చుట్టూ వున్న ప్రదేశాలు చూడటానికి...

"మిని బస్సు" ఒకటి ఎరేంజ్ చేశా.. అని చెప్పాడు..

నటాషా 'థాంక్యూ!! అంకుల్... అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో.. "ఓకే.. గైస్... లేడీస్ అంతా పైన...

జెంట్స్ అంతా కింద

అందరూ ఫ్రెష్ అయ్యి... రండి... డిన్నర్ చేద్దాం..

అందరూ పొలో మంటూ వెళ్ళి పోయారు.. స్వప్న, బిందు, నటాషా ఒక రూమ్ లో కి వెళ్ళారు. చాలా నచ్చేసింది... స్వప్నకి ఆ రూం.. విండో తీసింది.. దూరంగా సముద్రం.. చల్లటి గాలి తనని తాకింది... మనస్సంతా హాయిగా అనిపించింది... బిందు 'ఏంటి స్వప్న!!! చాలా హ్యాపీగా వున్నావ్. స్వప్న 'అవును... చాలా... అంటూ బిందు ని గిరాగిరా తిప్పింది.

తరువాత అందరూ లైట్ గా అందరూ లైట్ గా డిన్నర్ ముగించారు .

స్వప్న శృతి' కి వీడియో కాల్ చేసింది..

చాలా సేపు మాట్లాడుకున్నారు.
పక్కనుంచి నటాషా ' శృతి... రేపు మీ అక్కకి పెళ్ళై వెళ్ళిపోతే... అప్పుడు ఏం చేస్తావ్???

శృతి 'నేను.. వెళ్తా .. అక్కతోనే వుంటా... అన్నది...

బిందు 'అబ్బో... అది చూస్తా... మీ అత్త కి తెలిసిన వాళ్ళు కాబట్టి ఓకే...
''''ఒకవేళ తను కాకుండా ఇంకేవెరైనా అయితే...నిన్ను రానివ్వకుండా''''

కనీసం మీ అక్క ఎక్కడుందో తెలియకుండా.. దాచేస్తే... అప్పుడు ఏం చేస్తావ్??? స్వప్న ఆశ్చర్యంగా చూసింది.

శృతి 'అప్పుడా??? వాడిని వెతికి పట్టుకొని .. శృతి అక్కని ఎందుకు ఎత్తుకొచ్చానురా!!! అంటూ భయపడేలా చేస్తా... అన్నది ..

నటాషా 'నీకు అంత శ్రమ లేకుండా.. మీ కాబోయే బావ చూసుకుంటాడు లే.. అంటూ నవ్వింది..

శ్రుతి ' సరే ఉంటా..అక్క అని ఫోన్ కట్ చేసింది..
అందరూ పడుకున్నారు..

అక్కడంతా విపరీతమైన మంచు .

చుట్టూ ఏమి కనపడటం లేదు..

ఒకమ్మాయి పరిగెడుతోంది..

తన వెనుకే ఒకతను వెంబడిస్తున్నాడు.. ఆ అమ్మాయి.. కి చెట్టు తగిలి కింద పడిపోయింది .

ఆ అబ్బాయి వచ్చి..

ఆ అమ్మాయి చేయి పట్టుకొని పైకి లేపాడు..

ఆ అమ్మాయి భయపడుతూ... 'ప్లీజ్!! నన్ను వదిలేయండి.. అని బ్రతిమాలాడుతోంది...

ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పైకి లేపి భుజాన వేసుకుని.. తన జీప్ లో పడేసి.

. "స్వప్న! ఇంకెవ్వరూ నిన్ను కనిపెట్టలేని ప్లేస్ కి తీసుకెళ్తున్నా.. అంటూ ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు..

నిద్రపోతున్న ఒక్కసారిగా స్వప్న గబుక్కున లేచి కూర్చుంది.. చెమటలు పట్టేశాయి.

పక్కనే ఫ్రెండ్స్ ఇద్దరూ మంచి నిద్రలో వున్నారు..

'ఛా!!! ఏంటి ఈ కల! అంటూ బెడ్ దిగి..

బాల్కనీ లో కి వెళ్ళింది.. చల్లటి గాలి వీస్తోంది.. అక్కడే ఉన్న చైర్ లో కూర్చుంది... ఫస్ట్ టైం... అమ్మ, శృతి ఇద్దరూ లేకుండా వుండటం.. ఏదో వెలితిగా వుంది..

అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంటే.. లేచి వెళ్ళి చూసింది.

అత్త కాలింగ్.."5.15....

ఇదేంటి అత్త ఇంత ఎర్లి మార్నింగ్ కాల్ చేసింది... అనుకుంటూ లిఫ్ట్ చేసింది..

సుచిత్ర ' స్వప్న '  లేచావా!!!

స్వప్న 'నేను లేచానని నీకు ఎలా తెలుసు??? అత్తా... అని అడిగింది ఆశ్చర్యంగా..

సుచిత్ర 'అది.. అది... ఆ.. కొత్త ప్లేస్ కదా... సేఫ్ గా వున్నావో లేదో అని ..

స్వప్న 'ఏంటి!! సేఫ్ అంటున్నావ్... అయామ్ నాట్ ఎ కిడ్ అంటూ నవ్వింది...

సుచిత్ర 'నాకు ఎప్పటికే చిన్న పిల్లవే... సరే....ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నాకు టచ్ లో వుండు..

ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకు....నీ ఫ్రెండ్స్ ని వదలకు.. అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

స్వప్న 'ఎంటో... అత్త ఎందుకు ఇంతలా జాగ్రత్తలు చెప్తోంది.. అంటూ రెడి అవ్వటానికి వెళ్ళింది..

అందరూ 8  గంటలకి టూర్ బస్ ఎక్కారు..

ఆటలు, పాటలు విపరీతంగా అరుపులతో మొదలైంది జర్నీ..

ఆరోజు అరకు.... వెళ్ళారు.. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూశారు .. ఆరోజు మధ్యాహ్నం...

లాస్య 'సుచిత్ర' కి ఫోన్ చేసింది. సుచిత్ర 'లంచ్... అయ్యిందా?? లాస్య.. అని అడిగింది

లాస్య 'హా! మా... అయ్యింది మామ్... ఒకసారి స్వప్న ని పిలువు.... అని అడిగింది..

సుచిత్ర గత్తుకుమన్నది...

వెంటనే 'తను బయటకు వెళ్ళింది...కాదు నేనే పంపాను...

లాస్య ' అవునా..పోని వచ్చిన తరవాత ఐనా

సూచి ' ఈవెనింగ్... కాదు. "రాత్రికి వస్తుంది.. వచ్చాక నీకు కాల్ చేయిస్తా సరేనా!!

లాస్య ' సరే మా!!ఉంటా అని ఫోన్ కట్ చేసింది..

స్వప్న వాళ్ళు రాత్రికి మళ్ళీ గెస్ట్ హౌస్ కి చేరారు.. ఫుల్ గా అలసిపోయారు..

స్వప్న 'సుచిత్ర' కి కాల్ చేసి... ఆ రోజంతా ఏం చేసింది చెప్పింది.

&&&

నెక్స్ట్ డే మార్నింగ్...

'సింహాచలం, వైజాగ్ లోకల్ గా అన్నిచూసి బీచ్ కి వెళ్ళారు.. ఫుల్ ఎంజాయ్ చేశారు.. ఫ్రెండ్స్ ఐదుగురు .. ఇసుకలో కూర్చున్నారు. స్వప్న 'రియల్లీ... గైస్.. ఐయామ్ సో హ్యాపీ.. మీ వలనే... మీరు ఈ టూర్ ప్రోగ్రాం పెట్టకపోతే.. నేను చాలా మిస్ అయ్యేదాన్ని...

బిందు 'ఆ ఆనందం అంతా నీ ఫేస్ లో కనపడుతుంది.. అయినా అంకుల్ ఎందుకు హిట్లర్ లా రూల్స్ పెట్టాడు..

విశాల్ 'ఎన్ని పెట్టిన శృతి లైట్ లే....

స్వప్న 'చూడండి...మా నాన్న ఏం చేసినా మా మంచికే... కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ అంతే....

నటాషా 'అందుకే నువ్వంటే ఇష్టం.. ప్రతి మనిషిలో మంచే చూస్తావ్.. అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది..

రవి, విశాల్ వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళారు..

నటాషా ' స్వప్న!! రియల్లీ లవ్ యు బంగారం.. నేనే అబ్బాయిని అయితే... నిన్ను పెళ్లి చేసుకునేవాడిని...

బిందు 'మరి నన్ను... అంటూ బుంగ మూతి పెట్టింది ...

నటాషా 'నువ్వు స్వప్న అంత కాకపోయినా బాగానే వుంటావ్....కానీ మంచితనం లో తన సరౌండింగ్స్ లో మనం వుండలేము.

బిందు 'అది... నిజమే అందుకే ఆరోజు.. అంటూ.. ఏదో చెప్పబోతుంటే

స్వప్న కళ్ళతో సైగ చేసింది.... వద్దంటూ..

బిందు ఆపేసింది.

(ఇది జరా గుర్తు ఎట్టేసుకోండి).. ఆరోజు మాత్రం చాలా హ్యాపీగా జరిగింది.

నెక్స్ట్ డే...లంబసింగి... వెళ్ళారు...

కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర.... వీళ్ళు బస్ దిగేసరికి..

కమ్ముకున్న పొగమంచు.

ఈడ్చికొట్టే అతి చల్లని గాలులు..

దూరంగా... ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.. భలే నచ్చేసింది స్వప్నకి.... చిన్న పిల్లలా పరిగెత్తింది... రవి ' స్వప్న ఆగు.. అన్ని వేరు. ఇది వేరు.. చూడు మంచు ఎలా కురుస్తుందో... కొంత దూరం వెళ్తే... నువ్వు కనపడను కూడా కనపడవ్... అంటూ అందరితో... ఎవరూ ఎక్కడికీ పరిగెతకండి... కలిసే వెళదాం .. అంటూ చెప్పగానే.. అందరూ 'ఓకే.. అంటూ పెద్దగా అరిచారు..

స్వప్న కూడా ఆగింది....అందరూ సెల్ఫీలు దిగుతూ..

అలా రెండు గంటలు గడిచాక... తాజంగి రిజర్వాయర్ దగ్గర బోట్ షికారు కి వెళ్ళారు ..

ఫుల్ ఎంజాయ్...

ఒక గంట తర్వాత. ఘాట్ రోడ్డు దగ్గర ఫోటోలు దిగుతున్నారు... అప్పుడే జరిగింది... ఓ ఇన్సిడెంట్... ఒక అతని కారుని లారి వచ్చి ఫాస్ట్ గా ఢీ కొట్టింది.. ఆ కారు ఫల్టీలు కొట్టి దూరంగా పడింది..

అందరూ కంగారుగా పరిగెత్తారు..

లారి డ్రైవర్ బాబు కూడా దిగి పరుగో పరుగు.

అందరూ చూస్తున్నారు కానీ దగ్గరకు వెళ్ళటం లేదు.

కాలేజ్ పిల్లకాయలు మాత్రం పోలోమంటు వచ్చారు..

బట్ కార్ దగ్గరికి వెళ్ళింది మాత్రం రవి స్వప్న మాత్రమే...

కారులో అతను స్టీరింగ్ మీద పడిపోయి వున్నాడు.. తల నుండి బ్లెడ్ కారుతోంది.

స్వప్న కారు డోర్ తీస్తుంటే .

బిందు 'ఆగు... స్వప్న... మనకెందుకు??? అని అరిచింది..

స్వప్న చుట్టూ చూసింది..

కాలేజీ ఫ్రెండ్సే కాదు... చాలా మంది ఆగిపోయారు..

స్వప్న 'రవి' తో.

'అంబులెన్స్ కి కాల్ చేయి... అన్నది .. రవి కాల్ చేశాడు..

ఈ లోపు స్వప్న కారు డోర్ తీసి అతని తలకు చున్నీ కట్టింది...

నటాషా 'ఇంక తను వినదు.. పదండి హెల్ప్ చేద్దాం.. అనగానే

బిందు,విశాల్ ఇంకో ముగ్గురు వచ్చారు..అతన్ని బయటకు తీశారు..

అంబులెన్స్ వచ్చింది .

అతన్ని తీసుకెళ్ళుతుంటే..

స్వప్న 'ఏ హాస్పిటల్??? అని అడిగింది .. కాంపౌండర్ ఎగాదిగా చూసి ..

"ఆ... ఏది దగ్గర గా వుంటే అది... అంటూ నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇచ్చాడు..

రవి 'చూడండి భయ్యా! ఎందుకంత పొగరుగా సమాధానం చెప్తున్నారు??? అని అడిగాడు ..

అతను 'ఇతను మీకు ఏమౌతాడు???

స్వప్న 'ఏం కాడు... అతను ఎవరో కూడా మాకు తెలియదు.. యాక్సిడెంట్ అయ్యింది అని మీకు ఫోన్ చేశాం...

అతను 'కదా!! అంతటితో మీ పని అయిపోయింది. ఇక మేము చూసుకుంటాం.. అంటూ లోపలికి ఎక్కాడు.

అంబులెన్స్ గా ఫాస్టుగా వెళ్ళి పోయింది...

స్వప్న డ్రెస్ అంతా బ్లెడ్ అంటుకుంది....

బిందు 'అయ్యో! ఇప్పుడెలా??? అంటుంటే..

స్వప్న 'ఏం పర్లేదు... ఎక్కడైనా షాప్ వుంటే ఇంకో డ్రెస్ కొనుక్కుంటా.... అన్నది..

ఈలోపు ఇంకో ఇద్దరు అమ్మాయిలు డ్రెస్ తెస్తాం.. అని చెప్పి వెళ్ళారు ... రవి ఫోన్ మోగింది..

రవి మాట్లాడి...

'గైస్!!! ఇందాక యాక్సిడెంట్ కేసు... అతనికి దెబ్బలు బాగా తగిలాయి. దగ్గరలో వున్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు.. అది ప్రైవేటు హాస్పిటల్.. అతనికి సర్జరీ అవసరం అంటా....

మనకి ఫోన్ చేశారు.. మనం ఏదైనా హెల్ప్ చేయగలమెమో అని అడిగాడు...

స్వప్న వెంటనే... నా ఎకౌంటు లో వన్ లాక్ వుంది... పదా అంటూ కట్టేద్దాం అనగానే..

విశాల్ ' స్వప్న.. ఊరుకో.. అతనెవరో తెలియదు ....యాక్సిడెంట్ అయ్యింది.. హాస్పిటల్ కి పంపాము..

తరువాత మనకి అనవసరం.....మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్లు కేసులు అంటూ... మన ప్రాణాల్ని తీస్తారు.. అన్నాడు..

దాదాపు అందరు వద్దనే అన్నారు..

స్వప్నకి, రవికి ఏం చేయాలో తోచలేదు..

బిందు 'సరే.. పదండి. లంచ్ టైం అవుతోంది... అంటూ అందరిని లాక్కెళ్ళింది..

స్వప్న తన ఫోన్ లో సిగ్నల్ లేదని రవి ఫోన్ తీసుకుంది..

"పక్కకి వెళ్ళి ఇందాక ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఇచ్చేసింది....

ఈలోపు ఒక ఫ్రెండ్ 'డ్రస్' తెచ్చి ఇచ్చింది...

స్వప్న 'మీరు కానియ్యండి... నేను డ్రెస్ చేంజ్ వస్తాను.. అంటూ వెళ్ళిపోయింది..

వీళ్ళకి దూరంగా వెళ్లి...

ఆ నెంబర్ కి కాల్ చేసింది....ఆ యాక్సిడెంట్ జరిగిన అతన్ని ఎక్కడ అడ్మిట్ చేశారో అడిగి..

ఆటో పిలిచింది....అతనికి ఆ అడ్రస్ చెప్పింది.. పది నిమిషాలలో... అక్కడికి చేరుకుంది... అక్కడ రిసెప్షన్ లో.. వివరాలు అడిగింది..

వాళ్ళు డీటెయిల్స్ చెప్పి...30,000/-

మరో ఆలోచన లేకుండా...వెంటనే తన కార్డ్ తో స్వైప్ చేసింది...

డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అక్కడే కూర్చుంది.. అరగంట తర్వాత రిసెప్షనిస్ట్ వచ్చి..

"ఆపరేషన్ సక్సెస్ అని చెప్పింది..

స్వప్న 'నేను.. అతన్ని ఒకసారి చూడొచ్చా... అని అడిగింది..

రిసెప్షనిస్ట్ తీసుకెళ్ళింది.. అతన్ని ఐ.సి.యు లో వుంచారు.. ఒకసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి చూసింది.. అతన్ని చూసి.. హ్యాపీగా బయటకు వచ్చింది..

తన ఫోన్ రింగ్ అవుతుంటే...

తీస్తూ..ఎదురుగా వస్తున్న అతన్ని గుద్దేసింది... అతను తననే చూస్తున్నాడు..

స్వప్న 'సారి అండి చూసుకోలేదు.. అంటూ వెళ్ళబోయింది.....

అతను ' స్వప్న!!! అని పిలిచాడు సీరియస్ గా..

స్వప్న ఆశ్చర్యంగా 'నేను... నా పేరు... మీకు??? అన్నది..

అతను ' స్వప్న ' ని దగ్గరకు లాక్కొని..

"నువ్వు తెలుసు... నీ పేరు తెలుసు... ఐ లవ్ యూ.. అని హగ్ చేసుకున్నాడు....

స్వప్న ముందు షాక్..వెంటనే అతన్ని తోసేసింది...ఫాస్ట్ గా వెళ్లిపోతుంటే

అతను చెయ్ పట్టుకొని...తన మీదకు లాక్కొని తన కళ్ళలోకి చూసాడు..

స్వప్న కళ్ళు భయంగా చూస్తున్నాయి...

చెప్పింది అర్థం అయ్యిందా..

I love you అన్నాడు...

స్వప్న అతన్ని విదిలించుకొని బయటికి వచ్చింది...స్వప్న గుండె సౌండ్ తనకే వినిపిస్తుంది...

తను బయటకు వచ్చేసరికి... తన ఫ్రెండ్స్ అందరూ తన కోసం ఎదురు వస్తున్నారు ...

రవి తనని చూసి...

'బుద్ధుందా??? నీకు... చెప్ప పెట్టకుండా వచ్చేయటమేనా??? అంటూ కోపంగా అడిగాడు..

" స్వప్న " భయంగా వెనక్కి తిరిగిచూసింది..

అతను వున్నాడేమో... అని!! కనపడలేదు కొంచెం టెన్షన్ తగ్గింది. కాని భయం అలాగే వుండిపోయింది..

బిందు 'అమ్మా! త్యాగరాణి... మీ అత్త నీకు ఖర్చు పెట్టుకోవడం కోసం ఇచ్చింది.. ఎమౌంట్.

బట్ నువ్వు ఇలా దారిన పోయే దానయ్య లకి ఖర్చు పెట్టడం కోసం........... కాదు..

స్వప్న బలవంతంగా నవ్వుతూ వెనక్కి చూస్తుంది...

నటాషా ' నువ్వు ఒకే కదా స్వప్న??

స్వప్న 'హ.హ అన్నది...

రవి 'ఏంటి నీ నుదుటన చెమటలు పట్టాయి... అని అడగ్గానే బిందు 'కట్చీఫ్' తీసి స్వప్న నుదురు తుడిచి.. లోపల ఏమైనా చూడకుడనిది ఏమైనా చూశావా??? అని అడిగింది . స్వప్న 'ఏమి లేదు... పదండి అంటూ హడావిడిగా లాక్కెళ్ళింది.. వీళ్ళ బ్యాచ్ బస్ దగ్గరకు వెళ్ళేసరికి.. కాలేజీ ఫ్రెండ్స్ అంతా.. ' స్వప్న... అలా ఎలా వెళ్ళావ్ అంటూ మందలించారు.. స్వప్న అంటే అందరికీ ఇష్టమే మరి

రవి '  లంచ్ చేయలేదు... నువ్వు కనపడకపోయేసరికి. ముందు డ్రస్ చేంజ్ చేసుకురా!!! తిందాం...

బిందు 'నేను వస్తా... పదా... ఈసారి అతనికి మెడిసిన్స్ ఇచ్చి వస్తా అని వెళ్ళినా వెళతావ్ అంటూ లాక్కెళ్ళింది..

అందరూ లంచ్ చేస్తున్నారు..

రవి ఫోన్ మోగింది..

రవి 'హలో!!!

అవతల 'అక్కడ స్వప్న వుంటే ఫోన్ ఇవ్వు...

రవి 'మీరెవరు???

అతను 'తనకి తెలుసు....

రవి 'అచ్చా! మరి తన ఫోన్ నెంబర్ కి చేయొచ్చు గా... నాకు ఎందుకు

అతను 'ఇక్కడ హాస్పిటల్ లో నీ నెంబర్ వుంది... రిజిస్టర్ లో..

తను నెంబర్ లేదు..

రవి కి అర్థం కాలేదు... బట్ ఏదో జరిగింది.. కామ్ గా లేచి పక్కకు వెళ్ళాడు..

'రేయ్! ఎవడ్రా నువ్వు? స్వప్న గురించి నీకు ఎందుకు???

అతను ' వీర..వీర..!!ఇక్కడ...!

........................................
[+] 11 users Like Avengers35's post
Like Reply


Messages In This Thread
Veera - by Avengers35 - 17-06-2024, 09:25 PM
RE: Veera - by sri7869 - 17-06-2024, 09:56 PM
RE: Veera - by dombull7 - 17-06-2024, 10:58 PM
RE: Veera - by hijames - 18-06-2024, 01:05 AM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:01 PM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:02 PM
RE: Veera - by hijames - 18-06-2024, 02:19 PM
RE: Veera - by Avengers35 - 19-06-2024, 12:07 PM
RE: Veera - by hijames - 19-06-2024, 12:33 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 01:41 AM
RE: Veera - by Saikarthik - 20-06-2024, 10:40 AM
RE: Veera - by appalapradeep - 20-06-2024, 11:59 AM
RE: Veera - by sri7869 - 20-06-2024, 07:24 PM
RE: Veera - by hijames - 20-06-2024, 08:24 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 08:33 PM
RE: Veera - by hijames - 20-06-2024, 09:38 PM
RE: Veera - by sri7869 - 20-06-2024, 09:45 PM
RE: Veera - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: Veera - by Avengers35 - 21-06-2024, 08:24 PM
RE: Veera - by Saikarthik - 21-06-2024, 09:18 PM
RE: Veera - by sri7869 - 21-06-2024, 09:43 PM
RE: Veera - by dombull7 - 21-06-2024, 11:29 PM
RE: Veera - by hijames - 22-06-2024, 03:38 AM
RE: Veera - by Avengers35 - 22-06-2024, 09:02 PM
RE: Veera - by sri7869 - 22-06-2024, 09:04 PM
RE: Veera - by hijames - 23-06-2024, 04:30 AM
RE: Veera - by Saikarthik - 23-06-2024, 10:42 AM
RE: Veera - by Avengers35 - 23-06-2024, 07:22 PM
RE: Veera - by hijames - 23-06-2024, 08:11 PM
RE: Veera - by sri7869 - 23-06-2024, 10:28 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 07:31 PM
RE: Veera - by hijames - 08-07-2024, 07:36 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 08:43 PM
RE: Veera - by hijames - 08-07-2024, 09:50 PM
RE: Veera - by sri7869 - 09-07-2024, 05:00 AM
RE: Veera - by Saikarthik - 09-07-2024, 09:00 AM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 09:43 PM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 10:00 PM
RE: Veera - by 3sivaram - 20-07-2024, 10:38 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 06:54 AM
RE: Veera - by sri7869 - 20-07-2024, 10:21 PM
RE: Veera - by Uday - 21-07-2024, 03:04 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 04:23 PM
RE: Veera - by Uday - 21-07-2024, 07:08 PM
RE: Veera - by sri7869 - 22-07-2024, 11:25 AM
RE: Veera - by Avengers35 - 10-08-2024, 10:53 PM
RE: Veera - by sri7869 - 11-08-2024, 01:00 PM
RE: Veera - by vrao8405 - 01-09-2024, 11:49 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 01:36 PM
RE: Veera - by বহুরূপী - 17-11-2024, 05:08 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 05:19 PM
RE: Veera - by sri7869 - 17-11-2024, 06:38 PM
RE: Veera - by Avengers35 - 21-11-2024, 07:59 AM
RE: Veera - by sri7869 - 21-11-2024, 10:23 AM
RE: Veera - by BR0304 - 21-11-2024, 01:41 PM



Users browsing this thread: 1 Guest(s)