08-07-2024, 02:59 PM
(08-07-2024, 02:55 PM)Uday Wrote: నువ్వన్నది కూడా కరక్టే తమ్ముడు, ఏదైనా మనవరకొస్తేగాని తెలియదు, పడ్డవాడికే తెలుసు అందులోని బాధ. నేనూ ఈ మద్య పడ్డాను కానీ ప్రేమలో కాదు, స్కాం లో. దెబ్బకు నేనూహించనంత పోగొట్టుకున్నాను. మూడ్రోజులు అసలు నిద్ర రాలేదు, అస్సలేమీ తినలేదు (మీరు నమ్మితే నమ్మండి), ఏదో రెడీ అవుతున్నాను, డ్యూటికి వెళ్తున్నాను, వస్తున్నాను. కళ్ళు మూసినా తెరచినా పోయిందే గుర్తుకు వచ్చేది, ఇంత సులభంగా ఎలా మోసపోయానా అని, అది కూడా చిన్న మొత్తం కాదు, నేను పదేళ్ళుగా కూడబెట్టిన డబ్బు. ఆ తరువాత నా బెట్టర్ ఆఫ్ స్వాంతనతో తేరుకున్నా. డబ్బులేగా పోయాయి, నేను బ్రతికే వున్నాగా, సంపాదించలేనా మళ్ళీ అని. ఇప్పుడు కూడా గుర్తుకువస్తే బాధగా వుంటుంది, కానీ ఏం చేస్తాం జీవితం అంటే అంతే. పడతాం, లేస్తాం, లేస్తూనే పరుగెడతాం, మళ్ళీ పడతాం..మళ్ళీ రిపీట్. Get going and cheer up. విత్తనం పగిలితేనే కదా మొక్క పుట్టి మహా వృక్షమైయ్యేది.
Ayyo em ayindi anna ela mosapoyav clear ga cheppu memu jagratta ga untam kada