13-07-2024, 05:10 PM
Quote:చిట్ చాట్
ఈ డిస్కషన్ స్టొరీలో ఇస్తాను కాని మర్చి పోతాను ఏమో అని ముందుగా చెబుతున్నాను.
ఇక్కడ రెండు క్యారక్టర్స్ రెండు విషయాలు చెబుతాయి....
క్రిష్.... మరియు నిషా....
క్రిష్ - సెల్ఫ్ లవ్ అని అంటాడు, నిషా ని సెల్ఫ్ డిసేప్షన్ అని అంటాడు.
సెల్ఫ్ లవ్ అంటే తనని తాను ప్రేమించుకోవడం కాదు తనని తానూ పట్టించుకోవడం లేదా గౌరవించుకోవడం.
నేను హ్యాపీగా లేను.. నన్ను నేను సినిమాకి తీసుకొని వెళ్తాను.
నాకు ఈ పాప్ కార్న్ వద్దు... నా హెల్త్ నాకు ముఖ్యం.
టికెట్ తో పాటు టోకెన్ ఇచ్చాడు ఫ్రీ అన్నాడు.... కాని నాకు వద్దు.. నాకు నేను ముఖ్యం.
నాకు బోరింగ్ గా ఉంది... నన్ను నేను ఎంటర్ టైన్ చేసుకోవడం కోసం పార్క్ కి వెళ్తాను.
పార్క్ లో ఎక్కువ సేపు ఉన్నాను, ఇక చాలు ఇంటికి వెళ్తాను. నాకు ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ వస్తే టెంప్ట్ అయిపోతాను.
నాకు బలమైన బాడీ ఇంపార్టెంట్, నన్ను నేను మోటివేట్ చేసుకొని జిమ్ చేస్తాను.
నాకు ఆరోగ్యం ఇంపార్టెంట్, నన్ను నేను డైట్ చేసుకుంటాను, యోగా చేస్తాను.... కంట్రోల్ లో ఉంటాను.
టీ ఆఫర్ చేశారు.... నో చెబుతాను.... వాళ్ళు హార్ట్ అవుతారు.... స్టిల్ నో... బికాజ్ నో మీన్స్ నో...
నన్ను వీళ్లు అవమాన పరుస్తున్నారు.... నేను రియాక్ట్ అవుతాను. రివర్స్ అవుతాను.
మనల్ని కాపాడడానికి దేవుడు రాడు.... ఇది నిజం...
కధలలో చెప్పినట్టు వేరే రూపంలో హెల్ప్ పంపిస్తాడు కూడా అబద్దమే...
మన కోసం అందరి కంటే ముందు మనమే నిలబడాలి... అప్పుడే వేరే ఎవరైనా హెల్ప్ కి వస్తారు, చేస్తారు.
ఇది నిజం..... ఇది మాత్రమె నిజం.....
సెల్ఫ్ డిసేప్షన్ అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం.. పనిష్ చేసుకోవడం... తెలిసి తప్పు చేయడం...
ఎప్పుడు ఏం చదువుకుంటాం.... అలా వెళ్లి కాసేపు ఆన్ లైన్ చాట్ చేద్దాం.....
మనకు క్లాస్ లో ఒక్క సారి వింటే బస్.... వచ్చేస్తుంది... బొచ్చు గాని రాదు.
నా గర్ల్ ఫ్రెండ్ డబ్బులు అడిగింది.... అమ్మ వాళ్ళు తినమని ఇచ్చిన డబ్బులు ఉన్నాయి తనకు ఇచ్చేద్దాం.... ఒక పూట తినకపోతే ఏమవుతుంది లే....
ఆ అబ్బాయి నా న్యూడ్ ఫోటోస్ అడుగుతున్నాడు.... సరే ఇద్దాం... నాకు తన మీద నమ్మకం ఉంది. (వాళ్ళ ఇల్లు కూడా తెలియదు... ఈ పనికిమాలిన దానికి)
బ్రేక్ అప్ అయిన తర్వాత..... లేదా ఎక్సాం ఫెయిల్ అయ్యాక..... లేదా చదువు అయ్యాక జాబు రావడానికి మధ్యలో....
బయటకు వెళ్తే అతను/ఆమె వేరే వాళ్లతో కనిపిస్తుంది, వద్దు ఇక్కడే ఉందాం.
ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయ్యా అని వెక్కిరిస్తారు.. వద్దులే మన ఫెయిల్ అయిన బ్యాచ్ లో కలిసి పోదాం.
అబ్బా ఫంక్షన్ కి వెళ్తే.... జాబ్, జాబ్ అని దొబ్బుతారు.... వెళ్లొద్దు లే....
వీళ్ళను జనరల్ గా మనం పట్టించుకుంటాం, డిప్రెషన్ లోకి వెళ్ళకుండా చూసుకుంటాం....
కాని కొంత మంది (ఫారెన్ లో ఎక్కువ).... డిప్రేస్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు.
ఈ కధలో ఆ డిప్రేస్ పర్సన్..... నిషా....
మొదటి పరిచయం లో.... కాజల్, క్రిష్ ని కలిస్తే.... ఓపెన్ మైండెడ్ గా ఉంది.
కాని నిషా క్లోసేడ్ మైండెడ్ గా ఉంది.
తను తన మానసులోకి ఎవరినీ రానివ్వదు...
ఇలాంటి వాళ్ళు తమను తాము వాల్యూ ఇచ్చుకోరు, తమకు పార్టనర్ వాల్యు ఇవ్వక పోయినా కలిసి ఉంటారు. అలా ఆ పార్టనర్ కి అలుసు అవుతారు.
నిజానికి ఆ పార్టనర్మిమ్మల్ని బ్యాక్ అప్ గా పెట్టుకుంటారు. తనకు సరైన వాళ్ళు దొరికితే నిన్ను వదిలేస్తారు. వాళ్ళు తనని వదిలేశాక మళ్ళి నీ దగ్గరకు వచ్చి సారీ చెబుతారు. మళ్ళి వేరే వాళ్ళు దొరికాక, మళ్ళి నిన్ను వదిలేస్తారు. నువ్వు అలాంటి వాళ్ళకు ఒక బ్యాక్ అప్ వి మాత్రమె...
సెల్ఫ్ లవ్ ........ సెల్ఫ్ డిసేప్షన్ ........ చూడడానికి ఒకేలా కనిపిస్తారు. కానీ వేరు వేరు...
సెల్ఫ్ లవ్ లో పర్సన్ తన బెస్ట్ వర్షన్ కి ట్రావెల్ అవుతాడు.... చిన్నగా అయినప్పటికీ......
సెల్ఫ్ డిసేప్షన్ లో పర్సన్ మంచిగానే కనిపిస్తారు కానీ... తన వరస్ట్ వర్షన్ కి ట్రావెల్ అవుతాడు...
సెల్ఫ్ డిసేప్షన్ మనుషులను ఎవరూ ఏం చేయలేరు... చిన్నపిల్లలు అయితే రెండు పీకీ.... కూర్చో పెడతాం.... టీనేజర్స్ ని పెద్ద వాళ్ళను ఏం చేస్తాం... ఏం చేయలేం...
డోర్స్ లోపల నుండి క్లోజ్ చేసుకొని ఉంటే... ఎవరం ఏం చేస్తాం.... చెప్పండి...
వాళ్ళు ఓపెన్ చేయమని మోటివేట్ చేస్తాం.... తలుపులు తీసి బయటకు వచ్చి రియాలిటీ ని ఫేస్ చేయాలా.. లేదా అందులోనే మగ్గిపోవాలా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది... వాళ్ళను వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటేనే బయట పడగలరు....
సెల్ఫ్ లవ్ అన్నాను కాని ఎవరినీ లవ్ చేయొద్దు అని నేను చెప్పలేదు.
స్వార్ధ పరులు వేరు ....... సెల్ఫ్ లవ్ వేరు.....
సెల్ఫ్ లవ్ చేసుకుంటే.... సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సక్సెస్ కి అదే సూత్రం.
ఆఖరిగా.... సెల్ఫ్ లవ్ అంటే.... ఏకాంతంగా ఉండడం. సెల్ఫ్ డిసేప్షన్ అంటే..... ఒంటరిగా ఉండడం.
ఏకాంతంగా ఉండడం -- ఇక్కడ నాతో నేను ఉన్నాను.
ఒంటరిగా ఉండడం -- మీకు తెలుసు....
![[Image: AdobeStock_245653305-scaled.jpeg]](https://www.ashleytreatment.org/wp-content/uploads/2020/02/AdobeStock_245653305-scaled.jpeg)
![[Image: wpid-sad-broken-heart-for-boyspix-for-sa...ksgkad.jpg]](https://friendshipmaza.files.wordpress.com/2014/11/wpid-sad-broken-heart-for-boyspix-for-sad-broken-heart-boy-2dksgkad.jpg)
ఇక మళ్ళి ఈ కధలో ఈ టాపిక్ డిస్కషన్ ఉండదు...
నిషా స్టొరీ ఇప్పుడే స్టార్ట్ అయింది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them