06-07-2024, 01:10 PM
97. ఎందుకు అంటే... నేను, హీరో ని కాబట్టి....
కేశవ్, క్రిష్ ఇద్దరూ బావ బామ్మర్దులు, ఎక్కువగా రామ్మోహన్ దగ్గర ఉండడంతో అలాగే స్పోర్ట్స్ లో బాక్సింగ్ లో కలిసి పోటీ చేయడంతో మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. కొట్టుకోవడం వాళ్ళ ఇద్దరి మధ్య సర్వసాధారణ విషయం.
కేశవ్, క్రిష్ ని పైకి లేపి అతని చొక్కా గుండీలు సరి చేసి, అతని జుట్టు సారి చేస్తూ... "చూడు... మనసు అంటే ఒకళ్ళకు ఇచ్చేది.... తలా ఒక ముక్క చేసి తలా కొద్ది కొద్దిగా పంచేది కాదు..." రా అని చెప్పాడు.
క్రిష్ అతన్ని తోసేసి చొక్కా గుండీలు పెట్టుకుంటూ, కేషవ్ వైపు కోపంగా చూస్తున్నాడు.
కేశవ్ "రష్, నిన్ను అసలు మనిషిలా కూడా లెక్క వేయలేదు... అందరూ తనని దూరం చేసినపుడు మాత్రమె నీ దగ్గరకు వచ్చింది"
క్రిష్ "నేను వెళ్లి కాపాడాను"
కేశవ్ "హా...."
క్రిష్ "మీరందరూ తనని వదిలేసి చేతులు దులుపుకుంటే... నేను వెళ్లి కాపాడాను..."
కేశవ్ "అయితే..."
క్రిష్ "బ్రదర్ వరస అయ్యే.... సెక్యూరిటీ ఆఫీసర్.... ద గ్రేట్ కేశవ్.... సబ్ ఇన్స్పెక్టర్ గారు.... సొంత తండ్రి రామ్మోహన్... నార్కోటిక్ డిపార్ట్మెంట్... ఎవ్వడు ఏం పీకలేక మూసుకొని ఉంటే... నేను వెళ్లి కాపాడాను... ఒక్కడిని వెళ్లి కాపాడాను"
కేశవ్ సైలెంట్ గా ఉన్నాడు.
క్రిష్ "ఊరికే లవ్ లెటర్ యిచ్చేసి... తనను తీసుకొని నేను లేచిపోలేదు రా.... తనని, తన పసికందుని కిడ్నాప్ చేస్తే... వరంగల్ వెళ్లి అందరిని ఎదిరించి... ఒక్కడిని కాపాడుకొని వచ్చాను... పిల్లాడికి బాగోక రెండు లక్షలు అవసరం అయితే చేతిలో డబ్బులు లేక పోతే... ఒకరిని మోసం చేసి తెచ్చి కట్టాను ఆ డబ్బు... ఆ రెండు లక్షలు.... అప్పుడు కూడా రాలేదు... ఏ పెద్ద వాళ్ళు... రాలేదు.. అవునూ రా హీరో నే.... హీరో నే.... " అని ఆవేశంగా చెబుతున్నాడు.
రెండు నిముషాల్ తర్వాత...
కేశవ్, క్రిష్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని "రేయ్, క్రిష్.... అది కాదు రా.... ఇంత చేశాక కూడా... రష్ ఎక్కడుంది"
క్రిష్ సైలెంట్ అయ్యాడు.
కేశవ్ "ఎక్కడుంది.... చెప్పూ..."
క్రిష్ "..."
కేశవ్ "వెళ్లి పోయింది..."
క్రిష్ "..."
కేశవ్ "నిన్ను వాడుకుంది.... నిజాయితీ... కృతజ్ఞత లేని మనుషులు రా..."
క్రిష్ "..."
కేశవ్ "నీ మంచి కోసమే చెబుతున్నా... నువ్వు మళ్ళి అలా అవ్వకూడదు అని చెబుతున్నా...."
క్రిష్ సైలెంట్ అయ్యాడు. అతని ఆవేశం కూల్ అయి మాములు అయ్యాడు.
రెండు నిముషాల తర్వాత...
ఇద్దరూ పక్కపక్కన కూర్చొని ఉన్నారు. కేశవ్, క్రిష్ భుజం చుట్టూ చేయి వేశాడు.
కేశవ్ "ఇంతకీ ఎవరినీ మోసం చేశావ్.... ఆ రెండు లక్షల కోసం.." అన్నాడు.
క్రిష్ పైకి లేచి నిలబడి కేశవ్ ఎదురుగా నిలబడ్డాడు.
క్రిష్, కేశవ్ చేయి చూపిస్తూ "నీ సెక్యూరిటీ ఆఫీసర్ బుద్ది పోగొట్టుకున్నవ్ కాదు..." అన్నాడు.
కేశవ్ "అది కాదు రా.... రేపు ఏదైనా కేసు గీసు వస్తే... హెల్ప్ చేద్దాం అని...."
క్రిష్ "నా బొక్క చేస్తావ్ రా... నెంబర్ వన్ స్వార్ధ పరుడువి నువ్వు.... నిన్ను అసలు నమ్మ కూడదు..." అన్నాడు.
కేశవ్ "అది కాదు రా... నాకు బామ్మర్దివి రా.. అప్పుడు మేం ఎవరం హెల్ప్ చేయలేదు.... మొండిగా వెళ్ళావ్.... సాధించుకొని వచ్చావ్... ఇప్పటికి నువ్వంటే మా అందరికి మంచి ఫీలింగ్... నువ్వు ఇబ్బందుల్లో పడకూడదు అని... అంతే...."
క్రిష్ "అయినా నేను సార్ట్ అవుట్ చేసుకున్నా లే...."
కేశవ్ "ఎవరో చెప్పను అంటావ్.... అంతేలే ఎంతైనా మేం బయట వాళ్ళం...." అని క్రిష్ వైపు దొంగ చూపు చూస్తున్నాడు. క్రిష్ చెబుతాడు అని అర్ధం అయి, చిన్నగా నవ్వుకుంటున్నాడు.
రెండు నిముషాల తర్వాత...
క్రిష్ "తనే..." అంటూ ఏటో చూస్తూ చెప్పాడు.
కేశవ్ "ఏంటి?" అని ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు.
క్రిష్ కేశవ్ ని చూస్తూ నిలబడ్డాడు.
కేశవ్ పగలబడి నవ్వుతూ "ఏంటి.. అయితే మీ ఇద్దరి పరిచయం మోసంతో మొదలయిందా.... సూపర్ రా బాబు..."
క్రిష్ "నీ సిస్టర్.... రష్ మోసంతో ముగించింది..... కాజల్ తో మోసంతో మొదలయింది..... ఏది బెస్ట్ అంటావ్..." అన్నాడు.
రెండు నిముషాల తర్వాత...
కేశవ్ "రష్ కి నువ్వొక బ్యాక్ అప్ వి... ఇప్పుడు తన మొగుడు ఏమైనా అన్నా, వదిలేసినా నీ దగ్గరకు వస్తుంది... నిన్ను అలా అట్టి పెట్టుకుంది... క్రిమినల్ బ్రెయిన్..." అన్నాడు.
క్రిష్ "ఏం చేయమంటావ్.... దిగిన తర్వాత ఈదడమే.... అలానే ఉంటే మునిగిపోతాం.... రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక తప్పదు బావా... మోయాల్సిందే"
కేశవ్ "ఈ అమ్మాయి ఎలాంటిది? అసలు తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిని, అందులోనూ డబ్బు కోసం మోసం చేసిన వాడిని లవ్ చేయాలని తనకు ఎలా అనిపించింది... హౌ ఈజ్ దిస్ పాజిబుల్..."
క్రిష్ పైకి చూస్తూ "ఎందుకంటే తనొక ఏంజెల్..."
కేశవ్ "అబ్బో...."
క్రిష్, తిరిగి కేశవ్ ని చూస్తూ "నిజంగా తనొక ఏంజెల్..."
కేశవ్ "సరే.... నీ ఏంజెల్ ని జాగ్రత్తగా చూసుకో... ఈషాని కిడ్నాప్ చేయబోయిన ఆ కిడ్నాపర్ ఒక సీరియల్ అఫేండర్... ఒక సైకో లాంటి వాడు... వాడిని మేం రెండు నెలల ముందు వేరే కేసులో కూడా వెతుకుతున్నాం... దొరకడంలేదు"
రెండు నిముషాల తర్వాత...
క్రిష్ "రెండు రోజులు..."
కేశవ్ "ఏంటి?"
క్రిష్ "రెండు రోజుల్లో వాడిని తీసుకొచ్చి నీ ముందు నుంచో బెడతా..."
కేశవ్ "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు"
క్రిష్, నవ్వుతూ లేచి నిలబడ్డాడు.
కేశవ్ "ఇన్వాల్వ్ అవ్వకు... ముందుగా చెబుతున్నా, ఇన్వాల్వ్ అవ్వకు..." అన్నాడు, కాని క్రిష్ నవ్వుతూనే ఉన్నాడు.
కేశవ్ "అసలు నీకూ ఎందుకు రా..."
క్రిష్ ఒళ్ళు విరుచుకుంటూ "ఎందుకు అంటే... నేను, హీరో ని కాబట్టి" అని నవ్వుతున్నాడు.