04-07-2024, 07:50 AM
92. దొరికాడు
కాజల్ "మనం అసలు సంగతి మర్చిపోయాం.... హేయ్ ఈషా అతను నీకూ తెలుసా..... ఎందుకు అలా చేశాడు" అంది.
క్రిష్ కోపంగా ఆమె వైపు చూసి మళ్ళి ఈషా వైపు చూస్తూ "చెప్పండి... అతనెవరు...." అని అడిగాడు.
కాజల్ "నీకూ అసలు అడగడమే చేతకాదు, ఎదో తనే పొడిచినట్టు అడుగుతున్నావ్"
క్రిష్ "పోనీ నువ్వే అడుగు..."
కాజల్, ఈషా వైపు చూసింది.
ఈషా "అతను కౌశల్..... కాలేజ్ లోనా సీనియర్..... లవ్ అంటే..... ఇంట్లో అడగమన్నాను..... మా అమ్మ వాళ్ళ దగ్గరకు పెళ్లి ప్రపోజల్ తీసుకు వచ్చాడు, అమ్మ వాళ్ళకు నచ్చక పోవడంతో వద్దన్నారు.... మా ఇద్దరి మధ్య లవ్ ఏం లేదు.... కౌశిల్ కోపంగా నాతో ఫోన్ లో మాట్లాడాడు. తను అంత పని చేస్తాడు అని అస్సలు అనుకోలేదు. ఐ యామ్ సో సారీ మేడం..." అంటూ ఏడుస్తుంది.
కాజల్ ఆమెను ఓదారుస్తూ ఉంది.
క్రిష్ తన ఫోన్ నుండి ఒక నెంబర్ పేపర్ పై రాసి "తని నాకు తెలిసిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, ఆల్రెడీ చెప్పి ఉంచాను, అలాగే వాళ్ళు రేపు వచ్చి పార్కింగ్ ఏరియా cc కెమెరా ఫుటేజ్ తీసుకుంటారు. మీరు కూడా ఒక సారి మాట్లాడండి"
కాజల్ "వావ్... అప్పుడే ఇదంతా ఎప్పుడు చేశావ్..."
క్రిష్, కాజల్ వైపు కోపంగా చూశాడు.
కాజల్ "నాతో మాట్లాడవా.... కోపమొచ్చిందా... అయినా టూర్ వదిలి ఎందుకు వచ్చావ్.... నన్ను చూడాలని అనిపించిందా.... " అని మాట్లాడుతూనే ఉంది.
ఈషా తన మేడంలోని ఈ కొత్త యాంగిల్ చూస్తూ క్రిష్ వైపు చూస్తూ ఉంది.
క్రిష్ మొహంలో కోపం మెల్లగా తగ్గిపోయి నవ్వు చేరుకుంటుంది.
కాజల్ "అవునూ, నీ ఎక్స్ లలో కూడా ఎవరైనా నన్ను కాని నిన్ను కాని కిడ్నాప్ చేసే వాళ్ళు ఉన్నారా.... ముందే చెప్పూ నాకు అసలే చాల భయం"
క్రిష్ "ఉన్నారు... చాలా పెద్ద విలన్ ఉన్నాడు"
కాజల్ "నీ కంటే పెద్ద విలన్ ఉండరు లే..."
క్రిష్ సైలెంట్ గా "ఒకడు ఉన్నాడు" అని చిన్నగా అన్నాడు.
కాజల్ "అయినా నువ్వు నన్ను మెచ్చుకోవా.... నేను ఒకరిని సేవ్ చేశాను. తెలివితేటలు ఉపయోగించి... కారులో బయటకు వెళ్ళిపోయినట్టు నడుచుకుంటూ లోపలకు వచ్చాను" అంటూ జరిగింది మొత్తం చెప్పింది.
కాజల్ "మీకు తెలిసిన సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పి నాకేమన్నా అవార్డ్ వస్తుందా... బ్రేవరీ అవార్డ్ " అని ఎక్సైటింగ్ నా నవ్వుతుంది.
క్రిష్ "పెప్పర్ స్ప్రే కొట్టాక... డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కారు నడుపుకుంటూ బయటకు ఒక కిమీ వెళ్లి అక్కడ డిక్కీ ఓపెన్ చేసి కాపాడొచ్చు కదా..." అన్నాడు.
కాజల్, క్రిష్ ని కోపంగా చూస్తూ "ఛీ.... సచ్చినోడా... అసలు గ్రాటిట్యూడ్ అనేది కూడా తెలియదు" అంటూ దూరం జరిగింది.
ఈషా వాళ్ళ ఇద్దరినీ చూస్తూ ఉంది.
క్రిష్, ఆమెనూ దగ్గరకు లాక్కొని ఆమె భుజం గాయం చూస్తూ "నీకో మాట చెప్పాలి... ఒక అప్పుడు మా అమ్మ చెప్పిన మాట...."
కాజల్ "చెప్పూ"
క్రిష్ "జీవితంలో అందరి కంటే ముందు ఎవరూ చనిపొతారో తెలుసా"
కాజల్ "హుమ్మ్"
క్రిష్ "ముందు వెనక చూసుకోకుండా గొడవకు దిగే వాళ్ళు.... నీలా...."
కాజల్ "ఛీ... సచ్చినోడా... దూరం ఉండు నాకు.... ఉత్త వెస్ట్ ఫెలో ఈషా..." అంటూ దూరం జరిగింది
క్రిష్ ఆమెను మళ్ళి దగ్గరకు లాక్కొని "ఇంకో సారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే.... నాకు కాల్ చెయ్.... ఈ సచ్చినోడు... నీ కోసం చావగలడు..."
కాజల్, క్రిష్ చెంప మీద కొట్టి "పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మూతి పళ్ళు రాల్తాయి.... " అని వేలు చూపించి కోపంగా దూరం జరిగి కూర్చుంది.
సుమారు అయిదు నిముషాలు గడిచాయి. ఇద్దరూ మాట్లాడుకోలేదు కాని ఆమె కొట్టినందుకు అతను, అతను అలా అన్నందుకు ఆమె మనసులో సంతోష పడుతున్నారు.
క్రిష్, కాజల్ ని చూసి "ఇప్పుడే వస్తా.... ఎవరితో గొడవ పడకు..." అన్నాడు.
కాజల్ "నువ్వు మాత్రం ఎవరన్నా గొడవకు వస్తే నన్ను పిలువూ..." అని కసిగా అంది.
క్రిష్ చేతులు కట్టుకొని వెక్కిరిస్తూ "అలాగే మేడం... వచ్చి ఆ రెండో భుజం కూడా అడ్డు పెట్టండి" అని వెళ్ళిపోయాడు.
కాజల్ కూడా అతన్ని వెక్కిరించింది.
అతను వెళ్ళాక....
ఈషా "మీకు చాలా దైర్యం మేడం.... ఇంతకు ముందు చూశారా... ఒక్క దెబ్బతో అతణ్ణి కింద పడేశాడు. పైగా బాక్సింగ్ చాంపియన్..... మీరు అసలు అలా చెంప దెబ్బ, కొట్టేశారు" అంది.
కాజల్ చిన్నగా నవ్వి "నీకో సీక్రెట్ చెప్పనా... నేను అతన్ని రెండు లక్షలు పెట్టి కొనుక్కున్నాలే..." అని నవ్వింది.
ఈషా నవ్వింది.
కాజల్ చిన్నగా నవ్వి "ఇంకొకటి చెప్పనా.... ఆ రెండు లక్షలు కూడా వాడి దగ్గరే అప్పు చేశా" అని మళ్ళి నవ్వింది.
ఈషాకి అర్ధం కాక పోయినా కాజల్ ని చూసి నవ్వేసింది.
కాజల్ "తొందరగా గొడవకు వెళ్ళడు... మంచోడు..." అంది.
ఈషా "మేడం అక్కడ కొట్టుకుంటున్నారు.... మీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు"
కాజల్, ఈషా ఇద్దరూ అక్కడకు చేరుకున్నారు.
క్రిష్ ని కింద పడేసి అతని పై మరొకరు అతన్ని పైకి లేవనివ్వకుండా చేతులు మేలిపెట్టాడు.
కాజల్ అరుస్తూ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే మరో పెద్ద వయస్సు వ్యక్తీ "సెక్యూరిటీ ఆఫీసర్ లం మేడం మా డ్యూటీ చేసుకోనివ్వండి" అంటూ అతని id చూపించాడు. దానిపై ఇన్స్పెక్టర్ రామ్మోహన్ నార్కోటిక్ డిపార్టుమెంటు అని వ్రాసి ఉంది.
![[Image: shocked-kajal.gif]](https://media.tenor.com/NpZX4-Fap7UAAAAM/shocked-kajal.gif)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them