Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
91. పిసినారి






కాజల్ పార్కింగ్ ఏరియా లో నడుస్తూ తన కార్ దగ్గరకు నడుస్తూ వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయిని లాక్కొని వెళ్తూ ఉన్నట్టు "హెల్ప్" అని పిలిచింది.

కాజల్ చుట్టూ చూసి ఎదో దెయ్యం అనుకుంటూ భయం భయంగా తన కారు దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చొని కార్ తీసి బయటకు పంపింది.

ఈషా నోటిని ఒకతను మూసేసి ఆమెను తన కార్ దగ్గరకు లాక్కొని వెళ్తున్నాడు.

ఈషా ఏడుస్తూ అతనితో కలబడుతూ ఉంది. అతను ఆమె కంటే బలంగా ఉండడంతో అతని కింద ఆనడం లేదు.

అతను ఈషా మొహం పై చెంప దెబ్బ కొట్టి, ఆమెను లాక్కొని వెళ్లి కార్ డిక్కి ఓపెన్ చేశాడు. లోపల తాళ్ళు నోటికి వేసి ప్లాస్టర్ ఉంది.

ఈషా భయం భయంగా అతన్ని తోసేసి "హెల్ప్" అని అరుస్తూ పరిగెత్తింది, కాని ఆదివారం అందులోనూ రాత్రి, దాంతో ఆఫీస్ లో ఎవరూ లేకపోవడం తనకు శాపం అయింది. 

అతను ఆమె వెనకే పరిగెత్తి ఆమె జుట్టు పాతుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాడు. ఈషా కేకలు పెడుతూ వేడుకుంటూ ఉంది, అయినా అతను ఆమె నోటికి ప్లాస్టర్ వేశాడు.

ఆమె చేతులతో ప్లాస్టర్ లాక్కొ బోతూ ఉంటే అతను ఆమె చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడు.

చుట్టుపక్కల మరే వ్యక్తీ లేరు తనను కాపాడడానికి, అందుకే ఆమె మూలుగుతూ అతని వైపు జాలిగా చూస్తుంది, కాని అతను అదేం పట్టించుకోకుండా ఆమె కాళ్ళు కూడా కట్టేసి ఆమెను ఎత్తుకొని డిక్కీలో పడేశాడు.

ఈషా పెద్ద పెద్దగా మూలుగుతూ అరిచే ప్రయత్నం చేసింది.

అతను "హమ్మయ్యా" అనుకోని డిక్కీ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, "అయిపోయిందా" అని గొంతు వెనక నుండి వచ్చింది. 

అతను వెనక్కి తిరిగి కత్తి చూపించగా.... కాజల్ అప్పటికే తన పర్సులో నుండి తీసిన పెప్పర్ స్ప్రే అతని కళ్ళలోకి కొట్టింది. 

అతను నొప్పితో "ఆహ్" అని అరుస్తూ కింద పడిపోగా, కాజల్ స్పీడ్ గా వెళ్లి డిక్కీ ఓపెన్ చేసి ఈషా కట్లు విప్పుతుంది. అవి గట్టిగా ఉండడంతో ఆమెకు లేట్ అయిపోతుంది. 

ఇంతలో ఈషా నోటి ప్లాస్టర్ తీయగానే, ఈషా "వెనక చూడు" అని అరిచింది.

అప్పటికే అతను పైకి లేచి కత్తి తీసుకొని ఆమె పైకి వచ్చేశాడు. కాజల్ తప్పుకోగా ఆమె భుజంలోకి చీల్చుకుంటూ దిగి పోయి బ్లడ్ ఒక్క సారిగా చిమ్మింది. 

కాజల్ నొప్పితో "అమ్మా" అంటూ పడిపోగా... ఈషా "మేడం..." అంటూ అరిచింది. ఆమెకు డిక్కీలో ఉండి బయట కాజల్ పరిస్థితి అర్ధం కావడం లేదు.

అతను మళ్ళి కాజల్ వైపు కత్తి తీసుకొని వస్తుంటే, కాజల్ అతని వెనక చూస్తుంది. ఆమె చూపు అనుసరించి వెనక్కి తిరిగి చూడగా హెల్మెట్ పట్టుకొని ఉన్న క్రిష్ అతన్ని కాలుతో కొట్టడంతో దూరం వెళ్లి పడ్డాడు.

కాజల్ "నువ్వు వెళ్ళిపో.... అతని చేతిలో కత్తి ఉంది" అంది.

క్రిష్ అదేమీ పట్టించుకోకుండా అతని ముందు నిలబడ్డాడు.

అతను పైకి లేచి ఫాస్ట్ గా క్రిష్ మీదకు వస్తూ ఉంటే కాలుతో అతని చాతి పై గట్టిగా కొట్టడంతో, అతను వెళ్లి వెనక ఉన్న గోడకు తగిలి పడిపోయాడు.

క్రిష్ ని భయంగా చూస్తూ అక్కడ నుండి పారిపోయాడు.

అలాగే ఈషా కట్లు విప్పి ఇద్దరినీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు.

దెబ్బ పెద్దగా తగల లేదు... కట్టు తడవకుండా చూసుకోండి. అని చెప్పి మందులు రాసిచ్చాడు డాక్టర్.

కాజల్ భుజానికి కట్టు కడుతున్నంత సేపు సైలెంట్ గా కోపంగా ఉన్నాడు. ఈషా ఆమె పక్కనే కూర్చొని ఒక్కో సారి సారీ, ఒక్కో సారి ధాంక్స్ చెబుతూ ఉంది.

ఆ తర్వాత ముగ్గురూ ఒక కాఫీ షాప్ లో కూర్చున్నారు. క్రిష్ కోపం చూసి ఎదో ఒకటి మాట్లాడాలని అనిపించింది.

కాజల్ "నీ కాలేజ్ టూర్ అయిపోయిందా.. అప్పుడే వెనక్కి వచ్చేసావ్" అంది.

క్రిష్, కాజల్ చేతిలోని బ్యాగ్ తీసుకొని పెప్పర్ స్ప్రే బాటిల్ తీసి "ఇది వాడొచ్చు కదా..." అన్నాడు.

కాజల్ "నేను వాడాను.... ఈషా నువ్వైనా చెప్పూ"

ఈషా "వాడింది" అని అంటూ ఉండగానే క్రిష్ చేతులు అడ్డంగా పెట్టి కాజల్ వైపు తిరిగి "పిసినారి దానా.... ఇందులో ఇంకా చచ్చింది కదా.... మొత్తం వాడి మీద కొడితే లేచే వాడు కాదు కదా" అన్నాడు.

ఈషా ఇద్దిరిని మార్చి మార్చి చూస్తుంది.

కాజల్ "మనం అసలు సంగతి మర్చిపోయాం.... హేయ్ ఈషా అతను నీకూ తెలుసా..... ఎందుకు అలా చేశాడు" అంది.

క్రిష్ కోపంగా ఆమె వైపు చూసి మళ్ళి ఈషా వైపు చూస్తూ "చెప్పండి... అతనెవరు...." అని అడిగాడు.

కాజల్ "నీకూ అసలు అడగడమే చేతకాదు, ఎదో తనే పొడిచినట్టు అడుగుతున్నావ్"

క్రిష్ "పోనీ నువ్వే అడుగు..."

కాజల్, ఈషా వైపు చూసింది.

ఈషా చెప్పడం మొదలు పెట్టింది.

[Image: HD-wallpaper-eesha-rebba-actress.jpg]



















[Image: kajal-agarwal-kajal.gif]
[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 04-07-2024, 07:48 AM



Users browsing this thread: 28 Guest(s)