Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#19
సిద్ధార్థ కళ్లు తెరిచి చూస్తే తనకి వినోద్ కీ ఇద్దరికి కరెంట్ వైర్ లు కట్టి షాక్ ఇచ్చి వాళ్ళని స్ప్రుహ లోకి తెచ్చారు అప్పుడు ఇలియాజ్ విజిల్ వేస్తూ సిద్ధార్థ దగ్గరికి వచ్చి “ఎలా ఉన్నారు సార్ అని అంటూ వినోద్ వైపు చూసి అరే మేజర్ సాబ్ చెప్పా కదా మీ ఫ్రెండ్ నీ జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు చూడండి ఇద్దరు ఎలా నా గుప్పెట్లో ఉన్నారో” అని చెప్పి నవ్వాడు “మీ తాలిబన్లు ఆడింగి జాతి కీ చెందినోళ్లూ అని మళ్ళీ నిరూపించావ్ రా ఇలియాజ్ దమ్ముంటే కట్లు విప్పు రా నీ తల నరికి నీ చేతుల్లోనే పెడతా” అన్నాడు వినోద్ దానికి ఇలియాజ్ కీ కోపం వచ్చి వినోద్, సిద్ధార్థ ఉన్న ఛైర్ కీ కాలి తో కొట్టాడు “మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో చూస్తా” అన్నాడు అప్పుడే సలీం వచ్చి అందరి ముందు కాల్పులు జరిపి ఇలియాజ్ మోకాలి పైన కాల్చి అందరినీ చంపి వినోద్, సిద్ధార్థ నీ విడిపించాడు అప్పుడు సిద్ధార్థ, సలీం చేతిలో ఉన్న గన్ తీసుకొని ఇలియాజ్ భుజాల పైన కాల్చి నుదుటి పైన గన్ పెట్టి “ఒకటే question ఆ రోజు మా మీద ఎలా ఎటాక్ చేశావ్ మా నాన్న వస్తున్నాడు అని నాకే తెలియదు నీకు ఎలా తెలుసు ఎవరూ నీకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది” అని అడిగాడు దానికి ఇలియాజ్ నవ్వుతూ “నీ బాబే రా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది” అని అన్నాడు అది విని సిద్ధార్థ, వినోద్ షాక్ అయ్యి ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు.
ఇలియాజ్ చెప్పింది విన్న తరువాత వినోద్, సిద్ధార్థ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు “ఏంట్రా షాక్ అయ్యరా ఏమీ అనుకున్నావ్ మీ బాబు గురించి వాడు ఏమైనా దేవుడా నీతి తో గెలవడానికి మీ బాబు చాలా పెద్ద స్కెచ్ వేశాడు గెలవడం కోసం మీకు గుర్తు ఉందో లేదో నాలుగు సంవత్సరాల క్రితం elections కీ రెండు నెలల ముందు ఇండియా లో దసరా పండుగ తో పాటు మొహరం కూడా కలిసి వచ్చింది అప్పుడు తమిళనాడు లోని మధురై లో దేవి ఊరేగింపు లో కొంతమంది ముస్లిమ్స్ ఊరేగింపు లో వచ్చే భక్తుల మీద beef మాంసం పోశారు దాంతో అక్కడ పెద్ద గొడవలు జరిగాయి దాంతో పాటు కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ లో మత ఘర్షణలు జరిగాయి ఆ గొడవలు చేయించింది మీ నాన్న రమేష్ ఠాకూర్ ఎందుకంటే మీ నాన్న పార్టీ నాయకులు ”ల పైన చాలా వ్యతిరేకత చూపించడం తో ”లు అంతా మీ నాన్న opposition పార్టీకి మద్దతు తెలిపారు దాంతో జనం లో వాళ్ల పార్టీ image పెంచడం కోసం మీ బాబు పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా కీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సైన్యం నీ వెనకు తరలిస్తాను అని మాట ఇచ్చాడు దాంతో యూసఫ్ రజా మా భాయ్జాన్ మూసాఫ్ తో మీ నాన్న కీ డీల్ కుదుర్చాడు దాంతో నను సోఫియా కీ బాడి గార్డ్ గా పంపి మీ నాన్న అక్కడికి వచ్చినప్పుడు తన మీద తనే ఎటాక్ చేయించుకుని నా పేరు బయటకు తెచ్చి ఇండియా లో ”లకు terrorists లకు సంబంధం లేదని ఇండియా లోని ”లు ఎప్పుడు దేశ భక్తి తో ఉంటారు అని పత్తితి కబుర్లు చెప్పి వాళ్ల అభిమానం గెలుచుకున్నాడు దాంతో పాటు ఈ మత ఘర్షణలు రేపి హిందూ ”లు ఎప్పుడు సోదర భావంతో ఉండాలి అని చెప్పి గొడవకు కారణమైన మా సంస్థ కీ చెందిన ఇద్దరు terrorist లను మిలిటరీ తో చంపించి ఆ sympathy తో గెలిచాడు మీ బాబు దాంతో పాటు ఈ సారి గెలవడం కోసం చాలా పెద్ద స్కెచ్ వేశాడు కాకపోతే ఎవడు చేశాడో తెలియదు ఆ బాంబ్ బ్లాస్ట్ చేశాడు చా ఈ సారి మాకు 1500 వందల కోట్లు వచ్చేవి ” అని అన్నాడు దాంతో సిద్ధార్థ ఇంకో ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇలియాజ్ నీ కాల్చి చంపాడు.
అప్పుడు వినోద్ “రేయ్ పిచ్చ నాయాలా వాడు evidence రా అలా చంపేశావ్ ఇప్పుడు ఈ మొత్తం scam ఎలా నిరూపించగలం” అని అన్నాడు దాంతో సిద్ధార్థ తన షర్ట్ కీ ఉన్న బటన్ కెమెరా తీసి “ఇది మొత్తం రికార్డ్ అయ్యింది పదండి మూసాఫ్ ఇస్లామాబాద్ కీ వెళ్లే లోపు పట్టుకుందాం లేదా లేపేదాం నా కొడుకును” అని గన్ లోడ్ చేస్తూ చెప్పాడు సిద్ధార్థ అప్పుడు సలీం “సార్ మూసాఫ్ కరాచి లో లేడు ఇప్పుడు మనం ఎంత తొందరగా వెళ్లిన కూడా ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కీ చేరుకోలేము ఇక్కడి నుంచి కరాచి నే మూడు గంటల సమయం పడుతుంది అయిన మీకు accident అయిన తరువాత ఇంత తక్కువ టైమ్ లో వాళ్లు మిమ్మల్ని ఇక్కడకు ఎలా తీసుకొని వచ్చారు” అని అడిగాడు దాంతో సిద్ధార్థ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బయట ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ గాలి లో ఎగిరి పడింది ఏంటి అని వెళ్లి చూస్తే అక్కడ ఒక హెలికాప్టర్ ఉంది దాంతో సిద్ధార్థ “వినోద్ దాని takeoff చేయి మనం మూసాఫ్ నీ పట్టుకొని మీడియా ముందు పెట్టాలి” అని చెప్పాడు దానికి వినోద్ గుటకలు మింగుతూ “రేయ్ నాకూ హెలికాప్టర్ నడపడం రాదు నేను ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కాదు” అన్నాడు దానికి సిద్ధార్థ సలీం వైపు చూశాడు వాడు కూడా రాదు అని తల ఊపాడు అప్పుడే చేతికి బుల్లెట్ దిగి దొంగతనం గా పారిపోతున్న ఒక terrorist నీ చూసి వాడిని కొట్టి లాకుని వచ్చాడు సలీం వాడిని అడిగితే వాడికి హెలికాప్టర్ కంట్రోల్ వచ్చు అన్నాడు దాంతో వాళ్లు హెలికాప్టర్ లో మూసాఫ్ దగ్గరికి బయలుదేరాడు అప్పటికే ఇస్లామాబాద్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా, మూసాఫ్ కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడే హెలికాప్టర్ లో అక్కడికి చేరుకుని మూసాఫ్ కార్ మీద grenade launcher తో ఎటాక్ చేశాడు సిద్ధార్థ అలా మూసాఫ్ అనుచరుల పైన దాడి చేసి మొత్తానికి మూసాఫ్ నీ పట్టుకుని అదే హెలికాప్టర్ లో కరాచి చేరుకున్నారు అప్పటికే సింగ్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ నీ stand by లో పెట్టాడు అలా మూసాఫ్ తో సిద్ధార్థ, వినోద్, సలీం ఇండియా కీ సురక్షితంగా చేరుకున్నారు.
అలా ఇండియా వచ్చిన తర్వాత మూసాఫ్ మరియు ఇలియాజ్ ఇచ్చిన సాక్ష్యం నీ మీడియా ముందు బహిరంగంగా బయట పెట్టాడు సిద్ధార్థ అలాగే వచ్చే elections లో కూడా గెలవడం కోసం తన తండ్రి చేయాలి అనుకున్న మారణహోమం గురించి కూడా బయట పెట్టాడు అని పెద్ద నగరాల్లో భారీ బాంబ్ బ్లాస్ట్ లు చేసి మళ్లీ హిందూ, ”ల అల్లర్లు రేపి హిందుత్వ రాష్ట్రం గా ఇండియా నీ మార్చి ”లను తరిమి కొట్టడానికి పధకం వేశాడు అని వాళ్ల ప్లాన్ బయటకు తెచ్చాడు, దాంతో సిద్ధార్థ ఇలా సమాధానం ఇచ్చాడు “ఇన్ని ఘోరాలు చేసి నా తండ్రి సంపాదించిన ఈ పదవే ఆయన ప్రాణం తీసింది ఇలా రక్తపు మరకలు ఉన్న సింహాసనం నాకూ వద్దు నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తున్నా అంతేకాకుండా ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు తెలియజేస్తున్నాను ఇదే పార్టీ లో నిస్వార్థంగా మంచి జ్ఞానం తో వివేకం తో ఉన్న యువ నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి నాయకులకు నేను చెప్పదల్చింది ఒకటే మిత్రులారా మీరు ఇలాంటి కుల గజ్జి, మత ఘర్షణలు రేపి, రక్తపు వాసన తో నిండిన ఇలాంటి పార్టీ నుంచి వేరు అయి సొంతంగా ఒక పార్టీ పెట్టి యువతరం నీ దేశాని ముందుకు నడిపించండి మన యువత మీకు తోడుగా ఉంటుంది ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆత్మగౌరవం లేని ముసలి రాజకీయ నాయకులు కాదు మీరు యువత ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి” అని చెప్పి వెళ్లిపోయాడు సిద్ధార్థ ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన luggage సర్దుకోని వెళ్లిపోతున్న సిద్ధార్థ నీ ఆపి తన చేతిలో ఉన్న ఫోన్ లోని వీడియో చూపించాడు మధు అందులో సిద్ధార్థ తన తండ్రి రమేష్ కీ poison injection ఇచ్చి ఆ రూమ్ లో బాంబ్ పెట్టి పేల్చిన video మొత్తం రికార్డ్ అయ్యింది అది చూసి సిద్ధార్థ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
[+] 1 user Likes raosahab786's post
Like Reply


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 2 Guest(s)