Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
82. వార్నింగ్





కాజల్ "క్రిష్ వాళ్ళు ఏమైనా అన్నా కూడా పట్టించుకోవద్దు..."

క్రిష్ "నేనేమన్నా రౌడీలా కనపడుతానా..... ఎందుకు అలా చెబుతున్నావ్..."

కాజల్ "అలా అని కాదు..."

క్రిష్ "ఉఫ్ఫ్... పదా వెళ్దాం..."



మేఘ, కూడా వచ్చింది కాని క్రిష్ ని చూడగానే కళ్ళు పెద్దవి చేసుకొని అతను అవునా కాదా అనేది చూసుకొని.... అక్కడ నుండి లేచి దాక్కొని దాక్కొని వెళ్ళిపోయింది.

తనని ఎవరూ గమనించలేదు. బయటకు వెళ్లి ఫోన్ చేస్తూ "నేను క్రిష్ ని చూశాను, అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఆఫీస్ లో టీం లీడ్..."

అవతలి నుండి మగ గొంతు ఆమె భర్త "దూరంగా ఉండు... వాళ్ళ జోలికి వేళ్ళకు... పోయిన సారి అయింది చాలదా...."

మేఘ చమటలు తుడుచుకుంటూ "సరే... సరే... సరే... కానీ.... మాస్టర్ కి విషయం తెలుసా..." కంగారు పడుతుంది.

భర్త దవడలు బిగుసుకున్నాయి "మాస్టర్ సిటిలోకి వచ్చారు... మళ్ళి వెళ్ళారు"

మేఘ "నా.... నాకు... భయంగా ఉంది. మనం వేరే ఊరు ట్రాన్సఫర్ పెట్టుకొని వెళ్ళిపోదాం"

భర్త "ముందు నువ్వు ఒక చోట కూర్చొని గాలి పీల్చి వదులు.... కూల్ అవ్వు"




ఈషా "మేడం... ఒక సారి నాతొ వస్తారా..." అంటూ కాజల్ ని తీసుకొని వెళ్తూ మిగిలిన స్టాఫ్ కి సైగ చేసింది.

కాజల్ వాళ్ళ సైగలను ఆమెను గమనిస్తూనే ఉంది. వాళ్ళ అందరి మధ్య క్రిష్ ని ఒంటరిగా వదలడం తనకు ఇష్టం లేదు కాని క్రిష్ హ్యాండిల్ చేయగలడు అని ఎందుకో మనసుకు అనిపిస్తుంది.

చుట్టూ ఉన్న అందరూ సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టారు. క్రిష్ కి ఇబ్బంది కలిగించాలని... అయితే క్రిష్ ఫుడ్ తింటూ చుట్టూ ఉన్న ఎవరినీ పట్టించుకోకుండా తింటున్నాడు.

అప్పుడప్పుడు ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక ఎంప్లాయ్ అతనికి సంబంధం లేని సబ్జెక్ట్ మాట్లాడి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయి "కమోడిటీస్.... షేర్స్.... మునాఫా రేటింగ్.... బాండ్స్" అని మాట్లాడుతున్నాడు.

క్రిష్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇంతలో కాజల్ మరియు ఈషా వచ్చారు. కాజల్ "ఏంటి... అలా సైలెంట్ గా ఉన్నావ్... నువ్వు షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తావ్ కదా...."

క్రిష్ "పెద్ద వాళ్ళు మాట్లాడేటపుడు సైలెంట్ గా ఉండాలి" అన్నాడు.

P1  "ఎంత ఇన్వెస్ట్ చేశావ్..."

P2  "కమాన్.... తను కాలేజ్ గోయింగ్ గై... ఎంత చేస్తాడు... వేలల్లో ఉంటుంది" అని నవ్వాడు.

P3 "నేను పది లక్షలు ప్రిన్సిపల్ పెట్టాను. అసలు వెనక్కి తిరిగి చూడను"

P4 "అప్పుడప్పుడు చూసుకోవాలి.... నేను పదిహేను...."

P5 "నేను పదిహేడు"

P6 "నేను పద్దెనిమిది.... కాజల్ మేడం మీరూ...."

కాజల్ "నేను బ్యాంక్ లో వేసుకుంటాను" అని నవ్వింది.

P1 "అదేంటి మేడం విడాకులు అయ్యాయి కదా... భరణం రాలేదా..." అన్నాడు.

P6 "మేడం నేను ఒకరి నెంబర్ పంపిస్తాను. ఇన్వెస్ట్ చేయండి బాగా లాభాలు వస్తాయి"

క్రిష్ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి "భరణం తీసుకోవడం లేదు..." అన్నాడు.

P6 "ఓకే... ఇట్స్ ఓకే... కాని ఇన్వెస్ట్ చేయండి... మన ఆదాయంలో..."

క్రిష్ "ఇప్పటికే నేను చాలా ఇన్వెస్ట్ చేశాను. సుమారు పాతిక..."

P6 "పాతిక వేలకు ఏం వస్తుంది... చూడు... నా మాట వినూ...."

క్రిష్ "లక్షలు..."

అందరూ సైలెంట్ అయ్యారు.

కాజల్, క్రిష్ వైపు చూస్తూ "నిజం చెప్పూ... లేదంటే దెబ్బ అయి పోతాం..."

క్రిష్ ఆమె చెవిలో "నేను అబద్దం చెప్పడం లేదు.... బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేశాను.... సుమారు ఒక అయిదు సంవత్సరాల క్రితం.... అలా... అలా... అలా... " అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఆమెకు చూపించాడు.

కాజల్ అతని చేతిని పెనవేసుకొని "అయితే నువ్వు రిచ్"

క్రిష్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి "మనం" అన్నాడు.

కాజల్ మురిసి పోతూ ఉంటే... ఈషా.... మేడం ఒక్క సారి పక్కకు వెళ్దాం అంటూ మళ్ళి తీసుకొని వెళ్ళింది.

అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న దుబ్బోడు P7 "డబ్బు బాగా ఉంది.... అది చూపించి మా మేడంని పడేసావ్.... మాతో ఆడుకుంటూ ఉంటే మజాగా అనిపించిందా... లోపల లోపల చిన్నగా నవ్వుకొని ఉంటావే" అన్నాడు.

క్రిష్ అతన్నే చూస్తూ ఉన్నాడు.

P7 "ఏదైనా తేడా వేస్తె.. తాటతీస్తాం... మా సర్కిల్ నీకూ తెలియదు..." అంటూ పైకి లేచి క్రిష్ చొక్కా పట్టుకున్నాడు, కొట్టడానికి.

అక్కడకు కొంచెం దూరంలో ఉన్న మేఘ ఆశ్చర్యంగా వాళ్ళ మాటలు విని నవ్వుకుంది.

కాజల్ మరియు ఈషా ఇద్దరూ ఎదో గొడవ జరుగుతుంది అన్నట్టు పరుగున వచ్చేశారు.

ఇంతలో ఒక బేరర్ వచ్చి "క్రిష్ సర్...." అంటూ వచ్చి "మీరేంటి సర్ ఇక్కడా...." అన్నాడు.

క్రిష్ "డిన్నర్ కి వచ్చాం" అన్నాడు.

బేరర్ "మీ మ్యాచ్ అద్బుతం సర్.... మళ్ళి ఎపుడు సర్..."

క్రిష్ "నేను మానేశాను"

బేరర్ "అదేంటి సర్... మీకు బాక్సింగ్ చేస్తూ ఉంటే.... కిరాక్ ఉంటుంది" అన్నాడు.

అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే... బేరర్ కాగితం మీద క్రిష్ సంతకం పెట్టించుకొని వెళ్ళాడు.

అందిర్ని చూస్తూ క్రిష్ "నాకు చిన్నప్పటి నుండి అలవాటు అంతే...."

P7 "ఏంటి?"

క్రిష్ "బాక్సింగ్" అని కాజల్ వైపు చూసి పక్కకు వెళ్ళమని సైగ చేశాడు.

కాజల్, ఈషాని పక్కకు వెళ్దాం అని తీసుకొని వెళ్ళింది.

క్రిష్ "రేయ్... నేను గొడవ ఎందుకు చేయలేదో తెలుసా... మనం ఉన్న ప్లేస్ CC కెమెరా కవరేజ్ ఉంది"

అందరూ చుట్టూ చూశారు.

క్రిష్ "తను నా మనిషి... నాకు బాగా కావలసిన మనిషి.... ఇంకొక్క సారి తను బాధపడింది అని తెలిసిందో..." అని చుట్టూ అందరిని చూస్తూ "CC కెమెరాలు పగిలిపోతాయ్" అని పైకి లేచి "బిల్ నేను పే చేస్తాను" అని వెళ్ళాడు


బయటకు వెళ్తూ వెళ్తూ మేఘ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద చిన్నగా తట్టి ఆమెను చూడకుండానే సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

మేఘ భయం భయంగా అక్కడ నుండి బాత్రూంకి వెళ్ళిపోయింది. ఫోన్ లో భర్తతో "చూసేసాడు.... చూసేసాడు.... క్రిష్ నన్ను చూసేసాడు.... నాకు భయంగా ఉంది" అంటూ ఏడుస్తుంది.

భర్త "రిలాక్స్.... క్రిష్ చూస్తే భయం ఏముంది.... అయినా క్రిష్ మంచి వాడు... మాస్టర్ చూస్తేనే కదా..... సమస్య" అన్నాడు.

మేఘకి భయం అనిపించింది. ఎదురుగా అద్దంలో ఒక్క సారిగా 'మాస్టర్ నూతన్' మొహం కనపడింది. వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరూ లేరు. అదంతా తన భ్రమ...

టాయిలెట్ వస్తున్నా ఆపుకొని.....  ఇక అక్కడ ఉండకూడదు అన్నట్టు బయటకు పరిగెత్తింది.



కాజల్ "నీకూ నిజంగా బాక్సింగ్ వచ్చా..."

క్రిష్ "ఆ బేరర్ కి డబ్బులిచ్చా...  అలా చెప్పమని" కాజల్ నవ్వేసింది.

కాజల్ "ఆ షేర్ మార్కెట్ డబ్బు..."

క్రిష్ "అదంతా ఉత్తుత్తే.... అయినా అంత డబ్బు ఉంటే నిన్ను ఎందుకు డబ్బు కోసం మోసం చేస్తాను..."

కాజల్ "కదా..." అని తల కొట్టుకొని క్రిష్ దగ్గరకు వచ్చి "అంటే నువ్వు రిచ్ కాదా...."

క్రిష్ "రిచ్.... హృదయం ఉంది" అన్నాడు.

కాజల్ కోపంగా "మడిచి..." అని వెళ్ళిపోయంది.

క్రిష్ నవ్వుతూ ఆమెను అనుసరించాడు "నీకూ రేపటి నుండి వాళ్ళ సమస్య ఉండదు"

కాజల్ "నాతో మాట్లాడకు అసలు నువ్వు... అన్ని అబద్దాలు చెబుతావ్..."

క్రిష్ "బేబి... బేబి... బేబి... " అంటూ ఆమెను ఫాలో అయి వెళ్తున్నాడు.

కాజల్ "నాతో మాట్లాడకు అసలు నువ్వు..."

క్రిష్ "ఇందంతా నీ కోసమే చేశాను" అంటూ నవ్వుతూ ఆమెను ఫాలో అయి వెళ్ళాడు.

కాజల్ కోపంగా ముందుకు వెళ్ళిపోయింది. క్రిష్ ఆమె వెంట పడుతూ వెళ్ళాడు.






-- -- -- -- -- --


[Image: angry-kajal-reaction.gif]



మూడు రోజుల తర్వాత......

కాజల్ "నేను అప్పు తీసుకొని XXX కొన్నాను"

క్రిష్ "ఓహ్....."

కాజల్ "XXX కూడా కొన్నాను"

క్రిష్ "హుమ్మ్....."

కాజల్ "XXX కూడా కొన్నాను"

క్రిష్, కాజల్ వైపు చూసి "అసలెంత బిల్ చేశావ్..."

కాజల్ రెండు వేళ్ళు చూపించింది.

క్రిష్ "ఇరవై వేలా...." అని నోరు తెరిచాడు.

కాజల్ "కాదు.... రెండు లక్షలు..."

క్రిష్ "వాట్...."

కాజల్ "ప్లీజ్... క్రిష్..... డబ్బులు ఉంటే ఇవ్వవా.... సాలరీ రాగానే ఇంస్టాల్ మెంట్ లో ఇచ్చేస్తాను. ప్లీజ్... ప్లీజ్... "

క్రిష్ మనీ ట్రాన్సఫర్ చేస్తూ "దుర్మార్గురాలివి తెలుసా.... ఆ రోజు రెస్టారెంట్ బిల్ కూడా నా చేత కట్టించావ్...."

[Image: kajal-aggarwal-hmm.gif]

కాజల్ "గర్ల్ ఫ్రెండ్ అంటే అంతే.... ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. బాయ్ క్రిష్" అంటూ ఆఫీస్ లోపలకు వెళ్ళిపోయింది.

క్రిష్ "లక్షల్లో సంపాదించే దాని అప్పు వేలల్లో సంపాదించే వాడు తీర్చాడు... దీనికి సంపాదించడం కాదు. దాచుకోవడం నేర్పాలి" అనుకుంటూ కాలేజ్ కి బయలు దేరాడు.

















Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 29-06-2024, 07:43 AM



Users browsing this thread: 24 Guest(s)