25-06-2024, 02:30 PM
ఢిల్లీ సీఎం వచ్చి కల్కి సర్ ఎక్కడ అని అడగడంతో, పీఎం వారి వైపు చూస్తూ " కొన్ని జబ్బుల్ని నయం చెయ్యడానికి కావాల్సిన హెర్బ్స్ కోసం హిమాలయాల్లోని సంజీవని పర్వతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు దాదాపు పది రోజులైంది, కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న కానీ కుదరట్లేదు" అని అంటాడు.
ఆ విషయం విని వాళ్ళు అక్కడే కూలబడిపోతారు. హోమ్ మినిష్టర్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ "ఒకవేళ ఆయనకు అక్కడ ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే..." అని తన ఆందోళనగా పీఎం వైపు చూస్తాడు.
"లేదు లేదు ఆయనకు ఏమి అలా జరిగి ఉండదు" అని పీఎం వారిని శాంతపరుస్తాడు.
స్పేస్ షిప్ లో....
మూడో రోజు గడువు ముగుస్తుండడంతో, మర్ఖద్వ తన సైన్యాన్ని ఎనిమిది దిక్కులకి పంపడానికి ఎనిమిది భాగాలుగా విభజిస్తాడు. అందులో ఒక భాగానికి రాయిస్ ని నాయకుడిగా నియమించి పశ్చిమ భాగం వైపు వెళ్ళమని చెప్తాడు.
మర్ఖద్వకు ఏదో గుర్తొచ్చి బార్బెరా వైపు చూస్తూ "ఈ గ్రహంలో ఎక్కడైనా ఒక చోటు నుండి ఇంకొక చోటుకి క్షణాల్లో ప్రయాణించే సాధనం లాంటిది ఉందా" అని అడుగుతాడు.
బార్బెరా సందేహంగా డ్రాగల్, కాస్సీ వైపు చూస్తూ "అలాంటిది ఏమి లేదు ప్రభు" అని అంటాడు.
"అలాంటిది ఇక్కడ లేదుగాని వాటిని ఇక్కడి వాళ్ళు టెలిపోర్టల్స్ అంటారు ప్రభు" అని అంటుంది కాస్సీ.
"ఆ సాధనం దేనికి ప్రభు" అని అడుగుతాడు రాయిస్.
"నాక్కూడా తెలీదు, నా అన్న వెళ్లిన ప్రతి గ్రహంలో దీనిని వెతికించేవాడు అందుకే అడిగాను" అని అంటాడు మర్ఖద్వ.
"మూడు రోజుల గడువు తీరిపోయింది ఎలాంటి శక్తివంతుడు ఇక్కడికి రాలేదు" అంటాడు నిరాశపడుతూ మర్ఖద్వ.
మర్ఖద్వ అనుచరుడు రాయిస్ మాట్లాడుతూ "ఇంకెక్కడ శక్తివంతుడు వాళ్ళు చెప్పారుగా అలాంటి వాళ్ళు ఎవరు లేరని ఒకవేళ ఆ శక్తివంతుడు ఉన్న మిమ్మల్ని చూసి భయపడి దాక్కుని ఉంటాడు ప్రభు" అంటూ వెకిలిగా నవ్వుతుంటాడు.
మర్ఖద్వ కూడా చిన్నగా నవ్వి బార్బెరాతో "నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను, నన్ను నిరాశపరిచావ్" అని అంటాడు. బార్బెరా ఏమి మాట్లాడడు.
మర్ఖద్వ "అయినా ఏం పర్లేదు నేనిక్కడ ఎవ్వరిని వదలను అందరిని చంపేసే మళ్ళీ నా గ్రహానికి వెళ్తాను" అని అంటాడు.
పీఎం ఆఫీస్ లో....
పీఎం ఆఫీస్ లో పీఎం, హోమ్ మినిస్టర్ ఆ రాత్రి కల్కిని కాంటాక్ట్ అవ్వడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ అక్కడే నిద్రపోతారు.
అర్థరాత్రి చప్పుడు అవ్వడంతో నిద్ర లేస్తారు. ఎదురుగా కల్కి నవ్వుతు సాధించానన్నట్టు తను తీసుకొచ్చిన మెడిసినల్ హెర్బ్స్ ని చూపిస్తాడు. కానీ వాళ్ళ మొహాల్లో ఆనందం కనపడకపోవడంతో వారిని ఏం జరిగింది అన్నట్టు సందేహంగా చూస్తాడు కల్కి.
వాళ్ళు విషయమంతా చెప్పి షీల్డ్ లోపల జరిగిన ఆ మారణకాండను కల్కికి చూపిస్తారు. అది చూసి కల్కి చలించిపోతాడు తన పిడికిలి బిగుసుకుంటాయి. తన కళ్ళల్లో బాధ, కోపం రెండు ఒకేసారి ప్రస్ఫూటిస్తుంటాయి. ఒక్కసారిగా కల్కి అక్కడి నుండి మాయమైపోతాడు.
మిలిటరీ క్యాంప్ లో....
"చుట్టు పక్కల ఉన్న సివిలియన్స్ అందరిని వెకేట్ చేయించండి అండ్ మీడియాను కూడా పంపించండి. మనం ఇక్కడి నుండే వారిని డిఫెండ్ చెయ్యడానికి ప్రయత్నిద్దాం" అని అంటాడు కల్నల్ డేవిడ్ ఆండర్సన్
మేజర్ జనరల్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ "పారామిలటరీ ఫోర్సెస్ ఆ పనిలోనే ఉన్నారు. మరి మిగతా దేశాల సంగతి ఏంటి" అని అడగగా
"అన్ని దేశాల వారికి సందేశం పంపించాం, అందరిని బంకర్లలోకి పంపిస్తున్నాం" అని అంటాడు కల్నల్ డేవిడ్ ఆండర్సన్.
"దీని నుండి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు" అని దిగులుతో అంటుండగా ఒక సోల్జర్ వచ్చి "సర్, షీల్డ్ లో ఎవరో స్పేస్ షిప్ వైపు వెళ్తున్నాడు" అనగానే వాళ్ళు బయటకి వచ్చి చూస్తారు. సోల్జర్స్ అందరు షీల్డ్ లోపల ఉన్న ఆ మనిషినే చూస్తుంటారు.
వాళ్ళు బైనాక్యూలర్స్ అందుకుని చూస్తే ఒకడు స్పేస్ షిప్ వైపు వెళ్తుంటాడు అప్పుడు మేజర్ జనరల్ మాట్లాడుతూ "ఇతనెలా లోపలికి వెళ్ళగలిగాడు" అని ఆశ్చర్యంగా ఆండర్సన్ వైపు చూస్తూ అంటాడు.
షీల్డ్ దగ్గర ఉన్న మీడియా....
మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. ఈ రాత్రి గడిస్తే ఏమవుతుందో అన్న భయం అందరి కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సోల్జర్స్ వాళ్ళని వెళ్లిపోవాలని చెప్తాడు. మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగగా నాకు తెలీదు అని సమాధానమిస్తారు.
ఆ సోల్జర్స్ వారిని త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పి అందరు అక్కడి నుండి వెళ్ళిపోగానే మీడియాలో ఒకడు "అయిపోయింది అంతా అయిపోయింది వీళ్ళు కూడా ఏం చెయ్యలేకపోతున్నారు. ఇక మానవ జాతి మొత్తాన్ని వాళ్ళు చంపేస్తారు" అని భయంతో ఏడుస్తూ ఉంటాడు.
అతని ఛానల్ సంబంధించిన క్రూ మెంబెర్స్ తనని ఓదారుస్తుంటారు. మిగతా వాళ్లంతా కెమెరాస్ ని అతని వైపే తిప్పి చూస్తుంటారు. ప్రపంచమంతా అతని బాధని చూస్తుంటుంది. నిజానికి వాళ్ళ మనసులో మెదులుతున్నది కూడా ఇదే.
అప్పుడే మీడియాలో ఒకరు షీల్డ్ వైపు తీక్షణంగా చూస్తూ తన పక్కన ఉన్న వాళ్ళతో "షీల్డ్ లోపల ఎవరో ఉన్నారు" అనగానే కెమెరాస్ అన్ని అటు వైపు షిఫ్ట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న వాళ్లంతా ఆ లైవ్ ని వీక్షిస్తుంటారు. చీకట్లో చాలా దూరంలో ఉండడం వలన వారెవ్వరికి అతని మొహం కనిపించదు అతను మనిషి అని మాత్రమే తెలుస్తుంది.
స్పేస్ షిప్ లో....
స్పేస్ షిప్ లో ఉన్న మర్ఖద్వ ఏదో ఆలోచిస్తుంటే రాయిస్ "ఏమైంది ప్రభు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు " అని అడుగుతాడు.
అందుకు మర్ఖద్వ "నా అన్న నా దగ్గర ఈ లోహం గురించి ఏదో విషయాన్నీ దాస్తున్నాడు అనిపిస్తోంది ఈ పని అయిపోగానే అదేంటో కనుక్కోవాలి ఒకవేళ మా కంటే శక్తివంతులు ఉంటే వాళ్ళని వెతికి కనిపెట్టి చంపెయ్యాలి" అని అంటాడు.
మర్ఖద్వ సైనికులతో "తెల్లవారగానే బయలుదేరండి, ఈ గ్రహంలో ప్రతి మూల వెతకండి సముద్ర గర్భాల్లో, అడవుల్లో, నేలల్లో దాక్కున్న వెతికి వేటాడండి. ఈ గ్రహంలో ఉన్నవారందరిని చంపేసే మనం మళ్ళీ మన గ్రహానికి వెళ్ళాలి." అంటాడు ఆక్రోశంగా. సైనికులంతా మర్ఖద్వ పేరును కీర్తిస్తుంటారు.
బార్బెరా అక్కడ ఉండకుండా వేరే చోటుకి వెళ్లి మోకాలి మీద కూర్చుని "ఇదంతా నేనే చేశాను నా వల్లనే ఇప్పుడు ఈ గ్రహం అంతం అవ్వబోతోంది" అంటూ ఏడుస్తుంటాడు.
అప్పుడే ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ మర్ఖద్వ వద్దకు వచ్చి మర్ఖద్వతో "ప్రభు షీల్డ్ ని దాటి ఒకడు మన స్పేస్ షిప్ వైపే వస్తున్నాడు" అని అంటాడు.
"షీల్డ్ దాటాడా, అది అసాధ్యం ఇప్పటి వరకు ఏ గ్రహాలోను ఎవ్వరు దాన్ని దాటలేదు" అని అంటూ కంగారుగా రాయిస్ మర్ఖద్వ వైపు చూస్తే మర్ఖద్వ చిరునవ్వు నవ్వుతుంటాడు. రాయిస్ కు ఆశ్చర్యం వేస్తుంది.
స్పేస్ షిప్ లో ఉన్న వారంతా కిందకి ల్యాండ్ అయ్యి చూస్తారు. కల్కి ఆ స్పేస్ షిప్ వైపే నడుచుకుంటూ వస్తుంటాడు.
కల్కి ఆ శవాలని చూస్తూ స్పేస్ షిప్ వైపు నడుస్తూ ఉంటాడు. వాటిని చూస్తున్న కొద్దీ తనలో బాధ, కోపం ఇంకా ఎక్కువవుతుంది.
తను అలా నడుస్తూ ఉండగా తన ముందు ఉన్న శవాలలో ఒక శవం చేయి చాచి ఒక చిన్న బాబు వైపు ఉండడం చూస్తాడు. బహుశా తను ఆ బాబు తల్లి అయ్యుంటుంది అనుకుంటాడు. ఆ బాబు గుండె బయటికి వచ్చి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన కల్కికి కన్నీళ్లు ఆగవు.
కల్కి ఆ బాబుని ఎత్తుకుని తన తల్లి వద్దకు చేరుస్తాడు. కల్కి కన్నీళ్లు ఆపుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్లడం ప్రారంభిస్తాడు.
కల్కి ఎప్పుడైతే షీల్డ్ ని దాటాడో మర్ఖద్వకు అర్థమైంది తనే ఆ శక్తివంతుడు అని.
కల్కి మర్ఖద్వకు కాస్త దూరంలో ఉండగా మర్ఖద్వ తనను చూసి గర్వంతో నవ్వుతూ గట్టిగా "ఎట్టకేలకు నేననుకున్న రోజు వచ్చింది, ఇన్నాళ్ళకి నాతో సరిసమానంగా పోరాడగల శక్తివంతుడు దొరికాడు. మన మధ్య జరిగే ఈ యుద్ధం ఈ విశ్వంలోనే అత్యంత గొప్పదవుతుంది" అంటూ కల్కి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు.
కల్కి అవేమి పట్టించుకోకుండా స్పేస్ షిప్ వైపు నడుస్తుంటాడు. తనకు ఆ మాటలు అర్థం కాకపోయినా పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు కల్కికి కావాల్సింది తన వాళ్ళను చంపినందుకు ప్రతీకారం మాత్రమే.
మర్ఖద్వ అలానే కల్కి వైపు వచ్చి తన పిడికిలి బిగించి తను చేతి వేళ్ళకు వేసుకున్న ఆ లోహంతో కల్కి తలను కొట్టాలని చూస్తాడు. కానీ ఒక్కసారిగా కల్కి ఆ దాడి నుండి తప్పించుకుంటూ తన ఎడమ వైపుకు జరిగి తలను కుడి వైపుకు తిప్పుతాడు.
క్షణాల్లోనే కల్కి తన కాలితో మర్ఖద్వ మోకాలి వెనుక భాగాన కొట్టడంతో ఒంటి మోకాలి పై కూర్చుంటాడు. వెంటనే కల్కి తన కుడి చేయి నుండి ఒక మణి బయటకి వచ్చి దాని ద్వారా కత్తి తయారవుతుంది. కల్కి ఆ కత్తితో "హర హర మహాదేవ" అంటూ కోపంతో మర్ఖద్వ మెడ వెనక భాగాన వేటు వేస్తుంటాడు.
బార్బెరా, కాస్సీ, డ్రాగల్ అక్కడ ఉన్న వాళ్లంతా కళ్ళార్పకుండా ఆత్రుతతో చూస్తుంటారు. మర్ఖద్వ శరీర దృఢత్వం తెలుసు కాబట్టి రాయిస్ కు ఆ వెయ్యి మంది సైన్యానికి మాత్రం ఎలాంటి దిగులు ఉండదు. షీల్డ్ బయట ఉన్న వాళ్ళు అక్కడ జరిగేది సరిగా కనిపించకపోయినా శిలలాగా ఉండిపోయి అలానే చూస్తుంటారు.
ఆ కత్తి వేటు పడగానే మర్ఖద్వ మెడ వెనక భాగాన్ని చీల్చుకుంటూ పోతుంది, తన తల శరీరం నుండి వేరయ్యి కింద పడుతుంది. ఒక్కసారిగా అందరు నోరెళ్ళబెట్టి షాక్ లో ఉండిపోతారు. ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా ఏలియన్ శరీరం కింద పడి ఉండడం చూసి షాక్ అవుతారు.
అప్పటి వరకు రాయిస్ మర్ఖద్వను అమరుడు అనుకునేవాడు. తనను ఎవరు గాయపరచలేరు అనుకునేవాడు. కానీ ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతాడు. బార్బెరా కూడా అప్పటి వరకు మర్ఖద్వకు ఆ శక్తివంతుడు మధ్య గట్టి పోటీ జరుగుతుంది అనుకుంటాడు, కానీ ఒక్కసారిగా ఇంత సులువుగా అయిపోయేసరికి షాక్ లో ఉండిపోతాడు.
కల్కి ఆ ఖడ్గాన్ని నేలకు ఆనిచ్చి ఆ ఖడ్గం పిడి భాగం మీద చేతులు వేసి తర్వాత ఎవరు అన్నట్టు వారి వైపు నిల్చుంటాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారికీ భయం మొదలవుతుంది. వెంటనే రాయిస్ కు ఒకానొక సందర్భంలో ఇక్కడ ప్రాణభిక్ష కోసం ఎలా అడుగుతారు అని అడగగా బార్బెరా చెప్పింది గుర్తుకు వచ్చి ప్రాణభిక్ష కోసం రెండు మోకాలి మీద కూర్చుని కల్కి ముందు తలను నేలకు ఆనిస్తాడు.
అది చూసి అక్కడ ఉన్న సైనికులు కూడా అలానే చేస్తారు. బార్బరా, డ్రాగల్, కాస్సీ మాత్రం కృతజ్ఞతభావంతో మోకరిల్లుతారు. ఆ దృశ్యాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. మీడియా వాళ్ళు ఆ దృశ్యాన్ని కెమెరాలతో క్లిక్ మనిపించారు.
అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను చంపిన ఆ రాక్షసుడిని చంపినందుకు ప్రజలు టీవీలో నుండే కల్కికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంకొంతమంది దేవుడే అతనిని పంపించాడనుకొని దేవుడికి మొక్కుతారు.
వాళ్ళు మోకరిల్లాక కల్కి ఆ కత్తిని వదిలేస్తాడు, ఆ కత్తి కింద పడి మాయమైపోతుంది. వెంటనే కల్కి మాయమవుతాడు. కల్కి మాయమైపోవడం చూసి వెళ్లిపోయాడనుకొని అందరు పైకి లేస్తారు. అప్పుడు అందులో ఉన్న ఒక సైనికుడు షీల్డ్ వైపు చూపిస్తూ పైకి చూపిస్తాడు.
కల్కి షీల్డ్ పైన ఒంటి మోకాలి మీద కూర్చుని ఒక గుద్దుతో ఆ షీల్డ్ ని గుద్దుతాడు. ఆ షీల్డ్ మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుండి మాయమైపోతాడు. అందరు మర్ఖద్వ శరీరాన్ని తీసుకుని వారి గ్రహానికి వెళ్ళిపోతారు.
పొద్దున అవ్వగానే అన్ని న్యూస్ పేపర్స్ లో అన్ని న్యూస్ చానెల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు.
నిజానికి అప్పుడే వాళ్లలో ఒక భయం మొదలవుతుంది. మొదటిది విశ్వంలో వాళ్ళు ఒంటరి వాళ్ళం కాదు అని, తమలాంటి బుద్ధి జీవులు కూడా ఉన్నారని, వాళ్ళు తమ కంటే సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి చెందిన వారని, తెలుస్తుంది. వాళ్ళు తలుచుకుంటే వారిని చంపెయ్యగలవు అని అర్థమవుతుంది.
రెండో భయం ఏంటంటే అంతటి అభివృద్ధి చెందిన ఏలియన్స్ ని కూడా సులువుగా ఓడించిన వాడు తమ మధ్యలోనే ఒక సామాన్యుడిగా తిరుగుతున్నాడన్న విషయం, అతనే దేశాలని మెల్లగా ఆక్రమించుకుంటున్నాడన్న విషయం వారిని ఇంకా భయపెడుతుంది.
కొన్ని దేశాల్లో ఆ conspiracy theory నిజమని తెలియడంతో ఆ శక్తివంతుడి గురించి మరింత తెలుసుకోవడం మొదలుపెడతాయి. వారి టేబుల్ మీద ఆ శక్తివంతుడి సంబంధించిన ఫైల్ కూడా చేరుతుంది. ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి దేశాలు.
లండన్ లోని ఒక నిర్జన ప్రదేశంలో....
మాఫియా డాన్ జార్జ్ లైన్ అతని కొడుకు ట్రెవర్ లైన్ తో ఒక అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో తమ ముందు ఒక రేడియో పెట్టుకుని వెయిట్ చేస్తుంటారు.
"డాడ్ మనం వచ్చి దాదాపు గంట అయింది, నాకు బోరింగ్ గా ఉంది అస్సలు మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అస్సలు మనం ఎవరిని కలవబోతున్నాం" అంటాడు ట్రెవర్ విసుగ్గా జార్జ్ వైపు చూస్తూ.
" చూడు ట్రెవర్ నువ్వు నా తర్వాత ఈ కుర్చీలో నా ప్లేస్ లో ఉండాల్సిన వాడివి నువ్వన్నీ నేర్చుకోవాలి అందులోను ఓపిక అనేది చాల అవసరం" తన కొడుకు భుజం మీద చేయి వేస్తూ అంటాడు జార్జ్.
"ఓకే డాడ్ నాకు అర్థమైంది కనీసం మనం ఎవరి కోసం ఇక్కడికి వచ్చామో అదైనా చెప్పండి" అంటాడు ఆతృతతో.
"సరే చెప్తాను కానీ మనం ఇక్కడికి వచ్చినట్టు నువ్వు ఎవరితో చెప్పకూడదు ఈవెన్ నీ ఫ్రెండ్స్ కూడా " అంటాడు జార్జ్. ట్రెవర్ సరే అంటూ తల ఊపుతాడు.
"నీకు తెలుసు మన బిజినెస్ ఈ మధ్య డల్ అయిపోయింది మనం మన పట్టును కోల్పోతున్నాం ఒక్కడివల్ల. వాడిని నేను ఇన్నాళ్లు అబద్ధం అనుకున్నాను. కానీ ఈ మధ్యనే తెలిసింది వాడు నిజమని" అని అంటుండగా ట్రెవర్ ఆపుతూ.
"ఆ conspiracy person, ఆ ఏలియన్ ని ఓడించిన వాడి గురించేనా డాడ్ నువ్వు మాట్లాడేది " అని అడుగుతాడు
"అవును వాడే మనం చేసే డ్రగ్ ట్రాఫికింగ్, అర్మ్స్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్నిట్లోనూ మన వాళ్ళని చంపేస్తూ వచ్చాడు. ఇప్పుడు వాడిని చంపేస్తే గానీ మనం మళ్ళీ పుంజుకోలేం. అందుకే వాడెవడో కనిపెట్టి వాడిని చంపేసే ఒక assassin ని మనం కలవబోతున్నాం" అని అంటాడు జార్జ్ కోపంతో.
"డాడ్ అతనొక సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరో అతన్నెలా మనం చంపించగలం. అస్సలు అతనిని చంపబోయేది ఎవరు" అని అడుగుతాడు ట్రెవర్
జార్జ్ తన కొడుకు వైపు చూస్తూ "బ్లాక్ డ్రాగన్ ఫ్లై" అని అంటాడు. తను ఆ పేరు చెప్పేటప్పుడు తన మొహం లో చిరునవ్వు కనపడుతుంది.
ట్రెవర్ ఆలోచిస్తూ "నేను తన గురించి చాలా సార్లు విన్నాను. తను ఇప్పటి వరకు చాల మందిని చంపింది. తనను ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు. తను ఇప్పటికి మేల్ ఆర్ ఫిమేల్ అనేది ఎవరికీ తెలీదు. తనకు ఆ పేరు కూడా ఎలా వచ్చిందో తెలుసు. నిజానికి డ్రాగన్ ఫ్లై అనే పురుగు చాలా వేగంగా చాలా చురుకుగా వేటాడతుంది. అది ఎప్పటికి తన ఎరను మిస్ చెయ్యదు."
"అవును అందుకే తనకు బ్లాక్ డ్రాగన్ ఫ్లై అనే పేరు వచ్చింది. నిజానికి ఆ పేరు ఒకప్పటి ఈ కుర్చీలో కూర్చున్న విల్ఫ్రిడ్ ని చంపినందుకు వచ్చింది. ఆ పని చేయించింది కూడా నేనే. విల్ఫ్రిడ్ చనిపోయాక నాకు ఈ పోసిషన్ వచ్చింది"
"విల్ఫ్రిడ్ అంటే హుబెర్ట్ వాళ్ళ నాన్న కదా" అంటూ ఏదో ఆలోచిస్తూ "డాడ్ కాని ఆ డ్రాగన్ ఫ్లై ఈ మధ్య చనిపోయారు అని చెప్పడం విన్నాను"
"అవును తను కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు అందువలన చనిపోయింది అని అనుకున్నారు కానీ తను బ్రతికే ఉన్నారని తెలిసింది"
"మీరు తనని ఎలా కాంటాక్ట్ అయ్యారు"
"డార్క్ వెబ్ లో తన వెబ్సైట్ ఒకటి ఉంది అందులో తనతో మాట్లాడాలనుకునేవాళ్ళు ఆ వెబ్సైటు లో తను కొన్ని కోఆర్డినెట్స్ పెడుతుంది ఆ కోఆర్డినెట్స్ తెలుసుకుని అక్కడికి వెళ్తే తను రేడియోలోని ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా మనకు కనెక్ట్ అవుతుంది తను రీసెంట్ గా కొత్త కో ఆర్డినెట్స్ పెట్టడంతో తను న్క బ్రతికే ఉన్నారని అర్థమైంది"
"డాడ్ మరి వెబ్సైటు ఉంటె తన ఐపీ అడ్రెస్స్ ఎక్కడుందో తెలిసిపోతుంది కదా"
"నార్మల్ బ్రౌసర్ లో ఉండే వెబ్సైట్స్ తెలుస్తాయి కానీ డార్క్ వెబ్ లో ఉండే వెబ్సైట్స్ యొక్క ఐపీ అడ్రస్ ని ఎవరు కనుక్కోలేరు" అని అంటాడు. ట్రెవర్ మళ్ళీ ఏదో అడగబోతుంటే రేడియో నుండి సౌండ్ రావడం మొదలవుతుంది.
వెంటనే జార్జ్ ట్రెవర్ ని సైలెంట్ గా ఉండమని చెప్పి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ని చేంజ్ చేస్తుంటాడు. అప్పుడు బ్లాక్ డ్రాగన్ ఫ్లై కి కనెక్ట్ అవుతుంది.
"బ్లాక్ డ్రాగన్ ఫ్లై, మాట్లాడి చాలా కాలం అయింది ఎలా ఉన్నారు" అంటాడు జార్జ్.
"డైరెక్ట్ విషయానికి వచ్చేయండి" అని రకరకాల వాయిసెస్ చేంజ్ అవుతూ వినపడుతుంది.
"హలో డ్రాగన్ ఫ్లై మీ గురించి నేను చాలా విన్నాను నేను మీకు పెద్ద ఫ్యాన్. ఇంతకూ మీరు మగవారా లేక ఆడవారా" అని అడుగుతాడు ట్రెవర్ ఉండబట్టలేక.
"మీకు కేవలం ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఉంది" అని మళ్ళీ రకరకాల వాయిసెస్ చేంజ్ అవుతూ వినపడుతుంది.
జార్జ్ ట్రెవర్ ని సైలెంట్ గా ఉండమని చెప్పి డీల్ మాట్లాడతాడు. యాభై వేల కోట్లకు డీల్ కుదురుతుంది.
"ఇంతకు మీరు తనని ఎప్పుడు చంపేస్తారు" అని అడుగుతాడు ట్రెవర్.
దానికి డ్రాగన్ ఫ్లై వెటకారంగా "రేపే అతను నా దగ్గరికి వచ్చి నేనే ఆ ఏలియన్ ని చంపేసింది, నేనే దేశాలని ఆక్రమించుకుంటున్నది అని చెప్తాడు కదా ఆ మరుక్షణమే చంపేస్తా" అని సమాధానం వస్తుంది.
అప్పుడు జార్జ్ "ట్రెవర్ మనకే అతనెవరో ఎలా ఉంటాడో తెలీదు. ఇప్పటివరకు అతను కేవలం ఒక ఇండియన్ అని మాత్రమే తెలుసు అంత మంది ఉన్న జనాభాలో అతనిని కనిపెట్టడం చాలా కష్టం. కాబట్టి మనం తనకు కాస్త టైం ఇవ్వాలి" అంటూ డ్రాగన్ ఫ్లై తో "వాడు అలానే మాట్లాడతాడు నువ్వేం పట్టించుకోకు ఎంత టైం అయినా తీసుకోండి కానీ పని త్వరగా పూర్తి అయ్యేలా చూడండి" అనగానే రేడియో డిస్కనెక్ట్ అయిపోతుంది.