25-06-2024, 02:28 PM
ఢిల్లీ నగరంలో....
ఢిల్లీలో ఒక రద్దీ ప్రాంతం. ప్రొద్దున టైం తొమ్మిది అవుతుండడంతో ఆఫీస్ కి, కాలేజ్ కి కాలేజీకి వెళ్తున్నారు. అందరు వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక్కసారిగా ట్రాఫిక్ మొదలై రోడ్డు మీద బండ్లన్నీ ఆగిపోతుంటాయి. అందరూ ఆశ్చర్యంతో వెహికల్స్ నుండి దిగి పైకి చూస్తుంటారు.
వారు ఆకాశం వైపు చూడగా వాళ్ళ ముందు కొద్ది మీటర్ల దూరంలో ఒక స్పేస్ షిప్ నిలబడుతుంది. అది చాలా పెద్ద స్పేస్ షిప్. జనాలంతా దాని వైపే తీక్షణంగా చూస్తుంటారు. కొంత మంది దాన్ని మొబైల్ తో ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు.
ఆ స్పేస్ షిప్ ల్యాండ్ అవ్వకుండా గాలిలోనే నిలబడి ఉంది. అందులో నుండి కొన్ని చిన్న చిన్న స్పేస్ షిప్స్ బయటకు వచ్చి జనాల మీద నుండి ఆ స్పేస్ షిప్ నుండి దూరంగా వెళ్లిపోతుంటాయి. ఆ చిన్న స్పేస్ షిప్స్ అన్ని దిక్కుల్లో వెళ్లి ఆ స్పేస్ షిప్ చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక షీల్డ్ ని నిర్మిస్తాయి.
జనాలంతా అయోమయంగా ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తుంటారు. అప్పుడు ఆ పెద్ద స్పేస్ షిప్ నుండి నీలం రంగులో ఉన్న ఏలియన్స్ బయటకు వస్తాయి. ఆ ఏలియన్స్ చూడటానికి అందరూ ఒకేలా నీలం రంగులో ఉండి నల్లని మెరుస్తున్న కవచాలు ఆయుధాలను ధరించి ఉన్నారు.
అందులో ఒకడు చుట్టూ ఉన్న జనాలను చూస్తూ వాడి వెనక ఉన్న వాళ్ళతో ఏదో సైగ చెయ్యడంతో ఆ ఏలియన్స్ అంతా వారి ముందు ఉన్న జనాలని చంపడం ప్రారంభించారు.
అది చూస్తున్న మిగతా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుండి పారిపోతుంటారు. షీల్డ్ అడ్డంగా ఉండడం వలన ప్రజలు బయటకు వెళ్లలేకపోతారు. షీల్డ్ వద్ద ఉన్న జనాలను అక్కడే ఉన్న చిన్న స్పేస్ షిప్స్ లోని ఎలియెన్స్ చంపేస్తాయి. షీల్డ్ లోపలున్న భవనాలను, ఇళ్లను కూల్చేస్తు అల్లకల్లోలం చేస్తారు.
అలా దాదాపు ముప్పై నిమిషాలు జరిగిన నరమేధంలో వేల మందిని చంపేసి విధ్వంసాన్ని సృష్టిస్తారు. చుట్టూ రక్తంలో పడి ఉన్న శవాలు, కొన్ని శవాల నుండి బయటకి వచ్చిన అవయవాలు మాత్రమే ఉంటాయి. చివరిగా ఒక కుర్రాడు మిగిలి ఉంటాడు, తను స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు.
అక్కడి నుండి లేవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎందుకో నొప్పిగా ఉండడంతో తన వెనక ఉన్న కాళ్ళని చూసుకుంటాడు. అందులో ఒక కాలు మీద బిల్డింగ్ పడడం వల్ల కట్ అయిపోయి ఉంటుంది.
తనకు ఏడుపు ఆగదు. తన కాలు కట్ అయిపోవడంతో పాకుతూ ఆ షీల్డ్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. తన కళ్ల వెంట నీరు ధారలుగా కారుతూ ఉంటుంది.
అలా ఏడుస్తూ తన మనసులో "నేను చావకూడదు నేను బాగా చదువుకోవాలి, పెద్దవాడినై మంచి ఉద్యోగంలో చేరాలి, మా అమ్మని, చెల్లిని బాగా చూసుకోవాలి" అనుకుంటూ గట్టిగ ఏడుస్తూ "నేను బ్రతకాలి నేను బ్రతకాలి నేను బ్ర...." అంటుండగానే తన శరీరం నుండి తన తల వేరవుతుంది.
మర్ఖద్వ ఆ కుర్రాడి తలను నరికి తన పక్కన ఉన్న సైన్యంతో "ఇంకా ఎవరైనా బ్రతికున్నారా" అని అడుగుతాడు.
"లేరు ప్రభు" అంటాడు అతనితో పాటే ఉన్న రాయిస్.
"షీల్డ్ లోపల అంతా వెతకండి ఎవరైనా దొరికితే చంపెయ్యండి" అంటూ రక్తంలో పడి ఉన్న అవయవాలని తొక్కుకుంటూ స్పేస్ షిప్ లోకి వెళ్తాడు.
మర్ఖద్వ తన గొడ్డలికి అంటిన రక్తాన్ని తుడుస్తూ "ఏం బార్బెరా నువ్వు చెప్పినట్టే ఆ శక్తివంతుడు ఉన్న చోటే ల్యాండ్ అయ్యాం కానీ ఇంకా ఎవరు రాలేదే" అని అడుగుతాడు మర్ఖద్వ.
బార్బెరా మర్ఖద్వ చేసిన ఊచకోతను చూస్తూ షాక్ లో ఉంటాడు. తన వల్లనే ఇదంతా జరిగింది అనే విషయాన్నీ జీర్ణించుకోలేక పోతున్నాడు బార్బెరా.
"ప్రభు అంతా సిద్ధం చేశాను ఇప్పుడు మీరు ఈ గ్రహంలో ఉన్నవాళ్ళతో మాట్లాడచ్చు, మీరు మాట్లాడేది అందరు వింటారు" అంటుంది కాస్సీ.
ప్రపంచంలో ఉన్న టీవీ చానెల్స్, మొబైల్స్, సిస్టమ్స్ అన్నిటిలో ఒక్కసారిగా గ్లిచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వాటి నుండి ఏవో సౌండ్స్ రావడం మొదలవుతాయి. ప్రపంచంలో ఉన్న దేశాధినేతలతో సహా వందల కోట్ల మంది తమ మొబైల్స్ లో టీవీల్లో ఏం జరుగుతోందో అర్థం కాక అలానే చూస్తుంటారు.
అప్పుడు మర్ఖద్వ గంభీరమైన స్వరంతో మాట్లాడుతూ "పురుగుల్లారా వినండి ఇన్నాళ్లు మీరు విశ్వంలో ఒంటరి వాళ్ళం, శక్తివంతులమని అనుకుని ఉండచ్చు కానీ అది నిజం కాదు, మీ కన్నా శక్తివంతులం మేము, ఇప్పుడు మిమ్మల్ని వేటాడటానికి వచ్చాము, మీరు భయపడిన పారిపోయిన మిమ్మల్ని వదలము. ఇప్పుడు మీకున్న దారులు రెండు మాత్రమే మీలో ఉన్న శక్తివంతుడు ఎవరైనా ఈ షీల్డ్ ని దాటి నాతో పోటీ పడి నన్ను ఓడించండి, లేదా మీ మరణానికి సిద్ధం అవ్వండి మీకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది" అంటూ ముగిస్తాడు.
అది విని ప్రపంచంలో ఉన్న అందరు భయపడడం మొదలుపెడతారు. ఇండియాలో ఉన్న ఢిల్లీ లో గుర్తు తెలియని ఒక స్పేస్ షిప్ ల్యాండ్ అయిందని, అందులో నుండి వచ్చిన ఏలియన్స్ ఒక షీల్డ్ నిర్మించి అక్కడ ఉన్న ప్రజలను చంపేసారని ఏలియన్స్ ప్రజలని చంపుతున్న కొన్ని దృశ్యాలని ప్రసారం చేస్తారు, అన్ని సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది.
షీల్డ్ లోపల చనిపోయిన వారి కుటుంబం షీల్డ్ వద్దకు వచ్చి రోదిస్తుంటారు. మీడియా కూడా అక్కడే ఉండడంతో వారి వద్దకు వెళ్తుంది. మీడియా వద్ద వాళ్ళ గోడును వెళ్లబోసుకుంటారు
"నా కూతురు కాలేజికని బయల్దేరిన పిల్ల, తను నిన్ననే ఒక ఫుట్బాల్ టోర్న్మెంట్లో కప్ కూడా కొట్టింది ఈరోజు నా ఫ్రెండ్స్ కు ఈ కప్ చూపించాలి నాన్న అంటూ వెళ్ళింది కానీ ఇప్పుడు అక్కడ శవం అయి పడుంది అస్సలు ఈ గవర్నమెంట్, సెక్యూరిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి మమ్మల్ని రక్షణగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లదే కదా మరి వాళ్ళేం చేస్తున్నారు మిలిటరీ ఏం చేస్తుంది" అంటూ గుండె పగిలేలా రోదిస్తుంటాడు.
"నా కొడుకు అయ్యా వాడికి చదువంటే చాల ఇష్టం రెండేళ్లుగా నేను మంచాన పడడంతో వాడే ఇల్లు గడవడానికి చదువు మానేసి కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది, ప్రభుత్వం మారడంతో మా బ్రతుకులు కూడా మారాయి మళ్ళీ వాడు కాలేజ్ కి వెళ్తున్నాడు, ఈ రోజు కూడా రేపటి సంవత్సరం నుండి చెల్లెల్ని కూడా కాలేజ్ లో చేర్పిద్దాం అమ్మ అంటూ బయల్దేరాడు ఇప్పుడు చూస్తే నా కొడుకు అందులోనే ఉన్నాడు వీళ్ళేమో అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అంటున్నారు" అంటూ తను కూడా రోదిస్తుంటుంది.
"ఈ సంఘటనకు సంబంధించి టీవీలో వేస్తుంటే చూసాను సర్, అందులో నా భార్య కొడుకుని దారుణంగా చంపేశారు, నా కొడుక్కి కేవలం రెండేళ్లు సర్ అయినా కొంచెం కూడా కనికరం లేకుండా చంపేశారు" అంటూ ఏడుస్తుంటాడు.
అలా అక్కడి వారిది ఒకొక్కరిది ఒక బాధ చెప్పుకుంటారు. అప్పుడే అక్కడికి మిలిటరీ సైన్యం వాళ్ళను అక్కడి నుండి పంపిస్తుంది
అప్పుడు అక్కడ ఉన్నవాళ్లలో ఒకరు "వాళ్ళని ఎలాగో కాపాడలేకపోయారు కనీసం వారి బాడీస్ నైనా మాకు అప్పగించండి సర్ మీ కాళ్ళు పట్టుకుంటాను సర్" అంటూ ఏడుస్తున్న బలవంతంగా వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తారు.
పీఎం ఆఫీస్ లో....
ఈ అనుకోని పరిణామంతో ఢిల్లీలో స్టేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. దేశంలోని అగ్రనేతలు మరియు సైనికాధికారులు పీఎం ఆఫీసులో సమావేశమవుతారు. అందరి మొహాల్లో భయం, ఆందోళన కనపడుతుంటుంది.
ప్రైమ్ మినిస్టర్ ఎస్.వి అరవింద్ మాట్లాడుతూ "మేజర్ జనరల్, ఇప్పుడు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి" అని అడగగా
"సర్, ఆ ఏలియన్ షీల్డ్ దాదాపు మూడు కిలోమీటర్ల రేడియస్ వరకు విస్తరించి ఉంది. షీల్డ్ చుట్టు పక్కల ఉన్న ప్రజలని ఖాళీ చేయించాం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇక షీల్డ్ లోపల ఉన్నవాళ్ళ విషయానికి వస్తే మేమంతా షీల్డ్ చుట్టూ తిరిగి చెక్ చేసాం ఎవరు బ్రతికిలేరు, దాదాపు పది వేల మంది దాక ఉంటారని అంచనా, అందరు చనిపోయారు" అని అంటాడు మేజర్ జనరల్ విక్రమ్ సింగ్.
"అస్సలు వాళ్ళు వచ్చే ముందే మనకు ఎందుకు తెలీలేదు, నిరంతరం సౌర కుటుంబాన్ని గమనిస్తున్న ఇస్రో సాటిలైట్స్ ఏమయ్యాయి" అని అడుగుతాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంజయ్ గుప్త.
"సర్ మన ఇస్రో మాత్రమే కాదు నాసా సాటిలైట్స్ కూడా ఆ యూ.ఎఫ్.ఓ రావడాన్ని కనిపెట్టలేకపోయాయి, అది క్షణాల్లో భూమి మీదకి ప్రత్యక్షమైంది. దీనికి కారణం ఏంటో మనకు ఇంకా తెలీదు" అని అంటుంది డాక్టర్ అంజలి మెహతా. తను ఇస్రోలోనే ఫీజిసిస్ట్ గా అంతరిక్షంలోని వస్తువుల మీద పరిశోధన చేస్తుంటుంది.
"మరి ఆ షీల్డ్ సంగతి ఏంటి" అని అడుగుతాడు ప్రైమ్ మినిస్టర్ ఎస్.వి అరవింద్
"సర్ ఆ షీల్డ్ పై ఎన్నో ఆయుధాల్ని ప్రయోగించాం కానీ దానికి ఒక గీత కూడా పడలేదు మేమింకా ప్రయత్నిస్తున్నాం ఆ షీల్డ్ గురించి మరింత తెలిస్తే లాభం ఉండచ్చు" అంటూ మేజర్ జనరల్ విక్రమ్ సింగ్, డాక్టర్ అంజలి మెహతా వైపు చూస్తూ అంటాడు.
డాక్టర్ అంజలి మెహతా మాట్లాడుతూ "సర్ మేము ఆ షీల్డ్ గురించి పరిశోధనలు చేస్తున్నాం దాని గురించి ఇంకా మాకు ఏమి తెలీలేదు అది అస్సలు ఏ మూలకంతో తయారు అయ్యిందో తెలీదు మాకు ఇంకాస్త సమయం కావాలి" అని అంటుంది.
అప్పుడు అక్కడే ఉన్న జనరల్ అరుణ్ కుమార్(ఆయన ఆర్మీ స్టాఫ్ కి చీఫ్) మాట్లాడుతూ "సర్ మనకున్న ఒకే ఒక ఆప్షన్ న్యూక్లియర్ మిస్సైల్ మేబి అది వర్క్ అవ్వచ్చు కాబట్టి మీరు అనుమతిస్తే...." అని అంటుండంగా
ప్రైమ్ మినిస్టర్ ఎస్.వి అరవింద్ ఎదో చెప్పబోతుంటే ఇండియన్ ఎంబసీ నుండి కాల్ వస్తుంది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యులైన దేశాల ప్రెసిడెంట్లు ఎమర్జెన్సీ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇండియాతో కాన్ఫరెన్స్ లోకి వస్తారు.
అమెరికా, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ దేశాలు అన్నీ ఇండియాకు సంతాపాన్ని తెలియజేస్తాయి. ఇది ఇండియా సమస్య మాత్రమే కాదని, ఇది మానవాళికి సమస్యగా గుర్తించి, ప్రపంచ ముప్పుగా పరిగణించి, ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండి, ఆ ఏలియన్స్ ని ఎదురుకోవాలని నిర్ణయిచుకుంటాయి.
అందుకోసం వివిధ దేశాలతో చర్చించి వారి వద్దనున్న అడ్వాన్స్డ్ వెపన్స్ మరియు ఒక నైపుణ్యం ఉన్న వివిధ దేశాల సైనికులు ఉన్న ఒక సైనిక బృందాన్ని, ఆ బృందానికి నాయకుడిగా కల్నల్ డేవిడ్ ఆండర్సన్ ని నియమించి ఇండియాకు పంపిస్తాయి.
అలానే కొంతమంది ఖగోళ వస్తువుల మీద నైపుణ్యమున్న శాస్త్రవేత్తలని ఇండియా శాస్త్రవేత్తలతో టచ్ లో ఉండేలా చేస్తామని మీటింగ్ ని ముగిస్తారు.
వాళ్లంతా అక్కడి నుండి వెళ్ళిపోగానే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంజయ్ గుప్త, పీఎంతో "ఆయనకు ఈ విషయం తెలుసా, మీరు చెప్పారా" అని అడుగుతాడు.
"ఇంకా చెప్పలేదు" అని అంటాడు పీఎం ఎస్.వి అరవింద్.
"అస్సలు ఆయన ఎక్కడికి వెళ్లారు" అని పీఎం ని అడుగుతాడు.
పీఎం ఎస్.వి అరవింద్ ఏదో చెప్పబోతుంటే అక్కడికి వచ్చిన ఆఫీసర్ "సర్ ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు" అనడంతో పీఎం అక్కడి నుండి హోమ్ మినిస్టర్ ని చూస్తూ వెళ్ళిపోతాడు.
షీల్డ్ వద్ద మేజర్ జనరల్ విక్రమ్ సింగ్ తో పాటు కల్నల్ డేవిడ్ ఆండర్సన్ మిలిటరీ క్యాంప్స్ ని ఏర్పాటు చేస్తారు. షీల్డ్ కి ఇంకొక వైపు ఉన్న మీడియా వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తారు. అక్కడ జరుగుతున్న ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేస్తారు.
షీల్డ్ మీద పరిశోధనలు చెయ్యడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ అంజలి మెహతాని నాయకురాలిగా నియమిస్తారు. తాను ఆ లోహం గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తుంటుంది.
ఆ షీల్డ్ మీద కల్నల్ డేవిడ్ ఆండర్సన్ మేజర్ విక్రమ్ సింగ్ కలిసి మిగతా దేశాల నుండి తీసుకొచ్చిన ఆయుధాలతో దాడి చేయిస్తారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. భూమి లోపల నుండి తవ్వి షీల్డ్ లోపలికి చొరబడాలని ప్రయత్నిస్తారు.
కానీ నిజానికి ఆ షీల్డ్ భూమి లోపలికి చొచ్చుకుపోయి ఒక పూర్తి గోళాకారంలో ఉంటుంది. అందువల్ల అది కూడా సాధ్యపడదు. మొదటి రోజు పూర్తవుతుంది.
శాస్త్రజ్ఞ బృందం ఎంత ప్రయత్నించినా ఆ లోహం గురించి దాని బలహీనతల గురించి తెలుసుకోలేక పోతారు. వాళ్లకు ఒక విషయం మాత్రం అర్థమైంది ఆ మూలకం భూమి మీద దొరకదని. అది ఒక కొత్త లోహం అని.
కల్నల్ ఆండర్సన్ న్యూక్లియర్ మిస్సైల్ తో ఎటాక్ చేద్దాం అని చెప్తే, అందుకు విక్రమ్ సింగ్ వ్యతిరేకిస్తాడు. రెండో రోజు ముగుస్తుంది అన్న సమయంలో మిలిటరీ క్యాంపు ఉన్న చోటు షీల్డ్ ఓపెన్ అవుతుంది.
వెంటనే అందరూ అలర్ట్ అవుతారు. మర్ఖద్వ మొదటిసారి షీల్డ్ బయటకి వచ్చి, తనను తాను పరిచయం చేసుకుంటాడు. అతని పక్కన ఉన్న బార్బెరా వారి భాషనీ అనువదిస్తుంటాడు. బార్బెరా ఆంగ్లంలో మాట్లాడుతుంటే వారికి ఆశ్చర్యం వేస్తుంది.
మర్ఖద్వ తాను ఇక్కడికి శక్తివంతుడి కోసం వచ్చానని చెబుతాడు. కానీ వారు ఇక్కడ అలంటి వారు ఎవరు లేరు అని వాదిస్తారు. బార్బెరా ఎంత చెప్పిన వినరు. ఇక్కడ కేవలం శక్తివంతమైన దళాలు, ఆయుధాలు మాత్రమే ఉంటాయని కావాలంటే వాటితో పోటీ పడి చూడామని అంటాడు కల్నల్ ఆండర్సన్.
మర్ఖద్వ కోపంతో అందుకు ఒప్పుకుంటాడు. కానీ పోటీ జరిగేటప్పుడు ప్రపంచమంతా అది చూడాలని అంటాడు. అందుకు కల్నల్, మేజర్ జనరల్ ఒప్పుకుంటారు. మూడవ రోజు పొద్దున షీల్డ్ ఓపెన్ అవుతుంది అని పోటీకి సిద్ధమవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు మర్ఖద్వ.
మూడో రోజు పొద్దున షీల్డ్ ఓపెన్ అవుతుంది. దాదాపు ఏడు వేల సైన్యాన్ని అడ్వాన్స్డ్ ఆయుధాలతో, ఆర్మర్ మరియు జెట్స్ తో పంపిస్తారు. వారు లోపలికి వెళ్ళగానే షీల్డ్ క్లోజ్ అవుతుంది. మీడియా వారు షీల్డ్ బయటే ఉండి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు.
మర్ఖద్వ తన గొడ్డలిని తీసుకుని తను ఒక్కడే వారి వైపు వెళ్తాడు. దాదాపు రెండు గంటలు జరిగిన యుద్ధంలో అందరిని చంపేస్తాడు మర్ఖద్వ. ఎన్ని ఆయుధాలు అతని పై ప్రయోగించిన ఫలితం ఉండదు. షీల్డ్ బయట ఉన్న వాళ్ళు శిలల్లా చూస్తుండిపోతారు.
సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కుర్చీలో కూర్చుని పీఎం వైపు చూస్తుంటాడు. పీఎం దిగులుగా చేతితో తల పట్టుకుని కళ్ళని మూసేసి ఆలోచిస్తుంటాడు. ఏదో అలికిడి రావడంతో తన ముందున్న హోమ్ మినిస్టర్ ని చూస్తాడు.
"నాకేం చెయ్యాలో తెలీట్లేదు ఆయనని కాంటాక్ట్ అవ్వడానికి కుదరట్లేదు, సిగ్నల్స్ దొరకడం లేదు" అని అంటాడు పీఎం.
"అస్సలు ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు" అని అడుగుతాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్
పీఎం ఏదో చెప్పబోతుంటే. హడావిడిగా ఢిల్లీ సీఎం అక్కడికి వచ్చి టేబుల్ మీద చేతులు వేసి పీఎం ని చూస్తూ "ఆయన ఎక్కడ ఉన్నాడు, కల్కి సర్ ఎక్కడ" అని భయం కలగలిసిన ఆత్రుతతో అడుగుతాడు.