23-06-2024, 07:22 PM
(This post was last modified: 23-06-2024, 07:27 PM by Avengers35. Edited 2 times in total. Edited 2 times in total.)
నెక్స్ట్ డే..లాస్య ఎర్లి మార్నింగ్ వెళ్ళిపోయింది... ఆ తర్వాత...
" స్వప్న, సుచిత్ర ఎర్పోట్ కని కాబ్ బుక్ చేసుకొని బయలుదేరారు..
దారిలో ' స్వప్నని వాళ్ళ కాలేజీ దగ్గర దింపి... జాగ్రత్తలు చెప్పి సుచిత్ర వెళ్ళిపోయింది.
స్వప్న రాగానే..
తన ఫ్రెండ్స్...
నటాషా, బిందు.. విశాల్, రవి హై-ఫై ఇచ్చారు..
బిందు,రవి, స్వప్న డిగ్రీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్... విశాల్,నటాషా యమ్.బి.ఏ లో పరిచయం అయ్యారు..
కాలేజీ నుండి మొత్తం 30 మంది స్టూడెంట్స్..
రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ లో బయలుదేరారు.. వైజాగ్ కి.. 12 గంటల ప్రయాణం...
అందరూ ఎసి కంపార్ట్మెంట్ లో బుక్ చేసుకున్నారు .
స్వప్న అండ్ ఫ్రెండ్స్ కబుర్లలో పడ్డారు..
రవి 'అసలు నువ్వు వస్తావని అనుకోలేదు స్వప్న... మన గ్రూప్ లో నీ మెసేజ్ చూశాక ముందు షాక్. తరువాత చాలా హ్యాపీ..
విశాల్ 'అవును.. 'అవును.. నేను కూడా!!!
బిందు 'ఇంతకి.. ఎలా ఒప్పించావ్??? అంకుల్ ని??
నటాషా 'దాన్ని ఊపిరి పీల్చుకోనిస్తే మనకి ఆన్సర్స్ ఇస్తుంది.. అంటూ స్వప్న భుజం పై చేయి వేసింది..
స్వప్న 'నాదేం లేదు... అంతా మా వాళ్ళదే ప్లాన్.. శృతి ఇంకా బామ్మ డైరక్షన్ లో మా అత్త యాక్షన్ చేసింది.
విశాల్ కళ్ళు మెరిసాయి... (శృతి పేరు వినగానే )
నటాషా 'మ్.... మొత్తానికి మన శృతి మాత్రం సూపర్.... టామ్ బాయ్.. తను వస్తే బాగుండేది.
విశాల్ (అవును... నాకు ఇంకా బాగుండేది)
బిందు 'అవును... ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారని చెప్పావ్! ఎప్పుడు??
స్వప్న "మేబి మళ్ళీ అత్త వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు.. వుండొచ్చు..
నటాషా 'అంటే 6 నెలల లోపలే నా!!! ..
విశాల్ 'అయితే శృతి బాధ పడుతోందా... పెళ్ళి అయ్యాక నువ్వు తనని వదిలి వెళ్ళిపోతావని....
బిందు 'ఆంటీ... ఏమంటున్నారు????
విశాల్ 'బామ్మ అయితే ఫుల్ గా అన్ని తినడానికి రెడీ అయ్యిందా!!?
రవి 'ఇదంతా కాదు కానీ... నువ్వు ఏమనుకుంటున్నావ్ రా!!! అని అడిగాడు... మృదువుగా...
స్వప్న 'ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు రవి...నాకు అమ్మ, నాన్న.. ఎంతో..అత్త కూడా అంతే...తనకి రిషి ఎంతో నచ్చాడు... అన్నది కళ్ళు తిప్పుతూ...
రవి 'కాదురా!!! స్వప్న బంగారం... నీకు రిషి అంటే ఇష్టమేనా? ??
బిందు 'అవును.. స్వప్న. రవి ఏది అయినా చాలా డెప్త్ గా ఆలోచిస్తాడు... మా లాగా కాదు..
రవి 'అది కాదు... మీ నలుగురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్.. మీకు సంబంధించిన ప్రతి విషయం... నాకు ఇంపార్టెంట్...
స్వప్న ' రిషి గురించి మీకు చెప్తా.. అంటూ వాళ్ళ నలుగురి వైపు చూసింది..
మా అత్త, మావయ్యలు ...మావయ్య వైపు దూరపు బంధువులు అంట..
తను యమ్.ఎస్ చేశాడు. వాళ్ళ డాడితో కలిసి బిజినెస్ చూసుకుంటున్నాడు
మంచితనం లో కూడా ఓకే.... బట్.. కొంచెం introvert అంట .. అంటూ ఆగింది..
బిందు 'అయ్యో!....ఇది ఇప్పుడు అందరికీ ఒక ప్యాషన్ అయ్యిపోయిందిలే .. అనగానే..అందరూ నవ్వేశారు.
స్వప్న 'బిందు' నెత్తి మీద ఒక్కటి పీకింది
నటాషా ' కొత్తలో కొంచెం ఇబ్బంది...తరవాతే వాళ్ళే extrovert అయిపోతారు...
బిందు ' మీ మరదలు కూడా వచ్చింది అంటగ
స్వప్న ' హా....తనని శృతి ఓ రేంజ్ లో ఆడుకుంది లే
విశాల్ ' శృతి తో మామూలుగా వుండదు...
స్వప్న ' తను ఆడపిల్లే,నేను ఆడపిల్లే కానీ లాస్య నన్ను కొంచెం స్పెషల్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది...
నటాషా ' ఎందుకు అల అనిపించింది
స్వప్న ' ఏమో తెలీదు...శృతి కి లాస్యకి అసలు పడదు...ఎప్పుడు గొడవలే..కానీ నాతో అల వుండదు..నన్ను ఏదో ఇంప్రెస్స్ చేయాలి అన్నట్టు,నాతో ఎక్కువ మాట్లాడాలి అన్నట్టు వుంటాయి తన చూపులు...పోని అత్తని అడుగుదామంటే....ఏమనుకుంటుందో అని అడగలేదు..
స్వప్న ' కాని... నాన్నకి లాస్య అంటే ఎందుకో గాని చాలా ఇష్టం..
రవి 'మీ ఇద్దరి కన్నా కూడానా???
స్వప్న 'అలా కాదనుకో... అన్నది..
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
శృతి కాలేజీ లో తన ఫ్రెండ్స్ తో బాతాఖానీ మొదలెట్టింది.
శృతి ఫ్రెండ్స్..
'ఏంటే! మాకు పార్టీ ఇవ్వవా??? మీ అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందిగా..
శృతి 'ఆ... అయ్యిందనుకోండి... బట్ మా మరదలు లాంటి బావ కొంత ఓవర్ చేస్తుంది...అందుకే మొన్న లెంగ్త్ కట్ చేశా...
మొన్న ఒకరోజు ఏం జరిగింది అంటే: అంటూ చెప్పుకొచ్చింది డాడి తప్ప మేమందరం గుడికి వెళ్ళాము..
అక్కడ: అందరూ ప్రదక్షిణలు చేస్తుంటే.. తాతగారు,లాస్య ఒక పక్కకి కూర్చుంటారు..
శృతి 3 ప్రదక్షిణలు చేసొచ్చి...
' లాస్య ! నువ్వు ప్రదక్షిణలు చేయవా??
లాస్య కళ్ళతోనే 'నో... అని చెప్పింది.
శృతి 'మరి.. మా అక్కకి పూజలు అన్నా గుళ్ళు అన్నా చాలా ఇష్టం...
స్వప్న 'ఐ నో... మామ్ సెడ్..
' శృతి ' లాస్య' పక్కనే చేరి తల మీద ఒక మొట్టికాయ వేసి..
నీ అతి వేషాలు ఆపు.. ఇక్కడ ఎవరు లేరు...మరెందుకు ఇంగ్లీష్ లో కటింగ్ కొడుతున్నావ్??
లాస్య 'హహ. చూడు దెయ్యం...
వైపూ 'నేను దెయ్యమా????
లాస్య 'యస్.. అంటూ కళ్ళు ఎగరేసింది...
శృతి 'నేను దెయ్యం అయితే మా అక్క డెవిల్....
స్వప్న ' (నువ్వు దెయ్యం బట్ మీ అక్క దేవత).....హీ హి హి....నేను అంటే యుఎస్ లో ఉంటా కాబట్టి కల్చర్ గురించి అంతగా తెలీదు...
తనని చూడు పద్ధతిగా చీర కట్టుకంటే నువ్వు... జీన్స్ టాప్....
జడ చూడు... చక్కగా అటు ఇటు లయబద్దంగా ఊగుతూ... నువ్వు పోని టైల్ అంటూ శృతి హెయిర్ క్లిప్ లాగేసింది..
తనని చూడు కాళ్ళకి పట్టీలు.. చెవులకి జూకాలూ
టామ్ బాయ్ గెటప్ నువ్వు.... అంటూ మొహం మాడ్చేశింది ?
తాతయ్య (లాస్య అయ్యిపోయవ్ నువ్వు... పోయి పోయి శృతితో పెట్టుకున్నావు. ఫినిష్)
శృతి నార్మల్ గా..
'కరెక్టే లాస్య!!! నువ్వు చెప్పింది అయితే... ఒకటి చెప్పు....అక్క...అంటే నాకంటే బాగుంటుందా??
లాస్య 'చాలా అంటే చాలా... అంటూ కళ్ళ నిండా ఎక్సైట్మేట్ తో చెప్పింది...
శ్రుతి 'మరి మా అక్క నిన్ను అసలు పట్టించుకొదే ....
లాస్య 'వ్వాట్!!!! నువ్వు అబద్దం చెప్తున్నావ్!!!
స్వప్న కి ఇంట్లో పనులు వల్ల బిజీగా వుంటుంది...నువ్వు కూడా మధ్యలో అడ్డు వస్తున్నావు మాట్లాడదాం అన్నప్పుడు.
శృతి 'నీకెలా తెలుసు???
లాస్య 'ఎలా అంటే??? తనని పలకరించినప్పుడు నువ్వు తనతో మాట్లాడేదానివి..
తాతయ్య ' డిజే టిల్లు లో రాధిక లు వున్న జనరేషన్ ఇది ....ఇంకా ఎవరో అడ్డుపడుతున్నారు అని మనం అనుకున్న పని చేయకుండా వుండకూడదు.. అంటూ భుజం మీద ఒక్కటి చరిచాడు.
లాస్య 'అబ్బా! అంటూ భుజం రుద్దుకుంటూ....నేను ఊహ తెలిసాక 3 సార్లు వచ్చాను....లాస్ట్ టైం వచ్చినప్పుడు నాతో బానే మాట్లాడింది..
తాతయ్య శృతి ఒకరినొకరు చూసుకొని .... ప్స్... అంటూ కళ్ళతోనే సైగ చేసుకున్నారు.
శృతి ' నీకు జీవితం లో ఏమైనా తీరని కోరికలు ఉన్నాయా??
లాస్య ' ఎందుకు లేవ్....చాలానే ఉన్నాయి....కానీ వాటిలో ఒకటి తీరిన మిగతా అన్ని తీరిపోతాయి...
శృతి ' అది ఎలా!?
లాస్య ' నా ప్లానింగ్ అల ఉందిలే...
శ్రుతి ' అల ఐతే నీకు ఒక సీక్రెట్ చెప్పనా??
లాస్య ' ఎంటి అది...
శృతి ' నేను చెప్పనుగా...మ్.. హూ అంటూ లేచి వెళ్ళబోయింది..
లాస్య ' శృతి...ఏంజిల్ అంటూ తియ్యగా పిలిచింది...
శృతి ' దెయ్యం అన్నవ్??
లాస్య ' సీక్రెట్ అన్నవ్... సారీ..
శృతి 'మ్... ఆ... ఒక పని చేయి... అంటూ ఎదో చెప్పింది... తరువాత పూజ అయ్యాక గుడి ప్రాంగణంలో కూర్చున్నారు.. లాస్య తప్ప అందరూ వుండటంతో.. గౌతమి 'సుచీ! లాస్య ఏది??? అని అడిగింది . సుచిత్ర 'ఇక్కాడే వుండాలే... అంటూ చుట్టూ చూసింది.. అంతలో లాస్య కొంచెం దూరంలో.. ఒక చెట్టు కి... ఒక కాలితో ప్రదక్షిణలు చేస్తూ కనపడింది..
అది చూసి...
స్వప్న 'అదిగో లాస్య!!! అంటూ లేచింది..
అందరూ తన వెనుకే వెళ్ళారు..
బామ్మ ' ఓయ్!..లాస్య టవరూ!!! అలా ఒంటి కాలుతో ప్రదక్షిణలు చేస్తున్నావ్ ఎంటి!!! అని అడిగింది ఆశ్చర్యంగా..
శృతి నవ్వు ఆపుకుంటోంది...
లాస్య ఏమి మాట్లాడలేదు..ప్రదక్షిణలు చేస్తూనే ఉంది...
స్వప్న ' లాస్య!!! ఆగు.. కాలు నొప్పి పుడుతుంది.. అని ఆపింది.
లాస్య ' శృతి ' వైపు చూసి.. "నువ్వు చెప్పింది నిజమే...అన్నది.. స్వప్న 'ఏం చెప్పావ్!!! శృతి అని అడిగింది... సీరియస్ గా.. లాస్య 'ఏం లేదు... అది పెద్ద మ్యాటర్ కాదు పదండి అంటూ కాలు దించింది..
పాపం నొప్పితో సరిగా నడవలేక పోయింది..
అందరూ ముందు నడుస్తుంటే..
స్వప్న శ్రుతితో ' లాస్య కి ఏం చెప్పావ్??అని కోపంగా అడిగింది..
శృతి జరిగింది చెప్పి... నన్ను దెయ్యం... అంటూ మొహం మాడ్చేశింది.. అందుకే.. ఆ చెట్టు పవర్ ఫుల్ అని.. ఆ చెట్టు చుట్టూ ఒంటి కాలుతో తిరిగితే... తను అనుకున్నట్లు.. జరగుతుంది అని చెప్పా..అన్నది.
స్వప్న 'ఆర్ యూ మ్యాడ్... శృతి.... అలా ఎలా చెప్తావ్!!! అది నిజమే... ఆ చెట్టుకి ఆ పవర్ వుంది కాదనను. బట్ అందుకని లాస్య అమాయకత్వాన్ని అలా అడ్డం పెట్టుకొని..
టీజ్ చేస్తావా!!!చాలా తప్పు..ఒకరి బలహీనతలతో ఎప్పుడు ఆడుకోకుడదు..
వెళ్ళు..వెళ్ళి సారి చెప్పు..
శృతి 'నువ్వు చెప్పావ్ కాబట్టి చెప్తా... లే అంటూ ముందుకు వెళ్ళింది..
అంతా విని తన ఫ్రెండ్స్..
"మరి... చెప్పావా!!! శృతి 'అస్సలా... సమస్యే లేదు.. తను నన్ను ఎగతాళి చేసింది.. నేను రివేంజ్ తీర్చుకున్నాను... అని నవ్వేసింది.. బట్ తన అక్కకి అబద్దం చెప్పినందుకు మాత్రం ఫీల్ అయ్యింది.. &&& స్వప్న వాళ్ళు వైజాగ్ వెళ్ళేసరికి నైట్ అయ్యింది..
...............................................
ఒక 2 డేస్ అప్డేట్స్ ఉండవ్....తరవాత రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి...