Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#11
సిద్ధార్థ చేసిన పిచ్చి పనికి Dean పిలిచి warning ఇచ్చింది ఆ తర్వాత ఆ న్యూస్ మొత్తం viral అయ్యింది దాంతో రమేష్, మధు సిద్ధార్థ నీ నోటికి వచ్చినట్లు తిట్టారూ కానీ సిద్ధార్థ ఫోన్ mute లో పెట్టి మార్కిన్ తో Playstation లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు అప్పుడే సోఫియా వచ్చి తలుపు కొట్టింది వినోద్ వెళ్లి తలుపు తీశాడు అప్పుడు సోఫియా లోపలికి వచ్చింది తనని చూసి వినోద్ “మేడమ్ మీరు ఏంటి ఇక్కడ” అని అడిగాడు దానికి సోఫియా “సిద్ధార్థ” అని అడిగింది దాంతో వినోద్ తనని లోపలికి రానీచ్చి బయటకు వెళ్లి నిలబడాడు అప్పుడు సోఫియా బాడిగార్డ్ ఇలియాజ్ నీ చూసిన వినోద్ మొహం లో రంగులు మారాయి “మేజర్ సాబ్ ఎలా ఉన్నారు మీకు దిగాల్సిన బుల్లెట్ పాపం మీ ఫ్రెండ్ దిగింది కదా ఆ రోజు జాగ్రత్త ఈ ఫ్రెండ్ కీ ఏమీ దిగుదో చెప్పలేను” అని వెటకారం చేశాడు ఇలియాజ్ దానికి వినోద్ నవ్వుతూ “నా ఫ్రెండ్ బుల్లెట్ దిగితే నేను కాపాడుకోలేక పోయా జనాభ్ కానీ నా గన్ నుంచి మీ colonel తలకి తగిలిన బుల్లెట్ చూసి పారిపోయిన ఒక పిల్లి పిల్లను తీసుకొని వచ్చి prime minister కూతురు కీ సెక్యూరిటీ గా పెట్టారు చూడు అది మీ గవర్నమెంట్ తెలివి” అన్నాడు దానికి ఇలియాజ్ అక్కడి నుంచి తల దించుకోని వెళ్లిపోయాడు.

లోపల ఉన్న సోఫియా, సిద్ధార్థ తో “సిద్ధార్థ్ నాకూ నీ అంత ధైర్యం ఉంటే బాగుండు నాకూ కూడా ఇలాంటి క్రేజీ పనులు చేయాలి అని ఎప్పటి నుంచో ఆశ నను మీ టీం లో కలుపుకొండి ప్లీజ్” అని అడిగింది దానికి సిద్ధార్థ “సోఫి నువ్వు ఇలా నాతో కలిసి తిరుగుతూ మీడియా కీ కనుక దొరికితే నీకు నాకూ మీ నాన్న కు మా నాన్న కు రిస్క్ కానీ మనం కలిసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్ వేరు అదే క్రేజీ గా ఉంటుంది కాకపోతే నువ్వు నా లాగా ఒక క్రేజీ పని చేసి నిన్ను నువ్వు నిరూపించుకో” అని అన్నాడు దానికి సోఫియా ఏదో ఆలోచిస్తూ ఉంటే “భయం వద్దు నేను ఏమీ నాలాగా చేయమని చెప్పను రాత్రి నేను, మార్కిన్, డోని, విలియమ్స్ అందరం రాత్రి సీక్రెట్ గా పార్టీ కీ వెళుతున్నాం నువ్వు నీ బాడిగార్డ్ కీ తెలియకుండా వస్తే చాలు” అని చెప్పాడు దానికి సోఫియా కూడా సరే అని చెప్పింది, రాత్రి 10 తరువాత అందరూ హాస్టల్ గోడ బయట డోని కార్ దెగ్గర సోఫియా కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడు సోఫియా తన హాస్టల్ బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు వచ్చింది అప్పుడు Ferrari 599 GTD కార్ చూసి ఆశ్చర్య పోయింది సోఫియా దాంతో నేను నడపోచ్చా అని అడిగింది దాంతో సిద్ధార్థ సైగ చేయడం తో డోని కార్ తాళం సోఫియా కీ
ఇచ్చింది దాంతో సోఫియా మొదలు పెట్టడమే 80 kmph లో కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లింది తను వెళ్లే స్పీడ్ కీ టైర్ నుంచి పొగలు కూడా వస్తున్నాయి ఇలా కాలేజీ నుంచి స్టూడెంట్స్ బయటకు వచ్చారు అని తెలుసుకుని క్యాంపస్ చుట్టూ తిరుగుతున్న మీడియా వాళ్లు వీళ్లని వెంబడించారు దాంతో సోఫియా కార్ నీ ఇంకా స్పీడ్ గా పోనిచ్చి drift కొట్టి ఒక సందులో ఆగి హెడ్ లైట్ ఆపి మీడియా వాళ్ళు వెళ్లిపోగానే తను కార్ నీ pub వైపు పోనిచ్చింది.
అలా pub కీ వెళ్లగానే అందరూ సోఫియా నీ మెచ్చుకున్నారు అప్పుడు సిద్ధార్థ, సోఫియా నీ గట్టిగా కౌగిలించుకున్ని ముద్దు పెట్టాడు దాంతో సోఫియా లో మొదటి సారిగా ఏదో తెలియని ఫీలింగ్ మొదలు అయ్యింది అలాగే అందరూ pub లోకి వెళ్లారు అప్పుడు అక్కడ సిద్ధార్థ తనని కొట్టిన అమ్మాయి నీ చూశాడు నిన్న తనలో సంస్కృతి సంప్రదాయాలను చూశాడు కానీ ఇక్కడ తనలో ఉన్న hotness చూశాడు ఒక బ్లాక్ skrit వేసుకొని loose hair తో ultra modern అమ్మాయిల కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించింది దాంతో సిద్ధార్థ రెండు డ్రింక్స్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయి సిద్ధార్థ నీ చూసి ఏంటి అని సైగ చేసింది “well మీరు నాకూ చాలా బాగా నచ్చారు నిన్న మీలోని సంప్రదాయం నాలో ఇష్టం రేపింది కానీ ఈ రోజు మీలో hotness నాలో చిలిపి ఆశలు రేపింది ఈ డ్రింక్ తీసుకుంటే మీరు నన్ను క్షమించినట్టే” అని అన్నాడు సిద్ధార్థ దానికి ఆ అమ్మాయి లేచి సిద్ధార్థ చేతిలో ఉన్న గ్లాస్ లోని డ్రింక్ పారేసి ఖాళీ గ్లాస్ సిద్ధార్థ కీ ఇచ్చింది “నేను తాగను అండ్ నాకూ ఈ డ్రస్ లో ఎంత చిరాకుగా ఉందో నీకు తెలియదు ఏదో నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం వేసుకొని వచ్చా నీ డ్రింక్ పడేశా అని ఫీల్ అవ్వోదు నేను నిన్ను క్షమించా కాబట్టే పక్కన పోశా లేకపోతే నీ మొహం మీద పోసే దాని” అని చెప్పి వెళ్లిపోయింది దానికి సిద్ధార్థ నవ్వుతూ “హలో నీ పేరు చెప్పలేదు” అని అరిచాడు దానికి తను వెనకు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయింది.
మరుసటి రోజు ఉదయం మొదటి రోజు క్లాస్ కీ వెళ్లారు అందరూ అప్పుడు ఆ institute లోనే అతి strict అయిన ప్రొఫెసర్ వీళ్లకు క్లాస్ తీసుకున్నారు ఆయన క్లాస్ చెప్పిన తరువాత “మీకు అందరికీ గ్లోబల్ లీడర్ అయ్యే అర్హత కంటే ముందు కావాల్సింది diplomacy అంటే దౌత్యం మీ దేశం తో ఇంకో దేశ దౌత్య సంబంధాలు సరిగ్గా ఉంచగలిగినప్పుడు మీరు గొప్ప నాయకులు అవుతారు కాబట్టి మీ అందరి ఒక ప్రాజెక్ట్ వర్క్ అది నెలలో సబ్మిట్ చేయాలి మీకు ఇచ్చిన కవర్ లో మీతో పాటు మీరు project చేయాల్సిన మీ partner details కూడా ఉంటాయి now my assistant and your junior professor sandhya will guide you” అని చెప్పాడు అప్పుడు ఒక పదహారునాల అచ్చ తెలుగు అమ్మాయి క్లాస్ లోకి వచ్చి అందరికీ ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చింది తరువాత ప్రొఫెసర్ వెళ్లిపోయాడు అప్పుడు సంధ్య “మీ ప్రాజెక్టు నెల లోగా submit చెయ్యాలి ముఖ్యంగా మీ partners నీ మార్చే ప్రసక్తి లేదు keep that in your mind any doubts” అని అడిగింది సంధ్య అప్పుడు సిద్ధార్థ లేచి “మీ పేరు చెప్పలేదు” అని అడిగాడు దానికి సంధ్య “సంధ్య సంధ్య కాళింగరి” అని చెప్పి సిద్ధార్థ వైపు కొంటెగా చూస్తూ వెళ్లిపోయింది, అప్పుడే సోఫియా తన partner గా సిద్ధార్థ వచ్చాడు అని సంబరంగా వచ్చి సిద్ధార్థ పక్కన కూర్చుంది అప్పుడు సిద్ధార్థ సంధ్య వైపే చూస్తూ ఉంటే సోఫియా ఏంటి అని అడిగింది “అందమైన అమ్మాయి అందం చీర లోనే తెలుస్తుంది ఈ అమ్మాయి అందం రోజు రోజుకు పిచ్చి ఎక్కిస్తుంది” అని అన్నాడు సోఫియా ఇది గుర్తు చేసుకుంటూ ఉండగా తన సెక్యూరిటీ చీఫ్ వచ్చి “మేడమ్ ఫ్లయిట్ ల్యాండ్ అయింది” అని అన్నాడు దాంతో సోఫియా సిద్ధార్థ నీ రిసీవ్ చేసుకోడానికి వెళ్లింది అప్పుడు సిద్ధార్థ సోఫియా వేసుకున్న చీర చూసి షాక్ అయ్యాడు కానీ దానికంటే ఎక్కువ షాక్ అందులో సోఫియా అందం చూసి షాక్ అయ్యాడు.

సోఫియా తనని రిసీవ్ చేసుకోడానికి రావడం కంటే తను సంధ్య కోసం తెచ్చిన చీర సోఫియా వేసుకోవడం ఇంకా shocking గా ఉంది సిద్ధార్థ కీ దాంతో పాటు సోఫియా తో ఇన్ని రోజుల చనువు ఉన్న కూడా తన అందం ఎప్పుడు సిద్ధార్థ నీ డిస్టర్బ్ చేయలేదు కానీ ఎందుకో ఆ చీర సంధ్య కంటే సోఫియా కే బాగా కుదిరింది, దాంతో సిద్ధార్థ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అందుకే సోఫియా వైపు eye to eye కాంటాక్ట్ చేయలేక ఉన్నాడు “welcome to PASMMMMA PM sir” అని bouquet ఇచ్చింది సోఫియా దాంతో “Thank you సోఫి అని చెప్పి మళ్ళీ తల కొట్టుకొని బేగం సా” అన్నాడు సిద్ధార్థ దానికి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే బేగం అని భర్తలు మాత్రమే అనాలి అని చెప్పాడు వినోద్ దాంతో సిద్ధార్థ “సారీ మిస్ తహసిల్” అని అన్నాడు దాంతో సోఫియా నవ్వి పర్లేదు సోఫి అని పిలువు అని చెప్పింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి కార్ లో హోటల్ కి బయలుదేరారు సోఫియా అలా తన పక్కన ఉంటే మొదటి సారి సిద్ధార్థ చాలా ఇబ్బంది గా ఫీల్ అయ్యాడు అప్పుడు తన భుజం మీద చేయి వేసి అలాగే తల ఆనించి పడుకున్న సంధ్య మెల్లగా “ఏంటి నీ ఫ్రెండ్ నాకంటే అందం గా ఉందా” అని అడిగింది సంధ్య దానికి సిద్ధార్థ “నా దృష్టిలో ఎప్పటికీ నువ్వే అందగత్తెవి” అని అన్నాడు అది విన్న సోఫియా థాంక్స్ సిద్ధ్ అనింది దాంతో సంధ్య ప్రతిబింబం మాయం అయ్యింది దాంతో సిద్ధార్థ తన మెదడు నీ క్లియర్ చేసుకోడానికి పెషావర్ సిటీ అందాలు చూస్తూ ఉంటే అలా వెనకు రోడ్డు పక్కన ఉన్న భవంతులతో పాటు తన ఆలోచనలు కూడా గతంలోకీ వెనకు వెళ్లాయి.
[+] 1 user Likes raosahab786's post
Like Reply


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 2 Guest(s)