Thread Rating:
  • 13 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#15
స్వప్న వాళ్ళ ఇల్లు...ఆరోజు సండే...సుదీప్ ఇంట్లోనే వున్నాడు .

అందరూ కామ్ గా ఎవరి రూమ్స్ లో వాళ్ళు వున్నారు.. శ్రుతి,స్వప్న డోర్ లాక్ చేసి మరి లాపి లో సినిమాలు చూసుకుంటూ..పడిపడి నవ్వుతున్నారు..

స్వప్న 'అమ్మా! నా వల్ల కాదు శ్రుతి... సౌండ్ చేయకుండా నవ్వటం....

శ్రుతి 'నేను మాత్రం హ.హ.హ. అంటూ నవ్వుతున్నానా???

డాడీ ఇంట్లో వున్నారు కదా!!! అందుకే...

స్వప్న 'ప్స్! ఎంటోనే... పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము..

నాన్న పెద్దగా నవ్వరు... మరి అవసరం అయితే... హా హా..అంతే

శ్రుతి 'నాకు తెలిసి డాడ్ ఒక్కరే.... వుంటారేమో... ఇలా!!!

స్వప్న 'ఏమో! మనకెలా తెలుస్తుంది... నేనైతే మన నాన్న కాబట్టి ఏమి అనలేను..

అదే ఇంకెవెరైనా ఇలా నవ్వకుండా మొహం పెట్టుకుంటే.. చెవిలో పెద్దగా అరిచి... మరి అడుగుతా??

శ్రుతి 'ఏమని???

స్వప్న 'ఏమయ్యా!!! నీకు దేవుడు.. కళ్ళు ఎందుకు ఇచ్చాడు?? అందాలని, ఆనందాలని, సంతోషాలని చూడటానికి.....నోరు ఎందుకు ఇచ్చాడు??
ఆ కళ్ళకి సమాధానం ఇవ్వటానికి...మనస్సు ఎందుకు ఇచ్చాడు???
అటు కళ్ళని... ఇటు నోటికి... స్పందించమని చెప్పటానికి..

శ్రుతి 'అక్కోయ్! నువ్వు ఒకటి మర్చిపోయావ్??? అట్లా వున్నారు అంటే వాళ్ళకి మనసే లేదని.. స్వప్న కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.. 'ఓహో!!!.

శ్రుతి 'అయినా డాడ్ కొంచెం బెటర్... ఈ మీటింగ్స్ లో... పార్టీ లలో నవ్వుతారు... స్వప్న 'మరి మనతో ఎందుకు అలా వుంటారు???

శ్రుతి 'అదేమో... గాని... నీ టూర్ సంగతి అడగవా?? ....ఇంకో వన్ వీకె టైం వుంది...

స్వప్న 'ఎంటో శ్రుతి.. అడగాలంటే ధైర్యం చాలటం లేదు...

శ్రుతి 'హ.హ. డాడ్ ని టూర్ సంగతే అడగలేని దానివి....ఎవరో గన్నాయి ని పట్టుకొని.. కళ్ళు, ముక్కు...అంటూ క్లాస్ ఏం పీకుతావ్??? అంటూ నవ్వింది.

ఈలోపు ఎవరో డోర్ కొట్టారు..

అంతే లాప్ టాప్ లో ఏదో వర్క్ ఓపెన్ చేసి... స్వప్న సైలెంట్ గా కూర్చుంది .

శ్రుతి డోర్ తీసింది..

వాళ్ళ బామ్మ.. లోపలకి వచ్చి...

'మీ ఇద్దరికీ ఒక గుడ్ న్యూస్.... అన్నది.

ఇద్దరూ 'డాడ్ బయటకు వెళ్ళారా??? అని అడిగారు ఒక్కసారిగా..

బామ్మ 'వాడు వెళితే... తలుపు దబదబా బాదేయను..ఇంత చిన్నగా కొడతానా???

స్వప్న 'అయితే గుడ్ న్యూస్ ఏంటి???

బామ్మ 'సాయంత్రం... మీ అత్త ఇంకా మీ మరదలు వస్తున్నారు అనగానే...

స్వప్న బెడ్ మీదనే ఎగిరి....

'అత్త... వస్తోందా... వావ్ అంటూ డాన్స్ చేసింది.. శ్రుతి 'అత్తతో పాటు మీ మరదలు కూడా వస్తుంది అన ఈ డాన్స్???

స్వప్న 'అదేం లేదు... నేను మా అత్త కోసమే... ఈ డాన్స్... అంటూ బెడ్ మీద నుంచి దూకి వాళ్ళ బామ్మని హగ్ చేసుకుంది ..

బామ్మ 'నాకు తెలుసు స్వప్న... నీకు మీ అత్తా... దానికి నువ్వు అంటే లవ్వు ...

శ్రుతి 'అంతేనా చూడటానికి అక్క అచ్చు "అత్త" కి జిరాక్స్ కాపి

బామ్మ 'అంతేకాదు.. మీ మరదలు తన బిజినెస్ మీటింగ్ పని మీద వస్తుంది...

పనిలో పనిగా స్వప్నకి వాళ్ళకి తెలిసిన అబ్బాయి అంట ఎవరో అతని పెళ్ళి గురించి... కూడా మాట్లాడుకుంటున్నారు

అప్పటి దాకా ఆనందంగా వున్న స్వప్న మొహంలో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి..

అది చూసి శ్రుతి 'వాట్ హ్యపెండ్??? ఎందుకు ఫేస్ డల్ గా పెట్టావ్???

స్వప్న 'పెళ్ళి... అంటేను... భయం వేస్తోంది..

బామ్మ 'చూడు... స్వప్న.. ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్ళి చేసుకోని వెళ్ళాల్సిందే...

కాకపోతే.. కేవలం నీకు మాత్రమే దొరికిన ఛాన్స్..

పుట్టింటి నుంచి మళ్ళీ పుట్టింటి లాంటి మి అత్త ఇంటి దగ్గరలో ఉండబోతున్నావ్..

అక్కడ నువ్వు ఏది చెప్తే అది...మీ అత్త,మామ,మరదలు.... ... అందరూ నీ ఫ్యాన్స్.

స్వప్న 'అవునక్కా... యు ఆర్ సో లక్కి....

గౌతమి వచ్చి 'అత్తా! లంచ్ రెడి... పదండి తిందాం.. అందరూ సైలెంట్ గా వెళ్ళారు.. డైనింగ్ హాల్ దగ్గరకి... సుదీప్ కూర్చోని వున్నాడు.. తాతగారు వచ్చి కూర్చున్నాడు. ఇక మన ఆడలేడిఔరత్ లు కూడా వచ్చారు.. గౌతమి అందరికీ వడ్డిస్తోంది... శ్రుతి స్వప్న' కి సైగ చేసింది... అడుగు... అని!!! స్వప్న 'నాన్న! మీతో ఒకమాట.... అది.. మరి..

సుదీప్ ' స్వప్న ! నువ్వు అడగాలనుకుంటున్నావా??? లేక ఎదైనా చెప్పాలి అనుకుంటున్నావా??? అని అడిగాడు యమా సీరియస్ గా..

స్వప్న 'అడగాలి.

తాతగారు, శ్రుతి నవ్వు ఆపుకుంటున్నారు..

స్వప్న వాళ్ళ వైపు చూసి....(నాగార్జున హుమ్మ్)

'మా కాలేజీ లో టూర్ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. నేను... అది.. నన్ను.. అంటూ ఆగిపోయింది.

అందరూ తినడం ఆపి సుదీప్ వైపు చూశారు ..

టైగర్ బాబు ఏం చెప్తాడా??? అని .

సుదీప్ ఎవరి వైపు చూడటం లేదు... కామ్ గా తింటున్నాడు....

రెండు నిమిషాల తర్వాత..

బామ్మ  ' దీపు..స్వప్న చిన్నప్పటి నుంచి..ఇది కావాలి అని అడగలేదు.. ఫస్ట్ టైం... అడిగింది రా!!! అన్నది...

సుదీప్ వాటర్ తాగుతూ...'అమ్మా! నా సిద్ధాంతాలు మీ అందరికీ తెలుసు..ఆడపిల్లలు పెళ్ళి అయ్యేవరకు... చాలా జాగ్రత్తగా ఉండాలి..

తాతయ్య 'ఓరుకోరా!!! అది వెళ్తా అంటోంది... ఫ్రెండ్స్ తో... కాదు.. కాలేజీ తో.. అందరూ తోడు వుంటారు .

సుదీప్ 'అదే ప్రాబ్లం... అబ్బాయిలు కూడా వున్నారు..

బామ్మ 'అబ్బాయిలు వుంటే ఇంకా సెక్యూర్డ్ గా వుంటుంది ..

సుదీప్ 'అవునవును.. బయట అబ్బాయిల నుంచి వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు.. కానీ వాళ్ళలో వాళ్ళు పోటీ మాత్రం పడతారు..

గౌతమి నోరు మెదపటం లేదు..అలా సెట్ చేశాడు.. దీపు అంకుల్...

ఇంక లాభం లేదని శ్రుతి 'డాడ్!! అక్క కి అన్నీ తెలుసు.. టూర్ కి వెళ్ళినంత మాత్రాన తన లైఫ్ లో మార్పులు ఏమి జరగవు...

సుదీప్ ' శ్రుతి.. విల్ యు.. అంటూ కోపం గా చూశాడు..

శ్రుతి 'ఏమో! డాడ్... మీ రూల్స్... ఒక్కొక్కసారి నాకు మెంటల్ ఎక్కిస్తాయి.

స్వప్న 'ష్!! శ్రుతి అలాగేనా??? మాట్లాడేది అంటూ కోపం గా చూసింది ..

తను కామ్ అయ్యింది..

సుదీప్ 'చూడు స్వప్న!! వీళ్ళ అందరి సపోర్ట్ వున్నంత మాత్రాన నేను ఒప్పుకోను...అది నీకు తెలుసు...
ఇంకో విషయం ..

అత్త వాళ్ళకి తెలిసిన అబ్బాయితో నీ పెళ్ళి ఫిక్స్ చేశా....

ఈవెనింగ్ ఫ్లైట్ కి అత్త,లాస్య ఇద్దరూ వస్తున్నారు..

అండ్ శ్రుతి... నువ్వు కొంచెం పద్ధతిగా వుండటం నేర్చుకో.. అని చెప్పేసి కామ్ గా వెళ్లి పోయాడు...
ఈ దీపు అంకుల్... వున్నాడే... చెప్పాల్సినది స్ట్రైట్ గా మొహం మీద ... చెప్పేస్తాడు..

ఎవరు ఏమనుకుంటున్నారో అని కూడా ఫీల్ అవ్వడు ?

శ్రుతి ఏమో కోపంగా
స్వప్న ఏమో సాడ్ గా

బామ్మ 'ఛిల్! గార్ల్స్... డోంట్ గివ్ అప్.. ఐ హావ్ ఎ ప్లాన్... అంటూ చిన్నగా ఏదో చెప్పింది..

తాతయ్య 'వర్క్ అవుట్ అవుతుంది అంటావా??? అన్నారు అనుమానం గా

గౌతమి అవుతుంది... మావయ్యా... నాకు నమ్మకముంది..

స్వప్న బామ్మ ని హగ్ చేసుకొని.... 'థాంక్యూ... బామ్మా... అన్నది సంతోషంగా..

ఆ రోజు ఈవెనింగ్ సుదీప్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు.. స్వప్న లోపల వాళ్ళ అత్త కోసం వంట చేసే పనిలో పడింది..

ఇంటి ముందు కారు వచ్చి ఆగింది..

ఒక ఆరు అడుగుల కటౌట్... దిగింది.. వాళ్ళ అమ్మతో పాటు గా...

వాళ్ళని గౌతమి రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకొచ్చింది.. శ్రుతి 'అత్తా... అంటూ హగ్ చేసుకుంది.. బామ్మ 'ఎలా వున్నావే సుచి... (సుచిత్ర)... అంటూ దగ్గరికి తీసుకుంది.. తాత 'ఏ లాస్య !!.. టవర్ లా ఇంత ఏదిగవ్ అంటూ లాస్యని పలకరించాడు.

సుచిత్ర 'ఊరుకోండి... నాన్న... మీరు మీ పెటైర్స్... అంటూ చుట్టూ చూసింది..

గౌతమి 'కూర్చో... వదినా నీ కోడలు తనే స్వయంగా వంట చేస్తోంది... నీ కోసం ...

సుచిత్ర 'అయ్యో! నా బంగారాన్ని వంట చేయిస్తున్నారా!! అంటూ కిచెన్ లోకి వెళ్ళింది..

సదరు లాస్య 'హాయ్! శ్రుతి... హౌ ఆర్ యూ.. అని
అని అడిగింది .

శ్రుతి 'ఏ తల్లి నాలుక రాదా??? అని అడిగింది .

లాస్య 'వ్వాట్ .. వ్వాట్... కమ్ ఎగైన్????..

వైషూ 'అదిగో మళ్ళీ... అంటూ నవ్వింది..

లాస్య తాతగారితో 'వాట్.. గ్రాండ్ పా... వై షీ ఈజ్ లాఫింగ్.. అండ్ సేయింగ్.... సమ్ సమ్ అంటూ నాన్చుతుంటే..

తాతయ్య ' లాస్య ... తల్లి అంటే ..

లాస్య 'మదర్...

తాతయ్య 'నాలుక.. అంటే నాలుక చూపించింది..

లాస్య 'టంగ్... ఓ.. మదర్ టంగ్...

శ్రుతి 'హా.. అదే నీ మాతృభాష తెలుగు... అది నీకు వచ్చు.. బట్ ఎందుకో. తెగ కటింగ్ కొడుతున్నావ్...

లాస్య 'నో యార్!! యాక్చువల్లీ... వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్.... అంటూ ఏదో చెప్తుంది.

లోపల సుచిత్ర అటు తిరిగి వున్న స్వప్న ని వెనుక నుంచి హగ్ చేసుకుంది..

స్వప్న 'అత్తా! అంటూ ఆనందంగా వాటేసుకుంది..

సుచి 'వ్వాట్! మై డియర్ క్యూట్ పై... నా కోసం దిగులు పెట్టుకున్నావా??? ఇలా చిక్కిపోయావ్!!!

గౌతమి 'మరే... నువ్వేమో... వీడియో కాల్ లో తప్ప... రావటం కూడా తగ్గించేశావ్!!!!

స్వప్న అందరికి బాదం మిల్క్ రెడి చేసింది..

అందరూ హాల్ లో కి వెళ్ళారు..

స్వప్న ' హేయ్ లాస్య ఎలా...ఉన్నావ్..

లాస్య గుండె రాగం తప్పింది... (లయ అంటే... రెగ్యులర్ వర్డ్.. ) లాస్య గ్లాసు అందుకుంటూ..

'ఐయామ్... గుడ్ ... స్వప్న... వాట్ ఎబౌట్ యు..

స్వప్న 'అయ్యో! మరదలు లాంటి బావ... చక్కగా తెలుగు నేర్చుకుంటున్నావని చెప్పింది అత్త...

శ్రుతి 'అదేం లేదు అక్కా... ఎన్ ఆరై కదా...తెలుగులో మాట్లాడితే మనం ఫీల్ అవుతాం అనుకుంటుంది..

లాస్య 'నో... యార్... నాకు తెలుగు... క్లారిటీ గా రాదు.. మోర్ ఓవర్ ఐయామ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్..

శ్రుతి (ఐనా  ఇది ఏంటి ....అక్కని చూసి ఇంత బ్లష్  అవుతూ.. ఓవర్ చేస్తుంది... చెప్తా చెప్తా..)

బామ్మ ' లాస్య ' పక్కనే చేరి..

'ఓకే.. మై డియర్ లాస్య.. లెట్ దెమ్ గో... ఐయామ్ విత్ యు...

లాస్య ' థాంక్స్ గ్రాని...అంటూ హగ్ చేసుకుంది...

సుచిత్ర 'అవును...మా టైగర్ బ్రదర్ ఏడి???

గౌతమి 'అర్జెంట్ పని వుందని బయటకు వెళ్ళారు .

సుచిత్ర 'అమ్మా! అన్నయ్య ఇంకా మరడా???

బామ్మ 'వాడు మారడని ఫిక్స్ అయ్యే మేమే మారాం... లాస్య కన్ను ఆర్పకుండా ' స్వప్న నే చూస్తుంది. స్వప్న  అందరు తాగేశాక... కిచెన్ లోకి వెళ్ళిపోయింది.. సుచిత్ర 'అంటే... అన్నయ్య లేనప్పుడు...

తాతయ్య 'భేషుగ్గా... కావాల్సినవి వండుకోవడం.... తినేయడం...

బామ్మ 'వాడు లేనపుడు టివిలో సీరియల్స్, కామెడి షోలు.. వాడు వచ్చే టైం కి భ భక్తి ఛానల్..

గౌతమి 'నాకు అయితే ఆయన్ని చీట్ చేయడం నచ్చేది కాదు.

సుచిత్ర 'ఇవన్నీ నాకు తెలుసు... అంతా ఈ చిన్న దాని ప్లాన్ కదూ...అంటూ శ్రుతి బుగ్గలు లాగింది...

శ్రుతి 'లేకపోతే... ఏంటి అత్తా!!! ఆయన కాలేజీ డేస్ లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని.. జాగ్రత్త పడాలి... కరెక్టే...బట్ ఇలా ఏమి సరదాలు వద్దు..అంటే ఎలా???

అందుకే... నేనే వీళ్ళందరిని చెడ గొట్టేశా... అంటూ కాలర్ ఎగరేసింది..

సుచిత్ర 'మ్... అర్థం అయ్యింది... బట్ మా అన్నయ్య... కాలేజీ రోజుల్లో చాలా సరదాగా వుండేవాడు..

నన్ను నెలకి ఓసారి సినిమాకి తీసుకెళ్ళే వాడు.. నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చి సర్ఫైజ్ లు ఇచ్చేవాడు...

అలాంటిది... సడెన్ గా మారిపోయాడు..

సినిమా కి కాదు కదా... పక్కింటికి కూడా పర్మిషన్ ఇచ్చే వాడు కాదు..


లాస్య 'మామ్! ఐ వాంట్ టు టాక్ విత్ స్వప్న అనింది...

సుచిత్ర ఏం పట్టించుకోలేదు..

గౌతమి ' తను కిచెన్ లో ఉంది వెళ్ళు.. లాస్య..అనగానే లాస్య లేచి హుషారుగా వెళ్ళింది .

శ్రుతి దగ్గు వచ్చినట్లు దగ్గుతూ... 'వాటర్ తాగి వస్తా అంటూ లాస్య వెనకే వెళ్ళింది..

గౌతమి 'నువ్వు పద వదినా రెస్ట్ తీసుకుందువు గాని... అంటూ పైకి తీసుకెళ్లింది.

కిచెన్ లో స్వప్న వంట కంప్లీట్ చేసి..తిరిగి చూసేసరికి లాస్య తననే చూస్తోంది.

లాస్య వెనుక శ్రుతి 'ష్!! అంటూ స్వప్న కి సైగ చేసింది..
స్వప్న 'ఏంటి లాస్య??? అని అడిగింది..

లాస్య ' యక్చ్ వలి... ఐ వాంట్ టు సే సమ్ థింగ్.... అంటూ.. స్వప్న దగ్గరకు వచ్చింది..

స్వప్న వెనక్కి వెళ్ళింది..

లాస్య ' ఈరోజు నువ్వు.. అంటుడగానే.... శ్రుతి లాస్య చేతిని గట్టిగా గిచ్చింది...

స్వప్న,శ్రుతి ఇద్దరూ హై ఫై ఇచ్చుకున్నారు.. లాస్య కోపం గా చూసేసరికి..

శ్రుతి తన నడుముతో లాస్య ని ఒక్కతోపు తోసి..

'ఏం బావా ఐనా మరదలా!!! తెలుగు తన్నుకుంటూ వచ్చింది . అంటూ నవ్వే సరికి..లాస్య కోపం గా....చూసి వెళ్ళిపోయింది..

స్వప్న 'అయ్యో! శ్రుతి లాస్యకి కోపం వచ్చింది. ఇప్పుడెలా??? అన్నది కంగారుగా,

శ్రుతి 'ఏం పర్లేదు... లేకపోతే.. తెలుగు వచ్చి కూడా కటింగ్ కొడుతుంది..ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడని చెప్తా...అంటూ వెళ్లిపోయింది..

               ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

ఆరోజు నైట్....

కాళి 'వీర' తో...'వీరా!!! సేఠ్ ఇల్లు నీ చేతికి వచ్చేసింది. తరువాత??? ఏం చేయాలని... వీరా 'ఎదో చెప్పాడు .. అది విని కాళి.. 'అవునా??? అన్నాడు ఆశ్చర్యంగా.. 'కాళి' తప్పకుండా.... నువ్వు చెప్పటం నేను చేయకపోవడం... వీర 'సుబ్బు, సింహా ఇద్దరికి కాస్తా గట్టిగా చెప్పు...

వీర 'కాబట్టి.. నువ్వు ఆ పనిలో వుండు...

అవతల వున్న వాడు ఎంత పెద్ద తోపు అయినా... ప్రయత్నించకుండా వెనక్కి రావొద్దని..

కాళి ' ఆ... నేను చెప్తాను.

ఈలోపు బయట గేటు చప్పుడు అయ్యింది.. కాళి లేచి వెళ్ళాడు..ఫుల్ మందు కొట్టేసి..వీర నాన్న

'రేయ్! వీరా... రా! రా! బయటికి. నా.. కొడకా... నేను కంటేనే... నువ్వు పుట్టావ్.. రా!!! ఏం చూసుకొని రా... నీకు అంత బలుపు.. రారా రేరేయి... అంటూ తూలుతూ నిల్చున్నాడు.

కాళి 'ఏంటి? బాబాయ్...ఇది... వాడు ఇంట్లోనే వున్నాడు..

ఆయన 'నాకేమైనా ??? భయమా??? పిలు వాడిని పిలు..

వీర కోపంగా బయటకి వచ్చి "దీని కోసమేగా వచ్చావ్"   అని 'డబ్బుల కట్ట' విసిరి మొహన కొట్టాడు..

ఇంక దొబ్బేయ్... అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.

ఆయన కట్ట అటు ఇటు తిప్పి 'నా కొడుకు... దేవుడు...నాన్నా! వీర... నా బంగారు తండ్రి....
నువ్వు పుట్టడం నా అదృష్టం రా... అంటూ వెళ్లిపోయాడు..

కాళి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.....
[+] 9 users Like Avengers35's post
Like Reply


Messages In This Thread
Veera - by Avengers35 - 17-06-2024, 09:25 PM
RE: Veera - by sri7869 - 17-06-2024, 09:56 PM
RE: Veera - by dombull7 - 17-06-2024, 10:58 PM
RE: Veera - by hijames - 18-06-2024, 01:05 AM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:01 PM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:02 PM
RE: Veera - by hijames - 18-06-2024, 02:19 PM
RE: Veera - by Avengers35 - 19-06-2024, 12:07 PM
RE: Veera - by hijames - 19-06-2024, 12:33 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 01:41 AM
RE: Veera - by Saikarthik - 20-06-2024, 10:40 AM
RE: Veera - by appalapradeep - 20-06-2024, 11:59 AM
RE: Veera - by sri7869 - 20-06-2024, 07:24 PM
RE: Veera - by hijames - 20-06-2024, 08:24 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 08:33 PM
RE: Veera - by hijames - 20-06-2024, 09:38 PM
RE: Veera - by sri7869 - 20-06-2024, 09:45 PM
RE: Veera - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: Veera - by Avengers35 - 21-06-2024, 08:24 PM
RE: Veera - by Saikarthik - 21-06-2024, 09:18 PM
RE: Veera - by sri7869 - 21-06-2024, 09:43 PM
RE: Veera - by dombull7 - 21-06-2024, 11:29 PM
RE: Veera - by hijames - 22-06-2024, 03:38 AM
RE: Veera - by Avengers35 - 22-06-2024, 09:02 PM
RE: Veera - by sri7869 - 22-06-2024, 09:04 PM
RE: Veera - by hijames - 23-06-2024, 04:30 AM
RE: Veera - by Saikarthik - 23-06-2024, 10:42 AM
RE: Veera - by Avengers35 - 23-06-2024, 07:22 PM
RE: Veera - by hijames - 23-06-2024, 08:11 PM
RE: Veera - by sri7869 - 23-06-2024, 10:28 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 07:31 PM
RE: Veera - by hijames - 08-07-2024, 07:36 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 08:43 PM
RE: Veera - by hijames - 08-07-2024, 09:50 PM
RE: Veera - by sri7869 - 09-07-2024, 05:00 AM
RE: Veera - by Saikarthik - 09-07-2024, 09:00 AM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 09:43 PM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 10:00 PM
RE: Veera - by 3sivaram - 20-07-2024, 10:38 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 06:54 AM
RE: Veera - by sri7869 - 20-07-2024, 10:21 PM
RE: Veera - by Uday - 21-07-2024, 03:04 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 04:23 PM
RE: Veera - by Uday - 21-07-2024, 07:08 PM
RE: Veera - by sri7869 - 22-07-2024, 11:25 AM
RE: Veera - by Avengers35 - 10-08-2024, 10:53 PM
RE: Veera - by sri7869 - 11-08-2024, 01:00 PM
RE: Veera - by vrao8405 - 01-09-2024, 11:49 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 01:36 PM
RE: Veera - by বহুরূপী - 17-11-2024, 05:08 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 05:19 PM
RE: Veera - by sri7869 - 17-11-2024, 06:38 PM
RE: Veera - by Avengers35 - 21-11-2024, 07:59 AM
RE: Veera - by sri7869 - 21-11-2024, 10:23 AM
RE: Veera - by BR0304 - 21-11-2024, 01:41 PM



Users browsing this thread: 4 Guest(s)