19-06-2024, 11:48 AM
అనుమనం - పెనుభూతం : ఇరవై ఏడు
కృష్ణ తన భుజంతో అనుపమ తల్లిని పొడుస్తూ "ఏమే అత్త, మటన్ కూర ఎదే" అన్నాడు. (కృష్ణకి మేనత్త, కృష్ణ ఆమె బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు)
కృష్ణ తన భుజంతో అనుపమ తల్లిని పొడుస్తూ "ఏమే అత్త, మటన్ కూర ఎదే" అన్నాడు. (కృష్ణకి మేనత్త, కృష్ణ ఆమె బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు)
అనుపమ తల్లి "నీ కంటి ముందే కద రా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది, నర్సింహని వెళ్లి తీసుకు రానీ" అంది.
కృష్ణ "వండక పో, నీ చెయి కొరుక్కుని తింటా" అంటూ చనువు గా ఆమె భుజం కొరుకుతున్నాడు.
అనుపమ తల్లి "అమ్మో అమ్మో చూడవే, వీడు కుక్క లాగా" అంటూనే కృష్ణ భుజం చరిచింది.
కృష్ణ "అబ్బా..... అంత గట్టిగానా కొట్టేది" ఉండు నీ పని చెబుతా అంటూ అనుపమ తల్లి యొక్క చెయి మేలి వేశాడు.
అనుపమ తల్లి "అమ్మో అమ్మో చంపేస్తున్నాడు రోయ్"
అనుపమ "రేయ్ వదులు రా...."
కృష్ణ "తను చెప్పింది కాబట్టి వదులుతున్నా" అని వేలు చూపించాడు.
అనుపమ తల్లి "హుమ్మ్" అనుకుంటూ లేచి కట్టు బొట్టు సరి చేసుకొని వంట గదిలోకి వెళ్ళింది.
నర్సింహ "సిగ్గు లేదు రా... నీకూ..." అంటూ నవ్వాడు.
అప్పుడే ఇంట్లోకి మిగిలిన ముగ్గురు స్నేహితులు శ్రీరామ్, మల్లేషం మరియు సత్య వచ్చారు.
కృష్ణ "నా ఫ్రెండ్ రా తనూ... కదా అత్తా"
అనుపమ తల్లి "అవును ఏవరు దొరకలేదని నీతోనే సావాసం చేయాలి"
కృష్ణ "అరె నాకేం తక్కువ, ఇప్పుడే కదా... కిట్ట పరమాత్ముడులాగా మాయ చేసి ఒకరి జీవితం కాపాడాను"
మల్లేషం ఈల వేశాడు.
కృష్ణ "న్యాచురల్ గా నువ్వు నా భక్తురాలివి అవ్వాలి" అంటూ చిటికే వేశాడు.
అనుపమ తల్లి "అబ్బో చాలా వేషాలు ఉన్నాయే" అంది.
అనుపమ "అయినా కిట్ట పరమాత్ముడు, ద్రౌపదికి బెనారస్, కంచి పట్టు చీరలు ఇచ్చాడు... నువ్వు పెండింగ్ ఉన్న చీరే ఇంత వరకు దిక్కు లేదు" అంది.
నర్సింహ తన భార్య మళ్ళి మామూలుగా అవ్వడంతో హ్యాపీగా అయ్యాడు.
నర్సింహ "మరే.... నువ్వేమో చీరలు చింపించావ్" అంది. శ్రేయ చినిగిన బట్టలను ఉద్దేశిస్తూ.
అందరం నవ్వాం...
కృష్ణ "పిచ్చి భక్తులారా...." అని చేతిని పెద్ద బాబా లా పోజ్ పెట్టి స్టైల్ గా చెబుతూ "చీరల పంపిణి కార్యక్రమం కాదే టాపిక్... న్యాయం నిలబెట్టడంమ్ ధర్మాన్ని ఉద్దరించడం" అంటూ డివైన్ స్మైల్ ఒకటి పడేశాడు.
అనుపమ "రేయ్, నువ్వు ఇంకో చీర పెండింగ్ ఉన్నావ్..... మొత్తం రెండూ..." అంటూ వచ్చింది.
అనుపమ తల్లి "సచ్చింది గొర్రె"
కృష్ణ "అమ్మ నీ యమ్మా, దీనికి దొరికాను.... అసలే చీరల పిచ్చిది" అని చిన్నగా అన్నాడు.
అనుపమ "హా! హా! వినపడింది... మీ ఇంటికి వస్తా... మీ అమ్మ చేత ఒకటి వదిన చేత ఒకటి, మొత్తం మూడు పెట్టించ లేదనుకో" అంటూ వేలు చూపిస్తుంది.
కృష్ణ "క్షమించు నర్సింహ, నీకు ఇలాంటి పెంకి పెళ్ళాన్ని యిచ్చి చేశాం" అని డ్రమాటిక్ గా అన్నాడు.
అనుపమ తల్లి "ఆపూ నీ వేషాలు, ఇటొచ్చి వంటలో సాయం చెయ్"
కృష్ణ "ఏంటి నేనా... ఆరడుగుల మగాడిని నాకు వంట పని చెబుతున్నావా.... హతవిధి" అంటూ డ్రామా చేస్తున్నాడు.
అనుపమ తల్లి "రేయ్, నువ్వు మూడు అడుగులు ఉన్నప్పుడు నుండి చేసిన వెధవ పనులన్నీ చెప్పమంటావా" అని బెదిరించింది.
కృష్ణ గట్టిగా నవ్వి "వద్దు.... అంత సాహసం చేయొద్దు నేనే వస్తా" అని వెళ్ళాడు.
నర్సింహ, వాళ్ళను చూసి తలకోట్టుకొని నవ్వుతూ శ్రీరామ్ తో "మావోడు, సిటీ లో కూడా ఇంతేనా...."
శ్రీరామ్ నవ్వి "డబుల్...."
అందరం నవ్వుకున్నాం.....
కొద్ది సేపటికి మల్లేషం లేచి వెళ్లి కొడవలి తీసుకొని వెళ్లి భోజనం కోసం అరటి ఆకులు కోసుకొని వచ్చాడు.
సత్య మరియు శ్రీ రామ్ వెళ్లి బిందెలు పంపు దగ్గర నీళ్ళు పట్టుకొని వచ్చారు.
కొద్ది సేపటి తర్వాత మల్లేషం "రేయ్ ఈ కొడవలి భలే పదునుగా ఉంది రా...." అంటూ చూపించాడు.
కృష్ణ చేతిలోకి తీసుకొని "అవును పదును గా ఉంది" అంటూ నర్సింహకి చూపించాడు.
అప్పటి వరకు కొంచెం సైలెంట్ గా ఉన్న నర్సింహ కృష్ణ చేతిలో కొడవలి పదును గురించి మాట్లాడుతూ ఉంటే పగలబడి నవ్వుతున్నాడు.
అందరూ నర్సింహని అయోమయంగా చూస్తూ "ఎందుకు నవ్వుతున్నావ్" అని అద్గుతుంటే "ఏం లేదు" అంటూ నవ్వుతూనే ఉన్నాడు.
అనుపమ కూడా నవ్వుతూ "ఏంటి?" అంటే "ఏం లేదు" అని చెప్పాడు.
( మూడు నెలల క్రితం, కృష్ణని అనుపమ విషయంలో అనుమానించి ఆ కొడవలితోనే చంపేద్దాం అని పదును పెట్టించి అక్కడ పెట్టాడు)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them