Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#5
సిద్ధార్థ చెప్పింది విన్న తర్వాత మధు, వినోద్ అదే పనిలో ఉన్నారు కాకపోతే సిద్ధార్థ అసలు ప్లాన్ వీల్లకు తెలియదు వాళ్ల నాన్న స్విస్ బ్యాంకుల్లో దాచిన 15,000 కోట్లు లో 1,000 కోట్లు తన తండ్రి బినామీ అకౌంటు లోకి షేర్ చేసి మరుసటి రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు “పిల్లవగానే వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలిసిందే మా నాన్న మన ప్రియతమ నేత రమేష్ ఠాకూర్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు దానికి సంబంధించిన విచారణ జరుగుతుందీ కాకపోతే ఆయన చావుకు ఎవరూ కారణం నాకూ తెలియదు కానీ ఆయనను చంపే అవసరం ఏంటో తెలిసింది” అని అంటూ తన బాగ్ లో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసి చూపించాడు సిద్ధార్థ “ఇవి ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేదవారికి ఉచిత వైద్య, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం సూచిస్తు, వారి పూర్తి ఆరోగ్యం తో బయటకు వచ్చే వరకు వాళ్లకు కావాల్సిన కర్చు మొత్తం ఉచితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించేలా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో foreign equipment తో మెరుగైన వైద్యం కోసం ఒక వెయ్యి కోట్లు వరకూ sanction చేశారు ఇది కనుక జరిగితే ఇక్కడ ఉన్న మెడికల్ mafia కీ కష్టం అవుతుంది అని ప్రతిపక్షంలోనో,లేదా మిత్రపక్షంలోనే ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు కానీ నా తండ్రి కొంచెం అనారోగ్యంతో బాధపడుతు హాస్పిటల్ లో ఉండటం వల్ల ఈ బిల్ కొంచెం ఆలస్యం అయ్యింది కాకపోతే ఈ రోజు ప్రజల ముందు నేను బిల్ నీ పాస్ చేస్తున్నా నాకూ తెలుసు నాకూ ఆ అధికారం లేదు అని కాకపోతే చట్ట సభల్లో ఈ బిల్ అంత తేలిక గా పాస్ అవ్వడం జరగదు అందుకే ప్రెస్ ముందు ఈ బిల్ గురించి ప్రజలకు తెలిసేలా చేశాను దీని కోసం మేము, facebook, twitter లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం కాబట్టి మీ హక్కు నీ మీరే కాపాడుకోండి జై హింద్” అని ప్రెస్ మీట్ ముగించాడు సిద్ధార్థ.
ఇది అంత చూస్తున్న వినోద్, మధు తో “సార్ నిజంగా అంకుల్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్” అని అన్నాడు దానికి మధు నవ్వుతూ “నీ బొంద వాడు ఫైనాన్షియల్ మినిస్టర్ advisor గా ఉన్నపుడు వాళ్ల నాన్న తో చెప్పిన ప్రపోజల్ అది అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు ఇమేజ్ కోసం వాళ్ల నాన్న సంతకం వాడే పెట్టి దాని approval చేయించి PM అవ్వాలి అని ప్లాన్ చేశాడు” అని సిద్ధార్థ మాస్టర్ ప్లాన్ చెప్పాడు దానికి వినోద్ “అమ్మ దొంగ నా కొడుక” అని మనసులో సిద్ధార్థ నీ తిట్టుకున్నాడు, ప్రెస్ మీట్ ముగుస్తుండగా “సార్ మీరు ఇప్పుడు ప్రధాని అవ్వాలి అని చెప్పి ఈ బిల్ బయటకు తీసుకొని వచ్చారు అని అనుకోవచ్చా” అని అడిగారు ఒక రిపోర్టర్ “సార్ నా దృష్టిలో యువత మాత్రమే ఇప్పుడు ముందడుగు వేయాలి అని నా ఆలోచన ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ advisor, ఢిల్లీ యూత్ లీడర్ గా నాకున్న అనుభవం తక్కువ అది ఒప్పుకుంటా నేను కాకపోయినా ఎవరైనా యువ నాయకులు ప్రధాని అయిన నాకూ సమంజసమే” అని చెప్పాడు సిద్ధార్థ “ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు” అని ఒక రిపోర్టర్ అడిగితే “ప్రజల మధ్య లో ఉండి ప్రజా సేవ నేర్చుకున్నాను” అని చెప్పాడు అంతలో ఒక రిపోర్టర్ “Linbergh లో మీతో పాటు ఆ రోజు మీ కాలేజీ వెనుక ఉన్న పార్క్ లో మీతో పాటు అర్ద నగ్నంగా ఫోటో లో దొరికిన అమ్మాయి ఎవరో ఇప్పుడయినా చెప్తరా సార్” అని అడిగాడు ఒక రిపోర్టర్ దాంతో సిద్ధార్థ మొహం లో నవ్వు మాయం అయ్యింది తన ముందు ప్రపంచం అంతా blank అయ్యింది అప్పుడు వినోద్, మధు సిద్ధార్థ నీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్లారు అప్పుడు సడన్ గా సిద్ధార్థ కార్ మీద ఒకటే సారి బుల్లెట్ వర్షం కురిసింది దాంతో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పగిలి ఒక బుల్లెట్ సిద్ధార్థ కుడి చేతికి తగిలింది.
దాంతో వినోద్ మిగిలిన సెక్యూరిటీ వాళ్లు ఎదురు కాల్పులు చేశారు అప్పుడు సిద్ధార్థ నీ ఇంటికి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారు అప్పుడు పార్టీ అధినేత మధు కీ ఫోన్ చేసి రెండు రోజుల్లో సిద్ధార్థ ప్రమాణ స్వీకారం అని చెప్పారు అది విన్న మధు సిద్ధార్థ వైపు చూసి సక్సెస్ అని అన్నాడు దానికి సిద్ధార్థ నవ్వుతూ “రేయ్ వినోద్ మీ sniper కీ Olympic లో గోల్డ్ మెడల్ confirm” అని చెప్పాడు (ఆ ఎటాక్ అంతా సిద్ధార్థ ప్లాన్ తను ఆ హాస్పిటల్ బిల్ ప్రపోజల్ తెచ్చింది తన ఇమేజ్ క్లీన్ అని నిరూపించుకోవడం కోసం కానీ ఎవరైనా తన గతం గురించి గేలికితే మొత్తం smash అని అర్థం అయ్యి ఆ controversy నుంచి జానలను divert చేయడానికి ముందు ప్లాన్ ప్రకారమే తన మీద తనే ఎటాక్ చేయించాడు) రెండు రోజుల తరువాత సిద్ధార్థ ప్రమాణ స్వీకారం కోసం తనతో పాటు vancross University లో చదివిన ఇంగ్లండ్ యువరాజు విలియమ్స్, అతని భార్య డోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు కొడుకు ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ మార్కిన్, పాకిస్తాన్ ప్రధాని కూతురు ఆ దేశ foreign affairs మినిస్టర్ సోఫియా తహసిల్ అందరూ వచ్చారు వీలు ఐదుగురు మంచి ఫ్రెండ్స్ సిద్ధార్థ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తన మదిలో ఒకటే జ్ఞాపకం కదులుతుంది “నువ్వు మన దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తున్నప్పుడు నేను మన జెండా రంగుల తో ఉన్న చీర కట్టుకుని వచ్చి ముందు వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతూ నీకు flying kiss లు ఇస్తా” అని తన ప్రేయసి సంధ్య చెప్పిన మాట గుర్తుకు వచ్చి కంటి నుంచి కన్నీరు కారింది సిద్ధార్థ కీ.
ప్రమాణ స్వీకారం తరువాత సిద్ధార్థ కంట్లో నీరు చూసి మధు “మీ నాన్న గుర్తుకు వచ్చాడా మీ నాన్న కల నిను ఇలా చూడటం కానీ తను అనుకున్న స్థాయి కంటే ఇంకా పైకి ఎదిగావ్ అందుకు చాలా గర్వంగా ఉంది రా సారీ సార్” అని సిద్ధార్థ నీ తీసుకొని వెళ్లాడు బయట కార్ లో ఇంటికి వెళుతుండగా కార్ కిటికీ నుంచి చూస్తే సంధ్య మోకాలి పైన నిలబడి సిద్ధార్థ వైపు చూస్తూ చేతులు చాచి రా అని పిలిచినట్టు అనిపించింది దాంతో వెంటనే కార్ లో నుంచి దూకి పరుగున వెళ్లి సంధ్య నీ కౌగిలించుకోవాలి అని చూశాడు కానీ అది అంత తన భ్రమ అని తెలిసి కొంచెం దిగులు గా కార్ వైపు వెళుతు తిరిగి వెనకు చూశాడు అప్పుడు సంధ్య ఒక flying kiss ఇచ్చి మాయం అయిపోయింది ఆ తర్వాత సిద్ధార్థ కార్ కూర్చొని తన చేతికి సంధ్య పెట్టిన ఉంగరం చూస్తూ ఉండిపోయాడు ఇంటికి వెళ్లిన తర్వాత సంధ్య ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించి తన బెడ్రూమ్ లో పెట్టాడు సిద్ధార్థ, సంధ్య ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయిన సిద్ధార్థ నీ వెనుక నుంచి hug చేసుకొని “సారీ రా” అని చెప్పి బయటకు వెళ్లాడు వినోద్ ఆ తర్వాత సాయంత్రానికి వినోద్, సింగ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే సిద్ధార్థ వాళ్ళని లోపలికి పిలిచాడు దాంతో ఇద్దరు లోపలికి వెళితే సిద్ధార్థ సంధ్య ఫోటో వైపు చూస్తూ “నాకూ మూడు బీర్లు కావాలి” అని అన్నాడు దాంతో వినోద్ కీ, సింగ్ కీ ఆరి కాలి నుంచి వణుకు మొదలైంది దాంతో వినోద్ “స్ట్రాంగ్ ఆ లైట్ ఆ” అని అడిగాడు దానికి సిద్ధార్థ స్ట్రాంగ్ అన్నాడు దాంతో సింగ్ కీ పాంట్ లోనే పడిపోయింది.
సిద్ధార్థ ఎప్పుడైనా కోపం లో ఉన్న, బాధ లో ఉన్న బీర్ తాగాలీ అనుకుంటే అవతలి వాళ్లకు బ్యాండ్ మొగిపోతుంది వాడు తాగితే అవతల వాళ్ల బాడి కీ football కీ తేడా ఉండదు సిద్ధార్థ కీ దాంతో వేరే దారి లేక వినోద్,
సింగ్ నీ పంపి బీర్ తెప్పించాడు దాంతో పాటు సిద్ధార్థ favorite ఫిష్ ఫ్రై కూడా తెప్పించాడు అప్పుడు సిద్ధార్థ బీర్ ఫిష్ ముందు పెట్టుకొని వాటి వైపే చూస్తూ ఉన్నాడు తరువాత వినోద్, సింగ్ వైపు చూశాడు సింగ్ కీ భయం తో హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అప్పుడే వంట అతను వచ్చి ఒక ఆమ్లెట్ పెట్టాడు అతని తాగుతావా అని అడిగాడు అతను మొహమాటం తో ఇప్పుడు వద్దు సార్ అన్నాడు, అయితే ఆమ్లెట్ తిను అన్నాడు దానికి వంటవాడు అది మీ కోసం సార్ అన్నాడు దొరికాడూ బకరా అనుకోని వినోద్ “అయితే దాంట్లో విషం కలిపావా” అని అన్నాడు దాంతో వంటవాడు లేదు సార్ అని తినడం మొదలు పెట్టాడు వాడు తినడం పూర్తి అయ్యే లోపు సిద్ధార్థ మూడు బీర్లు లేపేసాడు అప్పుడు తన ముందు ఉన్న వంటవాడిని పట్టుకుని “ఒరేయ్ నాన్న నువ్వు ఒక దేశం కీ ప్రధాని అయితే మాత్రం కన్న కొడుకు కీ అవార్డ్ ఇస్తుంటే రావా ” అని లాగి కొట్టాడు దాంతో వినోద్, సింగ్ ఇద్దరు షో స్టార్ట్ అయ్యింది అని డోర్ వెనకు వెళ్లి దాకుని చూస్తున్నారు, “సార్ ఏంటి సార్ అలా కొట్టారు” అని అడిగాడు ఆ వంట అతను దాంతో సిద్ధార్థ మళ్లీ కొట్టి “ఒక అమ్మాయి నచ్చింది అని చెబితే అది మన కులం కాదు అంటావా” అని మళ్ళీ కొట్టాడు దాంతో వినోద్ టాపిక్ ఎక్కడికి వెళుతుందో అర్థం అయ్యింది దాంతో సిద్ధార్థ నీ బెడ్ కీ కట్టెసి handcuffs వేశాడు “నేను ప్రేమించిన అమ్మాయి మన కులం కాకపోతే చంపేస్తావా” అని ఆరిచాడు సిద్ధార్థ అది విన్న వినోద్ ఇంక ఎవరూ వినలేదు కదా అని చూసి డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు.
నిద్రలో ఉన్న సిద్ధార్థ కలలో తన గతం కదలడం మొదలు అయ్యింది.
[+] 3 users Like raosahab786's post
Like Reply


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 2 Guest(s)