Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#3
అప్పటికే మధు పార్టీ హై కమాండ్ మీటింగ్ లో ప్రధాని తరుపున ఆ మీటింగ్ కి హాజరు అయ్యారు అక్కడ అందరూ తరువాత ప్రధాని అయితే నేను అవ్వాలి అంటే నేను అవ్వాలి అని కొట్టుకుంటూ ఉన్నారు ప్రధాని ఆరోగ్యం చాలా క్షీణించింది ఈవాళ, రేపు అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి ఈ విషయాన్ని బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు పార్టీ నాయకులకు రాష్ట్రపతి కీ తప్ప ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్ ఆ video తీసుకుని వచ్చి మధు కీ చూపించారు దాంతో మధు మొహం లో ఒక్కసారిగా రంగులు మారాయి వెంటనే ఆ video నీ పార్టీ అధినేత కీ చూపించారు మధు అది చూసిన పార్టీ అధినేత సరే అని సైగ చేశారు దాంతో మధు సెక్యూరిటీ ఆఫీసర్ తో కలిసి హడావిడి గా హైదరాబాద్ చేరుకొని సిద్ధార్థ ఉంటున్న కాలనీ కీ వెళ్లారు అప్పుడు కాలనీ వాళ్లు అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అప్పుడు మధు లోపలికి వెళ్లి సిద్ధార్థ మందు తాగి పడిపోతే అలాగే ఎత్తుకొని వచ్చి కార్ లో వేసి తీసుకుని వెళ్లాడు అప్పుడు కాలనీ వాళ్లు అంతా సిద్ధార్థ ఇంట్లోకి వెళ్లి చూశారు అక్కడ గోడ మీద చాలా ఫొటోలు, సర్టిఫికేట్ లు ఉన్నాయి అందులో ఒక ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు అది మన ప్రధాని తో సిద్ధార్థ కలిసి దిగిన ఫోటో దాని కింద “Best father in the world” అని రాసి ఉంది.
సిద్ధార్థ ప్రధాని రమేష్ ఠాకూర్ కొడుకు అని తెలిసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు ఒక అబ్బాయి గూగుల్ లో సిద్ధార్థ గురించి కోడితే కొన్ని వివరాలు వచ్చాయి “అందరూ ఇలా చూడండి సిద్ధార్థ NLU ఢిల్లీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ల నాన్న ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నపుడు ఫైనాన్షియల్ లా advisor గా ఉన్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే రమేష్ గారు prime minister అయ్యారో సిద్ధార్థ నీ కూడా లోకల్ యూత్ లీడర్ నీ చేశారు ఆ తర్వాత సిద్ధార్థ vancross University Lindbergh లో చాలా మంది వరల్డ్ politicians పిల్లల తో పాటు తను కూడా politics గురించి డిగ్రీ పొందాడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ ఒక controversy లో ఇరుకున్నాడు ఆ తర్వాత తను ఎక్కడికో మాయం అయిపోయాడు” అని సిద్ధార్థ గురించి మొత్తం వివరాలు చెప్పాడు.
ఇది ఇలా ఉంటే మధు సిద్ధార్థ నీ chartered flight లో తిరిగి ఢిల్లీ తీసుకుని వెళుతున్నాడు అప్పుడు ఫ్లయిట్ లో తన బెడ్ మీద ఉన్న సిద్ధార్థ కీ మెలుకువ వచ్చింది అప్పుడు flight attendant వచ్చి “your juice sir” అని చెప్పింది దాంతో ఆమె గొంతు గుర్తు పట్టిన సిద్ధార్థ మత్తులోనే “థాంక్ యు జూలియట్” అని చెప్పాడు తరువాత సిద్ధార్థ కీ అనుమానం వచ్చి లేచి చూస్తే తన రెండు చేతులకు బేడీలు వేసి ఉన్నాయి అది చూసిన సిద్ధార్థ “సింగ్ జి నువ్వు బయట ఉన్నావు అని నాకూ తెలుసు వచ్చి handcuffs తీయి” అని కోపం గా అరిచాడు ఇది అంత బయట నుంచి వింటున్న సిద్ధార్థ బాడిగార్డ్ సింగ్ లోపలికి వెళ్లాలి అంటే భయపడుతున్నాడు, “రేయ్ వినోద్ నా కొడక నువ్వు కూడా ఉన్నావు అని నాకూ తెలుసు వచ్చి handcuffs తీయి రేయ్ వినోద్” అని అరిచాడు సిద్ధార్థ దాంతో వినోద్ కీ కోపం వచ్చి లోపలికి వెళ్లి సిద్ధార్థ నీ నాలుగు పీకి “మూసుకొని కూర్చో” అని అన్నాడు (వినోద్, సిద్ధార్థ ఇద్దరు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు అంతేకాకుండా సిద్ధార్థ సెక్యూరిటీ వింగ్ లో వినోద్ చీఫ్) అప్పుడే లోపలికి వచ్చిన మధు నీ చూసిన సిద్ధార్థ “ఆల్ఫ్రెడ్ నేను ఎవరో తెలిసి కూడా ఇలా చేయడం తప్పు ఆల్ఫ్రెడ్” అని అన్నాడు (సిద్ధార్థ కీ బ్యాట్మాన్ అంటే చాలా ఇష్టం అందుకే మధు నీ చిన్నప్పటి నుంచి బ్యాట్మాన్ కీ అసిస్టెంట్ అయిన ఆల్ఫ్రెడ్ పేరుతోనే పిలుస్తాడు) “చూడు సిద్ధు నేను మీ నాన్న సెక్రటరీ మాత్రమే కాదు ఫ్రెండ్ నీ కూడా నా ఫ్రెండ్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు తన చివరి కోరిక నువ్వు తన ముందు ఉండాలి అని నేను నా స్నేహం కోసం చేస్తున్న నువ్వు ఇష్టం గా వచ్చిన ఎలా వచ్చిన నువ్వు నాతో రావాలి అంతే వినోద్ వాడు నీకు ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు కానీ తను నీ బాస్ show some bloody respect” అని చెప్పి వెళ్లిపోయాడు.
దాంతో సిద్ధార్థ ఆకలి వేస్తుంది అని చెప్తే వినోద్ జూలియట్ నీ టిఫిన్ తీసుకుని రమ్మని చెప్పి బయటకు వెళ్లాడు జూలియట్ వచ్చిన తర్వాత తనకు బెడ్ కింద ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది దాని బాత్రూమ్ లో పెట్టామని చెప్పి జూలియట్ జడ లో క్లిప్ తీసి పక్కన పెట్టి టిఫిన్ తింటున్నట్టు నటిస్తూ జూలియట్ వెళ్లిపోవగానే తన handcuffs విడిపించుకొని తన బెడ్ కింద నుంచి కింద cargo లోకి వెళ్లి flight cargo door తెరిచి బాత్రూమ్ లో ఉన్న ప్యారాచూట్ తో కిందకి దూకి తప్పించుకున్నాడు సిద్ధార్థ అప్పుడు cargo door తెరుచుకోని ఉండటం తో మధు కీ అర్థం అయ్యింది వాడు తప్పించుకున్నాడు అని అప్పుడు రాడార్ ప్రకారం వాళ్లు హర్యానా బార్డర్ లో ఉన్నారు అంటే తను కచ్చితంగా ఫరీదాబాద్, గురుగ్రామ్ జిల్లాలో ఎక్కడో ఒక చోట ఉంటాడు అని మధు కీ అర్థం అయ్యింది దాంతో వాళ్లు ఢిల్లీ లో ఫ్లయిట్ ల్యాండ్ చేసి గురుగ్రామ్, ఫరీదాబాద్ సెక్యూరిటీ అధికారి ఫోర్స్ మొత్తం నీ సిద్ధార్థ వెనుక పంపారు కానీ సిద్ధార్థ అంబాలా లో ల్యాండ్ అయ్యాడు అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్లాలి అని ప్లాన్ చేశాడు సిద్ధార్థ.
ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ foreign affairs మినిస్టర్ సోఫియా తహసిల్ టేబుల్ మీద సిద్ధార్థ మళ్లీ కనిపించడం ఉన్న video గురించి ఒక ఫైల్ ఉంది అది చూసిన సోఫియా సిద్ధార్థ ఫోటో మీద రెడ్ పెన్ తో సర్కిల్ గీసింది ఇక్కడ ఢిల్లీ లో రమేష్ ఠాకుర్ ఉన్న హాస్పిటల్ లో సడన్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగి మొత్తం హాస్పిటల్ నేలమట్టం అయ్యింది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కీ గురి అయ్యారు దాంతో మధు, వినోద్ సిద్ధార్థ గురించి పక్కన పెట్టి రమేష్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ మొదలు పెట్టారు రమేష్ చనిపోవడం న్యూస్ లో చూసిన సిద్ధార్థ కీ సంతోషం తో కాలు నేల మీద నిలబడలేదు అప్పుడే కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు సిద్ధార్థ నీ అరెస్ట్ చేశారు తనని అంబాలా నుంచి ఫరీదాబాద్ మధ్యలో ఉన్న అడవి దారిలో తీసుకొని వెళ్లుతున్నారు అప్పుడే ఆ సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది దాంతో జీప్ ఆపి సిద్ధార్థ నీ ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు

కానీ సిద్ధార్థ అందరినీ కొట్టి తనను ఎందుకు చంపాలీ, ఆ అవసరం ఎవరికి ఉంది అని అనుకున్నాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ లో వచ్చిన నెంబర్ చూస్తే ప్రైవేట్ నెంబర్ దాంతో ఏమీ క్లూ దొరకలేదు ఇంక సిద్ధార్థ కీ ఒకటే దారి కనిపించింది.
దాంతో మరుసటి రోజు ఉదయం రమేష్ సంతాప సభ నిర్వహించారు అప్పుడు రాష్ట్రపతి, రమేష్ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు అప్పుడు కొత్త తాత్కాలిక ప్రధాని ఎవరిని పెట్టాలని ఇద్దరు చర్చించుకుంటున్నారు అప్పుడే సిద్ధార్థ అక్కడికి వచ్చి అందరి ముందు తన తండ్రి చావు కీ ఎవరూ దిగులు పడవద్దు అని చెప్పారు తన తండ్రి స్థానంలో ఈ దేశం కోసం తను పాటుపడతాననీ మాట ఇచ్చి తనని కొత్త ప్రధానిగా ఎన్నుకోవాలి తన హై కమాండ్ కు చెప్పాడు అప్పటికే తను కోనేసిన కొంతమంది మినిస్టర్ లు సిద్ధార్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సిద్ధార్థ సంతాప సభ నుంచి డైరెక్ట్ గా ప్రధాని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న తన తండ్రి, తను కలిసి దిగిన ఫోటోలు అన్ని తీసి విసిరేశాడు ఆ తర్వాత వాటిని ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ అని ఆ ఫోటోలు పైన పగల గొట్టి తగలబెట్టాడు అప్పుడే వచ్చిన మధు, వినోద్ అది చూసి మధు ఆవేశం గా సిద్ధార్థ మీదకు వెళ్లి లాగి కొట్టాడు “బ్రతికి ఉన్నపుడు ఎలాగో మీ నాన్న కీ నువ్వు గౌరవం ఇవ్వలేదు కనీసం ఇప్పుడయినా గౌరవించురా” అని అరిచి చెప్పాడు, “అవి నా కళ్ల ముందు ఉంటే నాలో ఆవేశం పెరుగుతోంది కానీ ఇప్పుడు నేను చేయాల్సింది ఆవేశం తో కాదు ఆలోచన తో నాన్న చనిపోయిన తర్వాత నన్ను కూడా చంపాలి అని చూశారు మన వెనుక చాలా పెద్ద ప్రమాదం ఉంది అది ఏంటో తెలుసుకోవాలి అంటే నేను prime minister నీ కావాలి అందుకే మన పార్టీ లో ఇప్పటికే నలుగురు మినిస్టర్స్ నీ కొనేశా కానీ ఒకడికి foreign affairs, ఇంకొకడికి central home ministry కావాలి అన్నారు కానీ వాళ్లు ఎద్దవలు కాబట్టి వాళ్లు సీట్లు ఎక్కిన రెండు రోజుల్లో కుర్చీ దిగాలి మన దేశం ముందుకు నడవాలి ఇలాంటి వయసు అయిపోయి పదవుల కోసం ఎగబాకే తోడేలు కాదు కావాల్సింది మన పార్టీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో నిజాయితీ గా పని చేస్తున్న, ప్రజల మద్దతు ఉన్న యంగ్ లీడర్స్ అందరి లిస్ట్ తీయండి నేను ప్రధాన మంత్రి కాకపోయినా కనీసం వాళ్ల లో ఒకరైన అవ్వాలి అంతే కాకుండా ఇప్పుడు ఉన్న సెంట్రల్ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ ల జాతకాలు అని నాకూ కావాలి వారం రోజుల్లో కాబోయే ప్రధాని నీ announce చేస్తారు కాబట్టి be quick” అని చెప్పాడు సిద్ధార్థ.
[+] 3 users Like raosahab786's post
Like Reply


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 1 Guest(s)