Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బుజ్జి:ఊరి ప్రెసిడెంట్
#13
అక్క: బాబాయ్, పిన్ని  మీరు అనుకోవచ్చు ఎంటి పెద్దగా పరిచయం లేదు కానీ ,  ఎంటి ఇలా  సాయం చేయమని , అది జీవితం లో ఒక్కసారి జరిగే తంతు , ఎలాగైనా తన కూతుర్ని  మన కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యమని ఎలా అడిగేస్తుంది అని అనుకోవచ్చు. కానీ మీరు నా పరిస్థితి అర్థం చేసుకోవాలి.

నాన్న: ఇదంతా చెప్పావ్ కదమ్మా ఫోన్ లో మళ్ళీ ఎందుకు. పైగా నేను మాట కూడా ఇచ్చేశాను కదా.

బావ: అంటే  మీ అబ్బాయిగారికి మరియూ అత్తమ్మ గారికి కూడా తెలియాలి కదా అందుకు.

నాన్న : అవ్వని ఏం అవసరం లేదు , నాకు చెప్పారుగా.ముందు అసలు విషయం లోకి రండి . మా కోడలు పిల్లని  చూపించండి.

బావ : వెళ్లి తీసుకుని రావే (మా అక్క వైపు చూస్తూ)

అక్క వెనక సైడ్ దుప్పటి కట్టున్న గుమంలోంచి అటు వెళ్లి ఒక రెండు నిమిషాలు తరువాత  ఒక అమ్మాయిని తీసుకుని వచ్చింది

అక్క: (ఒక గ్లాస్ ఆ అమ్మాయి చేతికి ఇస్తూ) వెళ్లి మజ్జిగ పోసీ ఇవ్వు 

అమ్మాయి వచ్చి చెంబులో వున్న మజ్జిగ పోసి ఇచ్చింది.  (నేను ఆ మజ్జిగ ఒక గుటక వేసి ఆ అమ్మాయిని చూస్తున్న )

అమ్మాయి నీ describe చెయ్యాలంటే  (నేను ఇది చెప్పకూడదు కానీ) తెలుగు instagram reeler ganeswari లాగ వుంది కాకపోతే తనకన్నా కొద్దిగా (చాలా కొద్దిగా)chubby గా వుంది.ఇంటర్ 2nd చదివే అమ్మాయి ఎలా వుంటుందో మీకు తెలుసు కదా

అమ్మ : ఎర అమ్మాయి బానే వుంది కదా రా.
 
నాన్న : (మధ్యలో మాట్లాడుతూ) బానే వుండటం కాదు . చాల అందంగా ,లక్షణం గా వుంది. (అంటూనే ఆ అమ్మాయి వైపు తిరిగి) నువ్వు వెళ్ళమ్మా ఇంకా 

ఆ అమ్మాయి ఆ దుప్పటి కట్టిన  గుమ్మం సైడ్ వెళ్లి పోయింది.

అమ్మ : (ఆ అమ్మాయి వెళ్ళగానే ) మరి కట్నం సంగతి ఏమంటారు.

బావ: కాకినాడ దగ్గరలోనే ఒక ఊరిలో పొలం కొనధాం అనుకుంటున్నాం కట్నం కోసం 

అమ్మ: పొలం గురించి చెప్పారు మరి బంగారం , వెండి కూడా పెట్టాలి గా

అక్క: హ పెట్టాలి కానీ అంత ఇచ్చుకోలేం

అమ్మ: లేదు నా కొడుకెం తక్కువ. నాకు పెళ్ళి సమయాన్ని కల్ల బంగారం వెండి పెట్టాల్సిందే

నాన్న: ముందు ఈ బంగారం వెండి ఇవ్వండి .తర్వాత పొలం సంగతి చూద్దాం పెళ్లి అయ్యాక

బావ : సారే అలా ఐతే పెళ్లి సమయానికి బంగారం వెండి పెడతాం , పెళ్ళైన ఒక రెండు మూడు సంవ్సరాల కి పొలం  ఇస్తమ్మ్ 

అక్క: పెళ్లి మాత్రం పిల్ల  చదువు ఐపోగానే జరిగిపోవాలి

నాన్న: అలాగే అమ్మ, అంత బాగానే జరగాలి , జరుగుది 
 
అక్క : ఏంటి తమ్ముడు ఏం మాట్లాడలేదు. అమ్మాయి నచ్చలేదా ఇంటి
 
(నాకేమో ఒక పక్క ఉచ్చ ఆగట్లేదు)
 
నాన్న :  అమ్మాయి నచ్చకపోవడం ఏం కాదు.అయిన ఆడు మాట్లాడేది ఏముంది ఇందులో
(ఇంకా ధైర్యం చేసి మా బావ సైడ్ చూస్తూ)

నేను: బావ కొద్దిగా బాత్రూం చూపించవా
నేను మా బావ వెంకల వెళ్ళాను మా బావ  ఇంటి బయటకు వచ్చి అలా ఇంటి ఎదురుగా  రోడ్డు (మట్టి దారి)  అవతల ఉన్న తుప్పల దగ్గరికి వచ్చి ఆగడు.

బావ:ఇలా కనిచే బాబు

నేను : ఏంటి ఇక్కడ , బాత్రూం అలాంటివి లేవ 

బావ: మా వూరిలో మొత్తం బుజ్జిగారి (పేరు గుర్తుపెట్టుకొండి)ఇంటి దగ్గర మళ్ళీ xxxxxxgari ఇంటి దగ్గర మాత్రమే బాత్రూం లు ఉన్నాయి బాబు ఇంక ఎక్కడ వుండవు

సర్లె అని నేను కానిచేసి  

నేను :బావ మరి  ఆడోలు  అది స్నానాలు ??

బావ :ఊర్లో ఆడాళ్ళు  సూర్యడు రాకముందే చెరువు కాడ చేసేస్తారు  స్నానాలు. మగ్గోలు ఆ తర్వాత ఆరు ఏడు గంటలకి  వెళ్లి  స్నానాలు చేస్తాం బాబు

అలా మాట్లాడుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాము .
(వెళ్ళే సమయానికి )

అమ్మ : సరే అని బాగా కుదిరాయి ఐతే అన్ని  మనకి.( నన్ను చూసి) రేయ్ మీ అక్క నీతో మాట్లడుతుందంట రా .

అక్క మళ్ళీ నన్నొకడిని బయటకు తీసుకువచ్చింది

అక్క: తమ్ముడు నిన్ను అడగకుండా మీ నాన్న మాటిచేసాడని నువ్వు ఏమి మనసులో పెట్టుకోకు రా . నీకూ మా అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి చేసుకునే అవకాశం వుంది .కానీ దానికి అలా కాదురా , దానికి ఈ సంబధం కాకపోతే ఇంకా పెళ్లి అవ్వుదని నమ్మకం లేదురా నాకు .అది ఈ ఊరిలో పుట్టడమ్మే చేసిన తప్పు.  కొద్దిగా అర్థం చేసుకోర మీ నాన్న కూడా అందుకే మాట ఇచ్చాడు . అమ్మాయి మాత్రం చాల మంచిరా 

నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు సరే  అన్నటు తల ఊపాను. అక్క లోపలికి వెళ్లి పోయింది. మరి కొంచెం సేపటికి మధ్యానం  కావస్తుందని తిరిగి ఇంటికి బయల్దేరాము.
Like Reply


Messages In This Thread
RE: నాకు తెలిసిన అమ్మాయీ - by Insider247 - 17-06-2024, 04:41 PM



Users browsing this thread: 9 Guest(s)