Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#1
కోర్టు ప్రాంగణం మొత్తం హడావిడి గా ఉంది స్టూడెంట్స్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కోర్టు పునాదులు కదిలేంచేలా ఉన్నాయి కారణం ముందు రోజు హైదరాబాద్ సిటీ లోని ఒక కాలేజీ స్టూడెంట్స్ చేసిన స్ట్రైక్ ఇండియా లోని విద్యా పద్దతి నీ మార్చాలని వాళ్లు పోరాటం చేస్తున్నారు దాంతో కాలేజీ యూనియన్ నాయకులను సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు పైగా వాళ్లు అంతా ఒకే కాలనీ కీ చెందిన విద్యార్థులు కాలేజీ కీ సంబంధించిన కొంతమంది టీచర్లు అందరూ కలిసి ఒక కాలనీ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ల పిల్లలు చదువుతున్న కాలేజీ సెంట్రల్ మినిస్టర్ దీ అతని మీద కేసు వేసి మరీ వాళ్లు పోరాటం మొదలు పెట్టారు ఇది తెలిసి వాళ్లను అరెస్ట్ చేయమని మినిస్టర్ లోకల్ సెక్యూరిటీ అధికారి డిపార్టమెంట్ కీ చెప్పాడు పైగా స్టూడెంట్స్ తరుపున లాయర్ నీ రాకుండా చూడాలని ఆర్డర్ ఇచ్చాడు దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు, ఎవరికి ఏమీ చేయాలి అని తెలియడం లేదు దాంతో తమ పిల్లలు జైలు కీ వెళ్లతారు అని భయపడుతున్నారు అప్పుడు కోర్టు మొదలు అయ్యింది జడ్జి గారు కూడా వచ్చి హియరింగ్ మొదలు పెట్టారు కానీ స్టూడెంట్స్ తరుపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా లేరు అందుకు వాళ్ళని జైలు కీ పంపాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడం మొదలు పెట్టాడు “your honor ఎంతోమంది విద్యార్థులకు ఫీజు వసూలు చేయకుండా ఉచిత విద్య ఇస్తున్నారు మన గౌరవనీయులైన మినిస్టర్ పాండే గారు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన చేస్తున్న సేవలు పైగా ప్రతి రాష్ట్రంలోనూ ఆయన కళాశాల విద్యార్థులు ఉచిత విద్య పొందుతున్నారు అలాంటి మహా వ్యక్తి పైన పైగా ఎంతో మంది మేధావులను తయారు చేసిన మన విద్యా వ్యవస్థ నీ అవమానీస్తూ విద్యార్థులు చేసిన ఆందోళనలు వల్ల కళాశాల కీ ఉన్న reputation దెబ్బ తినింది కాబట్టి ఇలాంటి విప్లవ కాంక్షలు ప్రేరేపించేలా ఉన్న విద్యార్థుల చేష్టలు సమాజాన్ని తప్పుడు దోవ పట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి వీరికి విధించే శిక్ష మిగిలిన వాళ్లకు గుణపాఠం కావాలిఅని చెప్పి తన వాదనను ముగించారు.
అప్పుడు జడ్జ్ గారు విద్యార్థుల వైపు చూసిమీ తరుపున ఎవరైనా లాయర్ ఉన్నారాఅని అడిగారు అప్పుడు ఒక లాయర్ కోర్టు లోకి వచ్చి “yes your honor వీళ్ల తరుపున నేను వాదిస్తానుఅని చెప్పాడు అతని చూసి అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ల తల్లితండ్రులు ఎందుకంటే లాయర్ ఉండేది వాళ్ల కాలనీ లోనే అతని తో రోజు అందరికీ గొడవ ఎప్పుడు తాగుతూ ఉంటాడు ప్రతి చిన్న విషయానికి అందరితో గొడవ పడుతూ ఉంటాడు, ఒక పిచ్చోడు అని కాలనీ వాళ్లు అతని పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు పిచ్చోడు లాయర్ అని తెలిసి షాక్ అయ్యారు అతని చూసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్సిద్ధార్థ్ ఠాకూర్అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు జడ్జ్ గారు proceed అన్నారు “Thank you your honor మన pp గారు చెప్పింది అక్షరాలా సత్యం విద్యార్థులు అంత విప్లవ భావాలు కలిగి సమాజం నీ తప్పు దోవ పట్టిస్తున్నారుఅని సిద్ధార్థ చెప్పగానే అందరూ పిచ్చోడు మనల్ని ముంచడానికే వచ్చాడు అని అనుకున్నారు.
అవును కానీ వాళ్ళకి విప్లవ కాంక్షలు ఎక్కడి నుంచి మొదలు అయ్యాయి చిన్నప్పుడు మనకు స్వాతంత్య్రం తీసుకుని రావడానికి సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అని వీళ్లకి బోధించిన ఇదే విద్యా వ్యవస్థ వీళ్లలో విప్లవం రేపింది రోజుకో కొత్త వింత చూస్తున్న ప్రపంచంలో ఇంకా పాత పాచి పట్టిన ఆవకాయ పచ్చడి లాంటి సిలబస్ ప్రకారం చదువులు చెప్పి వాళ్ళని ర్యాంకుల కోసం machines లా పరిగెత్తిస్తున్న సమాజం విప్లవం రేపింది, పక్కింట్లోవాడు అబ్దుల్ కలాం అయితే నువ్వు కూడా అదే అవ్వాలి అని ఒత్తిడి చేసే తల్లితండ్రులు విప్లవం వాళ్లలో రేపింది, your honor మన law అనేది కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక శక్తివంతమైన వ్యవస్థ కానీ అదే వ్యవస్థ లో రోజు న్యాయం కంటే అవకతవకలు ఎక్కువ
అయ్యాయి కానీ మనం దాని మార్చాలేం కానీ విద్యా వ్యవస్థ నీ మార్చోచు సిలబస్ ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి కాదు ప్రతి సంవత్సరం మార్చాలి ఇది ఏంటి ప్రతి సంవత్సరం మార్చడం ఏంటి పిచ్చి పట్టిందా వీడికి అనుకోవచ్చు నేను మొత్తం సిలబస్ మార్చాలని చెప్పడం లేదు కొత్త అంశాలను ప్రస్తుతం ఉన్న సిలబస్ తో జోడించి రూపొందించాలి పుట్టగొడుగులా పెరుగుతున్న లైసెన్స్ లేని గవర్నమెంట్ ఆమోదం కూడా సరిగ్గా లేని ర్యాంకుల కోసం ఫీజులు గుంజడం కోసం మాత్రమే ఉన్న ఇలాంటి కాలేజీలను మూసి విద్యార్థులకు మంచి భవిష్యత్తు మీద నమ్మకం కలిగేలా చూడాలని కోరుతున్నాఅని తన వాదనను ముగించాడు సిద్ధార్థ.
దాంతో జడ్జ్ గారులాయర్ సిద్ధార్థ నీ చాలా రోజుల తర్వాత చూడడం సంతోషంగా ఉంది ఆయన చెప్పిన విషయాలను కోర్టు స్వాగతిస్తుంది కానీ ప్రక్రియ ఒక్క రాత్రి లో జరిగేది కాదు కావున విద్యార్థుల సంఘం సమక్షంలో ప్రతి గవర్నమెంట్ ఆమోదం ఉన్న యూనివర్సిటీ లో విషయం పై విచారణ జరిపించాలని ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోర్టు ఆదేశం ఇస్తుంది అలాగే విద్యార్థుల తమ హక్కుల కోసం పోరాటం చేయడం లో ఎలాంటి తప్పు లేదు కానీ వాళ్లు చేసిన నిరసన వల్ల కొంత వరకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడటం వల్ల వారిని మందలిస్తు 5 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఇది చివరి హెచ్చరిక గా ప్రకటిస్తూ వారిని విడుదల చేయడం జరిగింది court is adjourned” అని తీర్పు ఇచ్చారు, కోర్టు లో కేసు గెలిచిన తర్వాత విద్యార్థులు అంతా సిద్ధార్థ నీ తమ భుజాల పైన మోస్తూ కోర్టు బయటికి వచ్చారు ఇది అంత అందరి ఫోన్ లో Facebook లైవ్ లో పెట్టారు అప్పుడు video మొత్తం viral అయ్యింది.

ప్రధాన మంత్రి కార్యాలయం లోని చీఫ్ సెక్యూరిటీ సిబ్బంది video చూసి ప్రధాని చీఫ్ సెక్యూరిటీ కీ వీడియో చూపించారు అతను video నీ ప్రధాని పర్సనల్ సెక్రటరీ అయినమధు గుప్తాదగ్గరికి వెళ్లారు.
[+] 4 users Like raosahab786's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 2 Guest(s)