Thread Rating:
  • 111 Vote(s) - 2.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
వర్షం తగ్గింది..
ఎప్పుడు తగ్గిందో తెలీదు..కానీ తగ్గింది..
రెండున్నర ప్రాంతం లో వసుంధర స్నానం చేసి మెరూన్ కలర్ చీర మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంది..
పోనీ టెయిల్ వేసుకుంది..
నుదుటన చిన్న స్టిక్కర్ పెట్టుకుంది,..
అద్దం లో చూసుకుంది..
వెనక్కి తిరిగి చేతులెత్తి చూస్కుంటుండగా బెడ్ మీద ఆమె ఫోన్ మోగింది..
వెళ్లి ఫోన్ చూసింది..
పక్కింటి మామ్మ గారు..
వసుంధర : హలో మామ్మ గారు
మామ్మ గారు : అమ్మాయ్ వసుంధరా..లేచావా..
వసుంధరా : హా మామ్మ గారు..రెడీ అయ్యాను వెళదామా..
మామ్మ గారు : పాపం చీకట్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నానమ్మా
వసుంధర : అయ్యో దానికేముందండీ పర్లేదు పదండి దించేస్తాను..వస్తున్నాను VUNDNADI
మామ్మ గారు : సరేనమ్మా..
వసుంధర వినయ్ రూమ్ లోకెళ్ళి చూసింది..మంచి నిద్ర లో వున్నాడు..
'ఇలా వెళ్లి అలా వొస్తాను జాగ్రత్త గా ఉండమని' చెప్పింది..వాడు నిద్ర లో ఏమర్ధమయ్యిందో గాని 'హా ఓకే' అని మళ్ళీ నిద్ర పోయాడు..సరే అనుకుని లైట్స్ ఆన్ చేసి డోర్ క్లోస్ చేసి బయటికెళ్లింది..
తన స్వేట్టెర్ తీస్కుని మామ్మ గారి బాగ్ తీస్కుని లిఫ్ట్ లో కిందికెళ్లారు
మామ్మ గారు : పాపం చీకట్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నానమ్మా
వసుంధర : అయ్యో అదేం పర్లేదు మామ్మ గారు
అంటూ స్కూటీ దగ్గరికెళ్లి డిక్కీ లో స్వీటెర్ పెట్టుకుని మామ్మ గారి బాగ్ ముందు పెట్టుకుని కూర్చుంది..
మామ్మ కూడా స్కూటీ ఎక్కగానే స్టార్ట్ చేసింది..
ఫ్లోర్ దాటగానే గేట్ బయట రోడ్ మీద బాగా నీళ్ళొచ్చి చేరాయ్..
అందులోంచి ముసలావిణ్ణి ఎక్కించుకొని వెళ్లడం కుదరదని స్కూటీ ని వెనక్కి తిప్పింది..
అపార్ట్మెంట్ కి ఒక బ్యాక్ గేట్ వుంది..
అది సింగిల్ గేట్..
అందులోంచి కార్ లు వెళ్ళలేవు ఓన్లీ టూ వీలర్స్ తప్ప..
కానీ గేట్ ని ఎవ్వరు వాడరు..
మెల్లిగా వైపు బండి ని తిప్పింది..
గేట్ దగ్గరికి వెళ్లే దారి ఒక యాభై మీటర్లు ఉంటుంది.. దారి కాంపౌండ్ వాల్ కి ఒక అరడజలు వాష్రూమ్స్ ఉంటాయి..అవి ఎవ్వరు వాడరు..అందులో పని చేసే వాళ్ళు అప్పుడప్పుడు రిపేర్ చేయడానికి వచ్చిన ప్లంబర్ లు ,ఎలక్ట్రీషియన్ లు,సెక్యూరిటీ వాడతారు..వాటిని ఎవ్వరు పట్టించుకోరు..అందుకే దారంతా చీకటిగా కాస్త డర్టీ ఉంటుంది..
వసుంధర దార్లో వెళ్లి గేట్ దగ్గర స్కూటీ ని ఆపి గేట్ గొళ్ళెం తీసింది..దాని తక్కువగా వాడడం తో కాస్త గట్టిగా వుంది..గేట్ తీసి స్కూటీ ని బయటకి తీసి గేట్ దగ్గరికి వేసి బండి స్టార్ట్ చేసింది..
గాలి చాలా చల్లగా వీస్తోంది..
రోడ్ మీద ఒక్క వెహికిల్ తిరగడం లేదు..
వెనకాల కూర్చోవడం తో ముసలావిడకి పెద్దగా చలిగా లేదు..
వసుంధర కి మాత్రం పిచ్చి చలేస్తోంది..
వచ్చే దార్లో ముసలావిడ ఏవేవో మాట్లాడుతూ వుంది కానీ చలిలో వసుంధర కి ఏమి వినాలని లేదు..
దశలో 'అనవసరం కమిటయ్యానా' అనుకుంది
రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ దిగి రైట్ సైడ్ సింగల్ డాంబర్ రోడ్ లోకి పొనిచ్చింది..అటు ఇటు గుబురుగా చెట్లు..అలా ఆరు కిలోమీటర్లు..
దారిని తాను ఇంతకుముందు చూసింది గాని టైం లో చూడడం ఇదే ఫస్ట్ టైం..
దార్లో చీకటి తప్ప ఇంకేం లేదు..పగలు ఆటో లు బాగా తిరిగే దార్లో చీకటి ఇంత రాజ్యమేలడం వసుంధర కి ఆశ్చర్యం తోచింది..
వెనకాల మామ్మ మాత్రం మాట్లాడుతూనే వుంది..
స్టేషన్ కి మరో ఇరవై అడుగుల దూరం వుంది,,
వసుంధర రోడ్ గురించి ఆలోచింస్తుండగా రైలు కూత వినిపించింది..
వసుంధర టకాటకా స్కూటీ ఆపి ముసలావిడ దిగగానే ..బాగ్ పట్టుకుని లోపలికెళ్ళింది..
జనాలు ట్రైన్ ఎక్కడానికి కొద్ది ముందున్నారు..
ముందుగానే బుక్ చేసిన బెర్త్ నెంబర్ భోగి లో వెతికి చూసి మామ్మ ని మెల్లిగా ట్రైన్ ఎక్కించింది..
ముసలావిడ థాంక్స్ చెప్పి చెప్పగానే ట్రైన్ కదిలి చూస్తుండగానే వెళ్లిపోయింది..
వసుంధర కి బాగా చలేస్తోంది..
"అబ్బా ఎం చలిరా బాబు..ఇంటికెళ్లి దుప్పటి కప్పుకోవాలి"
బయటికెళ్లి టకాటకా స్కూటీ స్టార్ట్ చేసింది..
అప్పుడు గుర్తొచ్చింది తనకి..
"వాసు..?''
"ఔను ఏడి వీడు..ఇక్కడే వుందామన్నాగ..రమ్మని చెప్పినా రాలేదు.. చీకట్లో ఒక్క దాన్నే వెళ్ళాలా.."
"వెధవకి ఫోన్ చేద్దాం.."
అనుకుంటూ స్టేషన్ ముందే స్కూటీ మీద స్టాండ్ తీసి కూర్చుని కాల్ చేసింది వాసుకి..
నాట్ రీచబుల్ అనొస్తుంది,,
మళ్ళీ చేసింది..మళ్ళీ నాట్ రీచబుల్..
"అయ్యో అనవసరం వీణ్ణి నమ్ముకున్న..చ్చ.."
ఇప్పుడు చీకట్లో ఒక్క దాన్నే పోవాలా.."
చుట్టూ చూసింది..
స్టేషన్ దగ్గర కాబట్టి చిన్న బడ్డీ కొట్టు,చిన్న తీ స్టాల్,కొద్దిగా ఒక పది మంది జనం ఆటో స్టాండ్ ,డ్రైవర్ లు అంతే..
స్టేషన్ దగ్గర ఒక కిలోమీటర్ వరకు దారి ఓకే  గాని..
తర్వాత...
దారి గుర్తుకు వస్తేనే వసుంధర వాళ్ళు జల్లున వణుకుతోంది..
"పోనీ తెల్లారే దాకా ఇక్కడే స్టేషన్ లో కూర్చుని తర్వాత పోదామా..ఆమ్మో అక్కడ వినయ్ ఒక్కడే వున్నాడు చీకట్లో భయపడతాడు..వెళదాం"
కానీ ఎలా..
అసలే చీకటి..పైగా దారి మొత్తం చెట్లే..ఒక్క మనిషన్న వాడు లేదు..
వామ్మో..
ఇప్పుడేంటి పరిస్థిథి..
అనుకునే సమయానికి..
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 16-06-2024, 01:29 AM



Users browsing this thread: sanjaykamble, 2 Guest(s)