Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వరల్డ్ ఫేమస్ రైటర్
#5
ఒకరోజు అనుకోకుండా.. ఎవరో ఆనందరావు ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారుఇంట్లో ఎవరూ లేకపోవడంతోఆనందరావు వెళ్లి తలుపు తీసాడువచ్చిన వారిని చూసిన తర్వాతఆనందరావు కు నోట మాట రాలేదు.. 



"లోపలి రావొచ్చా ఆనందరావు గారు.. ?" అని అవతలి నుంచి అడిగారు 
"ఎంత మాట.. రండి.. రండి.. కూర్చోండి.. "
"సమయానికి ఇంట్లో ఎవరూ లేరు.. ఏం తీసుకుంటారు.. ?" అని అడిగాడు ఆనందరావు 
"ఏం పర్వాలేదు.. ఇంతకీ నన్ను గుర్తు పట్టారా.. ?"
"ఎంతమాట.. మీరు ది గ్రేట్ డైరెక్టర్ నాగేంద్రమౌళి.. పాన్ ఇండియన్ డైరెక్టర్మీరు తీసిన సినిమాలతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియన్ స్టాయి లో గుర్తింపు వచ్చిందిమీకు నేను వీర అభిమానినిఅలాంటిది.. మీరే మా ఇంటికి రావడం అంటే.. అంతా నా అదృష్టం"
"ఇటుపక్క షూటింగ్ ఉంటేమిమల్ని కలిసి పోదామని వచ్చాను.. "
"అంతా నా అదృష్టం.. "
"మీరు రాసిన వెబ్ సిరీస్ చదివాను.. బాగా నచ్చింది.. నేను నెక్స్ట్ తీయబోయే పాన్ ఇండియా మూవీ కోసం మీరు ఒక కథ రాయాలి.. రాస్తారా.. ?"
"దేవుడే దిగివచ్చి వరం ఇస్తానంటేవద్దంటాన చెప్పండి.. తప్పకుండా.. " అన్నాడు ఆనందరావు 
"ఇదిగోండి అడ్వాన్సు.. కథ అయిపోగానే చెప్పండి.. "
"అలాగే నాగేంద్రమౌళి గారు.. "



ఆనందరావు  కథను చాలా బాగా రాసాడుఅతి తొందరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది..  తర్వాత రిలీజ్ అయిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందిఆనందరావు అనుకున్న దానికన్నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చిందిఇప్పుడు ఆనందరావు ఒక పాన్ ఇండియా రైటర్. 



అతి త్వరలోనేసినిమాలు వేరే దేశాలలో కుడా బాగా పాపులర్ అయి.. ఆనందరావు కథలకిస్క్రిప్ట్ రైటింగ్ కి చాలా ఫేమస్ అయ్యాడుప్రపంచం అంతా ఫేమస్ అయ్యాడుఅనతికాలంలోనే 'బీబీసీలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆనందరావు. 



అంతా  'మీపత్రిక వారు అప్పట్లో చేసిన సన్మానం పుణ్యమేనని.. ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు.. 



==============================================================
 సమాప్తం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వరల్డ్ ఫేమస్ రైటర్ - by k3vv3 - 13-06-2024, 01:14 PM



Users browsing this thread: 1 Guest(s)