11-06-2024, 11:55 PM
Time : 9:00 PM
Chakala, Rawalpindi, Punjab
Pakistan..
GHQ Rawalpindi (army headquarters)
DG-ISI: Asif Khan
Military Intelligence: Sadiq umar
Army chief : Asim Raza
ప్రశాంత వాతావరణం మధ్యలో పెను తుఫానులా ఒక కార్ వేగంగా రావల్పిండి- చకాల హైవే పై ప్రయాణిస్తోంది.
డ్రైవర్ కి తెలుసుతోంది ఈరోజు ఏదో పెద్ద విషయం జరిగింది అని.. లేదంటే ఈపాటికి నాలుగు పెగ్గులు వేసి పడుకునే 'జనరల్ రజా' ఇప్పుడు ఈ టైం లో ప్రయాణించడు.. అదీ కూడా ప్రోటోకాల్ లెక్కుండా కేవలం ఒక వీవెహికల్ లో..
చుట్టూ రాత్రి గస్తీ చేస్తున్న సైనికులను దాటుకుంటూ ఒక బెంజ్ కార్ హెడ్ క్వార్టర్స్ ముందు ఆగింది.
అసిఫ్ ఖాన్, సాదిక్ ఉమర్ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఆర్మీ చీఫ్ ఆసిమ్ రజా కోసం ఎదురు చూస్తున్నారు.. ఈ రోజు వేసిన పన్నాగాంలో భారత్ చిక్కుకోవాలి అని వారి ఎదురుచూపు..
రావడం తోనే రజా చూపు టీవీ పైన పడింది..
రజా: రజాక్ అరెస్ట్ అయ్యాడా??
అసిఫ్: అవును జనాబ్.. మన ప్లాన్ ప్రకారం రజాక్ అరెస్ట్ అయ్యాడు..
సాదిక్: అరెస్ట్ చేసిన ప్రాంతం ఢిల్లీ లోని లోటస్ టెంపుల్ గార్డెన్ దగ్గర జనాబ్.. మనవాళ్ళు రజాక్ అరెస్ట్ చేసిన టీం ఫొటోస్ తీశారు..
రజా: వాడేనా? ఆ IFTIKHAR గాడేనా?
సాదిక్: ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి జనాబ్.. ఇద్దరు మఫ్టీ లో ఉన్నారు.. మత్తు మందు ఇచ్చి కిడ్నప్ చేసారు.. చుస్తే ఇంటలిజెన్స్ వాళ్ళు అయ్యుండాలి..
మన భారత దాటాబేస్ లో వాళ్ళు లేరు జనాబ్.
రజా: IFTIKHAR గాడేనా... కాదా?
అసిఫ్ : కాదు జనాబ్.. IFTIKHAR అనే వాడి ఆచూకీ
దొరకడంలేదు జనాబ్.. వాడి అసలు పేరేంటో కుడా తెలీదు.. మన గూఢచారుల ద్వారా ట్రై చేసినా ఫలితం లేకపోయింది.. ఇక ఇర్ఫాన్ విషయానికి వస్తే వాడు మనకు ఇంకా అవసరం లేదు జనాబ్.
ఇర్ఫాన్ చేయి దాటిపోయాడు.. ఎవరో అమ్మాయి వెంట పడ్డాడు అని తెలిసింది.. వాడు ఏమయ్యాడో ఇంకా తెలీదు..
రజా: ఎంత ఖర్చయినా.. ఏమి కావాలన్నా నన్ను అడగండి.. ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు కావాలి.. వాడిని నాచేతులతో చంపాలి.. ముక్కలు ముక్కలు గా నరకాలి..
ఇంతకీ పంజషీర్ దగ్గర రెండు నెలలు క్రితం జరిగిన ఇండియన్ బిలియనైర్ అగర్వాల్ కూతురు కిడ్నప్ కేస్ ఫైల్ రెడీ అయ్యిందా.. విశేషాలు ఏంటి.. భారత కి ఆఫఘానిస్తాన్ లో అంత సాయం చేసింది ఎవరు..
మన వాళ్ళు రాకముందే పని చక్కబెట్టేసారు..
సాదిక్: జనాబ్.. నాకెందుకో ఆ కిడ్నప్ సమయంలో వాళ్ళని చంపింది IFTIKHAR ఏమో అని అనుమానంగా ఉంది జనాబ్.
రజా: ఎలా చెప్పగలవు నువ్వు.. IFTIKHAR చేసినట్టు ఆధారం ఏమైనా ఉందా?
సాదిక్: చనిపోయిన అందరి తలలు మొండెం నుంచి వేరు చేయబడి ఉన్నాయి జనాబ్.. ఒక్క వేటు లో చేసాడు అంటే బలవంతుడు అయ్యి ఉండాలి.. అందుకే IFTIKHAR ఏమో అనుకుంటున్నా జనాబ్.
అసిఫ్: నాకెందుకో ఇది మాసూద్ గ్యాంగ్ పని అనిపిస్తోంది.. ఆ అగర్వాల్ అమ్మాయి ని విడిపించినందుకు బాగా డబ్బు ముట్టచెప్పారు అని కాబుల్ లో అనుకుంటున్నారు..
"ఆపరేషన్ IFTIKHAR" అనేది భారత ఇంటలిజెన్స్ చేసిన ఒక డ్రామా అనిపిస్తోంది జనాబ్..
గ్రాఫిక్స్ చేయడం లో సిద్దహాస్తులు వాళ్ళు..
ఎక్కడైనా ఒక మనిషి అలాంటి పనులు చేయగలడా?
అంత క్రూరంగా ఒక మనిషి ప్రవర్తిస్తాడు అని నేను అనుకోను..
రజా: సరే జెంటలెమెన్.. కీప్ మీ అప్డేటెడ్.. రేపు కేస్ ఫైల్ నాకు పంపండి.. ఐ విల్ టేక్ ఆ లీవ్.
అందరు నిలుచొని సెల్యూట్ చేసారు.. Chief బయటికి వెళ్ళగానే అక్కడ ఉన్న అందరు ఊపిరి తీసుకున్నారు..
ఈ chief కి ఆ IFTIKHAR గొడవ మర్చిపోడా?
60 దగ్గరికి ఒచ్చాయిగా.. చాదస్తం బాగా పెరిగిపోయింది.. అనవసరం గా రజాక్ ని 'ఎర' గా వేశం.. ఫలితం లేకపోయింది..
ఒక వేళ IFTIKHAR బ్రతికి ఉంటే ఈపాటికి వచ్చేవాడు..
పది నిమిషాల అనంతరం.. బెంజ్ కార్ లో రజా.. తన ఫోన్ తీసి.. భారత దేశం లోని ఒక నెంబర్ కి కాల్ చేసి మాట్లాడాడు..
చీఫ్ : హలో
XXX: "హనీ బీ" స్పీకింగ్
చీఫ్: సెక్యూర్ లైన్ లోకి రా
XXX: జి జనాబ్..
సెక్యూర్ లైన్ కనెక్టెడ్..
చీఫ్: అయేషా.. అ IFTIKHAR గురించి డీటెయిల్స్ సంపాదించావా?
అయేషా: IFTIKHAR అనేది ఆపరేషన్ పేరు జనాబ్..
దానిలో పనిచేసినవారి పేర్లు సీల్ చేసారు.. ఒక కలనల్ and బ్రీగాడిర్ ని ట్రాప్ చేసే పనిలో ఉన్నా..
ఒక నెల లోపు కచ్చితంగా అ టీం వివరాలు తెలుస్తాయి..
అంతవరకూ వెయిట్ చేయండి..
ఇలా కాల్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు జనాబ్.. తప్పదు కాబట్టి మాట్లాడుతున్న.. నెలరోజులు లోపు వాడిని వాడి టీంని అంతం చేద్దాం..
చీఫ్: షుక్రియ బేటీ.. జాగ్రత్త.. వాడిని చుసినవాళ్లేవారు ప్రాణాలతో లేరు.. అందుకే నిన్ను పంపాను..
అయేషా: షుక్రియ జనాబ్.. అల్లా హాఫిజ్..
జనరల్ ఆసిమ్ రజా కి గత 18 నెలలుగా సంతోషం లేదు.. భార్య వదిలేసి వెళ్ళిపోయింది..
Iftikhar గురించి అలోచించి పిచ్చివాడాయిపోతున్నాడు.. అవకాశం ఉన్నా కూడా తనను చంపకుండా వదిలేసి తన శత్రువు ప్రాణం బిక్షం వేసాడు అనే ఆలోచన రోజురోజుకి తనని దహించివేస్తోంది..
వాడిని చంపి పగ తీర్చుకోవాలి అనుకున్న వాడిని ఎదురుగా చుస్తే మనిషి అన్న వాడికి వెన్నులో వణుకు పుడుతుంది..
############################
అగర్వాల్ మ్యాన్షన్ ముంబై
సమయం రాత్రి 10:00
బాంద్ర - సీలింక్ ని చూస్తూ గ్లాస్ లో విస్కీ తాగుతున్న రమేష్ అగర్వాల్ కి పెద్ద చిక్కె వచ్చి పడింది..
గంట క్రితం తన కూతురు అడిగిన సాయం చేయడానికి సెంట్రల్ మినిస్టర్స్ తో మాట్లాడితే సాయం చేయలేము అని చేతులు దులుపుకున్నారు..
ఇక గత్యంతరం లేక పవర్ బ్రోకర్స్ ని పట్టుకొని..
లొసుగులు వెతికి పని పూర్తి చేయడానికి సిద్ధం అయ్యాడు..
డాడీ నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి "సూర్య" గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కో అని కూతురు అంటే.. ఎలా కాదనడం..
అతను లేకపోతే ఈరోజు తన కూతురు లేదు..
అచితుచి అడుగువేయాలని.. అలోచించి.. హోమ్ మినిస్టర్ సెక్రటరీ కి కాల్ కలిపాడు..
నెక్స్ట్ అప్డేట్ ఆన్ 21st జూన్