Thread Rating:
  • 87 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
యష్ణ అక్కయ్య : బామ్మా ..... మాల్ లోకి వెళ్ళామా - యమున అక్కయ్యకు అందమైన పట్టుచీర గిఫ్ట్ గా తీసుకున్నామా - అక్కయ్య లేచేలోపు తన ముందు ఉన్నామా ...... అన్నట్టు ఉండాలి కమాన్ కమాన్ ఫాస్ట్ .
హమ్మయ్యా ..... నా మనసులోని మాటనే చెప్పావు అక్కయ్యా , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లిపోదాము , చిన్నగా చినుకులు కూడా మొదలయ్యాయి అంటూ కిందకుదిగి చుట్టూ స్కాన్ చేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నువ్వు ఎక్కువగా ఊహిస్తున్నావు అంటూ దిగి బామ్మను దింపి లోపలకు వెళ్లిపోతున్నారు .
వదిలి వెళ్లను అని మాటిచ్చావు కదా అంటూ వెనుకే వెళ్ళాను .
యష్ణ అక్కయ్య : గుర్తుచేసుకో నేనెటువంటి మాట ఇవ్వనేలేదు .
బామ్మా ..... మీ ముందే కదా .
బామ్మ : మాట్లాడుకున్నాము కానీ తల్లి అయితే ప్రామిస్ చెయ్యలేదు .
బామ్మగారూ ...... ? షాక్ .
యష్ణ అక్కయ్య : థాంక్యూ బామ్మా ..... , ఫస్ట్ టైం ఫస్ట్ టైం ..... నాకు సపోర్ట్ - నాకూ షాకింగ్ గానే ఉంది అంటూ సంతోషం .
ఇది మాటివ్వలేదు పోనీలే , " తమ్ముడు పిలుపు - ముద్దు " ఎప్పుడు తీరుస్తారో చెప్పండి .
యష్ణ అక్కయ్య : అవేంటి ? అంటూ నవ్వులు .....
బామ్మగారు ..... ? .
బామ్మగారు : తల్లీ ..... నీ తమ్ముడు గెలిచాడు , తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలవాల్సిందే - ప్రేమతో ముద్దుపెట్టాల్సిందే .
యష్ణ అక్కయ్య : నాకు సపోర్ట్ అని సంతోషించేంతలో షాక్ ఇచ్చావు పో బామ్మా ......
బామ్మగారు : మంచో చెడో నేనైతే నిజం ప్రక్కన ఉంటాను తల్లీ ..... 
థాంక్యూ థాంక్యూ బామ్మగారూ ...... , అక్కయ్యా .... ఎప్పుడు ఎప్పుడు ? .
యష్ణ అక్కయ్య : నేనెప్పుడో మరిచిపోయాను - నువ్వూ మరిచిపో అంటూ ముసిముసినవ్వులతో బామ్మ చేతిని అందుకుంది , బామ్మా ..... పట్టుచీరలు ఫస్ట్ ఫ్లోర్ అంటూ లిఫ్ట్ లో తీసుకెళ్లింది .
సుమారు గంటపాటు చూసి నచ్చిన చీరను తీసుకుంది , బాగుంది కదా బామ్మా .....
బామ్మగారు : నీ నవ్వంత బాగుంది తల్లీ ..... , నీ తమ్ముడికీ చూయించు తల్లీ .....
యష్ణ అక్కయ్య మురిసిపోయింది - ఆకాశానికి ఎత్తేస్తాడు బామ్మా వద్దులే .
అవును చాలా చాలా బాగుంది అక్కయ్యా ..... , యమున అక్కయ్యకు అందమైన కానుక , అమ్మో చాలా ఖరీదైనది , అక్కయ్యా ..... నీ సాలరీ ఎంత ? .
యష్ణ అక్కయ్య : మగాడి హైట్ - అమ్మాయి సాలరీ అడగనేకూడదు .
సామెత ఆదికాదు .
యష్ణ అక్కయ్య : నాఇష్టం నేనెలాగైనా చెబుతాను , నువ్వు తీసుకోవా ?  
నేను బుజ్జాయికి తీసుకుంటాను .
యష్ణ అక్కయ్య : నేనుకూడా , నేనే ముందు అనుకున్నాను .
సరే అంటూ నవ్వుకుని , సెకండ్ ఫ్లోర్లో ఉన్న కిడ్స్ షాప్ కు వెళ్ళాము .
అక్కయ్యను బోల్తా కొట్టించి రెండు క్యూట్ డ్రెస్సెస్ అక్కయ్యే సెలెక్ట్ చేసేలా చేసాను , మోసం మోసం ..... క్యాన్సిల్ క్యాన్సిల్ .
సెలక్షన్ అయిపోయింది , ఇక ఏమన్నా లాభం లేదు , అక్కయ్య కోపాన్ని ఎంజాయ్ చేస్తూ కింద బిల్లింగ్ కు పంపించాను , అక్కయ్యా .... మొత్తం బిల్ నేనే పే చేస్తాను .
యష్ణ అక్కయ్య : రోషానికి పోయి మొత్తం నేనే పే చేస్తాను అంది .
థాంక్యూ అక్కయ్యా ..... ప్రస్తుతానికి నాదగ్గర డబ్బులెలాగో లేవు , ఈ తమ్ముడంటే ఎంతప్రాణమో డబ్బులు లేవని తెలిసే ఇలా ఆటపట్టించిందన్నమాట , ఎంతైనా అక్కయ్యల మనసు బంగారం .....
ముందు పొంగిపోయినా ..... , నో నో నో ......
Yes yes yes పే చేస్తాను అన్నావు చేయాల్సిందే , తప్పించుకోవడానికి లేదు అదిగో సీసీ కెమెరా .....
యష్ణ అక్కయ్య : అయ్యో ఇలా బుక్ అయిపోయాను ఏంటి , పే చేశానో ఊరంతా టామ్ టామ్ చేస్తాడు వెధవ , నా డబ్బు తిరిగిచ్చేయ్యాలి .
ఏ తమ్ముడైనా అక్కయ్య ప్రేమతో ఇచ్చిన డబ్బును తిరిగిస్తాడా ? ..... కౌంటర్లో పే చేసేయ్యండి .
యష్ణ : బామ్మా ..... , వద్దులే ఎలాగో తమ్ముడే కరెక్ట్ అంటావు .
ఇక్కడే పే చెయ్యొచ్చు మేడమ్ .....
పే చేసేసింది .
ఇద్దరమూ నవ్వుకుని కోపపు అక్కయ్య వెనుకే కిడ్స్ షాప్ నుండి బయటకువచ్చాము .

అక్కయ్యా - బామ్మా ..... అంటూ ఇద్దరి చేతులనూ పట్టుకుని వెనక్కులాగాను .
యష్ణ అక్కయ్య : రేయ్ .....
ష్ ష్ ష్ ..... వచ్చేసారు .
యష్ణ అక్కయ్య : ఎవరు వచ్చారు ? అంటూ కోపం .
ఇంకెవరు ఆ రాక్షసి పంపిన రౌడీలు ...... .
యష్ణ అక్కయ్య : నీకెలా తెలుసు ? .
మాస్కుల్లో ఉన్నారు .
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , కరోనా వలన ఇప్పటికీ కొంతమంది మాస్కుల్లోనే తిరుగుతున్నారు .
కరోనా వెళ్లి ఓ కాలమైపోయింది , మాస్కుల్లో మాత్రమే కాదు మంకీ క్యాప్స్ లో ఉన్నారు , చేతుల్లో ఏవో కత్తులు ఉన్నట్లు వెనుక దాచుకుని ఒక్కొక్క షాప్ లో మనకోసమే చూస్తున్నారు , ఇక్కడికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు , బామ్మా .... భయపడకండి , వాళ్ళు వెతకడానికి షాప్ లోకి వెళ్లి బయటకు వచ్చేన్తలో లిఫ్ట్ లోకి చేరిపోవాలి , ఒక్కరే ఉంటే నేనే చూసుకునేవాడిని ముగ్గురు నలుగురు ఉన్నట్లున్నారు , బామ్మా ..... వేగంగా నడవగలరా ? .
బామ్మగారు : రాగి ముద్దలు - జొన్న రొట్టెలు - ఉపవలు .... తిన్నదానిని రేసుగుర్రంలా మీవెనుకే వచ్చేస్తాను .
Sorry బామ్మగారూ ..... అంటూ తొంగిచూసి , వెయిట్ వెయిట్ ..... ఇప్పుడు అంటూ ఇద్దరి చేతులను పట్టుకుని వేగంగా నడిచాను .
వదులు నాకెవరూ కనిపించడం లేదు .
ఇద్దరినీ వదిలి ఇద్దరికీ అడ్డుగా వెనుక నడుస్తూ క్షణాలలో లిఫ్ట్ దగ్గరికి చేరిపోయాము , బటన్ నొక్కుతున్నాను కానీ లిఫ్ట్ రావడం లేదు , వెనుక షాప్ వైపు చూస్తూ కమాన్ కమాన్ ..... చెమటలు పట్టేసాయి .
వాళ్ళు రావడం - లిఫ్టు తెరుచుకోవడంతో ఇద్దరితో లోపలికివెళ్లిపోయి హమ్మయ్యా అనుకున్నాను .
డోర్ క్లోజ్ అయ్యే గ్యాప్ లో కనిపించినట్లు తల్లీ నిజమే ముగ్గురు ముసుగుల్లో - చేతిలో ఏమో ఉన్నాయి , మనవడా ..... ముందు నీ అక్కయ్యను జాగ్రత్తగా తీసుకెళ్లిపో నేనెలాగో వస్తాను .
యష్ణ అక్కయ్య : ముసుగులోఉంటే మాత్రం నాకోసం వచ్చినవాళ్లేనా ? , వెళితే మీతోనే వెళతాము రండి .

డౌన్ ఫ్లోర్లో లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే ఆగండి ఆగండి అక్కయ్యా ఎక్కడికి వెళ్లిపోతున్నారు నన్ను ముందు చూడనివ్వు , నాకున్న భయం కూడా నీకు లేదు అంటూ చేతితో ఆపి వెనక్కు అధిమాను .
దెబ్బలు ......
చెయ్యి యష్ణ అక్కయ్య నడుముపై ఉండటం చూసి స్స్స్ అంటూ వెనక్కు తీసేసుకున్నాను , నవ్వు వచ్చేసింది .
యష్ణ అక్కయ్య : నవ్వడం భలే నవ్వుతావు , వాళ్ళు రౌడీలో కాదో - నాకోసం వచ్చారో ఏమో తెలియకుండా ఎలా భయపడమంటావు .
వద్దులే నావెనుకే ఉండండి చాలు అంటూ బయటకువచ్చి పైకిచూసాను , రండి ..... , నో నో నో పైనుండి చూస్తున్నారు లోపలికి లోపలికి ..... పైనుండి చూస్తున్నారు , అంతలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోవడంతో ఏమిచెయ్యాలో తెలియక చుట్టూ చూస్తే ప్రక్కనే లోపల మనుషులు ఉన్న పెద్దపెద్ద బొమ్మలు ..... ముగ్గురమూ వాటి వెనుక చేరిపోయాము .
పిల్లలకోసం ఆ మనుషుల బొమ్మలు ముందుకువెళ్లిపోయాయి - మా అదృష్టం .... పైనుండి చూస్తున్న రౌడీలు వెనక్కు వెళ్లిపోయారు , వాళ్ళు కిందకు వచ్చేలోపు వెళ్లిపోవాలి ..... సమయానికి బెలూన్స్ బాయ్ కనిపించడంతో పిలిచి పర్సులో ఉన్న కొద్దిపాటి డబ్బు ఇచ్చేసి వాటిని అడ్డుగా పెట్టుకుని exit వరకూ వెళ్లిపోయాము .
రౌడీలు వెతుకుతూ వెనుకే వస్తుండటం చూసి , చిన్నపాటి వర్షంలో లోపలికి వచ్చి గొడుగును మడుస్తున్న ఒకరి నుండి లాక్కుని ముగ్గురమూ గొడుగుకింద చేరాము .
అక్కయ్యా - బామ్మా ..... ప్రక్కకు వెళ్ళకండి .
బామ్మగారు : మనవడా ..... తలుపు దగ్గర ఇద్దరు - పైనుండి ఒకడు చూస్తున్నాడు , భయపడాల్సిన అవసరమేలేదు చుట్టూ గొడుగులే .....
వానదేవుడి హెల్ప్ మనకు కలిసొచ్చింది అంటూ వెహికల్లోకి చేరిపోయాము , హమ్మయ్యా ..... అక్కయ్యా పోనివ్వు పోనివ్వు ఇంటికి వెళ్లేంతవరకూ ఎక్కడా ఆపకు .

యష్ణ అక్కయ్య : బామ్మ మనవడికి మాత్రమే కనిపించారు నాకైతే ఎవ్వరూ కనిపించనేలేదు , మల్లీశ్వరి మూవీ ఎన్నిసార్లు చూసావేమిటి ? 
మల్లీశ్వరి ..... ? , ఒక్కొక్కడూ ఎలా ఉన్నాడో తెలుసా ? , బిహారీ రౌడీల్లా ఉన్నారు , బామ్మగారూ ..... మీరైనా చెప్పండి .
బామ్మగారు : చెప్పి తల్లిని భయపెట్టడం దేనికి మనవడా ..... , మీకేమీ కాలేదు నాకదే సంతోషం .
యష్ణ అక్కయ్య : నేను నమ్మను .
నా అక్కయ్య భయపడకపోవడమే నాకు కావాలి , వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను .
యష్ణ అక్కయ్య : సినిమాల్లో డైరెక్టర్ గా పర్ఫెక్ట్ , ట్రై చేయ్యకూడదూ .....
సినిమానే అక్కయ్యా , త్వరలోనే ఎండ్ కార్డ్ వేసేస్తాను , ఫంక్షన్ పూర్తిచేసుకుని ఇంటికి వెళ్ళగానే ఉంటుంది ఆ రాక్షసికి ...... , ఇక ఉపేక్షించి లాభం లేదు .
యష్ణ అక్కయ్య : నువ్వే ఊహించుకుని నువ్వే హీరోగా ఫీల్ అయిపోతున్నావు , కానివ్వు కానివ్వు నీ ఊహ నీ ఇష్టం .....
బామ్మగారు : తల్లీ ..... అవన్నీ కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి , దయచేసి తమ్ముడిని వదిలి ఎక్కడికీ వెళ్లకు .
యష్ణ అక్కయ్యా : బామ్మా ..... నువ్వుకూడానా ? .
జాగ్రత్తల గురించి మాట్లాడుతూనే ఇంటికి చేరుకునేసరికి 5 గంటలు అయ్యింది .
యష్ణ అక్కయ్య : రేయ్ - బామ్మా ..... ఇదంతా యమున అక్కయ్యకు చెప్పకండి , ఈ పరిస్థితుల్లో కంగారుపెట్టకూడదు - భయపెట్టకూడదు .
అవునవును , గుర్తుచేసినందుకు థాంక్స్ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : జరగనిది జరిగినట్లు జరగలేదన్నట్లు ప్రవర్తించమని చెబుతున్నాను చూడు , వింతగా ఉంది , ఇంకేమీ మాట్లాడకు దిగు దిగు .....
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 29-12-2024, 11:22 AM



Users browsing this thread: 13 Guest(s)