Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"మ్యూచువల్ ఫండ్"
#18
తల్లితో ఇంటర్వ్యుకి వెళ్తున్నానని చెప్పి బయటకి వచ్చింది అమ్మాయి. బయట చిన్నగా తుప్పర.

"అమ్మాయ్, ఈ వానలో వెళ్ళాలా, ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చెయ్యరా?"... అడిగింది తల్లి.

"ఇంటర్వ్యూ ఉండి, ఒక్కళ్ళే వచ్చారనుకో, వాళ్ళు నా కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళైనా, వాళ్ళనే తీసుకుంటారు. నేను రేపు వెళ్తే, జాబ్ లేదు వెళ్ళిపో అంటారు. ఇంటర్వ్యూ ఉన్నా లేకపోయినా, వెళ్ళి రావడం మంచిది. ఇలాంటి జాబ్ వస్తే బాగుంటుంది. రాకపోతే షాపింగ్ మాల్ ఏదైనా పని ఇస్తుందేమో చూసుకోవాలి."

"ఇందుకేనే మీ నాన్నని క్షమిస్తున్నా, బంగారం లాంటి నిన్ను ఇచ్చినందుకు. అయితే వెళ్ళవే. వెళ్ళి ఉద్యోగం ఇచ్చారు అన్న శుభవార్తతో ఇంటికి రా"... కూతురిని ముద్దు పెట్టుకుంటూ మురిసిపోయింది తల్లి.

తల్లి అన్నట్టే జరిగితే బాగుంటుంది అనుకుంటూ, గొడుగు తీసుకుని బయటకి వెళ్ళింది అమ్మాయి.

ఇంటి దగ్గర నించి నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వచ్చింది.

టైం చూసుకుంది. బస్ ఎక్కితే లేట్ అవుతుంది, ఆటోలో వెళ్తే టైంకి ఉండచ్చు, ముందే వెళ్తే అక్కడే ఉండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటూ ఆటో కోసం చూడసాగింది.

వచ్చేవన్ని టూ వీలర్స్, కార్స్ అవుతూ ఆటోలు రాకపోవడంతో, నెమ్మదిగా నడుస్తూ, మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ముందుకి నడవసాగింది.

ముందుకి నడుస్తూ, ఇంకోసారి వెనక్కి చూసింది, మొహంలో నవ్వు. దూరంగా ఒక ఆటో.

చెయ్యెత్తి ఆటో వైపు చూస్తూ ఆగమన్నట్టు సైగ చేసింది. ఆగిన ఆటోలో కూర్చుంటూ, వెళ్లాల్సిన అడ్రస్ చెప్పింది.

"మూడొందలు"... అన్నాడు ఆటో డ్రైవర్.

పర్సులో నాలుగొందలు ఉండాలి అనుకుంటూ చూసుకుంది, ఉన్నాయి. తల ఊపింది. ఆటో సర్రుమని ముందుకు పోయింది.

దిగాల్సిన అడ్రస్ వచ్చింది. డబ్బులిచ్చి దిగింది. ఎదురుగా చిన్న బిల్డింగ్.

లోపలికెళ్ళింది. బయటకి చిన్నదిగా ఉన్నా, లోపల పెద్దదిగా ఉన్న ఆ ఆఫీసుని చూస్తూ, ఎదురుగా కంప్యూటర్ ముందున్న ఒక కుర్రాడికి ఇంటర్వ్యూ విషయం చెప్పింది.

సర్టిఫికెట్స్ అడిగి, కూర్చోమని, లోపలికెళ్లాడు. గొడుగు మూస్తూ, చుట్టూ చూస్తూ కూర్చుంది. పక్కనే ఇద్దరమ్మాయిలు ఉన్నారు, చుక్క తడి లేదు వాళ్ల మీద, అంటే తన కన్నా ముందే వచ్చారు అనుకుంటుండగా, ఇంకో అమ్మాయి వచ్చింది.

వాళ్ళ డ్రసెస్ వైపు చూసింది. మంచి క్వాలిటి డ్రసెస్. తన లాగా ఉద్యోగం అవసరం ఉన్నట్టు కనిపించలేదు వాళ్ళు. తన కన్నా బాగున్నట్టు అనిపించారు.

ఆఫీస్ మొత్తం చూడసాగింది. ముగ్గురు అమ్మాయిలు కంప్యూటర్స్ ముందు కూర్చుని ఏదో చేస్తున్నారు.

ఇంతలో వెనక నించి టక్ చేసుకుని ఉన్న ఒకతను వేగంగా నడుస్తూ లోపలికెళ్లాడు. అతను లోపలికెళ్ళగానే బయట ఉన్న కుర్రాడు ఫ్లాస్క్ తీసుకుని లోపలికెళ్ళాడు.

"ఎంత మంది వచ్చారు?"...కూర్చుంటూ అడిగాడు అతను.

"నలుగురు సార్"...బదులిచ్చాడు కుర్రాడు.

"అప్లై చేసింది?"...కింద సొరుగులో ఉన్నా పెద్ద కాఫీ కప్ తీసి టేబుల్ మీద పెడుతూ అడిగాడు అతను.

"తొమ్మిది మంది"... ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోస్తూ చెప్పాడు కుర్రాడు.

సరే టెన్ మినిట్స్ ఆగి, ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ఫస్ట్, తర్వాత వచ్చిన వాళ్లని తర్వాత, వచ్చిన ఆర్డర్లో లోపలికి పంపు"

కుర్రాడు తలూపి వెళ్ళబోయాడు.

"అక్కడున్న గొడుగు ఎవరిది?"

"మూడో అమ్మాయిది, వానలో వచ్చింది ఆ అమ్మాయే"

"ఓకే"

వెళ్ళిపోయాడు కుర్రాడు.

పది నిముషాలు గడిచాయి.

ముందు వచ్చిన అమ్మాయిని లోపలికి వెళ్ళమన్నాడు కుర్రాడు. లోపలికెళ్ళింది.

పావు గంట గడిచింది. లోపల ఏం అడుగుతున్నారో. కామర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, క్యాలుక్యులేషన్స్ అడుగుతున్నారో, ఏం అడుగుతున్నారో అనుకోసాగింది 'మన' అమ్మాయి.

మొదటి అమ్మాయి బయటికొచ్చింది. ఆఫీసు బయటకి వెళ్ళిపోయింది.

వెంటనే రెండో అమ్మాయిని లోపలికెళ్లమన్నాడు కుర్రాడు. లోపలికెళ్ళింది.

ఇంకో పావు గంట గడిచింది.

మళ్ళీ ఆలోచనల్లో పడింది 'మన' అమ్మాయి. లోపల ఆఫీస్ చూస్తే చాలా బాగుంది, అన్నీ కంప్యూటర్స్. సాఫ్ట్ వేర్ కంపెనీ లాగా ఉంది. ఈ ఉద్యోగం వస్తే కొన్నాళ్లు హాయిగా పని చేసుకోవచ్చు అనిపించసాగింది.

రెండో అమ్మాయి బయటికొచ్చింది. ఆఫీసు బయటకి వెళ్ళిపోయింది.

"హారికా" పిలిచాడు కుర్రాడు.

లేచి నుంచుంది.

"లోపలికెళ్ళండి"

తలుపుతూ... కొంచెం భయపడుతూ లోపలికెళ్ళింది హారిక.
Like Reply


Messages In This Thread
RE: "మ్యూచువల్ ఫండ్" - by earthman - 06-06-2024, 01:20 PM



Users browsing this thread: 2 Guest(s)