Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వరల్డ్ ఫేమస్ రైటర్
#2
"ఏమండీ.. ! మీరు రచనల కోసం ఇంత కష్టపడుతున్నారు కదా.. ! మీకు పారితోషకం ఏమీ రావట్లేదు.. కొంచం ఆలోచించండి.. !"
"నా ఆనందం కోసమే రచనలు చేస్తున్నాను సావిత్రి.. "
"అయినా సరే, మీరు చాలా సమయం వెచ్చించి రాస్తున్నారు.. మీరు రాసే కథలు తప్పులు లేకుండా చాలా నీట్ గా ఉంటాయి.. చాలామంది చేసే రచనలలో చాలా తప్పులు ఉంటున్నాయి.. అయినా వారికే గుర్తింపు ఎక్కువ వస్తోంది.. "
"సావిత్రీ.. ! రచన చేసినప్పుడు.. పర్ఫెక్ట్ గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం.. తొందరపడి ఏదో రాసేసి పంపించడం నాకు ఇష్టం లేదు. రోజు కాకపోతే, ఏదో రోజు నాకు గుర్తింపు వస్తుంది లే.. రేపటి నుంచి నవలలు కూడా మొదలుపెడుతున్నాను.. "
"అయినా మీకెందుకు ఇస్తారు లెండి పారితోషకం. నేను చూస్తూనే ఉన్నాను కదా.. ఎప్పుడూ కొంత మందికే బహుమతులు వస్తున్నాయి.. మీకు ఎప్పుడో ఒక్కసారి ఇచ్చారు అంతే.. ఒక బహుమతి.. "
"నువ్వు చెప్పింది నిజమే.. అన్నీ చోట్ల ఉన్న విధంగానే.. ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు.. ఏం చేస్తాం.. ? మన ప్రయత్నం మనం చెయ్యాలి.. ఎప్పటికైనా నన్ను గుర్తిస్తారన్న నమ్మకం నాకు ఉంది .. " అన్నాడు ఆనందరావు
"మీ నమ్మకం మీది. ఏదో రోజు మీరు వరల్డ్ ఫేమస్ రైటర్ కావాలన్నదే నా కోరిక"



******



ఏమండీ.. ! సన్మానం గురించి ఏమైనా తెలిసిందా.. ?
"క్రిందటి సంవత్సరం.. కొంత మంది రచయితలకు సన్మానం చేసారు.. మళ్ళీ ఊసే లేదు.. ఎందుకో.. ?"
"నెక్స్ట్ సన్మానం ప్రకటిస్తే, మొదటి పేరు మీదే ఉంటుంది.. నేను దాని కోసమే చూస్తున్నాను.. " అంది సావిత్రి 
"నా మీద నీకున్న నమ్మకానికి చాలా థాంక్స్ సావిత్రి.. "
"మీ కష్టం నాకే తెలుసు. రాత్రనకా.. పగలనకా.. ఐడియా వచ్చిన వెంటనే రాసేస్తున్నారు. మీ కష్టం ఊరికే పోదు.. మీ సన్మానానికి నేను కొత్త చీర కూడా రెడీ చేసుకున్నాను.. తెలుసా.. ?"
"అవునా.. ! అతి త్వరలో రోజు వస్తుంది సావిత్రి.. అప్పుడు ఆనందరావు గారి భార్యగా నీకూ చాలా గుర్తింపు వస్తుంది.. "
"నిజమేనండీ.. ! మీతో పాటు.. నాకూ గుర్తింపు, హోదా వస్తుంది మరి.. !"



====================================================================
ఇంకా వుంది.. 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వరల్డ్ ఫేమస్ రైటర్ - by k3vv3 - 06-06-2024, 08:31 AM



Users browsing this thread: 2 Guest(s)