04-06-2024, 08:17 PM
కొత్త త్రెడ్ ఓపెన్ చేసారు అంటున్నారు.. ఇంతకన్నా ఒక పాఠకుడిగా ఏం చేయాలి?? పేరు పేరున అందరికీ అడగలేము.. ఎవరి స్టైల్ వారిది.. మీ రచనలతో పిచ్చి ఎక్కిస్తున్నారు.. అప్డేట్ లేక ఒక షుగర్ పేషంట్, బీపీ పేషంట్ ఎదురు చూస్తున్నట్లు మీ అప్డేట్ కోసం ఎదురు చూడటం తప్ప ఇంకేం చేయగలం?? వ్యూస్ మీకు ఉన్నాయి.. i can understand ఒక రచయితకి కామెంట్స్, లైక్ కి మించిన అభినందన ఏది ఉండదు.. కానీ సైలెంట్ రీడర్స్ చాలా ఉన్నారు.. అందులో నేను కూడా ఉన్న.. ఒక చిన్న ex. ఒక స్వామి కరువుతో అల్లాడుతున్న ఊర్లో వర్షం కురిపిస్త అన్నాడు. ఊర్లో అందరూ వచ్చారు.. కానీ వర్షం కురవలేదు.. చివరికి ఒక పిల్లాడు గొడుగుతో వచ్చాడు.. అపుడు వర్షం కురిసింది . నేను చెప్పేది ఒకటే . మీ రచయితలు దేవుళ్ళు కాదు వైద్యులు...... మా టెన్షన్స్, అన్ని రిలీఫ్ చేసి మమ్మల్ని అలరించే వైద్యులు.. వంద మంది మీది చెత్త స్టొరీ అన్న కూడా మీ స్టొరీ నచ్చి లైక్ చేసే ఒక్కడి కోసం స్టొరీ రాయండి.. మావి గజి బిజి బతుకులు సార్.. ప్రతి సారి లైక్, కామెంట్ అంటే ఏమో గాని మీ స్టొరీ నీ మనసార ఆస్వాదిస్తూ మీరు బాగుండి ఇలాంటి కథలు మరెన్నో అందించాలని కోరుకునే సగటు పాఠకుణ్ణి.. ఇంకోటి ఇంతలా మమ్మల్ని అలరిస్తున్న మీకు నా కామెంట్స్ ఎక్కడ చిన్న బుచ్చుతాయో అని భయం.. మీరు నా ఎదురుగా అంటే దండ వేసి దండం పెట్టడం.. అంత కన్నా ఎలా పొగడలో తెలియని సామాన్య పాఠకుణ్ణి నేను.. ఇందులో నా తప్పు ఉంటే క్షమించండి.. కానీ ఒక్కటి మాత్రం నిజం.. మమ్మల్ని అలరిస్తున్న మీ రచయితలు అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు..