03-06-2024, 10:32 PM
(This post was last modified: 03-06-2024, 10:33 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక వైపు జీడీ మామిడి తోటలు, ఒక వైపు కాలువ గట్లు, ముందుకు వెళ్తే పచ్చటి పొలాలు అవి దాటితే కొబ్బరి తోటలు..
పచ్చని పొలాలలో పని చేసుకునే ఆడంగులు, నీళ్ల కాలువలో ఈత కొట్టే పిల్లలు, తాటి కల్లు దింపే మగవాళ్ళు..
ఎవరి లోకం లో వాళ్ళు ఉండగా కార్ అంతర్వేది గుడి దగ్గర ఆగింది..
సుధ - గుడి ముందు షెడ్ ని చూస్తూ ఇదేంటి ఇంత ఎత్తుగా ఉంది..
రాజు - అది స్వామి వారి రధం, కళ్యాణం అప్పుడు ఉత్సవాలకు తీసుకు వెళతారు,
సుధ - ఓహ్ వావ్ అనుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది..
తర్వాత ఇద్దరూ గుడి లోపలికి వెళుతూ ఉంటె వాళ్ళ వెనుక సుజ, తన వెనుక బాలు..
అక్కడా సుధ ఫొటోస్ తీస్తూ ఉంటె
పూజారి - అమ్మ గుడిలో ఫోటోలు తియ్యకూడదు అంటారు..
సుధ - ఓహ్ సారీ.. అని ఫోన్ హ్యాండ్ బాగ్ లో పెట్టేస్తుంది..
లోపల స్వామి వారి దర్శనం అయ్యాక..అందరూ తీర్థం తీసుకుని బయటకు వస్తు ఉంటె బాలు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని బయటకు వస్తాడు..
సుజ వాడి వాటం చూసి ఒక నన్ను నవ్వి మొహం తిప్పుకుంటుంది..
సుధ - రాజు ఇది చాల పాత కాలం గుడిలా ఉంది కదా...
రాజు - అవును ఇక్కడ శాసనాల్లో కృతయుగం నాటి గుడి అని ఉంది.. చాల మహిమ గల దేవుడు..
అలా అనగానే సుధ మళ్లి బయట నుంచే ఇంకోసారి దణ్ణం పెట్టుకుంటుంది..
బాలు - అవునవును.. మా అమ్మ నాన్నల్ని ఇలా మాయం చేసేసాడు అని చిటిక వేసి చూపిస్తాడు..
రాజు - రేయ్.. అనగానే వాడు నోటి మీద వేలు వేసుకొని గుడి గోపురం చూసుకుంటూ అలా వెళ్ళిపోతాడు..సుధ రాజు గుడి మీద శిల్పాలు చూస్తూ ఉంటారు... ఈలోపు సుజ కి బోర్ కొట్టి బాలు వైపు వెళ్లి
సుజ - ఓయ్.. ఇక్కడ బీచ్ ఎక్కడ ఉంది..
బాలు - ఓయ్.. నాకో పేరుంది.. బాలు..
సుజ - అవునా.. మంచిది..
బాలు - పేరు చెప్పాక తిరిగి పేరు చెప్పడం మర్యాద..
సుజ - అవునా.. కార్ లో దౌర్జన్యం గా ఎక్కడం ఎక్కడ మర్యాదో మరి..
బాలు - మా అన్న గాడు ఇచ్చాడు లిఫ్ట్ మీరు కాదు..
ఈలోపు సుధ అరుస్తుంది.. సుజా ఎక్కడ అంటూ..
బాలు - సుజ నా సుజ ఏంటి కూజా లాగ.. సగం పేరు పెట్టి వదిలేశారా..
సుజ - షట్ అప్ నా పేరు నా ఇష్టం..
అంటూ కోపం గా సుధ రాజు ల దగ్గరకి వస్తుంది.. కోపం గా.. బాలు నవ్వుకుంటూ వెనక ఫాలో అవుతాడు..
సుధ - గుడి బావుంది కదా..
సుజ - హ యాదగిరి గుట్ట స్వామి గుర్తొచ్చారు..
బాలు - అదెక్కడా..
సుధ - హైదరాబాద్ దగ్గర.. అంటూ రాజు వైపు తిరిగి.. ఇప్పడు ఎక్కడికి..
రాజు - మీరెప్పుడైనా లైట్ హౌస్ ఎక్కారా..
సుజ - లైట్ హౌస్ ఆ బన్నీ మూవీ లో చూడడమే.. ఎప్పుడు ఎక్కలేదు.. వెళదాం అక్కా..
సరే అంటూ కార్ తీసి ఆ ఇసక నేలలో మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే మెల్లిగా సముద్రం హోరు స్టార్ట్ అవుతుంది..
సుజ - ఓహ్ బీచ్...వావ్..
రాజు - అదిగో లోట్ హౌస్..
సుధ - ఏది అంటూ కిటికీ లోంచి తల బయటకు పెట్టి దూరంగా ధగ ధగ మెరుస్తున్న లైట్ హౌస్ ని చూస్తుంది..
కార్ ఆపగానే సుజ ఫాస్ట్ గా పరుగెత్తుకుంటూ హే నేనే 1st అంటూ గబగబా లైట్ హౌస్ మెట్లు ఎక్కుతూ ఆయాసం గా ఆగుతుంది..
ఈలోపు మెల్లిగా రాజు, సుధ, బాలు కబుర్లు చెప్పుకుంటూ తన దగ్గరకు రాగానే మళ్లి పరిగెడుతుంది..
పైకి వెళ్లి చూస్తే అనంతమైన సముద్రం.. సుదూరమైన ఆకాశం తో కలిసిపోతూ..
రాజు - అదిగో గోదావరి సముద్రం లో కలిసే చోటు అని చెప్పనే అదే..
సుజ - అది నరసాపురం లో కదా..
రాజు - అది గోదావరి అటు వైపు.. వెస్ట్ గోదావరి.. మనం ఇటు వైపు ఉన్నాం.. ఈస్ట్ గోదావరి..
సుధ - నైస్... చాల బావుంది.. మనం వెళ్ళొచ్చా అక్కడకి..
రాజు - వెళ్లొచ్చు.. వెళ్దామా..
సుజ - బాబోయ్ కాళ్ళు లాగుతున్నాయి.. కాసేపాగి వెళ్దాం..
బాలు మాత్రం ఎం మాట్లాడకుండా సైలెంట్ గా సముద్రాన్ని చూస్తూ ఉంటాడు...
రాజు - ఏంట్రా అలా ఉన్నావ్.. వచ్చేటప్పుడు బానే ఉన్నావ్ గా..
బాలు - ఎం లేదురా అంటూ పేస్ రియాక్షన్ మార్చేసి.. నా హీరోయిన్ తోటి ఇక్కడ డ్యూయెట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా...
సుధ - ఏంటి బాలు, లవ్ స్టోరీ నా..
బాలు - లేదండి జస్ట్ ప్లానింగ్..
సుజ కోపం గా మొహం తిప్పుకుంటూ.. అక్కా బీచ్ కి వెళ్దాం.. అని మళ్ళీ ఫాస్ట్ గా మెట్లు దిగడం మొదలు పెడుతుంది..
నలుగురూ సముద్రం దగ్గరకు రాగానే సుజ అలల వైపు పరిగెడుతూ సముద్రం తో కబడ్డీ అట ఆడుతూ ఉంటుంది..
సుధ సుజ ని చూస్తూ వొడ్డున కూర్చుని కళ్లు మూసుకుని సముద్రం హోరు వింటూ ఉంటుంది..
రాజు కూడా కొంచెం పక్కగా కూలబడతాడు.. బాలు నుంచుని సుజ ని సముద్రాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు..
కాసేపటికి సుజ వచ్చి అదేంటి అందరూ కూర్చుండిపోయారు గోదావరి సముద్రం కలిసే చోటుకు వెళదాం.. పదండి..
సుధ - ఒసేయ్ అన్నిటికి హడావిడేనా.. ఇంకాసేపు ఉంటాం కదా.. వెళ్దాం లే మెల్లిగా.. ఇక్కడ ఎంత ప్లెసెంట్ గా ఉంది.. కాసేపు నువ్వు కూడా కూర్చో ఇక్కడ..
సుజ - ఒసేయ్ ఎదో ప్రపంచం ఆగిపోయినట్టు అలా కూర్చోవడం నా వల్ల కాదె.. వెళదాం పద..
సుధ - పోనీ రాజు తో పాటు నువ్వు వెళ్ళు నేను కాసేపాగి వస్తా..
ఈలోపు బాలు రావద్దురా అన్నట్టు సైగ చేస్తాడు రాజుకి..
రాజు - నాకూ కాసేపు ఇక్కడ ఉండాలని ఉంది.. బాలు నువ్వు తీసుకెళ్ళరా అంటాడు..
బాలు - అన్నయ్య, నువ్వు చెప్పావు కాబట్టి.. నీకోసం.. అంటూ సుజ వైపు తిరిగి.. మిస్.. ఫాలో మీ.. అంటాడు..
సుజ వాణ్ణి తిట్టుకుంటూ.. సముద్రం వైపు చూస్తూ మొహం తిప్పుకుని నడుస్తూ ఉంటుంది..
బాలు - ఏంటి సుజ చూస్తుంటే ఎదో మూడాఫ్ లో ఉన్నట్టున్నావ్..
సుజ - మూడ్ ఆఫ్ కాదు మర్డర్ చేసేంత కోపం లో ఉన్నాను..
బాలు - ఎందుకండీ అంత కోపం.. ఎదో సరదాగా అన్న దానికి..
సుజ - షట్ అప్ నాతొ మాట్లాడితే చంపేస్తాను.. అని కోపం గా అరిచి వాణ్ణి దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది..
కొంత దూరం నడిచాక విసుగు పుట్టి ఇంకా ఎంత దూరం అంటుంది..
బాలు రెండూ చేతులూ బార్ల చాపి చాలా దూరం అని సైగ చేస్తాడు..
సుజ - బాబోయ్ కాళ్ళు నొప్పెడుతున్నాయ్..
బాలు - ఎత్తుకు తీసుకువెళ్ళానా.. పోనీ భుజం ఎక్కుతావా అని సైగ చేసి అడుగుతాడు..
సుజ - చి అందుకే నీతో మాట్లాడొద్దు అనుకున్నాను.. నువ్వెలాంటి వాడివో నీ మొహం మీద రాసుంది..
బాలు - వాడి మొహం వాడు చదువుకోడానికి అన్నట్టు ఆక్ట్ చేస్తాడు
సుజ - నిన్ను అంటూ కొట్టడానికి పరిగెడుతుంది..
వాడు దొరక్కుండా పరిగెడితే ఇక ఆయాసం వచ్చి అక్కడ బీచ్ లో కూర్చుండిపోతుంది..బాలు వచ్చి నవ్వుతూ చెయ్యి ఇస్తాడు లేవడానికి..
సుజ - ఇంకా దూరం ఉంటె వెనక్కి వెళ్ళిపోదాం.. అక్క కంగారు పడుతుంది లేట్ ఐతే..
బాలు - లేదు దగ్గరకి వచ్చేసాం.. రెండు నిముషాలు అని మళ్ళీ సైగ చేస్తాడు..
సుజ - ఏంటి నాతొ మాట్లాడవా..
బాలు - మాట్లాడితే చంపేస్తా అన్నావ్ గా..
సుజ - ఇప్పుడు మాట్లాడావుగా చంపెయ్యనా.. అని వాడి పీక పిసికినట్టు నొక్కి వదిలిపెడుతుంది..
బాలు - హే నిజం గా సారీ..
సుజ - సర్లే క్షమించేసాను పో.. అని మళ్ళీ నడక స్టార్ట్ చేస్తుంది..
బాలు సైలెంట్ గా ఎస్.. అనుకుంటూ నవ్వుతూ ఫాలో అవుతాడు..
కట్ చేస్తే..
సముద్రాన్ని జూమ్ అవుట్ చేసుకుంటూ సుధ రాజు మధ్యలోంచి వెనక్కి వస్తే..
వచ్చే అలలు వీళ్ళ దాకా వచ్చి వెన్నకి వెళ్లిపోతున్నాయి..
సుధ మోకాళ్ళ మీద గెడ్డం ఆనించి ఇసుకలో ఏవేవో రాసుకుంటూ ఉంటుంది..
కాసేపటికి ఈ లోకం లోకి వచ్చి రాజుతో..
సుధ - రాజు నువ్వు ఎం చేస్తూ ఉంటావ్..
రాజు - ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ ఐంది.. అధికారి ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను.. హైదరాబాద్ లో ఏదైనా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలని ప్లాన్..
సుధ - ఓహ్ నైస్.. మరి బాలు..
రాజు - చిన్నగా నవ్వి.. వాడు వస్తాడు హైదరాబాద్ హీరో అవ్వడానికి..
సుధ - హహహ్ అందుకేనా హీరోయిన్ తో డ్యూయెట్ అంటున్నాడు.. బావుంది.. మరి హైదరాబాద్ వచ్చి ఛాన్స్ లు వెతుకుతాడో హీరోయిన్ ని వెతుకుతాడో..
రాజు - నువ్వేం చేస్తున్నావ్..
సుధ - నాది డిగ్రీ కంప్లీటెడ్.. నెక్స్ట్ ఎంబిఏ చేసి పాలిటిక్స్ లోకి వెళదాం అనుకుంటున్నా..
రాజు కళ్లు పెద్దవి చేసి చూస్తుంటాడు..
సుధ - ఏమైంది.. అలా నవ్వుతున్నావ్.. నేను పాలిటిక్స్ లోకి ఏంటి నా..
రాజు - లేదు లేదు మీకు రాజకీయం బ్లడ్ లోనే ఉంది కదా.. వర్కౌట్ అవుతుందిలే..
సుధ - ఓహ్ అదా.. సరే లేట్ అవుతోందిగా మనమూ వెళ్దామా..
రాజు - హ కార్ లో వెళ్ళిపోదాం.. ఫోన్ చేసి చెప్పేయ్.. అటే వస్తాం వెయిట్ చెయ్యమని..
సుధ - గుడ్ ఐడియా అని సుజ కి డయల్ చేస్తూ కార్ వైపు వెళతారు..
సుజ సరే అక్క అంటూ ఫోన్ కట్ చేసి.. ఎదురుగ చూస్తే ప్రశాంతమైన గోదారి ఉగ్రమైన సముద్రం లోకి వడివడిగా పరిగెడుతోంది..
సుజ వావ్ అనుకుంటూ ఫొటోస్ క్లిక్ మనిపిస్తుంటే..
బాలు - ఏంటి ఫోన్
సుజ - అక్క వాళ్లు డైరెక్ట్ కార్ లో వస్తున్నారట.. రిటర్న్ రావద్దు వెయిట్ చెయ్యమని..
బాలు అక్కడ చిన్న పడవ లంగర్ వేసి ఉంటె దాన్లో కూర్చుంటాడు..
సుజ - అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఏమైనా పల్లెటూరి అందం పల్లెటూరుదే అంటూ
అక్కడ చిన్న చిన్న నీటి కుంటలు ఉంటె వాటిలో తనని తాను చూసుకొని ఐ లవ్ యు డార్లింగ్ అంటుంది..
బాలు షాక్ తిని వెనక్కి తిరిగి చూస్తాడు.. సుజ నీళ్లలో చూస్తూ సముద్ర గాలికి ఎగురుతున్న జుట్టు సరిచేసుకుంటూ ఉంటుంది..
బాలు - సుజ నువ్వు ఎం చదువుతున్నావ్..
సుజ - బి టెక్ 3rd ఇయర్.. ఏమి..
బాలు - ఎం లేదు.. చిన్న పిల్ల లాగా నిన్ను చూసి నువ్వే ఐ లవ్ యు చెప్పుకుంటున్నావ్.. ఇప్పటి దాక నీకు ఎవరూ చెప్పలేదా పాపం..
సుజ - కొంచెం స్టైల్ గా కాలు టాప్ చేస్తూ ఆ సంగతి నీకెందుకోయ్..
బాలు - నీకో మంచి సంగతి చెపుదాం అనుకున్న.. వద్దంటే వదిలేయ్..
సుజ - ముందు మన సెల్ఫ్ ని లవ్ చేసుకోకుండా ఎవర్ని లవ్ చేసిన వేస్ట్..
బాలు - కరెక్టే.. ఇంతకీ నీకు లవ్ అటు 1st సైట్ మీద నమ్మకం ఉందా..
సుజ - హా అంటూ అలోచించి.. ఉంది.. నా కాలేజీ సీనియర్ ఒకడున్నాడు ఉన్నాడు.. మహేష్ బాబు ల పొడుగ్గా హ్యాండ్సమ్ గా.. ఐ లవ్ హిం..
బాలు - కొంచెం ఏడుపు మొహంతో .. ఓహ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఆ..
సుజ - ఇంకా లేదు.. కాలేజీ ఓపెన్ అయ్యాక ప్రొపోజ్ చెయ్యాలి.. ఎలా చెప్తే బావుంటుందో నువ్వు ఐడియా ఇవ్వకూడదూ.. అని సైడ్ కి తిరిగి చిన్నగా నవ్వుకుంటుంది..
బాలు - నేనేం ఐడియా ఇస్తా
సుజ - అదే ఎలా అప్రోచ్ ఐతే బావుంటుందో..
బాలు - ఇక్కడ నాకే దిక్కు దివాణం లేదు..
సుజ - అంటే..
బాలు - అన్ని తెలివి తేటలే నాకుంటే ఈ పాటికి నా హీరోయిన్ తో బీచ్ లో పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి.. ఇలా నీతో పాటు ఎందుకు వస్తా చెప్పు..
సుజ - హే ఇందాక కూడా సేమ్ అన్నావ్.. హీరోయిన్ అని.. ఎవరైనా డ్రీం గర్ల్ ఆ..
బాలు - అదా.. నేను రేపు హీరో అవుదాం అనుకుంటున్నా.. సో ఆ హీరోయిన్ అన్నమాట..
సుజ - ఐతే సార్ సూపర్ స్టార్ అయిపోతారన్నమాట.. మరి అప్పుడు మాకు ఆటోగ్రాఫ్ లు ఫొటోగ్రాఫ్ లు కావాలంటే రావచ్చా...
బాలు - అంత కష్టం ఎందుకు నువ్వే హీరోయిన్ గా చెయ్యొచ్చు కదా నా పక్కన..
సుజ - అబ్బా చా..
బాలు - లేదు నిజం గా అడుగుతున్నా నా హీరోయిన్ అవుతావా.. అంటూ చిలిపిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు..
సుజ - కొంచెం ఆలోచించినట్టు మొహం పెట్టి.. ఇప్పుడే హీరోయిన్ ఐతే చదువు అటక ఎక్కేస్తుంది.. అందుకని చదువు అయ్యాక చూద్దాం లే..
బాలు - ఐతే 2 ఇయర్స్ తర్వాత నా హీరోయిన్ అవుతా అంటున్నవ్..
సుజా - చూద్దాం అంటున్నా.. ముందు నువ్వు హీరో అవ్వు బాబు.. అంటూ నవ్వుతూ మళ్ళీ సముద్రం వైపు అడుగులు వేస్తుంది..
బాలు - అవును ఇందాక నేనెలాంటివెన్నో మొహం మీద రాసి ఉంది అన్నావ్.. అప్పుడు నా మీద నీ ఒపీనియన్ ఏంటి..
సుజ – బాబా.. గతం గతః.. అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు చెప్పు..
బాలు - అది కాదు.. చెప్పొచ్చు కదా సరదాగా.. ప్లీజ్..
సుజ - నువ్వు ఇలా అందర్నీ బ్రతిమాలుతూనే ఉంటావా..
బాలు - లేదు నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే..
సుజ కొంచెం కోపం గా చూస్తుంది...
బాలు - అంటే.. నచ్చినప్పుడు మాత్రమే అని దాని అర్ధం.. ఎందుకు అలా అడిగావు..
సుజ - ఇందాక కార్ లో అంతర్వేది రావడానికి రాజు ని కూడా ఇలాగె బ్రతిమాలావ్ కదా..
బాలు - కార్ లో వద్దామని కాదు నీతో వద్దామని..
సుజ - నాతోనా? ఎందుకు..
బాలు - సుజ 21st సెంచరీ లో కూడా 1800 పెళ్ళికూతురిలా.. ఎందుకు ఏమిటి అంటే ఎలా చెప్పు..
సుజ - అర్ధం అయ్యింది కానీ.. మరి నా హీరో కి ఉండాల్సిన లక్షణాలు నీలో లేవే..
బాలు – అంటే ఎం ఉండాలి..
సుజ - అవి నీలో ఉన్నట్టు నేను ఫీల్ అవ్వాలి.. అంతే కానీ నీకు చెప్పి చేయించుకుంటే రీల్ హీరో అవుతావు తప్ప రియల్ హీరో ఎలా అవుతావు చెప్పు..
బాలు - మొహం కిందకి వేసుకొని.. కరెక్టే..
సుజ - ఏంటి కరెక్ట్..
బాలు - నువ్వు చెప్పిందే..
సుజ - అదే.. నీకేం అర్ధం అయ్యింది అని అడుగుతున్నా..
బాలు - చెప్పా కదా నువ్వేం చెప్పావో అదే అర్ధం అయ్యింది.. అండ్ అదే కరెక్ట్..
ఈలోపు సుజ దూరం గా చెట్ల వైపు ఎదో కదలిక కనపడితే అటు చూస్తూ ఉంటుంది...
సుజ - బాలు.. నీ హీరోయిజం చూపెట్టే టైం వచ్చినట్టుంది..
To be continued..