31-05-2024, 05:35 PM
(This post was last modified: 31-05-2024, 05:37 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
33. తోలి ప్రేమ (లు) - 2
కాలేజ్ లో జాయిన్ అయ్యాక, నా గురించి అమ్మాయిలూ పడి చస్తారు అనుకున్నా... దీనేమ్మా ప్రతీది కూడా యవాయిడ్ చేస్తుంది లేదా... పల్లె టూరు గుంటలు అయితే అన్నియ్యా... అన్నియ్యా... అంటూ తగలబడుతున్నాయి. నాకేం అర్ధం కావడం లేదు. కొంచెం హైట్ ఉంటా కదా... మా PD సర్ కన్ను పడింది నా మీద. ఒకటే పనిగా పిలిచి కాలేజ్ ఆటల్లో ఆడించే వాడు, ఏ రోజు వదిలే వాడు కాదు. అయితే అక్కడ మోమిన్ అనే బక్క సుందరి తగిలింది. నీ యమ్మా భలే ఉంది అనుకుంటూ అప్రోచ్ అయ్యా, అంతే కతమ్.... తమ్ముడు అనేసింది. నాకు అర్ధం కావడం లేదు. నాతో పాటు జాయిన్ అయిన బచ్చా గాళ్ళు అమ్మాయిలను వేసుకొని తిరుగుతున్నారు. అది ఎలా ఉంది అంటే. ఒక తాళం బుర్ర ఉంది. నెంబర్ లాక్ ఉంది, నేను తప్ప అందరూ ఎవరి లాక్ వాళ్ళు ఓపెన్ చేసి వెళ్ళిపోయారు.
ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నాయి. ఆన్ లైన్ నుండి ఆఫ్ లైన్ దాకా ఎవరూ నాకు పడడం లేదు.
ఛీ దీనమ్మే ఇక నాకు పడరు లే అనుకుని ఎక్సామ్స్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఫోన్ లో ట్రింగ్ అంటూ మోగింది.
"హాయ్ క్రిష్... ఎక్సామ్స్ కి ప్రిపేర్ అయ్యావా...."
చచ్చిపోయింది. చదవాలి అన్న ఉత్సాహం, ఊపు మొత్తం పోయింది.
అమ్మాయే అయి ఉంటుంది. లేదు అయి ఉండదు. నాకే పంపారా... పేరు క్రిష్ అని పెట్టారు.
వద్దు వద్దు రిప్లై పెట్టొద్దు అని బలంగా అనుకున్నా.
క్రిష్ "ఎవరు మీరు?" వద్దు అనుకుంటూనే రిప్లై పంపించాను.
అటు నుండి కూడా రిప్లై వచ్చింది.
నెక్స్ట్ డే నా అప్రోచ్ కాలేజ్ లో మారిపోయింది. ఏ అమ్మాయిని నేను చూడడం మానేశాను. మాట్లాడాలని ప్రయత్నించడం మానేశాను.
సెమ్ ఎక్సామ్స్ అయిపోయాయి.
అమ్మాయిల వెంట తిరిగినా మా బ్యాచ్ నీచ కమీన్ కుత్తే గాళ్ళు అందరూ తప్పారు.
నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను.
నేను ఫోన్ లో ఎదో చేసుకుంటూ ఉంటే, మన బక్క సుందరి మోమిన్ వచ్చి "హాయ్ క్రిష్" అంది.
నేను ఫోన్ లో ఉండి పట్టించుకోలేదు. తను మళ్ళి "హాయ్ క్రిష్" అంది.
నేను తనను చూసి "హా... చెప్పూ" అన్నాను. తను నన్ను నవ్వుతూ చూసి "ఎన్ని మిగిలాయ్" అంది.
బోకడా మొహంది నన్ను కూడా దాని లెవల్ అనుకుంది.
నేను "ఆల్ పాస్" అంటూ దాని గుండెల్లో గునపం దించేసి ఫోన్ లో మెసేజ్ చేస్తున్నాను.
బక్కది "ఫోన్ లో ఎవరూ" అంది.
క్రిష్ "తను నిత్యా...."
బక్కది నన్ను చూస్తూ ఉంది.
క్రిష్ "నిత్యా.... నా గర్ల్ ఫ్రెండ్" అంటు లైన్ పూర్తి చేసి నవ్వాను.
దానికి కాలింది లేచి వెళ్ళిపోయింది.
ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికితే ఇదంతా అవుతుందా అంటే జరుగుతుంది. ఎందుకంటే నా మనసు అప్పటి వరకు ప్రశాంతంగా లేదు కాని అప్పుడు వచ్చింది. నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చినందుకు నేను పాస్ అవ్వలేదు. నా మైండ్ కూల్ అయినందుకు పాస్ అయ్యాను.
ఇక నిత్య విషయానికి వస్తే....
నిత్యాతో రోజు చాట్ చేసే వాడిని పగలు గూడా మార్నింగ్ తో మొదలు పెట్టి, రాత్రి గుడ్ నైట్ వరకు సుమారు వందలలో మెసేజెస్ ఎక్సచెంజ్ అయ్యేవి.
ఒక రోజు నాకు బట్టలు పంపింది.
అలా మా రిలేషన్ నెక్స్ట్ స్టెప్ కి తీసుకొని వెళ్లాం.
తన ఇష్టా ఇష్టాలు.... కష్టాలు అన్ని నాతొ చెప్పేది, నేను కూడా నాకు తెలిసింది చెప్పి, సహాయం చేసేవాడిని, సపోర్ట్ గా ఉండే వాడిని.
వాళ్ళ నాన్న తర్వాత నా మీదే తనకు నమ్మకం అని చెప్పింది.
మా అన్నయ్య కొడుకు ఫ్రెండ్ బర్త్ డే అని నాకు గుర్తు చేసి మరీ చెప్పించింది.
మా అన్నని బావ గారు అని, వదినని అక్క అని పిలిచేది. ఇక అమ్మానాన్నని అయితే తను అత్తమామ అని కూడా కాదు. తనకు కూడా అమ్మానాన్న అనే పిలుస్తాను అలానే చూస్తాను అని చెప్పింది.
అసలు ఒక అమ్మాయి నీ కోసం ఇంత సమయం స్పెండ్ చేస్తుంది... అంటే మనకు ఎంత బాగుంటుంది చెప్పండి.
సరిగ్గా అలాంటపుడు మా జీవితంలోకి విలన్ గాడు ఎంటర్ అయ్యాడు. .....రాజు....
సుమారు సంవత్సరం తనతో చాట్ చేస్తూ ఉంటే, అప్పుడు వచ్చాడు.
గుండె పగిలి పోయే న్యూస్ చెప్పాడు...
క్రిష్ "నిత్య అమ్మాయి కాదు"
నిషా "అబ్బాయా"
క్రిష్ "కాదు"
కాజల్ "అంటే... ఆ..."
క్రిష్ "ఆ... కూడా కాదు"
నిషా "మరీ..."
క్రిష్ పైకి లేచి దీర్గంగా శ్వాస తీసుకొని చెప్పాడు. "వాళ్ళు ఒక గ్రూప్... ముగ్గురు వ్యక్తులు... ఒక గ్రూప్"
నిషా "అదేంటి నిత్య అంటే ఒకళ్ళు కాదా"
కాజల్ "ముగ్గురు ఏంటి?"
క్రిష్ "రోజులు మారిపోయాయి మేడం.... నా లాంటి ఎర్రోళ్ళు ఎర్ర బస్సులో దిగుతారు అని అర్ధం చేసుకొని మమ్మల్ని ట్రాప్ చేయడానికి నెట్వర్క్ రెడీ చేసుకున్నారు"
నిషా "హనీ ట్రాప్"
క్రిష్ "సుమారు నా లాంటి ఆరుగురు ని ట్రాప్ చేశారు.... వాళ్ళు నా డేటా అంతా స్టోర్ చేసుకొని మెసేజెస్ చూస్తూ ఉంటారు అంట... అలాగే మాకు పంపే అకౌంట్ నెంబర్స్ కూడా..."
కాజల్ "ఎంత పెట్టావ్..."
క్రిష్ "ఒక స్కూటీ కొనిపెట్టా... ఇంకా డబ్బులు కూడా పంపా.... తన కోసం నేను పార్ట్ టైం జాబులు కూడా చేసేవాడిని"
కాజల్ "ఎంత?"
క్రిష్ "ఒకటిన్నర లక్ష"
కాజల్, క్రిష్ భుజం మీద కొట్టి "సిగ్గు ఉందా నీకూ అసలు... అమ్మ నాన్న కష్ట పడి డబ్బులు కూడా బెడితే.... ఇలా చేస్తావా..."
నిషా "మాకు అమ్మ నాన్న కూడా లేరు..."
కాజల్ "అలాంటిది వాళ్ళు తినకుండా నీకూ పంపితే..."
క్రిష్ "ఇంకా అయిపోలేదు"
నిషా "ఇంకా ఏముంది?"
క్రిష్ "ట్రైన్ జర్నీ"
నిషా "ట్రైన్"
క్రిష్ "లాస్ట్ ఎపిసోడ్ లో ఊరు నుండి కాలేజ్ కి వెళ్ళే ట్రైన్ లో పరచయం అయింది కదా... మన మాళవిక.... వెళ్ళేటపుడు పాకీ దానిలా ఉంది కదా.... సిటీ కల్చర్ కి ..... కత్తిలా తయారయింది"
క్రిష్ "మెల్లగా ఈ నిత్య నా మీద వాడిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని నేను మాళవిక మీద వాడి ఫోన్ నెంబర్ సంపాదించి లైన్ లో పెట్టేశాను"
కాజల్ "పోనీలే...."
నిషా ఆశ్చర్యంగా కాజల్ వైపు చూసింది.
కాజల్ "ఇక ఆ నిత్య బాధ పోయింది కదా"
క్రిష్ అడ్డంగా ఊపాడు.
కాజల్ "ఏమయింది?"
క్రిష్ "ఈ ట్రిక్స్ మీదే కదా... మాళవిక నాకు పడింది... అందుకే ట్రిక్స్ నిత్య ని కూడా మైంటైన్ చేశాను"
క్రిష్ "సుమారు రెండు నెలలు చాటింగ్.... చాటింగ్....
హాయ్... హౌ ఆర్ యు నుండి
తిన్నావా రా... దాకా వెళ్ళింది...
మాళవిక నాకు పడింది అని కన్ఫర్మ్ అయి, అనుకుని లోపూ... నేను తనకు మేసేజ్ చేసే లోపు.... నాకు తను మెసేజ్ చేసింది."
మాళవిక "రెండు వారాల్లో తనకు పెళ్లి" అని మెసేజ్ చేసింది.
కాజల్ "అదేంటి?"
క్రిష్ "ఆ బక్క సుందరి మోమిన్ మరియు మాళవిక ఇద్దరూ ఫ్రెండ్స్ అంట... నేను తన మీద ట్రిక్స్ వాడుతున్నా అని చెప్పింది అంట.... అంటే నేను దానికి చెప్పాను లే.... PD పీరియడ్ లో కలిసినపుడు..."
నిషా "నోట్లో ఏం ఆగదు కదా"
క్రిష్ "మాట్లాడుకోవాలి అంటే ఎదో ఒక టాపిక్ కావలి కదా"
నిషా "అందుకని రహస్యాలు చెప్పెసుకుంటావా..."
కాజల్ "తర్వాత ఏమయింది?"
క్రిష్ "ఆ దొంగ ముండ నా దగ్గర ట్రిక్స్ అన్ని నేర్చుకొని వెళ్లి వాళ్ళ బావని పడగొట్టింది. సెటిల్ అయిపొయింది"
నిషా "నిన్ను ఎర్రిపప్పను చేసింది"
క్రిష్ "మాళవిక పెళ్ళిలో నన్ను అన్నయ్య అని పరిచయం చేసింది. ఒక అన్నయ్యలా ప్యాంట్ జేబులో చేతులు కట్టుకొని బయటకు వచ్చేశాను. ఎటు వెళ్ళానో నాకు కూడా తెలియదు"
నిషా మరియు కాజల్ ఇద్దరూ నన్ను చూసి నవ్వు ఆపుకుంటూ ఉన్నారు.
క్రిష్ "పర్లేదు నవ్వుకోండి"
ఇద్దరూ నవ్వుతూ ఉండగా, "నన్ను కూడా నవ్వుకోమంటావా" అని గొంతు వినపడింది.
క్రిష్ "ఎవరూ" అంటూ వెనక్కి తిరిగి చూడగా...
వెనక్కి తిరిగి చూడగా.... నిత్య...
![[Image: fb5bc20fdafdcd6685378a9cb17a1331.jpg]](https://i.pinimg.com/736x/fb/5b/c2/fb5bc20fdafdcd6685378a9cb17a1331.jpg)
క్రిష్ "నువ్వా..." అని షాక్ అయ్యాడు.
కాజల్ మరియు నిషా ఇద్దరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే...
నిషా క్రిష్ వైపు తిరిగి "ఎవరూ?" అంది.
నిత్యా "నిత్యాని..... వీడు చెప్పిన కధలో నిత్యా మీనన్ ని.... వీడి వర్జినిటిని నా దగ్గరే పోగొట్టుకున్నాడు...."
అమ్మాయిలు కాంప్లెక్స్ క్రియేచర్స్, వాళ్ళను జాగ్రత్తగా డీల్ చేయాలి.
Q) నీతో అన్ని చెప్పుకున్నాను. నీకూ ఇంపార్టెంన్స్ ఇచ్చాను. అయినా నా మనసులో ఏం ఉందొ నీకూ తెలియలేదా? అని ఏ అమ్మాయిని అడగొద్దు...?
A) వాళ్ళకు నువ్వు కనీసం ఐ లైక్ యు అని చెప్పందే.. నిన్ను దేకరు... నువ్వు ఇచ్చే హింట్స్ పట్టించుకోరు. మాళవిక విషయంలో క్రిష్ చేసిన తప్పు అదే... చెప్పకుండా నువ్వు ఎంత లవ్ చేసినా ఉపయోగం ఉండదు. లేడీస్ ఫస్ట్ అనే సామెతని గంగ లో తోక్కండి.
Q) ఆమె త్వరగా మర్చి పోయింది? నా ప్రేమను...
A) అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటే, అమ్మాయిలు మానసికంగా బలంగా ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్కువగా కంట్రోల్ లో పెట్టుకోగలుగుతారు. నువ్వు దూరం పెడితే కచ్చితంగా దూరం అయిపోతారు.
Q) నువ్వు గింజ అంత రహస్యం?
A) నీ ఫ్రెండ్ అమ్మాయికి రహస్యం చెప్పి ఎవరితో చెప్పొద్దూ అంటే.... ఆ అమ్మాయి దానికి మసాలా జోడించి ఇంకా హాట్ గా తయారు చేసి మరీ చెబుతుంది. కాబట్టి రహస్యం ఎవరికీ చెప్పొద్దూ.
Q) చాట్ బాట్?
A) హనీ ట్రాప్ చాట్ బాట్ లు వచ్చాయి. మనిషి కాదు అవతల AI కూడా మాట్లాడుతూ లేదా చాట్ చేస్తూ ఉండొచ్చు.
Q) హ్యుమర్?
A) అమ్మాయిలతో మాట్లాడేటపుడు హ్యుమర్ ని వాడాలి, అలాగని చులకన అయి కమీడియన్ అవ్వొద్దు. అలాగని పక్కన వాడిని ఎడిపించినా, నిన్ను బుల్లీ కింద ట్రీట్ చేసి వెళ్ళిపోతారు. హ్యూమర్ వాడాలి... కాని అలుసు ఇవ్వొద్దు. అప్పట్లో అలా అయింది ఇప్పుడు ఆ చాన్స్ లేదు అనేలా ఉండాలి. అలాగే తను చెప్పే విషయాలు ఓపికగా వినాలి.
Q) ఆత్మవిశ్వాసం?
A) ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లనే అందరూ ఇష్ట పడతారు. అందుకోసం చిట్కా ఒకటే.. నిన్ను నువ్వు ప్రేమించాలి.