Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"మ్యూచువల్ ఫండ్"
#8
తల్లి కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అమ్మాయికి, బయట చెప్పుల శబ్దం వినిపించడంతో, తల్లి వచ్చిందని అర్ధమై వెంటనే తలుపు తీసింది.

లోపలికొచ్చి అక్కడున్న స్టూల్ మీద కూర్చుంటూ, కొంగుతో చెమట తుడుచుకుంటున్న తల్లిని చూసి ఫ్యాన్ వెయ్యబోయింది అమ్మాయి.

"వద్దే. చెమట అదే ఆరిపోతుంది. కరెంట్ బిల్ ఎక్కువ చెయ్యద్దు"... అంటున్న తల్లి వైపు చూస్తూ, తల్లి ప్రయత్నం ఫలించలేదనేది అర్ధమై అక్కడే కూర్చుండిపోయింది అమ్మాయి.

దిగులుగా ఉన్న తన కూతురి మొహం చూస్తూ... "అంత దిగులెందుకే, నీ చదువు అయిపోయింది, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నీ తమ్ముడి చదువు అయ్యేదాకా ఫీజు కడదాం, వాడు కూడా పార్ట్ టైం ఏదన్నా చేస్తాడు. షాపు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కొన్ని రోజులు వస్తాయి. ప్రతి రూపాయిని లెక్కబెట్టి ఖర్చుపెడదాం"... అంటూ భూత, భవిష్యత్, వర్తమానాలని ఒకే వాక్యంలో చెప్పేసింది తల్లి.

"పదిహేనేళ్ళ నించి చేస్తున్నావు, ఎందుకు తీసేస్తున్నారు. బిజినెస్ క్లోజ్ చేస్తున్నారా ఏంటి?"

"లాభాలు రావడం లేదట, ఆరు షాపులని ఎవరికో అమ్మేస్తారట, వాళ్ళు నాలుగు ఉంచి, రెండు మూసేస్తారంట, ఆ నాలుగిటికి స్టాఫ్ ఇంతమంది ఎక్కువ అని తీసేస్తున్నారు. మన దురదృష్టం, నేను పని చేసే షాపు మూసేస్తున్నారు"

"ఆ నాలుగులో నీకు పని ఇవ్వచ్చు కదా?"

"ఇస్తానన్నారే, కానీ ఆ షాపు ఊరికి ఆ చివరన. పైగా మా ఓనర్ గారు దయగల మనిషి కాబట్టి ఇన్నాళ్ళు మంచి జీతం ఇచ్చాడు, ఈ కొత్త ఓనర్ అంత ఇవ్వడు. అ జీతానికి ఇక్కడ నించి రోజు వెళ్ళి రాలేనే. అక్కడ అద్దెకుండాలంటే, నువ్వు రోజూ ఎక్కువ తిరగాలి, నీ తమ్ముడి చదువు తేడా వస్తుంది. ఇన్న్నాళ్ళూ మీ ఇద్దరూ ఒకే కాలేజి, ఇంటి పక్కన కాలేజి అయితేనే వాడు నీకు తెలీకుండా క్లాసులు ఎగ్గొటాడు, అలాంటిది ఇప్పుదు మనం అంత దూరంలో ఉంటే, వాడి చదువు సర్వనాశనం అవుతుందే. ఒక పైసా మిగలడం సంగతి దేవుడికెరుక, మన అందరం ఇబ్బందులు పడతాం. దాని కన్నా ఇక్కడే ఏదన్నా దొరుకుతుందేమో చూస్తాను"

గుక్క తిప్పుకోకుండా మొత్తం చెప్పి.. మంచినీళ్ళు కావాలన్నట్టు వేళ్ళు చూపించింది.

నీళ్ళు తెచ్చింది అమ్మాయి.

నీళ్ళు తాగుతూ... "ఇన్నేళ్ళూ చేసిన షాపులో పని చెయ్యగలిగినంత ఉండేది, మంచి జీతం ఇచ్చేవాడు మా యజమాని, ఎండాకాలం ఏసీ ఉండేది. అప్పు పుట్టేది. సుఖపడ్డానే. ఇప్పుడు వయసు పెరిగాక, ఇంకోటి వెతుక్కోవాల్సి వస్తోంది. ఇన్నేళ్ళూ చేసిన లాంటిది ఇప్పుడు అవసరం, అలాంటిది దొరకదు. ఇన్నేళ్ళూ సుఖపడ్డట్టు, వయసు పెరిగాక, శక్తి తగ్గాక, ఇప్పుడు కష్టపడాల్సి వస్తోంది. కట్టుకున్నవాడు ఏనాడు కూడు పెట్టాడు కనుక, ఎప్పుడు తోడుకున్నాడు కనుక, వాడి సుఖం వాడు చూసుకున్నాడు. ఆడవాళ్లమైనా మనమే ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాం. నీ తమ్ముడికి మీ నాన్న పోలిక రాకుండా ఉంటే చాలు" అంటూ నిట్టూరుస్తూ అక్కడే ఉన్న చాప మీద పడుకుని కళ్ళు మూసుకుంది అమ్మాయి తల్లి.

తల్లి ఇచ్చిన సమధానంతో అమ్మాయికి విషయం మొత్తం అర్ధమైంది. తన ఉద్యోగ అవసరం తన కుటుంబానికి అవసరం, ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది.

"ఇందాక ఇంటి ఓనర్ అంకుల్ వచ్చాడు"... అంటూ తల్లికి విషయం చెప్పింది అమ్మాయి.

"అద్దె ఇవ్వలేదనే విషయం గుర్తులేదే అమ్మాయ్, షాపువాళ్ళిచ్చిన డబ్బులు రెండు నెలలు వస్తాయి కదా అనుకుంటున్నా, ఆ మొత్తం అద్దెకే పోతాయా"... అంటూ దిగులుగా నిట్టూర్చింది తల్లి.

ఇంతలో ఫోన్ మోగింది.

"అక్కా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలి, మూడొందలు కావలక్కా, అర్జెంట్ అక్కా"... టకటకా అన్నాడు అమ్మాయి తమ్ముడు.

"ఎందుకురా?"

"చెప్పా కదక్కా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలి"

"అదే ఎందుకు మనీ ట్రాన్స్ఫర్?"

"ఫ్రెండ్ ఒకడికి ఇవ్వాలక్కా, మొన్న నోట్ బుక్స్ వాడి డబ్బులతో కొన్నాను, ఇప్పుడు అడిగాడు, వాడికి ఇవ్వలక్కా"

"అతని నంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి కనుక్కుని డబ్బులు పంపిస్తాను"

డబ్బులు అన్న మాట వినగానే లేచి కూర్చుంది తల్లి.

"ఏంటే నీ తమ్ముడేనా. ఎంత కావాలిట. రూపాయి లేక చస్తుంటే వీడి తిరుగుళ్ళకి డబ్బులు కావాలా, ఏదీ మొబైల్ ఇవ్వు" అంటూ మొబైల్ తీసుకుని... "ఒరేయ్ నా ఉద్యోగం పోయింది, చాలా అప్పులు ఉన్నాయి, నీ తిరుగుళ్లు ఆపేసి, చక్కగా చదువుకుంటూ, నువ్వు ఏదన్నా పార్ట్ టైం చేస్తూ, మాకు ఏదన్నా తేవాలిరా. మగపుట్టక పుట్టి, ఆడపిల్ల కష్టపడి చదువుకుంటూ, సంపాదించిన డబ్బులు అడుగుతున్నావా, డబ్బులు లేవు, ఏమీ లేవు, పెట్టేయ్"... పెద్దగా కేకలేస్తూ మొబైల్ అమ్మాయికిచ్చింది తల్లి.

"డబ్బులు లేవుగా, నేను మధ్యహ్నం ఇంటికొచ్చె అన్నం తినను, ఇక్కడే నీళ్ళు తాగుతా".. కోపంగా అంటూ కాల్ కట్ చేసాడు కుర్రాడు.

అటు తల్లి, ఇటు తమ్ముడు, తను ఉద్యోగం తెచ్చుకోవాలి అని గట్టిగా అనుకుంటూ... "అమ్మా తలుపేసుకో, నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది అని సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ తీసుకుని బయటకి నడిచింది అమ్మాయి.

Like Reply


Messages In This Thread
RE: "మ్యూచువల్ ఫండ్" - by earthman - 30-05-2024, 08:49 AM



Users browsing this thread: 1 Guest(s)