28-05-2024, 10:32 AM
(This post was last modified: 28-05-2024, 10:33 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(22-05-2024, 07:27 PM)Haran000 Wrote: మిత్రమా నేను ఒకటి చెప్పనా నేను twist exact గా expect చేసాను.
ఇకపోతే, మనం ఇప్పుడు review వద్దాం:
1. చాలా నిర్మలంగా, కావాలసిన పదాలు మాత్రమే వాడారు.
2. కొన్ని చర్యల పోలిక చాలా అంటే చాలా బాగుంది.
3. చిన్న కథల్లో ప్రత్యేకం ఏంటంటే మనం వాటిని సాగదీయకుండా ఎంత కావాలో, ఎన్ని సన్నివేశాలు కావాలో అన్నే పెట్టుకోవాలి, ఇది నాకు రాదు, కానీ మీరు చాలా చక్కగా చేసారు.
4. శ్వేత విడాకులు తీసుకొని, రఘుని మర్చిపోలేక, అది మరచిపోవాలి అనుకొని MS చేసిందేమో, ఆ తరువాత ఇలా నిర్ణయించుకొని ఇక ఒక అబద్దంతో రఘుకి ఏ ఇబ్బందీ లేకుండా తనకి ఉన్న చిన్న కోరిక, అదే రఘు రక్తం తనతో ఉండాలి అని, అది తీర్చుకొని వెళ్ళిపోయింది.
5. ప్రేమ అంటే కలిసి ఉన్నా లేకున్నా, జ్ఞాపకాలు ఉన్నంత వరకూ కొన్ని సంతోషాన్ని కొన్ని విషాదాన్ని గుర్తు చేస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒక జ్ఞాపకం ఐతే మిగిలింది.
ఎంతైనా తను తండ్రి అని చెప్పుకోలేకపోయినా, ఎవరికైనా అలా ఒక్కసారైనా నిజంగా చూసుకోవాలి అనిపిస్తుందేమో. అది తండ్రి అయితే తెలుస్తుంది. మీకోటి చెప్పాల, ఒక రచయితకు తను రాసిన కథ అనేది సంతానం లాంటిది, కథ రాసి ఆ పుస్తకం ఎక్కడో పెట్టేస్తాము, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి రాసేటప్పుడు అది గుర్తుకు వచ్చి ఒకసారి చూసుకోవాలి అనిపిస్తది. మీరు కథలు ఎన్నో కథలు చదివిన అనుభవంతో రాస్తున్నారు. ఇంకా రాయాలి, అని కోరుతున్న.
థాంక్యూ బ్రో..
ఆక్చువల్ కధ ఇదే.. కాకపోతే రెండు ఎపిసోడ్ అయ్యాక.. ౩౦ డేస్ కాన్సెప్ట్ రాసేటప్పుడు ౩౦ డేస్ రోజుకో ఎపిసోడ్ రోజుకో లవ్ యాంగిల్ చూపెడదాం అనుకున్నా..
బట్ ఈ సైట్ లో అంత లవ్ అవసరం లేదేమో అనిపించి ఇక్కడితో ఆపేసా..