25-05-2024, 04:51 PM
(This post was last modified: 25-05-2024, 04:54 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
కల్పతరువు - పార్ట్ 2
ఉదయం రాజధాని ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో అలసి ఆగిపోయింది. నరాలు బిగుసుకుంటున్న చలి! పొగమంచుతో వాతావరణం మందంగా వుంది. టీ తీసుకున్నారు. లోకల్ ట్రైన్లో న్యూఢిల్లీ వరకు వచ్చారు. భారత దేశ రాజధాని క్రిక్కిరిసిన హడావిడి.. ఏమిటోగా వుంది.
చండీగఢ్ శతాబ్ధి చైర్ కార్లో కూర్చున్నాక కాస్త మనసు కుదురుగా అనిపించింది, సత్యప్రకాష్కు. నిర్ధారించిన సమయానికే రైలు కదిలింది. శతాబ్ధిలో ప్రయాణం చాలా సౌకర్యముగా వున్నది.
ప్రజలు తొంభై శాతం బలమైన అంగ సౌష్టంతో మంచి రంగు కలిగి వున్నారు. రైతులకు మద్దతు ఇచ్చే సారవంతమయిన నేల, నీటి సమృద్ది. స్వచ్చమయిన వాతావరణం. తను కోరుకున్న ప్రకృతి అందాలు మళ్ళీ కనబడుతున్నాయి, కానీ భర్త తోడుగా లేనందుకు నిరాశగా, బాధగా వుంది. మూడు గంటల ప్రయాణం తరువాత దిగాల్సిన స్టేషన్ వచ్చింది.
లాయర్ సత్యప్రకాష్ కొలీగ్ లాయర్ సర్దార్ శరణ్ జీత్ రిసీవ్ చేసుకున్నాడు. అతని కార్లో వాళ్ళ ఇంటికి వెళ్లారు.
శరణ్ జీత్ గారి ఇంట్లో పంజాబీ భోజనం చేశారు. తరువాత తెలిసింది, సత్యలీలను పేయింగ్ గెస్ట్ గా, అన్న చేసిన ఏర్పాట్లు. చెల్లెలు ఒప్పుకోలేదు.
“అన్నా, నేను ఒక్కదాన్నే రూమ్ తీసుకొని, నా వంట నేనే వండుకొని ఆఫీసుకు వెళతాను. నా జీవితాన్ని పూర్తిగా ఏదో వ్యాపకాలతో బిజీ చేసుకోవాలనుకుంటే, నువ్వేంటి మీ ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వుండమంటున్నావు?”
“నీకు తెలియదమ్మా! ఇది మన వూరు కాదు, మన భాష కాదు నీ సేఫ్టీ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను”.
“అన్ని తెలిసే వచ్చాను కదా, నేనొక్కదాన్నే వేరేగా ఉండాలి. నీ తృప్తి కోసం శరణ్ జీత్ గారిని అప్పుడప్పుడు పరామర్శించమను. అంతేగానీ పేయింగ్ గెస్ట్ గా ఐ డోంట్ లైక్” ముక్కుసూటిగా అయిష్టాన్ని బయటపెట్టింది.
ఎప్పుడూ అన్నయ్య చెబితే చెల్లెలు వినేది, కానీ విశ్వం మరణించిన తరువాత చెల్లెలు మాటకే ప్రాధాన్యత హెచ్చింది.
పెద్ద బంగాళా కుడి వైపు ఫస్ట్ ఫ్లోర్ లో వన్ రూమ్ సెట్ అంటే వన్ బిహెచ్ కే వుడ్ వర్క్ చేసి నీట్ గా వున్న కబోర్డ్స్. మరో వైపు పోర్షన్ వుడ్ వర్క్ లేకుండా కబోర్డ్స్, చిన్న ఫ్యామిలీ వున్నారు. క్రింద పోర్షన్లో ఓనర్స్. కుడి వైపున వున్న ఖాళీ పోర్షన్ రెంట్కు తీసుకున్నారు. సత్యలీలకు గ్యాస్తో పాటు ఇంట్లోకి కావాల్సిన సామానులు అన్ని కొని తెచ్చాడు సత్యప్రకాష్.
వదిన జగదాంబ కోసం మెత్తటి, వెచ్చటి పష్మిన్ శాలువ గిఫ్ట్ పంపింది.
బ్యాచ్స్ గా వచ్చే వివిధ కోర్సుల ద్వారా కంప్యూటర్ శిక్షణ ఇవ్వటముతో ప్రతిరోజూ ఆఫీసు బిజీ లైఫ్ అలవాటై పోయింది. ఎవరి కోసం ఆగని కాలంతో పాటు మనుషులు వేగం పెంచుతున్నారు, కాలంతో పోటీ!
ప్రక్క పోర్షన్లో వున్న అచలాదేవికి, సత్యలీలకు బట్టలు ఆరేసుకునే స్థలం ఒకటే.
కాశ్మీర్ కన్యలలో వుండే నాజూకైన అందంతో ముద్దుగా వుంది అచల. పాప, బాబు చిన్న ఫ్యామిలీ. చూడ ముచ్చటగా వున్నారు. అచల ఎలక్ట్రిక్ కుట్టు మిషిన్ సాయంతో రెండు గంటల్లో షల్వార్ కమీజ్ కుట్టేస్తుంది, నాలుగు గంటల్లో పెద్దసైజ్ స్వెటర్ అల్లుతుంది. ఎప్పుడూ సంతోషంగా చురుగ్గా వుండే అచల పనిలో ఎంతో నాణ్యత, ప్రవర్తనలో నమ్రతతో కనబడుతుంది.
హర్యాన్వి కలిసిని హిందీలో అచలాదేవి సత్యలీల స్వవిషయాలు అడిగి తెలుసుకుంది. క్లుప్తంగా జవాబు చెప్పింది.
“పిల్లలు లేరు కదా, మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు, పైగా చదువు, వుద్యోగం కూడా వున్నాయి. ” అచలాదేవి ప్రశ్న.
ఉర్దూ కలిసిన హిందీలో జవాబు చెప్పింది సత్యలీల “మా వారు నాకు ఆత్మబంధువు, శారీరకంగా ఆయన లేరు కానీ మానసికంగా మావారు నా వెంటే వున్నారు, సదా వుంటారు. ఇక పిల్లలు.. నాకు పిల్లల లోటు లేదు, అనాథ పిల్లలు మన దేశంలో ఎందరో వున్నారు. ఎవరో ఒకర్ని పెంచుకుంటే సరి."
అంతటితో తృప్తి చెందక అచల మళ్ళీ ప్రశ్నించింది. “మరి మీ పునర్వివాహం గురించి మీ అత్తగారు వాళ్ళ తరపు బంధువులు ఏమీ అనలేదా?”
“నేను బాల్య వితంతును కాదు, నాలో పరిపక్వం ఏర్పడిన తర్వాత నా యిష్టం మేరకు నా పెళ్లి జరిగింది. నాకంటూ ఒక వ్యక్తిత్వము వుంది. మా అత్తగారు కొడుకు పోయిన దుఃఖంలో వున్నారు”.
“మరి మీ వారి ఆస్తి గాని, ఉద్యోగం గాని మీకు రాలేదా?”
“నాకు సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ జాబ్స్ నచ్చవు. ఉద్యోగం నేను ట్రై చేయలేదు. మా వారి వాటా ఆస్తిని, మా అత్తగారు నా పేరిట రిజిస్టర్ చేసేశారు. చేతికి వచ్చిన కొడుకు, ఎంతో ధైర్యం యిచ్చే మనిషి లేకపోయే సరికి వాళ్ళ ఇంట్లో అంతా మరింత ప్రేమ, జాలి చూపిస్తున్నారే తప్ప ఎవ్వరికీ వేరే ఆలోచనలు లేవు.” చెబుతూ సీరియస్ అయింది సత్యలీల.
అచల ఒక్కసారిగా భోరుమని ఏడ్చింది.
“ఏమిటి? ఎందుకిలా ఏడుస్తున్నావు?
సారీ, నా గతం చెప్పి నేనే బాధ వ్యక్తం చేయలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు?” సత్యలీల గాబరా పడ్డది.
వెంటనే జవాబు చెప్పలేదు. కొద్ది సేపు వెక్కివెక్కి ఏడుస్తు, కన్నీళ్ళ ధార నిలిచిన తర్వాత అచల చన్నీళ్లతో ముఖం కడుక్కొని తన గూర్చి చెప్పడం మొదలు పెట్టింది.
“వద్దు, ఏమి చెప్పొద్దు, ముందు ఈ వేడి కాఫీ తాగు, నీ మనసు పూర్తిగా నెమ్మది అయినప్పుడు వింటాను. " కాస్సేపటికి పాప “మాజీ” అంటూ రావడంతో విషయం సశేషంగా మిగిలింది.
>>>>>>>>>>

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ